కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది
సామర్లకోట, పెన్ పవర్
కరోనా ఉధృతి దేశంలో చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లోను,రాష్ట్రంలో చూస్తే తూర్పుగోదావరి జిల్లాలోను అధికమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దీనిని కట్టడి చేసే విషయంలో ఎంతో నిర్లక్ష్యన్ని కనపరుస్తుంది అని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి తదితరులు అన్నారు.స్థానిక తెదేపా కార్యలయంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ తీరును విమర్శించారు. వారు మాట్లాడుతూ పాజిటివ్ కేసులో ఎంతో ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న పరీక్షలు చేయించుకునే వారికి సరిపడా కిట్లు అందించకుండా,ప్రజలకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టకుండా,కారంటెయిన్లో ఉన్న రోగులకు పోషకాహారం,మందులు పూర్తిస్థాయిలో అందించకుండా చాలా తేలికగా తీసుకుంటుంది అన్నారు.ఒక ప్రక్క ప్రాణనష్టం విపరీతమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.క్వారంటైన్ లో ఉన్న రోగులకోసం రోజుకు 5 వందలు ప్రభుత్వం కేటాయించిన వారికి సరైన మెనును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలి పెడుతున్నట్టు స్వయంగా ఆ రోగులు ఫోన్ లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.బ్రాందీ షాపులను తెరచి కరోనా ఉధృతి కి ప్రభుత్వం కారణమైంది అన్నారు.షాపులు వద్ద భౌతిక దూరం పాటించకుండా ఉండటం తో కేసులు పెరిగిపోతున్నాయి అన్నారు.తక్షణం వ్యాధి ఉధృతి తాగేంతవరకు బ్రాందీ షాపులను మూసివేసి పరీక్ష కిట్టులు తగినన్ని అందించడంతో పాటు క్వారంన్ టైన్ రోగులు తగిన సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఇంకా పార్టీ కార్యదర్శి బడుగు శ్రీకాంత్,నాయకులు అందుగుల జార్జి చక్రవర్తి, కంటే జగదీష్, వాసు తదితరులు పాల్గొన్నారు.