Followers

కోవిడ్ పై ఆందోళన వద్దు





కోవిడ్ పై ఆందోళన వద్దు


మంత్రి విశ్వరూప్


 


అమలాపురం పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్


 

దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కరోనా వైరస్ తీవ్రం ఉన్నప్పటికీ ప్రజలెవరూ  భయాందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి అన్నారు. శుక్రవారం అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో పది శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని,దీని నియంత్రణకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించవలసిన అవసరం వుందని మంత్రి తెలిపారు. అమలాపురం డివిజన్ లో గత మార్చి నుండి ఇప్పటివరకు 22,521 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 1,495 పాజిటివ్ గా గుర్తించడం జరిగిందని, 21,026 కేసులు నెగిటివ్ రావడం జరిగిందని మంత్రి తెలియ చేశారు.పాజిటివ్ కేసుల్లో 956 మందిని ఐసోలేషన్ సెంటర్స్ కు తరలించగా 525 మందిని హోమ్ ఐసోలేషన్ లో వుంచడం జరిగిందని మంత్రి తెలిపారు. మిగిలిన యాక్టివ్  కేసులు కిమ్స్ లోను, బొమ్మూరు లోను చికిత్స తీసుకుంటున్నారని మంత్రి తెలియ చేశారు.1091 మందిని చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

డివిజన్ లో గత మార్చి నుండి ఇప్పటివరకు కోవిడ్ మరణాలు 14 సంభవించాయని మంత్రి తెలిపారు.అమలాపురం మునిసిపాలిటీ పరిధిలో 30 వార్డులు వుండగా అందులో 24 వార్డులు కంటైన్మెంట్ జోన్ లు గా గుర్తించడం జరిగిందని మంత్రి తెలియ చేశారు.

 

అమలాపురం లో విద్యుత్ దహన వాటిక(ఎలక్ట్రిక్ క్రీమేషన్ )ఏర్పాటు___మంత్రి

 

అమలాపురం లో విద్యుత్ దహన వాటిక (ఎలక్ట్రిక్ క్రీ మేషన్ )ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు డివిజన్ లో 14 కోవిడ్ మరణాలు సంభవించాయని, రాబోయే రోజుల్లో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉన్నందున దహన సంస్కారాలుకు ఇబ్బంది లేకుండా వుండేందుకు అమలాపురం మునిసిపాలిటీ లో విద్యుత్ దహన వాటిక (ఎలక్ట్రిక్ క్రీమేషను )ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలియచేశారు.

 

కోవిడ్ మరణాలపట్ల వివక్షత వద్దు______మంత్రి

 

కోవిడ్ కారణంగా మరణించిన వారి పట్ల ప్రజలెవరూ అమాననీయ కోణం లో చూడకూడదని,అలాగే వారిపట్ల వివక్షత చూపకూడదని మంత్రి హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో  కోవిడ్ కారణంగా మరణించిన వారు ఒక్కొక్కరికి దహన సంస్కారాలు నిమిత్తం 15 వేలు మంజూరు చేశారని, అమలాపురం డివిజన్ లో కోవిడ్ కారణంగా మరణించిన 14 మందికి ఒక్కొక్కరికి 15 వేలు రూపాయలు చొప్పున రేపు సాయంత్రంలోగా  ఆర్.డి. ఓ ద్వారా అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే కోవిడ్ కారణంగా మరణించిన వారిని అనాధ శవాలుగా భావించకుండా వారికి ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు చేయాలని మంత్రి సూచించారు. పాత్రికేయుల సమావేశంలో అమలాపురం ఆర్.డి. ఓ ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, డిఎస్పీ షేక్ మాసుం భాషా పాల్గొన్నారు.

 

కోవిడ్_19 పై అధికారుల తో మంత్రి సమీక్ష

 

అమలాపురం డివిజన్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసిన చర్యల పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సంభందిత శాఖల అధికారులు తో సమీక్షించారు. అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఈ సమావేశం లో మంత్రి మాట్లాడుతూ మునిసిపాలిటీ పరిధిలో మెరుగైన పారిశుధ్యానికి చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్ కె.వి.వి.ఆర్.రాజును మంత్రి ఆదేశించారు. అన్ని వార్డుల్లో ను సోడియం హైపో క్లోరైడ్ ను ఉదయం,సాయంత్రం కూడా స్ప్రే చేయాలని మంత్రి సూచించారు.అలాగే డివిజన్ లోని అన్ని మండలాలలోను మెరుగైన పారిశుధ్యం వుండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో అమలాపురం ఆర్.డి. ఓ ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, డిఎస్పీ షేక్ మసూం భాషా, మునిసిపల్ కమీషనర్ కె.వి.వి.ఆర్.రాజు, అమలాపురం,అల్లవరం మండలాల తహసీల్దార్ లు మాధవరావు,అప్పారావు, అల్లవరం ఎం.పి.డి. ఓ సుగుణ శ్రీ కుమారి, ఏ.డి.ఎం.అండ్.హెచ్. ఓ డా. పుష్కర రావు, పంచాయిత్ రాజ్ డిప్యూటీ ఇ ఇ లు రాంబాబు,మురళీ కృష్ణ, కే.ఆర్.సి.తహసీల్దార్ లక్ష్మీపతి, అమలాపురం మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు చెల్లు బోయిన శ్రీనివాస్, మట్ట పర్తి నాగేంద్ర, దంగేటి  రాంబాబు, మోటూరి సాయి తదితరులు పాల్గొన్నారు.


 

 




 కరోనా విజృంభణ


 కరోనా విజృంభణ


ప్రత్తిపాడు ,పెన్ పవర్



రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు శుక్రవారం అత్యధికంగా ప్రత్తిపాడు లో 12 ధర్మవరం 2 కేసులు నమోదయ్యాయి దీనితో అప్రమత్తమైన అధికారులు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని అలాగనే తగు జాగ్రత్తలు పాటించాలని ఎండిఓ పేర్కొన్నారు లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేసేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు అవసరమైతే తప్ప దూరప్రయాణాలు చేయరాదని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు వైసిపి నాయకులు వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు చేయించారు


మనం మన పరిశుభ్రత పై అవగాహన సదస్సు


మనం మన పరిశుభ్రత పై అవగాహన సదస్సు



ఆత్రేయపురం,పెన్ పవర్ 


ఆత్రేయపురంమండలం లో నిర్వహించిన మనం_మన పరిశభ్రత పక్షోత్సవాలలో భాగంగా బొబ్బర్లంక  పేరవరం గ్రామాలకు చెందిన గ్రామ సచివాలయ సిబ్బందికి  మొబైల్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులకు ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఒ నాతి బుజ్జి ఆద్వర్యంలో మండల అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. పదిహేను రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు.  టీం సభ్యులు గ్రామంలో తిరిగి ఇంటింటికీ అవగాహన కల్పిస్తూ, ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు ఉంటే గుర్తించి , వెంటనే రిపేర్ చేయించాలని, ఎక్కడైనా అపారిశుధ్యం ఉంటే వెంటనే పారిశుధ్య మెరుగుదలకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమం లో మండల విద్యాశాఖాధికారి వర ప్రసాద రావు, పంచాయతీ కార్యదర్శులు శివారెడ్డి, శివ రామ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


చిన్న వెంకన్న స్వామి వారి స్వర్ణమయ పథకము






చిన్న వెంకన్న స్వామి వారి స్వర్ణమయ పథకము


 


పెన్ పవర్ పశ్చిమ గోదావరి బ్యూరో


 

పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి వారి విమాన గోపురం స్వర్ణమయ పథకాన్ని నకు లక్ష రూపాయల విరాళం సమకూర్చినది చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి కి చెందిన పొట్టి మాణిక్య కృష్ణ ఆనంద్ ఈ విరాళాన్ని ఈ ఓ ఆర్ ప్రభాకర్ రావు నాకు శుక్రవారం అందజేశారు ఈ సందర్భంగా ఈవో అతను ప్రత్యేకముగా అభినందించి స్వామివారి స్వర్ణమయ పత్రాన్ని స్వామి ప్రసాదాన్ని అందజేశారు .


 

 




ములికిపల్లిలో అద్వాన్నంగా ప్రధాన రహదారి


ములికిపల్లిలో అద్వాన్నంగా ప్రధాన రహదారి


రాజోలు,పెన్ పవర్


. రాజోలు మండల పరిది లోని ములికిపల్లి గ్రామ శివారులో పొన్నమండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలుపడి అధ్వాన్నంగా మారటంతో నిత్యం అనేక ప్రమాదాలు పజరుగుతున్నాయని స్దానికులు వాపోయారు. ఈ రహదారిలో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వెంటనే రహదారికి అమలు చేయాలి . 


హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని వినియోగించండి


హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని వినియోగించండి


మండల విద్యాశాఖ అధికారి జొన్నలగడ్డ


 


రాజోలు, పెన్ పవర్



 రాజోలు మండలం లో కరోనా   కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాజోలు మండల విద్యాశాఖాధికారి జొన్నలగడ్డ గోపాలకృష్ణ తమ కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బందిని కరోనా నుండి రక్షణ కల్పించే నిమిత్తం శుక్రవారం హైడ్రో క్లోరైడ్ ద్రావణంతో తమ కార్యాలయంను శుభ్రపరచడం జరిగింది. ఈ సందర్భముగా జొన్నలగడ్డ గోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా కేసులు బాగా పెరిగిపోవడం వలన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తగిన రక్షణ చర్యల నిమిత్తం మాస్కులు, శానిటైజేర్ లు వాడాలని వీలైతే కార్యాలయాలను హైడ్రోక్లోరైడ్ ద్రావణాలతో శుభ్రం చేసుకోవాలని సూచించడం జరిగింది. 


వైద్య ఆరోగ్య ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలి


వైద్య ఆరోగ్య ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలి


 


వైయస్సార్ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మూర్తి విజ్ఞప్తి


 


జగ్గంపేట,  పెన్ పవర్ 


 

కోవిడ్ 19 నివారణ కోసం ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని రాష్ట్ర  వైయస్సార్ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం కన్వీనర్ ఎన్ ఎస్ ఆర్. మూర్తి  ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ లు, ఇతర సిబ్బంది నియామకం హర్షణీయమన్నారు. ప్రత్యేక కార్యదర్శి మొదలుకొని  ఏ డబ్లు హెచ్. స్థాయి ఉద్యోగుల వరకు అవిశ్రాంతం రోగులతో పోరాటం చేయటం ప్రశంసనీయం అన్నారు. దీనికితోడు ప్రజా సహకారం ఎంతో అవసరం వ్యక్తిగత దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి గా పాటించాలని కోరారు. విధి నిర్వహణలో కొంతమంది వైద్యులు, నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది వ్యాధి బారిన పడటం కొంతమంది మరణించడం చాలా విచారకరం అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో  వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వారి కుటుంబాలకు  ప్రత్యేక కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలి, కోవిడ్ బారినపడ్డ ఉద్యోగుల క్వారంటైన్ చికిత్స సమయం న్యూ టి ఫిరియన్ గా పరిగణించాలి. సిబ్బందికి అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు ఆసుపత్రు లలో ప్రత్యేక వసతి ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ .ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ని కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోన్ అధ్యక్ష కార్యదర్శి వై.శ్రీనివాసరావు, కె. వీరబాబు, ఉద్యోగ సంఘం నాయకులు రామరాజు, గంగాధరం  తదితరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...