Followers

ఏవోబీలో ఉద్రిక్త పరిస్థితులు



 


ఏవోబీలో ఉద్రిక్త పరిస్థితులు


మావోయిస్టు పోలీసుల మధ్య సాగుతున్న ఎదురుకాల్పులు.
ఏవోబీలో ఉద్రిక్త పరిస్థితులు.
మావోల ప్లీనరీ పై సాయుధ పోలీసులు దాడి.
  త్రుటిలో తప్పించుకున్న ఆర్కె.చలపతి అరుణలకు గాయాలు.
ఒడిశాలో గాయపడ్డ ఇద్దరు మావోల మృతి


 


  విశాఖపట్నం_బ్యూరో ఛీఫ్ (పెన్ పవర్)



ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య  చోటు చేసుకున్న ఎదురుకాల్పుల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మావోయిస్టులు పోలీసులు వ్యూహం ప్రతి వ్యూహం తో కాల్పులకు తెగ పడుతున్నారు. మూడు రోజుల్లో రెండుసార్లు ఎదురు కాల్పులు జరిగాయి అంటే అర్థమవుతుంది. గాయపడ్డ మావోయిస్టులను పట్టుకోవాలని పోలీసులు గాలిస్తున్నారు. తప్పించుకునే పనిలో మావోయిస్టులు కొనసాగుతున్నారు. ఎదురుకాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టులు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఈనెల 28 నుంచి వచ్చే నెల మూడో తారీకు వరకు  అమరవీరుల దినోత్సవాలను జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో    ఏ ఓ బి పరిధిలో ఉందిబుధవారం రాత్రి మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్( ఆర్ కె)  చలపతి అరుణల ఆధ్వర్యంలో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో  సాయుధ పోలీస్ బలగాలు  గాలింపు చర్యలు చేపట్టారు. ఎదురుపడ్డ మావోయిస్టులు పోలీసుల మధ్య  కాల్పులు జరిగాయి. ఆర్ కె తృటిలో తప్పించుకున్న  ఏ ఓ బి కార్యదర్శి చలపతి అరుణ లకు గాయాలైనట్లు తెలుస్తోంది. వారు విడిచి వెళ్ళిన కిట్ బ్యాగులు  రైఫిల్ స్వాధీనపర్చుకున్నారు. పెదబయలు ముంచంగిపుట్టు అటవీ ప్రాంతాల్లో  మావోయిస్టు  చొరబడి నట్లు తెలిసి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అడుగడుగున  అణువు అణువున తనిఖీలు సోదాలు చేస్తున్నారు. ఒడిశా కోడుమూల్  జిల్లా కుమ్మడి బంద గ్రామం  వద్ద మావోయిస్టులు పోలీసు బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం. నాలుగు రోజుల తర్వాత ఇద్దరు మావోయిస్టుల  మృతి చెందినట్లు  భోగట్టా.   ఇటీవల బలి మల వద్ద ఎదురు కాల్పులు జరిగాయి. 16  19 22 తేదీల్లో  మావోయిస్టు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్రనేత ఆర్ కె.  తప్పించుకో గా ఏ ఓ బి కార్యదర్శి చలపతి అరుణ లు గాయాలతో బయట పడ్డారు. వీరిలో ఎవరో ఒకరు పట్టుబడక తప్పదని ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నారు. ప్రతీకార చర్యల  భయం మన్యాన్ని వెంటాడుతుంది.


వివిధ వ్యాధుల నివారణకు మలాథీన్ స్ప్రేయింగ్


వివిధ వ్యాధుల నివారణకు మలాథీన్ స్ప్రేయింగ్


 


చింతపల్లి ,పెన్ పవర్


 

పాడేరు  ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల ఆదేశాల మేరకు స్థానిక ఐటిడిఏ నివాస గృహాలు, మెట్ట బంగ్లా తదితర ప్రాంతాల్లో రెండవ విడత మలాదిన్ స్ప్రేయింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్ వైజర్ సాంసన్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ లు మాట్లాడుతూఎపిడెమిక్ సీజన్ ప్రారంభం కావడంతో విశాఖ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం మలేరియా,ఫలేరియా, డయేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రెండవ విడత మలాథియాన్ స్ప్రేయింగ్ నిర్వహించామన్నారు. గ్రామాలలో వర్షపు నీరు నిల్వ లేకుండాచేసుకోవలసిన భాద్యత ప్రజలపై ఉందన్నారు అదేవిధంగా ప్రతి ఇంటి లోపల, బయట స్ప్రేయింగ్ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంటి చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలను తొలగించుకోవా లని, పిచ్చి మొక్కల వలన విష సర్పాలు సంచరించే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కెఎన్ నెహ్రూ, ఏఎన్ఎం సాగిన విజయలక్ష్మి, ఆశ కార్యకర్త కే పూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల "ఘోష" పట్టించుకోండి


కార్మికుల "ఘోష" పట్టించుకోండి


 


పూర్ణమార్కెట్, పెన్ పవర్


 


 

విశాఖపట్నం  దక్షిణ నియోజకవర్గం కరోనాలో కూడా నిరంతరంగా పరిశుద్య

పనులు చేస్తూ....కరోనా సమయంలో కూడా తమ ఆరోగ్యాలను పక్కన పెట్టి రోగులకోసం... పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న  అవుట్  సోర్సింగ్ కార్మికులు గత  3 నెలలుగా జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు, వారిని  పట్టించుకునే నాధుడే కరువవ్వడం తో శుక్రవారం  కార్మికులు  ఘోష ఆసుపత్రి ఆవరణంలో నే విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, మార్చి 2020, నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ఈ మూడు నెలలు అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని ... 

పైగా కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న సమయంలో ఎవరు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని, దీంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

ఫీడర్  ఈ ఎం టి  లకు  జి.వి.కె సంస్థ శిక్షణ


ఫీడర్  ఈ ఎం టి  లకు  జి.వి.కె సంస్థ శిక్షణ

చింతపల్లి  , పెన్ పవర్

ఫీడర్ అంబులెన్స్ సారదులకు (ఈఎంటి)  ప్రతి మూడు నెలలకు ఒకసారి జివికె సంస్థ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ గంగాధర్ అన్నారు. శుక్రవారం మండలంలోని తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, జి.మాడుగుల మండలాలకు చెందిన సుమారు 20 మంది ఈఎంటి లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి ధర్మంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఈఎంటి లకు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి దరి చేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన సూచించారు. రోజూ కనీసం రెండు కేసులు తగ్గకుండా బాధ్యతాయు తంగా మెలగాలని అన్నారు. కరోనా బారిన పడకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్కులు,శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఈఎంటి లు       జి కిరణ్ కుమార్ (బాబి) వెంకటేష్, సామల హరికృష్ణ, ఎస్ శివకుమార్ సిహెచ్ హరీష్        తదితరు లు పాల్గొన్నారు.


బాలుడు కుటుంబానికి చెక్కు అందజేత





లుకేమియా బ్లడ్ క్యాన్సర్ బాధిత  ఉద్దేష్ కు లారస్ ఉద్యోగుల చేయూత


లారస్ ఎంప్లాయిస్ సంకల్ప ఫండ్ నుండి రు" లక్ష సహాయం 


బాలుడు కుటుంబానికి చెక్కు అందజేత


 


         


పరవాడ పెన్ పవర్


 

పరవాడ :విపత్కర పరిస్థితుల్లోనే కాదు ఆపత్కాల సమయాల్లో కూడా లారస్ యాజమాన్యం సహాయం చేయడానికి ముందు ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కరోనా వైరస్ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సైతం మండలంలోని వేలాది మంది నిరుపేద కుటుంబాలకు సామాజిక బాధ్యతలో భాగంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆదుకున్న చరిత్ర లారస్ యాజమాన్యానిది. లారస్ యాజమాన్యo వ్యాపార రగం లొనే కాక సామాజిక బాధ్యత లో కూడా ముందు వుంటుంద ఈ సేవాగుణం యాజమాన్యానికే పరిమితం కాలేదు ఆ సేవా గుణాన్ని సంస్థ ఉద్యోగులు కూడా అలవాటు చేసుకున్నారు. యాజమాన్యం చూపిన బాటలో తాము కూడా నడుస్తున్నాము అంటూ రుజువు చేసే విధంగా తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.భరణికం గ్రామంలో లుకేమియా వంటి ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతు తమిళనాడులోని వెల్లూరు సీఎంసి హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్న ఉద్దేష్ వైద్య చికిత్సల నిమిత్తం మేము సైతం అంటూ ఆర్థిక సహకారం అందించి ఆదర్శంగా నిలిచారు.లక్ష  రూపాయలను లారస్ ఎంప్లాయిస్ సంకల్ప ఫండ్  నుండి నిధిని సేకరించి ఆ నగదును బాలుడు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం అందజేసి సంస్థకు తగ్గ ఉద్యోగులు అని అనిపించుకున్నారు. లారస్ ఎంప్లాయిస్  సంకల్ప బ్రైట్నింగ్ లివ్స్ తరపున చెక్కును పరవాడ గ్రామానికి చెందిన నవ యువత సభ్యులు కూoడ్రపు నర్సింగరావు, పరవాడ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, వైసీపీ మండల యూత్ అధ్యక్షులు పెదిశెట్టి శేఖర్ తదితరులు బాలుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. లారాస్ ఉద్యోగుల సేవా గుణాన్ని స్థానిక జర్నలిస్టులతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, సామాజిక వేత్తలు, ప్రజా ప్రతినిధులు, కొనియాడారు.


 

 




28 నుంచి మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు



28 నుంచి మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు

పోలీసులకు -- మావోయిస్టులక  మధ్య నలుగుతున్న గిరిజనులు

చింతపల్లి, పెన్ పవర్

విశాఖ మన్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆధిపత్య యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. ఈ నెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వారోత్సవాల విజయవంతానికి మావోయిస్టులు,విఫలయత్నానికి పోలీసులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.గిరిజన గ్రామాల పై పట్టు కోసం మావోయిస్టులు, పోలీసులకు మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు.ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తే ఇంకొకరికి ఆగ్రహం కలుగుతుందనే ఉద్దేశంతో గిరిజనులు మౌనంగా ఉండి పోతున్నారు.దీనిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి అటు మావోయిస్టులు ఇటు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మిలీషియా సభ్యులను వారి ఉద్యమం నుంచి దూరం చేసి, మావోయిస్టులకు ఆశ్రయం లేకుండా చేయాలన్న పోలీసుల వ్యూహం  సత్ఫలితాలిచ్చింది. గిరిజనులకు మావోయిస్టులు చేసిన హింసాకాండను గిరిజనులకు అర్థమయ్యే రీతిలో ''ఆదివాసి చైతన్య సంఘం''  'అల్లూరి గిరిజన సేవా సంఘం" పేరిట గోడ పత్రికలు వెలుస్తున్నాయి. మన్యంలో పట్టుకోసం మావోయిస్టులు, పోలీసుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. మావోయిస్టు ఉద్యమానికి స్థానికంగా అండగా ఉంటున్న మిలీషియా వ్యవస్థను పూర్తిగా  నిర్మూలించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో మిలీషియా సభ్యులను గుర్తించి, వారి వివరాలను సేకరించారు. నయానో, భయానో వారు లొంగిపోయేలా పోలీసు యంత్రాంగం ఒత్తిడి పెంచింది. వారిపై ఉన్న కేసులు ఎత్తివేత,ఉపాధి అవకాశాలు కల్పించారు. మావోయిస్టు అగ్ర నాయకుడు, ఈ ప్రాంతీయుడు కుడుముల రవి అనారోగ్యంతో మృతి చెందడం, మరికొంత మంది మావోయిస్టులు, సానుభూతిపరులు స్వచ్ఛందంగా లొంగిపోవడం, మరోవైపు పోలీసులు జరుపుతున్న నిర్బంధ దాడుల్లో కొంత మంది మావోయిస్టులు మృతి చెందడం కూడా మిలిషియా సభ్యులపై ఒత్తిడి పెంచింది. పోలీసుల వ్యూహాల ఫలితంగా మావోయిస్టు పార్టీ లోకి కొత్తవారు చేరకుండా పోలీసులు కొంత వరకూ విజయం సాధించారు. ఉజ్వల, చేయూత, ప్రేరణ వంటి కార్యక్రమాల ద్వారా గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పోలీసులు ముందడుగు వేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా గిరిజన గ్రామాల్లో గిరి యువతకు ఆటల పోటీలు నిర్వహించి తద్వారా వారిని ప్రోత్సహిస్తూ వారితోనే జిల్లా స్థాయి పోలీస్ ఉన్నతాధికారులు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. గిరి యువత అక్రమ మార్గం వెతుక్కునే వీలు లేకుండా పోలీసులు కృషి చేస్తున్నారు. పులి మీద స్వారీ చేసే వాడు దానిని కొనసాగించాలే తప్ప స్వారీ ఆపి దిగితే ఆ పులి చంపేస్తుంది.డప్పుల దరువుతో ఒళ్ళు గగుర్పొడిచే ఆవేశపూరిత మావోయిస్టు పాటలకు, ఉపన్యాసాలకు ఆకర్షితులై ఉద్యమంలో చేరే వారి పరిస్థితి కూడా పులి లాగే ఉంటుందని పోలీసులు భోదిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్నంతసేపు వారిని ఉపయోగించుకుంటారని, ఆరోగ్యం బాగులేక, కుటుంబ ఒత్తిడి వలనో లొంగిపోయినా, పట్టుబడి జైలు శిక్ష అనుభవించి జనజీవనంలో కలిసి పోయి ప్రశాంతంగా జీవితాన్ని గడిపేవారిని పోలీస్ ఇన్ ఫార్మర్  అని వారిని కాల్చి చంపడం మావోయిస్టులకు  అలవాటేనని పోలీసులు గిరిజనులకు హితబోధ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల వ్యూహాన్ని తిప్పికొట్టడానికి మావోయిస్టులు నడుంబిగించారు.తమ ప్రాబల్యం ఉన్న గిరిజన గ్రామాల్లో పట్టు సడలి పోకుండా తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గిరిజన గ్రామాల్లో పోలీసులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై పలు రకాల ఒత్తిళ్ళు తీసుకువచ్చి వారిని దారిలోకి తెచ్చుకోవడానికి మావోయిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు, మావోయిస్టు ఆధిపత్య పోరులో గిరిజనులు నలిగిపోతున్నారు.


ఎంపీడీవో ఎస్ ఐ హెచ్చరిక


మాడుగుల మండలంలో స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించాల్సిందే


ఎంపీడీవో ఎస్ ఐ హెచ్చరిక

వి మాడుగుల (పెన్ పవర్)


 స్వచ్ఛంద లాక్ డౌన్ ను  అందరూ పాటించాలని  లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పోలినాయుడు  ఎస్ ఐ రామారావు తహసిల్దార్ రామశేషు హెచ్చరించారు. మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్ డౌన్ చేయాలని  తహసిల్దార్ రామశేషు ఎస్ ఐ రామారావు వ్యాపారుల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మండలంలో దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. ఆ తరువాత తెరిచి ఉంచినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మాడుగుల గ్రామంలో తప్పనిసరిగా నిబంధనలు అమలు జరగాల్సిందే అన్నారు. ఏ ఒక్కరూ పాటించకపోయినా తగిన మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. ఇంతవరకు మండలం గ్రీన్ జోన్ లోనే ఉందన్నారు. ఇటీవల పొంగలిపాక వచ్చిన మిలటరీ జవాన్కు పాజిటివ్ రావడంతో విశాఖ తరలించారు. విశాఖ నుంచి మాడుగుల ఆస్పత్రికి విధులకు వస్తున్నా స్టాఫ్ నర్సు కూడా పాజిటివ్ సోకింది. కానీ స్థానికంగా ఎవరికి కరోనా పాజిటివ్ రాలేదన్నరు. కానీ రిజిస్టర్ కార్యాలయంలో పని చేస్తున్న మహిళ కోవిడ్ లక్షణాలతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. ఆమెతో ప్రైమరీ కాంటాక్ట్ అయినా వారు కరోనా మహమ్మారి కి బలి అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. బ్యాంకు మేనేజర్లు నిబంధనలు తప్పక  అమలు చేయాలన్నారు. హ్యాండ్ మైక్ ల ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేస్తూ  రోజుకు 200 టోకెన్లు మాత్రమే సేవలందించాలని కోరారు. టోకెన్ల విషయంలో గ్రామ వాలెంటెర్ల సహకారం తీసుకోవాలన్నారు. మృతురాలు ఇంటి పరిధిలో 200 మీటర్లు కంటోన్మెంట్ జోన్   500 మీటర్లు బఫర్ జోన్ గా   గుర్తించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో కూడా   నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...