Followers

ఎమ్మెల్సీ జగదీష్ కు మాతృవియోగం


ఎమ్మెల్సీ జగదీష్ కు మాతృవియోగం


 


అనకాపల్లి , పెన్ పవర్


 

 

 తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ కు మాతృవియోగం చోటు చేసుకుంది. ఆయన తల్లి బుద్ధ ఆదియ్యమ్మ (86) గురువారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెెలు కాగా  రెండవ కుమారుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు శాసనమండలి సభ్యులు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇతర ప్రముఖులు పలువురు జగదీష్ ను పరామర్శించారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్  లు ఫోన్ చేసి ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ , జి వి ఎం సి జోనల్ కమీషనర్ శ్రీరామ్మూర్తి , తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల వెంకట్రావు ,మల్ల సురేంద్ర ,బి ఎస్ ఎం  కే జోగినాయుడు, వేగి గోపికృష్ణ ,పెంటకోట రాము, పొలిమేర నాయుడు, దానాల విష్ణు చౌదరి, బొలిశెట్టి శ్రీనివాసరావు ,సురే సతీషుు, వర్తక ప్రముఖులు పెంటకోట సుబ్రహ్మణ్యం, కొణతాల పూర్ణచంద్రరావు ,పీవీ రమణ ,కొణతాల అప్పలనాయుడు ,బుద్ధ అప్పలస్వామి నాయుడు, యల్లపు రాము, కొణతాల జనార్ధన్, ఆడారి జగన్నాధ రావు, మల్ల శ్రీరాములు తదితరులు  పాల్గొన్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.

పారిశుద్ధ్య పనులు పరిశీలిస్తున్న ఎంపిడిఓ


పారిశుద్ధ్య పనులు పరిశీలిస్తున్న ఎంపిడిఓ


 ఆత్రేయపురం,పెన్ పవర్


 ఆత్రేయపురం గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనీ, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దనీ, బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలనీ ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి అన్నారు.  గ్రామంలో ఉన్న షాపులు కూడా ప్రభుత్వ నిర్దేశించిన సమయాలలోనే తెరవాలనీ, షాపుల ముందు కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలన్నారు.గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేసారు.  సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, పారిశుధ్య సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నప్పుడు తప్పనిసరిగా కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలంతా సహకరించాలన్నారు. ఈ పరిశీలన లో పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్, కార్యదర్శులు గంగూలీ, సమీర్, మహిళా పోలీసులు,  సత్యనారాయణ, పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.


గ్రామానికి చేరుకునే మార్గం నరకప్రాయం







 

ప్రత్తిపాడు,పెన్ పవర్ 

 

 

నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి జాతీయ రహదారి జాతీయ రహదారి నుంచి గ్రామానికి చేరుకునే మార్గం నరకప్రాయంగా మారింది గోతులతో నిండిపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు వర్షం వస్తే ఇక రహదారిపై ప్రయాణించే వారు అష్టకష్టాలు పడుతున్నారు ప్రధాన రహదారి లో కొంత భాగాన్ని గతంలో ప్రభుత్వం సిమెంట్ రోడ్డు నిర్మించింది మిగతా  భాగాన్ని వదిలేయడంతో సమస్య ఉత్పన్నమవుతుంది రోడ్డు అసౌకర్యంగా ఉండడం తో 25 వేల మంది ప్రజానీకానికి ఇబ్బంది ఏర్పడుతుంది మండలంలోని ఉత్తరకంచి తదితర గ్రామానికి చేరుకుని రహదారి దుస్థితిలో ఉన్నాయి ఇకనైనా అధికారులు స్పందించి నిత్యావసర రహదారుల అభివృద్ధి చేయాలని ప్రజానీకం  కోరుతున్నారు

 

 



 



 




 



జి ప్లస్ టు గృహాలను వెంటనే అప్పగిచాలి







జి ప్లస్ టు గృహాలను వెంటనే అప్పగిచాలంటూ అమ్మానమ్మా  వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సి పి ఎం నాయకులు



 


సామర్లకోట, పెన్ పవర్


 


.సామర్లకోట మునిసిపాలిటీ పరిధి లో అమ్మానమ్మా అపార్టుమెంటు వద్ద,పిఠాపురం రోడ్డులోని ఉప్పువారి సత్రం ఎదురుగా నిర్మించిన జి ప్లస్ టు ప్లాటులను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు ప్లాటుల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.సిపిఎం బృందం ఆధ్వర్యంలో పార్టీ జెండాలను పట్టి ప్లాటుల్లోకి వెళ్లి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు కారణం ప్రసాదరావు మాట్లాడుతూ ప్లాటులవద్ద వద్ద ఇంకా త్రాగునీరు,రహదారుల, డ్రాయిన్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు జరగలేదు అన్నారు.వాటిని వెంటనే ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు.ఇప్పటికే ప్లాటులకు సంబంధించి లబ్దివారు వాటాగా అన్ని విడతల సొమ్మును చెల్లించి దానికి వడ్డీలు చెల్లించలేని పరిస్థితుల్లో ను అద్దె గృహాల్లో ఉండి అద్దెలు చెల్లించలేని స్థితిలోను ప్రజలున్నoదున ఈ విషయాలు ఎమ్మెల్యేలు,ఎం పి లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులకు వారి ప్లాటులను అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు,పాల్గొని తహసీల్దార్ వి జితేంద్ర కు వినతి పత్రాన్ని అందజేశారు.



 

 




 

 



 



 



పేదలకు ఇళ్ళు కేటాయింపులో నిర్లక్ష్యం పై జనసేన ధర్నా


పేదలకు ఇళ్ళు కేటాయింపులో నిర్లక్ష్యం పై జనసేన ధర్నా


సామర్లకోట, పెన్ పవర్


పేదలకు ఇళ్ళ కేటాయింపు విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందంటూ జనసేన,బిజెపి పార్టీల నాయకులు సామర్లకోట పట్టణంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జిలు తుమ్మల రామస్వామి(బాబు),యార్లగడ్డ రామ్ కుమార్ ల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నివాస యోజన  పథకం లో భాగంగా ప్రతి పేదవాడు ఇల్లు కలిగి ఉండాలనే లక్ష్యంతో నిధులు మంజూరు చేస్తే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అవినీతికి పాల్పడుతూ ఏప్లస్ టు,జిప్లస్ త్రీ గృహాలను కొన్నిచోట్ల 90 శాతం మరికొన్ని చోట్ల వందశాతం పూర్తి చేయగా వాటిని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకుండా ఉండటమే కాకుండా ఇప్పుడు ప్రతి పేదవాడికి ఇంటిస్థలం ఇస్తామంటూ చాలీచాలని సెంటు ఇస్తున్నారు అని విమర్శించారు. అలాగే అర్హులను ఎంపిక చేసే విషయంలో రాజకీయ వత్తిడి మేరకు అధికారులు వైసీపీ పార్టీ  కనివారిని అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు విమర్శించారు. ఈ విషయాలపై సీ ఎం జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో పర్యటించిన సమయంలో నిలదీయనున్నట్టు వారు స్పష్టం చేశారు.ఇప్పటికైనా వాస్తవ అర్హులను ఎంపిక చేసి వారికి ఇళ్ళ స్థలాలు ,ఇళ్ళు అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో జనసేన నాయకులు సరోజ వాసు,తుమ్మల ప్రసాద్,మంచే సాయి,పిట్టా జానికిరామారావు, అత్తిలి కృష్ణ, మందపల్లి చిన బాబు,ఎండి షపియుల్లా, పలువురు బి జె పి నాయకులు పాల్గొన్నారు.


గోకవరంని కి ఇంచార్జ్ ఎస్ఐ నియమించండి


గోకవరంని కి ఇంచార్జ్ ఎస్ఐ నియమించండి.


మాజీ  జడ్పీటీసీ సభ్యుడు బోస్.


 


గోకవరం పెన్ పవర్.


 

గోకవరం పోలీస్ స్టేషన్ కు ఇంచార్జ్ ఎస్ఐ నియమించాలని మాజీ జెడ్పిటిసి పాలూరు బోసు బాబు విజ్ఞప్తి చేశారు. గురువారం గోకవరం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి అన్నారు. దీనిలోని భాగంగానే గోకవరం లోని పోలీస్ సిబ్బందిలో చాలా మందికి కరోనా వైరస్ సోకడం వల్ల అందరూ ఇంటికే పరిమితమయ్యారు. మండలంలోని ప్రజలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి కోవడానికి కలెక్టర్  అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. కానీ తగినంత పోలీస్ సిబ్బంది లేక పోవడం చేత దుకాణదారులు నియమిత సమయం దాటిన తర్వాత కూడా దుకాణాలు తెరిచి ఉంచుతారు. అలాగే ప్రజలు కూడా ఇష్టమొచ్చినట్లు ఉదయం నుంచి రాత్రి వరకు పని ఉన్నా లేకపోయినా రోడ్ల మీదకు నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. దీనికి ప్రధాన కారణం తగినంత పోలీస్ సిబ్బంది లేకపోవడం మే అన్నారు. కావున ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి తక్షణమే గోకవరం పోలీస్ స్టేషన్ కు ఇంచార్జ్ ఎస్ఐ నియమించాలని గోకవరం మండల ప్రజలు ఆరోగ్యాన్ని కాపా డాలని ఆయన రాజమహేంద్రవరం నార్త్ జోన్ డిఎస్పి కి విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్




కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్


 


అల్లవరం ,పెన్ పవర్


 

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోమ్ ఐసో లేషన్ లో వుంచడం వలన తమకు వైరస్  సోకుతుందనే భయం ప్రజల్లో వుందని, హోమ్ ఐసోలేషన్ వలన ఎవరూ భయపడనవసరం లేదని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. గురువారం అల్లవరం మండలం బోడసకుర్రు లోని టిడ్ కో భవన సముదాయంలో అమలాపురం డివిజన్ లోని కరోనా పాజిటివ్ రోగుల కొరకు సుమారు రెండు వేల పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మూడు వేలమంది కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్ లో వుంచడం జరిగిందని ఏ సమస్యలు లేకుండా అందరూ బావున్నారని, వీరిని ఇంటిలో ప్రత్యేక గదిలో ఉంచి వైద్య చికిత్స అందించడం వలన కుటుంబ సభ్యులకు కూడా ఏ విధమైన సమస్యలు రాలేదని కలెక్టర్ తెలిపారు.జిల్లా లో కరోనా వలన సంభవించిన మరణాలను పరిశీలిస్తే చాలా వరకు బిపి,షుగర్,తో బాటు తీవ్రమైన ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారే మరణించినట్లు గా గుర్తించడం జరిగిందని అన్నారు.కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయి కొద్దిపాటి లక్షణాలు వున్న వారిని మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్ లో వుంచి చికిత్స అందించడం జరుగుతుందని, తీవ్రమైన కరోనా లక్షణాలతో సీరియస్ గా వున్న రోగులను తక్షణమే అన్ని సౌకర్యాలు వున్న కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని కలెక్టర్ తెలియచేశారు. బోడసకుర్రు లోని సిసిసి సెంటర్, మరియు రాజమండ్రి లోని బోమ్మూరు సిసిసి సెంటర్  5 వేల మంది పాజిటివ్ రోగులను వుంచే సామర్ధ్యం కలిగి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో కరోనా తీవ్రత ఎక్కువగా వున్న కారణంగా సిసిసి సెంటర్ లను పెంచుకోవాల్సిన అవసరం వుందని కలెక్టర్ తెలిపారు. కరోనా రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులను, ఏ.ఎన్.ఎం లు తదితర వైద్య సిబ్బందిని డ్యూటీ అనంతరం  ఇళ్లకు వెళుతుంటే చుట్టు పక్కల వారు  వారినుండి కరోనా సోకుతుందని అడ్డుకుంటున్నారని ఇటువంటి అపోహలు ప్రజలు విడనాడాలని, ఈ విధంగా ఎవరైనా అడ్డుకుంటే వారి పై ఖటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.ముందుగా కలెక్టర్ సిసిసి సెంటర్ లోని అన్ని విభాగాలను పరిశీలించి ఇంకనూ తీసుకోవలసిన చర్యలు పై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ వెంట అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, అమలాపురం డి ఎస్ పి షేక్ మాసూం భాషా,ఏ.డి.ఎం.అండ్ హెచ్. ఓ డా.పుష్కరరావు, మునిసిపల్ కమీషనర్ కె వి వి ఆర్ రాజు, డిఇఇ అప్పలరాజు, అల్లవరం మండల తహశీల్దార్ అప్పారావు, ఎం.పి.డి. ఓ సుగుణ శ్రీ కుమారి, గోడిలంక వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...