Followers

పంచాయతీ సెక్రెటరీ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి


పంచాయతీ సెక్రెటరీ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి


 


 


ఎంపీడీవో కి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు


 


పెద్దాపురం పెన్ పవర్


 

మండలంలోని కట్టమూరు గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 2018 లో డిజిటల్ క్లాసులు కొరకు పెద్దాపురం ఎల్. ఐ. సి. వారు యాబై వేల రూపాయలు స్కూల్ కి. పంచాయతీ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ పనికి నాటి తేదీన సాధారణ సమావేశం కట్టమూరు గ్రామ  పంచాయతీ లో ఏర్పాటు చేసి అప్పటి ఎంపీడీఓ అయిన వసంత మాధవి గారి ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది  కానీ తీర్మానం జరిగి రెండు సంవత్సరాలు కాగా సదరు కాంట్రాక్టర్  రంగనాధం శ్రీనివాసరావు గారు చేయలేదు  కానీ కట్టమూరు గ్రామపంచాయతీకి ప్రొజెక్టర్ తెర  స్కూల్ కి వేసినట్టు బిల్లు పంచాయతీకి పెట్టడం జరిగింది దాన్ని సదరు పంచాయతీ వారు పనిని తనిఖీ చేయకుంనే అప్పటి పంచాయతీ సెక్రయటరీ ఆయన రమణ గారు బిల్ చేయడం జరిగింది. దానిని ఇప్పుడు గ్రామములో ఉన్న యువత  గ్రామస్తులు ప్రశ్నించడం ద్వారా సదరు కాంట్రాక్టర్  స్కూల్లో ప్రొజెక్టర్. తెర.వేయడం జరిగిందని.  గ్రామములో ఉన్న సామాజిక కార్యకర్త  మాదిరెడ్డి సూర్య  మామిడి సతీష్ పాత్రికేయులకు తెలిపారు  అలాగే రెండు సంవత్సరాలు పని పట్ల జాప్యం చేసినందుకు అప్పటి సెక్రెటరీ రమణ మరియు కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని ఎంపీడీవోకు  వినతి పత్రం అందజేశారు ఎంపీడీవో తక్షణం స్పందించి అప్పటి పంచాయతీ సెక్రెటరీకి ఫోన్ చేసి నాడు జరగవలసి డిజిటల్ క్లాసులు మరియు తెర. పనులపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలి చేయాలని ఆయన కోరారు

రాజకీయాల్లో ఓపిక పట్టడమే సానుకూల అంశం


 


  రాజకీయాల్లో ఓపిక పట్టడమే సానుకూల అంశం


పెన్ పవర్ ఐ పోలవరం 


 


  రాజకీయాల్లో ఓపిక పట్టడమే సానుకూల అంశం. తొందరపడకుండా వెయిట్ చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నది వాస్తవం. మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు విషయంలో ఈ విషయం స్పష్టమయింది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి అమలాపురం పార్లమెంటు నుంచి గెలిచారు. ఆ తర్వా త ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ సందర్భంగా జగన్ పండుల రవీంద్ర బాబుకు హామీ ఇచ్చారు. ఆ హామీతోనే ప్రభుత్వం వచ్చిన ఏడాది లోగానే పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.


ఐఆర్ఎస్ అధికారిగా….


పండుల ర‌వీంద్రబాబు ప‌శ్చి మ గోదావ‌రి జిల్లా దెందులూరు మండ‌లం కొవ్వలి గ్రామానికి చెందిన వారు . ఆయన ఐఆర్ఎస్ అధికారి. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఉన్నత విద్యా వంతుడు కావడంతో తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశమిచ్చింది. . ఏ విష‌యంపైనైనా పూర్తి అవ‌గాహ‌నతో మాట్లాడ‌గ‌లిగిన నాయ‌కుడిగా పండుల రవీంద్రబాబుకు పేరుంది. అయితే అప్పట్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పండుల రవీంద్ర బాబుతో పాటు అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరడంతో పార్టీకి మంచి హైప్ వచ్చింది.


అంబాజీ పేట సభలో…..


అయితే గత ఎన్నికల సమయంలో ఆయనకు వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు పండుల రవీంద్ర బాబుకు గవర్నర్ కోటాలో జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంబాజీ పేట బహిరంగ సభలో జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఒకదశలో పండుల రవీంద్రబాబు తిరిగి తెలుగుదేశం పార్టీ గూటికి వెళతారన్న ప్రచారం జరిగింది.


రెండు స్థానాల్లో…..


కానీ పండుల రవీంద్ర బాబు వైసీపీలోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి కూడా కృషి చేశారు. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి పండుల రవీంద్ర బాబుకు ఇవ్వడం దళిత సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వమేనంటున్నారు ఆయన సన్నిహితులు. శాసనమండలి ఎన్నాళ్లు ఉంటుందన్న విషయం పక్కన పెడితే పండుల రవీంద్ర బాబుకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారన్నది వాస్తవం


స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులు తిలక్, ఆజాద్ లు


 


స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులు తిలక్, ఆజాద్ లు: వై కా పా నాయకులు రఘు రామ్


 


జగ్గంపేట,   పెన్ పవర్ 


 


:బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ 


 స్వరాజ్యం నా జన్మహక్కు  అని బ్రిటీష్ వారిని ఎదిరించిన నాయకుడు  బాలగంగాదర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్   లు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులనీ వై కా పా నాయకులు వొ మ్మి రఘు రాం అన్నారు. బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాల గంగా దర్ తిలక్ 1856. జులై 23న మహరాష్ట్రలోని రత్నగిరిలో  జన్మించారు.1920 అగస్టు 1న ఆయన మరణించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన నాయకులను బావితరాల వారి గురించి,వారి స్ఫూర్తిని తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది దేశఃకోసం ప్రాణాలర్పించిన వారిని గుర్తుచేసుకు౦టూ వారికివే మా జోహార్లు . అలాగే  చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) (జూలై 23, 1906 – ఫిబ్రవరి 27, 1931) భారతీయ ఉద్యమకారుడు. భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా , అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరు.  ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకుని ఆత్మార్పణం చేసుకొని భారత జాతీయ ఉద్యమంలో  అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ వారికివే మా జోహార్లు అన్నారు.

జగనన్న పచ్చ తోరణం







జగనన్న పచ్చ తోరణం


 


 


పెన్ పవర్ ద్వారకాతిరుమల


 


 


 


 


పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల 


 

 

మండలం జి.కొత్తపల్లి గ్రామంలో లో హై స్కూల్ వద్ద జగనన్న పచ్చ తోరణం కార్యక్రమాన్ని బుధవారం జి.కొత్తపల్లి వైఎస్ఆర్సిపి నాయకులు బిరుదు గడ్డబజారియా మొక్క నాటి ప్రారంభించారు .మొక్కలు నాటడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్. సత్యనారాయణ ,బోడ జాషువా, జనార్దన్ రావు. గ్రామ సెక్రెటరీ కంచర్ల సర్వేశ్వరరావు తోటకూర నాగేశ్వరరావు.జి. కొత్తపల్లి గ్రామ సెక్రెటరీ ఉద్యోగులు గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు


 

 




 



 



 



మరిడమ్మ దేవస్థానంలో పంచామృతాభిషేకం


మరిడమ్మ దేవస్థానంలో పంచామృతాభిషేకం


 ఘనంగా మఖ నక్షత్ర పూజలు


 


పెద్దాపురం ,పెన్ పవర్


 

మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని గురువారం పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం వేదపండితులు చిట్టెం హరిగోపాల శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే బంగారు, వెండి పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించినట్టు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాలను పంపిణీ చేశారు.

మాస్కులు ధరించి కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు సహకరించండి


మాస్కులు ధరించి కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు సహకరించండి.


..... గోకవరం పంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాసరావు


 


 


గోకవరం పెన్ పవర్.


 

మాస్కులు ధరించి కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు సహకరించండి. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శి  టి .శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడుతూ గ్రామములోని కరోనా వైరస్ వ్యాప్తి అధికం కావడంతో ప్రజలందరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ వైరస్ వ్యాధి నిర్మూలనకు సహకరించాలని ఆయన కోరారు. ఇటీవల పద్దెనిమిదో తారీఖున 60 మందికి కరోనా టెస్టులు చేయగా వారిలో 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. పంచాయితీ పై అధికారుల ఆదేశాల మేరకు బాధితులు ఇంటివద్ద  వారి వీధిలోనూ సోడియం హైపో క్లోరేట్ , కాల్షియం హైపోక్లోరైట్ ద్రవాన్ని పిచికారి చేయడం తో పాటు పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చెల్లించి చుట్టుపక్కల ప్రాంతాలు ను శానిటేషన్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం గ్రామంలో ప్రతి ఒక్కరూ బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని లేనిచో 500 రూపాయలు ఫైన్ విధించబడుతుంది అని ఆయన తెలిపారు. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని అదేవిధంగా గా  ఎక్కడపడితే అక్కడ జనాలు గుమిగూడి ఉండకూడదని గ్రామంలో ప్రజలు వైద్య సిబ్బందికి,  అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు .

దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టండి


దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టండి.


 


...... టిడిపి మాజీ ఎంపీపీ ఈధి రత్నజ్యోతి అశోక్.


 


గోకవరం పెన్ పవర్.


 

గోకవరం మండల తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ ఈది రత్నజ్యోతి అశోక్  తూర్పుగోదావరి జిల్లాలోలోని దళితులపై జరుగుతున్న అమానుష ఘటనలు  పై ఆయన నిరసన వ్యక్తం చేశారు . గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఎప్పుడు లేనివిధంగా బలహీనవర్గాలపై దాడులు జరుగుతున్నాయి అని చిన్న వయస్సులోనే అత్యాచారని కి బలి అవుతున్న దళిత యువతులు  సీతానగరం మండలం ముని కొడవలి లో అన్యాయా న్నీ నిలదీసిన దళిత యువకుడిని దారుణంగా కొట్టడం మరియు శిిరోముండనం చేయట లాంటివి చాలా స్న్ఇ్డ్డు్తే  దళితులకు రక్షణ ఎక్కడుతుంది అని దిగ్భ్రాంతిని తెలియజేసారు ఇటువంటి అరాచకాలను ఆపాలని ప్రతి ఒక్కరు మానవత్వంతో మెలిగి సాంఘిక సమానత్వం నకు కృషి చెయ్యాలని  తెలియచెప్పారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...