Followers

మద్యం వలన కరోనా విలయతాండవం 


మద్యం వలన కరోనా విలయతాండవం 


 


పూర్ణా మార్కెట్, పెన్ పవర్.


 


 

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో   జరిగిన మీడియా సమావేశంలో మద్యం వల్ల కరోనా విలయతాండవం చేస్తుందని సామాజిక దూరం పాటించకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని   ఒక్క విశాకలో తే22-07-2020 ధి న 1049 ,తే23-07-2020దీ న 646  వచ్చాయని కరోనా కంట్రోల్ చేయటం లో నేటి ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేసారు.విశాఖలో కలెక్టర్ ఉన్నారా లేదా అర్ధం కావటం లేదు. ముఖ్యమంత్రి అసలు కరోన ను సీరీయస్ గా తీసుకోవడం లేదు. సీఎం నిర్లక్ష్యం వలనే కేసులు విపరీతం గా పెరిగిపోతున్నాయి.కొవిడ్ కేంద్రాల లో సదుపాయాలు దారుణం. సరైన పౌష్టికాహారం అందడంలేదు. కేంద్రం ఇస్తున్న ₹.500/- రూపాయలు కరోన బాధిత కుటుంబాలకు అందించాలి. టెస్ల్ లు సకాలంలో జరగడంలేదు. కరోన రోగులకు కొవిడ్  ఆసుపత్రులకు  తీసుకెళ్లడానికి సరైన వాహన సదుపాయాలు  లేవు. ప్రయివేటు ఆసుపత్రులు కరోన రోగుల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నాయి.శారదా పీఠం స్వరూపానందం స్వామి ఏపీ రెండవ  ముఖ్యమంత్రి. విశాఖ జిల్లా కలెక్టర్ బాధ్యతగా ఉండాలి. కరోన కి  సంబంధించి వాస్తవ పరిస్థితి తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైకాపా నేతలు ఇష్టానుసారంగా తిరిగి కరోన వ్యాప్తి చేశారు. మద్యం కోసం జనాలు క్యూలో నిలిచిఉండటం దారుణం అని మందుబాబులు వలన వారి కుటుంబాలు కూడ కరోన బారిన పడుతున్నారు. అసలు ఇటువంటి సమయంలో మద్యం అమ్మకాలు అవసరమా, మద్యం షాపులను వెంటనే మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మాడుగుల లో కరోనా లక్షణాలతో మహిళ మృతి

మాడుగుల లో కరోనా లక్షణాలతో మహిళ మృతి


దహన సంస్కారం చేసిన పంచాయతీ సిబ్బంది

వి.మాడుగుల (పెన్ పవర్)


వి.మాడుగుల మేజర్ పంచాయతీ మాడుగుల గ్రామంలో గురువారం రాత్రి కోవిడ్19 లక్షణాలతో మహిళ మృతి చెందింది. స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న 53 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో చనిపోయింది. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో అంబులెన్స్ లో  విశాఖపట్నం తరలించే ప్రయత్నం చేశారు. ఈ లోగా ఆమె మృతి చెందింది. ఇటీవల ఆమెను పలుమార్లు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మృతి చెందే సమయానికి మహిళకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది. శాంపిల్స్ను పరీక్షలకు పంపించారు. ఈ పరిస్థితి తెలియడంతో శవాన్ని ఎవరో తాకలేదు. పంచాయతీ సిబ్బంది తోపుడు బండి పై తరలించి దహన సంస్కారాలు చేశారు. మృతురాలు ఇంటి పరిసరాలు పారిశుద్ధ్యం శానిటేషన్ చేయిస్తున్నారు. రాజ వీధిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈమెతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కార్యాలయంలో ఉద్యోగులకు  టీ  టిఫిన్లు  కోసం ఆమె దుకాణాల చుట్టూ తిరిగేది.  ఆమెను ఆసుపత్రికి తరలించిన వారు  కార్యాలయంలో సిబ్బంది పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పారిశుద్ధ్యం శానిటేషన్ అధికారులు చేపడుతున్నారు. గ్రామంలో ఇది మొట్టమొదటి కేస్ కావడం విశేషం.


పరిపాలనకు నోచుకోని ఇంజినీరింగ్ భవనం


పరిపాలనకు నోచుకోని ఇంజినీరింగ్ భవనం


 


గూడెం కోత్తవీధి, పెన్ పవర్



గూడెం కోత్త వీధి మండల కేంద్రంలో ఇంజినీరింగ్ అధికారులు
విధులు నిర్వహించడానికి కొత్త పరిపాలనా కొత్త పరిపాలనా భవనం నిర్మాణం పూర్తి అయి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. మండలాలు ఏర్పడి నాటినుండి మండల ఇంజినీరింగ్ అధికారి ఇతర సిబ్బంది విధులు నిర్వహించడానికి సొంత భవనం లేక ఇంతవరకు ఇంజినీరింగ్ సిబ్బంది. చింతపల్లి మండలం నుండే విధులు నిర్వహిస్తున్నారు. గూడెం కోత్త వీధి మండలంలో ఎటువంటి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు. ఎం బుక్. రికార్డు చేయించుకొవడానికి బిల్లు చేయించుకొవడానికి, చింతపల్లి వెళ్ళిరావలసిన దుస్థితినెలకొనివుంది. చివరకు కొత్త భవనాలుకి సిమ్మెంట్
రోడ్లు నిర్మాణాలకు మార్కింగ్ ఇవ్వవలసివుండగా. ఎ. ఇ.  వర్కు  ఇన్స్ పెక్టర్,  చింతపల్లి నుండి రాకకొసం ఎదురు చూడవలసిన పరిస్థితి. పేరుకే గూడెం కోత్తవీధి.... మండల ఇంజినీరింగ్ కార్యాలయం నిర్వహణ అయిన ఎన్నో సంవత్సరాలుగా చింతపల్లి మండలం కేంద్రంలో వుంటున్నప్పటికి ఇది ఎ ప్రాంతంలో వుంటుందో ఎవ్వరికీ తెలియకపోవడం బాధాకరం.  ఇదే  విషయాన్ని చెబుతూ మండలప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం పనులు పూర్తి చేసినా... కొంతమంది కాంట్రాక్టర్లు బిల్స్ కొసం ఎప్పుడు కార్యాలయానికి వెళ్ళినా ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్ లు, అందుబాటులో వుండడం లేదని బిల్స్ కొసం పదిసార్లు తిరిగిలేక వారు నివాసం వుంటున్న గృహాలు వద్ధకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు  కాపలా కయవలసి వస్తుదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడెం కోత్తవీధి మండలానికి చెందిన ఇంజినీరింగ్ సిబ్బంది ఇతర ప్రాంతాలు నుండి రాకపోకలు సాగించడం వలన మండలంలో పలునిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని మండలంలోఎక్కడచూసిన అసంపూర్తిగా నిర్మించి వదలివేసిన భవనాలు కనిపిస్తుయని మండల ప్రజలు విస్మయం వ్యాక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా పాడేరు ఎమ్మెల్యే  స్పందించిగూడెం కొత్తవీధి కొత్త మండల ఇంజినీరింగ్  కార్యాలయం ప్రారంభించి అన్నిశాఖల ఇంజినీరింగ్   అధికారులు మండల  కేంద్రంలో విధులు నిర్వహించే విధంగా తక్షణమే చర్యలు తీసుకొవాలని గూడెంకొత్తవీధి మండల ప్రజలు కొరుతున్నారు .


దళితుల పై జరుగుతున్న దాడులను జగన్ అరికట్టాలి


దళితుల పై జరుగుతున్న దాడులను జగన్ అరికట్టాలి



బీజేపీ నాయకులు దారా పాండు 


శ్రీ కాళహస్తి, పెన్ పవర్


అధికార వైసీపి పాలనలో దళితుల పై దాడులు పెరిగిపోతూన్నాయని బీజేపీ నాయకులు దారా పాండు అన్నారు.శుక్రవారం ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ,ఐఎఫ్ టి యు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్య కులు కన్నా లక్ష్మీనారాయణ,రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కో లా ఆనంద్ లా పిలుపు మేరకు దళితుల పై జరుగుతున్న దాడులకు నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు.అయితే దలితులు  సీఎం జగన్మోహనరెడ్డి నాడు చేపట్టిన పాదయాత్రలో  కావాలి జగన్ రావాలి జగన్ అంటూ జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన దళితుల పై జగన్ ప్రభుత్వంలో పోలీసులచే దాడులు చేయిస్తూ దళితులును అణ ద్రో క్కెందుకు ప్రయత్నిస్తునారని ఆరోపించారు.దళితులు చాలా బలహీనులని,అట్టి వారిపై దాడులు చేయించడం అమానుషమన్నారు.ఇకనైనా దళితుల పై జరుగుతున్న దాడులు ఆపాలని డిమాండు చేశారు.అనంతరం ఐఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ అన్యాయాన్ని ఎది రించిన పాపానికి దళిత యువకునికి పోలీసులు శిరోముండ నం చేయడం,తూర్పు గోదావరిలో ఒ దళితుడు మాస్క్ వేసుకోలేదని పోలీసులు కొ ట్టి  చంపడం హే యమైన చర్య అన్నారు.ఎ దాడుల ను తాము ఖండిస్తూ వున్నామన్నారు.దళితులపై దాడులు మానుకోకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కయ్యూరు ఈశ్వరయ్య,ప్రసాద్,సుబ్రమణ్యం రెడ్డి,గోపాల్,ఐఎఫ్ టీయు నాయుకులు కిరణ్  తదితరులు పాల్గొన్నారు.అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందిస్తున్న బీజేపీ,ఐఎఫ్ టి యు నాయకులు.


దళితుల ఆత్మాగౌరవం కాపాడేది కాంగ్రెస్సే





దళితుల ఆత్మాగౌరవం కాపాడేది కాంగ్రెస్సే


వజ్జిపర్తి శ్రీనివాస్.  కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్.               


 తూర్పు నియోజకవర్గం ఇన్చార్జి.


 


పూర్ణామార్కెట్, పెన్ పవర్


 

రాష్ట్రంలో   దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి వజ్జిపర్తి శ్రీనివాస్ తెలిపారు .  

రాష్ట్రంలో అధికారపార్టీ నాయకులు ,పోలీసులు దళితులమీద కక్షకట్టినట్లు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు,చీరాల,సీతానగరం,రాజమండ్రి ఇలా రాష్ట్రంలో అనేకచోట్ల వరుస దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.పోలీసులు గూండాల్లా వ్యవహరించారన్నారని విమర్శించారు.సోషల్ మీడియాలో పోస్ట్ నెపంతో మహేష్ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసారని,మాస్కు లేదనే నెపంతో కిరణ్ కుమార్ ను గొడ్డును బాదినట్లు బాది చంపేసారని ఆరోపించారు.ఇసుక అక్రమ రవాణా పై ప్రశ్నించిన వరప్రసాద్ ను పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసి అవమానించారని , ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ  మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం దారుణం అన్నారు.

దళితుల ఆత్మాగౌరవం కాపాడేది కాంగ్రెస్సే అన్నారు. బాధితులకు తమ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందన్నారు.


 

 




మహనీయుల  సేవలు చిరస్మరణీయం


 


మహనీయుల  సేవలు చిరస్మరణీయం


 


సామాజిక కార్యకర్త డోన్  పి.మహమ్మద్ రఫి


డోన్,పెన్ పవర్ 


 

 

జూలై 24 న  మహాకవి శ్రీ గుర్రం జాషువా గారి వర్థంతి మరియు గ్రంథాలయ పితామహుడు శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారి జయంతి  సందర్భంగా

 

డోన్ పట్టణం నందు  సామాజిక కార్యకర్త  పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో  గ్రంథాలయ పితామహుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి జయంతి మరియు మహకవి గుర్రం జాషువా గారి వర్థంతి  సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళులర్పించారు వారిని స్మరించుకున్నారు. 

ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి  మాట్లాడుతూ 

*మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు*

 

1) మహకవి శ్రీ గుర్రం జాషువా గారు 1895, 

సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ 

మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు.  విద్యభ్యాసం చేస్తున్న సమయంలో

మూఢాచారాలతో నిండిన సమాజంలో చాలా  అవమానాలు భరించాడు. సమాజం లో చైతన్యం తీసుకురావాలనే అశయంతో  పని చేసాడు. మంచి కవిగా సామాజిక ప్రయోజనం కోసం కవిత్వానికి పదును పెట్టాడు.మూఢాచారాలు, మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరిచి సామాజిక ప్రయోజనం కోసం రచనలు చేసాడు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు,

పురస్కారాలు అందుకున్నాడు.కవితా

విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధురశ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు,  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. గుర్రం జాషువా గారు 24-7-1971న స్వర్గస్తులైనారు.

 

2) శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారు తూర్పు గోదావరి జిల్లాలోని కొంకుదురు గ్రామంలో 1890 జూలై 24న జన్మించారు. ఈయన ఆయుర్వేదం, ప్రకృతివైద్యంలో సిద్ధ హస్తులు మరియు పత్రికా సంపాదకుడు. తెలుగువారైన అయ్యంకి వెంకటరమణయ్య కృషితో మనదేశంలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది.ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి పలు రాష్ట్రాలలో గ్రంథాలయాలను స్థాపించారు. 1912లో నవంబరు 12న ఆనాటి మద్రాస్‌ ఆంధ్రప్రదేశ్‌ లైబ్రరీ అసోసియేషన్‌ మీటింగ్‌ని రమణయ్య నిర్వహించారు. ఫలితంగా నవంబరు 14న జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు.అయ్యంకి కృషితోనే ఇండియన్‌ లైబ్రరీ అసోసియేషన్‌ ఏర్పడింది. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు.ఈయన 19 వ ఏటనే 

శ్రీ బిపిన్ చంద్ర పాల్ గారి ని ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవ వైపు అడుగులేసి 1910లో బందరులో ఆంధ్ర సాహిత్య పత్రికను స్థాపించి  గురజాడ,

రాయప్రోలు ,శ్రీశ్రీ రచనలను ప్రచురించి ప్రజలను చైతన్య పరిచారు. విజయవాడలో రామ్మోహన్ ధర్మ పుస్తక భాండాగారం తో అనుబంధం పెంచుకొని ఆ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934 -48 మధ్య  కోస్తా, ఆంధ్రా ప్రాంతాలలో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు .1972లో పద్మశ్రీ  పురస్కారం అందుకున్నారు .అలాగే గ్రంథాలయ పితామహా,  సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు.వీరు 1979 మార్చి 7న దివంగతులైనారు.ఇలాంటి మహానుభావులను అనుసరించి వారి ఆశయాలను కొనసాగించాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.

 

పోలీస్ కానిస్టేబుల్ కరోనాతో మృతి





పోలీస్ కానిస్టేబుల్ కరోనాతో మృతి


 


 ఏలేశ్వరం,పెన్ పవర్ 


 

స్థానిక పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఎల్ వి వి సత్యనారాయణ(42) కరోనా మహమ్మారితో ఐదు రోజులు పోరాడి బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కు చెందిన సత్యనారాయణ గత కొంతకాలంగా ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రైటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న అనారోగ్యానికి గురికావడంతో పరీక్షలు నిర్వహించగా 19 వ తేదీన పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటినుండి రాజనగరం ఆస్పత్రిలో ఐసోలేషన్ లోఉన్న సత్యనారాయణ బుధవారం సాయంత్రం మృతి చెందారు. మృతుడు సత్యనారాయణ స్వస్థలం సామర్లకోట కాగా 2003 వ సంవత్సరంలో రంపచోడవరం లో విధుల్లో చేరారు. ఈయనకు పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత లేక లేక తొమ్మిది నెలల క్రితం పాప పుట్టింది. సత్యనారాయణ మృతి పట్ల ప్రత్తిపాడు సి ఐ వై రాంబాబు, ఏలేశ్వరం ఎస్సై కే సుధాకర్, ఇతర పోలీసు సిబ్బంది  సంతాపం వ్యక్తం చేశారు.


 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...