ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలు అవగాహన లోపమా
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: పెన్ పవర్
కరోనా, కరోనా, ఎటు చూసిన కరోనా,ఏ ఊరిలో చూసిన కరోనా, ఎవరి నోట విన్నా కరోనా, ఈ పేరు ప్రపంచంలో ఏ ఒక్కరికీ పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న మహమ్మారి అది. అంతటి విలయతాండవం చేస్తున్న కరోనా గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. మా రాష్ట్రంలో ఇన్ని కేసులు వచ్చాయి, మా ఊరిలో ఇన్ని కేసులు వచ్చాయి అను చెప్పుకుంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్ లో, స్టేటస్ లలో ఇతర టెక్నాలజీలతో ప్రపంచానికి సందేశం ఇస్తున్న ప్రతి ఒక్కరూ తనను, తన కుటుంబాన్ని, తన రాష్ట్రాన్ని, తమ దేశాన్ని ఈ మహమ్మారి నుండి రక్షించుకోవడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏపాటివో తనకి తాను ఆత్మవంచన చేసుకోవాలి. ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టి, పోలీస్ అధికారుల నిర్ణయాలను తప్పుబట్టి, ఎవరో పాటిస్తూ లేదు అని ఎవరికో చెప్పి నీవు చేస్తున్నది ఏమిటి? మనకి రక్షణగా నిలిచిన వైద్యులను, పోలీసులను, ప్రభుత్వ ఉద్యోగులను, కుల మత వర్గ విభేదాలు లేకుండా ఆఖరికి రాజకీయ నాయకులను సైతం వదలని ఈ మహమ్మారి ఏ ఒక్కరిని వదిలి పెట్టడం లేదు కదా.. మరి ఇది ప్రభుత్వ వైఫల్యమా? ప్రజల అవగాహన లోపమా? డాక్టర్లు మాస్క్ ధరించ మంటే బద్ధకం పోలీసులు లాఠీ దులిపితే కోపం ప్రభుత్వం ఇంటివద్దే ఉండమంటే అసహనం మరి ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలన కావాలంటే ఎలా? వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ వ్యాధి ప్రాభలుతూనే ఉంటాది. సామాన్య ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన రానంతవరకూ ఈ వ్యాధి మరింత పెరిగే అవకాశమే ఎక్కువ.. ప్రజలలో మార్పు రానంత వరకు ఇంతే.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రాబోయే రోజుల్లో నైనా ఈ మహమ్మారిని తరిమివేయడం సాధ్యమవుతుంది మరి.. ఇకనైనా మారతారని ఆశిస్తూ మీ పెన్ పవర్ తెలుగు దిన పత్రిక యాజమాన్యం..