Followers

కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్


కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్


 


అమలాపురం పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్


 

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోమ్ ఐసో లేషన్ లో వుంచడం వలన తమకు వైరస్  సోకుతుందనే భయం ప్రజల్లో వుందని, హోమ్ ఐసోలేషన్ వలన ఎవరూ భయపడనవసరం లేదని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. గురువారం అల్లవరం మండలం బోడసకుర్రు లోని టిడ్ కో భవన సముదాయంలో అమలాపురం డివిజన్ లోని కరోనా పాజిటివ్ రోగుల కొరకు సుమారు రెండు వేల పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మూడు వేలమంది కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్ లో వుంచడం జరిగిందని ఏ సమస్యలు లేకుండా అందరూ బావున్నారని, వీరిని ఇంటిలో ప్రత్యేక గదిలో ఉంచి వైద్య చికిత్స అందించడం వలన కుటుంబ సభ్యులకు కూడా ఏ విధమైన సమస్యలు రాలేదని కలెక్టర్ తెలిపారు.జిల్లా లో కరోనా వలన సంభవించిన మరణాలను పరిశీలిస్తే చాలా వరకు బిపి,షుగర్,తో బాటు తీవ్రమైన ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారే మరణించినట్లు గా గుర్తించడం జరిగిందని అన్నారు.కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయి కొద్దిపాటి లక్షణాలు వున్న వారిని మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్ లో వుంచి చికిత్స అందించడం జరుగుతుందని, తీవ్రమైన కరోనా లక్షణాలతో సీరియస్ గా వున్న రోగులను తక్షణమే అన్ని సౌకర్యాలు వున్న కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని కలెక్టర్ తెలియచేశారు. బోడసకుర్రు లోని సిసిసి సెంటర్, మరియు రాజమండ్రి లోని బోమ్మూరు సిసిసి సెంటర్  5 వేల మంది పాజిటివ్ రోగులను వుంచే సామర్ధ్యం కలిగి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో కరోనా తీవ్రత ఎక్కువగా వున్న కారణంగా సిసిసి సెంటర్ లను పెంచుకోవాల్సిన అవసరం వుందని కలెక్టర్ తెలిపారు. కరోనా రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులను, ఏ.ఎన్.ఎం లు తదితర వైద్య సిబ్బందిని డ్యూటీ అనంతరం  ఇళ్లకు వెళుతుంటే చుట్టు పక్కల వారు  వారినుండి కరోనా సోకుతుందని అడ్డుకుంటున్నారని ఇటువంటి అపోహలు ప్రజలు విడనాడాలని, ఈ విధంగా ఎవరైనా అడ్డుకుంటే వారి పై ఖటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.ముందుగా కలెక్టర్ సిసిసి సెంటర్ లోని అన్ని విభాగాలను పరిశీలించి ఇంకనూ తీసుకోవలసిన చర్యలు పై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ వెంట అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, అమలాపురం డి ఎస్ పి షేక్ మాసూం భాషా,ఏ.డి.ఎం.అండ్ హెచ్. ఓ డా.పుష్కరరావు, మునిసిపల్ కమీషనర్ కె వి వి ఆర్ రాజు, డిఇఇ అప్పలరాజు, అల్లవరం మండల తహశీల్దార్ అప్పారావు, ఎం.పి.డి. ఓ సుగుణ శ్రీ కుమారి, గోడిలంక వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పరామర్శ





మంత్రి పరామర్శ


 


అమలాపురం పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్


 

అమలాపురం రూరల్ మండలం సవరప్పాలెం లో ఇటీవల అనారోగ్యానికి గురైన సత్తి శ్రీను ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పరామర్శించారు. గురువారం మంత్రి స్వయంగా శ్రీను ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.మంత్రి వెంట మట్టపర్తి నాగేంద్ర, సరేళ్ళ రామకృష్ణ, గొవ్వాల రాజేష్ తదితరులు వున్నారు.


 

 




పేస్ షీల్డ్ ను పంపిణీ చేసిన ఎంపీడీఓ నాతి బుజ్జి

పేస్ షీల్డ్ ను పంపిణీ చేసిన ఎంపీడీఓ నాతి బుజ్జి


ఆత్రేయపురం ,పెన్ పవర్


ఆత్రేయపురం మండలం లో రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు ఆత్రేయపురం ఎంపీడీఓ నాతి బుజ్జి తన సొంత ఖర్చులతో ఆత్రేయపురం గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బందికి పేస్ షిల్డ్ ఇచ్చారు అలాగే కార్యాలయ సిబ్బంది కూడా మాస్కులు పేస్ ఫీల్డ్ ధరించాలి అని సూచించారు ఈకరోనామహమ్మారి సమయంలో రక్షణ  కలిగించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశామని ఎం పి డి ఓ నాతి బుజ్జి చెప్పారు.


 పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్ ఐ అజయ్ బాబు


 పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్ ఐ అజయ్ బాబు


ప్రత్తిపాడు,పెన్ పవర్



శాంతి భద్రతల పరిరక్షణ తన  ప్రధాన కర్తవ్యమని ప్రత్తిపాడు ఎస్ఐ గా నియమితులైన అజయ్ బాగున్నారు స్థానిక పోలీస్ షన్లో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు అనంతరం మాట్లాడుతూ ప్రజల సహకారంతో పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు అజయ్ బాబు కు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు ఎంతవరకు ఎస్సైగా పనిచేస్తున్న రవి కుమార్ తుని కి బదిలీ అయి వెళ్లారు.


రొంగలి వరాహ ఉగ్రనరసింహా రావుకు  బి.జె.పి నాయకుల దిగ్భ్రాంతి


రొంగలి వరాహ ఉగ్రనరసింహా రావుకు  బి.జె.పి నాయకుల దిగ్భ్రాంతి


 


పూర్ణా మార్కెట్, పెన్ పవర్


 

 

బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, అర్.టీ.ఓ   ఏజెంట్స్  అసోసియేషన్ అధ్యక్షులు రొంగలి వరాహ ఉగ్రనరసింహా రావు ఆకస్మిక మరణం పట్ల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు , మాజీ  ఎమ్మెల్సీ  పి వి చలపతి రావు  దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఉగ్రనరసింహా రావు తండ్రి అయిన వెంకట జగన్నాథ రావు  తన అనుచరునిగా ఉంటూ  ఎమర్జెన్సీ సమయంలో ఒక సైనికునిలా పని చేసారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా  ఏం.ఎల్.సి  పి.వి.యన్. మాధవ్  మాట్లాడుతూ నరసింహారావు గారు ఒకవైపు అర్ టీ ఓ   ఏజెంట్స్   అసోసియేషన్ అధ్యక్షులు గా బాధ్యతలను నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తగా ఎనలేని సేవలు అందించారని అన్నారు. మాజీ ఎం.ఎల్.ఎ. విష్ణు కుమార్ రాజు  మాట్లాడుతూ నరసింహ రావు భార్య ఈ మధ్యనే కన్నుమూశారని, ఇంతలోనే ఈయన కూడా మరణించడం అతని కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఏం. రవీంద్ర మాట్లాడుతూ నరసింహారావుకి ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు ఉన్నారని ,వారి పెద్దకుమార్తె  కనకమహాలక్ష్మి, బీజేపీ విశాఖపట్నం మహిళా మోర్చాలో కూడా పని చేసారని తెలిపారు. ఆయన యొక్క కుమారుడు అయిన జి.బివి. రవి కుమార్ ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ  49 వ వార్డు కార్యదర్శిగా కూడా పార్టీలో సేవలందిస్తున్నారని, నరసింహారావు  కుటుంబం మొత్తం భారతీయ జనతా పార్టీకి అంకితహభావంతో పనిచేస్తున్నారని , అతని కుటుంబ సబ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ  స్వర్గీయ ఉగ్రనరసింహా రావు  ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. 

రెండుకు చేరిన మృతుల సంఖ్య


విశాఖ సాల్వెంట్ ఫార్మా ప్రమాదంలో గాయపడిన మల్లేష్  చికిత్స పొందుతూ మృతి.


రెండుకు చేరిన మృతుల సంఖ్య.


          పరవాడ పెన్ పవర్


పరవాడ: జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ  విశాఖ సాల్వెంట్ ఫార్మా కంపెనీ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ అనే ఉద్యోగి గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ కంపెనీ లో మృతి చెందిన ఉద్యోగుల సంఖ్య రెండుకు చేరింది. నాటి ప్రమాదంలో అనకాపల్లి మండలం రేబాక ప్రాంతానికి చెందిన సీనియర్ కెమిస్ట్రీ కాండ్రేగుల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదంలో మల్లేష్ తో పాటు మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన మల్లేష్ కుటుంబానికి రూ" కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే నాటి ప్రమాదంలో మృతి చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావుకు కంపెనీ యాజమాన్యం రూ"50 లక్షల పరిహారం ప్రకటించారు. కాగా విశాఖ సాల్వెంట్ ప్రమాదంపై పోలీస్ శాఖ కేసు నమోదు చేశారు.

కరోనాతో అప్రమత్తత అవసరం


కరోనాతో అప్రమత్తత అవసరం


 


అనకాపల్లి , పెన్ పవర్


 

కరోనాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ సీపీ మండల యువజన ఉపాధ్యక్షులు కాండ్రేగుల రవి సూచించారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ను పాటించాలన్నారు. ఉపాధి హామీ కూలీలతో గురువారం తుమ్మపాల లో చిన్నబాబు కాలనీ తదితర ప్రాంతాల్లో శ్రమదానం నిర్వహించారు. పరిసరాల్లో  పిచ్చి మొక్కలు , చెత్తాచెదారాన్ని తొలగించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...