Followers

రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు


రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు:  మంత్రి  ఆదిమూలపు సురేష్ 


 


మార్కాపురం, పెన్ పవర్


 

 

 స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కరోనా వైరస్ నివారణ,నియంత్రణకు తీసుకోవలసిన  చర్యల పై వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్, పోలీసు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో  13 లక్షల మందికి కరోనా వైరస్ అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించడము జరిగిందన్నారు.రాష్ట్రంలో కరోనా వైరస్ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వందల కోట్ల రూపాయలు వెచ్చించి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.మార్కాపురం డివిజనల్ లో కరోనా వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని ఆయన చెప్పారు. ప్రజలకుఇబ్బంది లేకుండా కరోనా వైద్య పరీక్షలు వేగవంతంగా నిర్వహించాలన్నారు.మార్కాపురం డివిజనల్ ప్రధాన కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ కు వెంటనే పంపాలని ఆయన చెప్పారు. మార్కాపురం డివిజనల్ లో అంబులెన్స్ ల కొరత కారణంగా రోగులను ఒంగోలు హాస్పిటల్ కు పంపడం తో ఆలస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు అంబులెన్స్ వాహనాలను కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వారిని ఒంగోలు రిమ్స్ కు పంపడానికి సిద్ధంగా ఉంచాలని ఆయన వైద్యులను ఆదేశించారు. మార్కాపురం డివిజనల్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతామన్నారు. మార్కాపురం డివిజనల్ లో కరోనా వైరస్ విస్తరించిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నియమాలను కఠినంగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వైద్య శాలల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అన్నారు.కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన తెలిపారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించే విధము అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాజిటివ్ కేసుల విషయం లో 104,108 వాహన సేవలను వినియోగించుకోవా లని ఆయన తెలిపారు. కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సంజీవిని వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ ఎం.శేషి రెడ్డి, డిప్యూటీ వ్ డి.ఎం.హ్.ఓ పద్మావతి, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ నాగేశ్వరరావు , ప్రభుత్వ హాస్పిటల్ సూపరిoడెంట్ డ్రా. విజయ లక్ష్మి, డ్రా.రాంబాబు,పట్టణ సి.ఐ శ్రీ  కె.వి. రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. డివిజనల్ పౌర సంబంధాల అధికారి,మార్కాపురం

ఎమ్మెల్యే వేణు కు మంత్రి పదవి పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ జెడ్పిటిసి గుల్లా


ఎమ్మెల్యే వేణు కు మంత్రి పదవి పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ జెడ్పిటిసి గుల్లా. ఏడుకొండలు


 


గోకవరం పెన్ పవర్.


 

తన చిరకాల మిత్రుడైన చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పదవి లభించడం పట్ల మాజీ జెడ్పిటిసి, వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుల్లా ఏడుకొండలు హర్షం వ్యక్తం చేశారు.గురువారం గోకవరం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామచంద్రపురం శాసనసభ్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ వై ఎస్ ఆర్ సి పి పార్టీ పట్ల విధేయత కలిగిన  కార్యకర్తగా పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు అన్నారు.2006లో జరిగినస్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి ఆయన జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన సహచరుడు గా ఉంటూ తాను గోకవరం మండలం  జడ్పిటిసి గా తన పాలన లోనాకు పనిచేయడానికి  , మండలాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన నాకు ఎంతగానో అవకాశం కల్పించారు ఉన్నారు. వేణుగోపాల నాయకత్వంలో జిల్లా పరిషత్ అభివృద్ధి పథంలో పరిగెత్తించిన విధంగానే రాబోయే కాలంలో ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తన శాఖ లో పలు సంస్కరణలు చేపట్టి బీసీ సంక్షేమ శాఖకు మంచిపేరు తేవాలన్నారు.ఆయన నాయకత్వంలో తూర్పుగోదావరి జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని బిసి వర్గానికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించనా ముఖ్యమంత్రి కి గుల్లా ఏడుకొండల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో మంత్రి వేణుగోపాల్ సహకారంతో మండలాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని గుల్లా. ఏడుకొండలు తెలిపారు

అక్రమంగా మద్యం రవాణా


 




తెలంగాణ రాష్ట్రం నుండి  ఆంధ్రప్రదేశ్ నకు అక్రమంగా మద్యం రవాణా దారులపై ఉక్కుపాదం మోపుతున్న 


 


జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద అదుపులోనికి తీసుకున్న  పోలీస్ సిబ్బంది


 


 


 


పెన్ పవర్ పశ్చిమ గోదావరిబ్యూరో


 


 


 

 

 

తెలంగాణ రాష్ట్రం నుండి  ఆంధ్రప్రదేశ్ నకు అక్రమంగా మద్యం రవాణా దారులపై ఉక్కుపాదం మోపుతున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె. నారాయణ్ నాయక్, ఐపీఎస్ వారు యొక్క ఆదేశాలపై పశ్చిమగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్  జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద 22/23.07.2020 TS 40 UC 9305 అను వాహనంలో తరలిస్తున్న 4,275 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు*

 

 *22/23.07.2020 వ తేదీ  అర్ధరాత్రి సమయంలో పక్క సమాచారము ప్రకారము  స్వయముగా  రంగంలోకి దిగిన ఎస్. ఈ.బి అదనపు ఎస్పి  కరీముల్లా షరీఫ్   తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ లోకి ఒక  వాహనంలో అధిక మొత్తంలో మద్యం బాటిల్స్ తరలిస్తుండగా జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద అదుపులోనికి తీసుకున్న  పోలీస్ సిబ్బంది*

 

 జిల్లా ఎస్పీ కె. నారాయణ్ నాయక్, ఐపీఎస్ వారు  ఆదేశాలపై ఎస్.ఈ.బి అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్  పోలవరం డిఎస్పి ఎం.వెంకటేశ్వరరావు పోలవరం సిఐ.ఏ. ఎన్.ఎన్. మూర్తి  ఆధ్వర్యంలో జీలుగుమీల్లి   ఎస్సై విశ్వనాథము  మరియు వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో TS 04 UC 9305 అను  నెంబర్ గల వాహనంలో   మద్యం బాటిల్ లు, 4016 క్వార్టర్   180 ఎం. ఎల్ బాటిల్స్,216  750 ఎం.ఎల్. బాటిల్స్ మరియు 43  1000 ఎం. ఎల్ బాటిల్స్ మొత్తము 4,275 బాటిల్స్ ను అక్రమ  రవాణా చేస్తున్న  స్వాధీనపరచుకొని ముద్దాయిని, వాహనమును మద్యం బాటిళ్లను అదుపులోనికి తీసుకొని  అతని పై ఆంధ్ర ప్రదేశ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ప్రకారము గా కేసు నమోదు పరిచినట్లు, సదరు ముద్దాయిని రిమాండ్ పంపిస్తున్నట్లు, ఈ అక్రమ మద్యం రవాణా కు  మూల సూత్రధారులను గురించి  కూడా  దర్యాప్తు చేసి  వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని, సదరు మద్యం విలువ తెలంగాణలో అయితే 750000 ఆంధ్రప్రదేశ్లో అయితే సుమారు 20 లక్షల రూపాయల ఖరీదు ఉంటాది అని ఈ పత్రికా ప్రకటనలో ఎస్. ఈ.బి అదనపు  ఎస్పీ  కరీముల్లా షరీఫ్   తెలియజేసినారు.

పదిమందికి కరోనా పాజిటివ్





రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలలో పదిమందికి కరోనా పాజిటివ్ నమోదు


వి ఆర్ పురం, పెన్ పవర్


 

తూర్పుగోదావరి జిల్లా వి ఆర్ పురం మండలం రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాల అధికారికి కోవిడ్19 పాజిటివ్ వచ్చిన కారణంగా గత కొద్ది రోజులుగా పి హెచ్ సి, ని మూసివేసినారు.మళ్ళీ గురువారం పి హెచ్ సి వైద్యశాలను పరిశుభ్రంగా తయారు చేసి ఈ రోజు 11 గంటలనుండి మండల ప్రజలకు ఓ పి చూడటం జరిగింది.వైద్యశాలకు వచ్చిన ప్రజలతో మీరు కరోనా విషయంలో అప్రమతంగా ఉండాలి, మనిషి మనిషికి దూరం పాటించాలి,ప్రతిఒక్కరు మాస్కులు ధరించాలి, కరోనా విషయం పై డాక్టర్ సుందర్ ప్రసాద్ ను వివరణ కోరగా,మండలంలో పది మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనవి. కొత్త కిట్లు త్వరలో వచ్చినట్లైతే .మీగతా ప్రజలకు  కరోనా టెస్టులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.


 

 




దళితులపై దాడులు హేయమైన చర్య


దళితులపై దాడులు హేయమైన చర్య


గిడ్ల వేంకటేశ్వరరావు


పెన్ పవర్అ,యినవిల్లి


స్వతంత్రం వచ్చి ఏల్లుగడుస్తున్న దళితులపై దాడులు జరుగుతునే ఉన్నాయి అని పైగా అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు పెచ్చుమిరుతున్నాయి అని అయన అగ్రహం వ్యక్తం చేశారు దళిత యువకుడకు శిరొమండనం చేయడం దుర్మర్గాం అని వారుపై ఎస్సీ ఎస్టీ కేసుపెట్టి అరెస్టు చేయ్యలని డిమాండ్ చేశారుఅత్యచారం బారినపడి శికిత్స పొందుతున్న బాలికకు రక్షణ కల్పచాలని దొసులను ఉరితియలని డిమాండ్ చేస్తు వినతిపత్రం తాహిశాల్దార్ రమేష్ బాబు కు అందజేశారు ఈకార్యక్రమంలొ మలమహనాడు నాయుకులు గిడ్ల వేంకటేశ్వరరావు, కాకర శ్రీనువాస్, బడుగు దుర్గారావు,కె.శ్రీనువాసరావు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

అయినవిల్లి ఎస్ఐగా నరసింహముర్తి





అయినవిల్లి ఎస్ఐగా నరసింహముర్తి


పెన్ పవర్-అయినవిల్లి


 

ఎస్ఐగా ఇ.నరసింహముర్తి బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేసిన జి.వేంకటేశ్వరరావు విఆర్ లొకి పట్టడంతో అయన స్దానంలొ కాకినాడ2,ట్రాఫిక్ నుండి అయినవిల్లి ఎస్ఐగా నరసింహముర్తి బాధ్యతలు స్వీకరించారు అనంతరం అయన మట్లడుతు మండలంలొ కరొనా వైరస్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు అనవసరంగా రొడ్లుపైకి వస్తే కఠినమైన చర్యలు తప్పవని అన్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన నరసింహముర్తి ని అయినవిల్లి పొలిస్ సిబ్బంది

కె.దొరబాబు,కె.శ్రీనువాస్, హరిబాబు,సత్యనారాయణ, చక్రవర్తి, ఎ.ఎస్ఐ, తదితరులు కలిసి అయనను అభినందించారు.


 

 




పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించిన విలేజ్




         

పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించిన విలేజ్


   ఐ పోలవరం ,పెన్ పవర్ 


 


 

   ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామం మునికోటిపలవారి పాలెంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించిన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ డి.లీలామహిత..

ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

ఫాస్పరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియాను వరిలో ఉపయోగించే విధానo మరియు సూడోమోనాస్
విత్తన శుద్ధి చేయడం వంటి పద్దతులు  వలన తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించు కోవచ్చునని డి.లీలామహిత రైతులకు సూచనలు నిచ్చారు.



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...