Followers

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో  ఆధ్వర్యంలో జిల్లాలో  దాడులు

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో  ఆధ్వర్యంలో జిల్లాలో  దాడులు


 


బ్యూరో రిపోర్ట్ కర్నూలు, పెన్ పవర్


 

 జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఐపియస్ గారి పర్యవేక్షణలో అక్రమ ఇసుక  రవాణా, అక్రమ మద్యం, నాటు సారా కట్టడి కి జిల్లాలో  ఎస్ ఈ బి టీం, పోలీసు, ఎక్సైజ్ పోలీసుల సమన్వయం తో  దాడులు కొనసాగుతున్నాయి. అక్రమ మద్యం మరియు నాటు సారా పై  53  కేసులు నమోదు .   75  మంది అరెస్టు .

21 వావాహనాలు సీజ్ . 230  లీటర్ల నాటు సారా, 500 కేజీల బెల్లం స్వాధీనం, 4,210 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం, వివిధ బ్రాండ్లకు చెందిన 344 లీటర్ల మద్యం స్వాధీనం.  ఇసుక అక్రమ రవాణ పై 1  కేసు నమోదు. ఇద్దరు అరెస్టు, 1 వాహానం సీజ్. 4  టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నారు.

మాజీమునిసిపల్ వైస్ ఛైర్మెన్ బషీర్ అహ్మద్ ఇకలేరు


మాజీమునిసిపల్ వైస్ ఛైర్మెన్ బషీర్ అహ్మద్ ఇకలేరు


 


 


పెన్ పవర్, ఎమ్మిగనూరు 


 

మాజీ మునిసిపల్ వైస్ ఛైర్మెన్, 5సార్లు కౌన్సిలర్ గా గెలిచి ఎమ్మిగనూరుకు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన బషీర్ అహమ్మద్ గారు అనారోగ్యంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో గురువారం ఉదయం చికిత్స పొందుతూ తుది శ్వాస వదిలారు.

హరిత విప్లవం ద్వారా వాతావరణ సమతుల్యత సాధ్యం




హరిత విప్లవం ద్వారా వాతావరణ సమతుల్యత సాధ్యం


                     


మొక్కలలో నిధుల స్వాహా కు స్వస్తి                                  


85 శాతం మొక్కలు బతికి తేనే బిల్లుల చెల్లింపు    


     


పేదల గృహాలు పచ్చటి వాతావరణంతో పులకరింపు 


 


ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి                     


పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి


 

 రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుందని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి  అన్నారు. గురువారం దూబగుంట సమీపంలోని పొగాకు బోర్డు ఎదురుగా ఉన్న పేదల నివేశన స్థలం లో అధికారులతో కలిసి  మహీధర్ రెడ్డి  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న మంచి లేఅవుట్లో ఈ బృహత్తర కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అనేక సంవత్సరాల నుండి పచ్చదనం కార్యక్రమం దశాబ్దాల కాలం నుండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగినప్పటికీ ఆ మొక్కలు ఇప్పటికీ ఎక్కడా కనబడటం లేదని అన్నారు. మొక్కల పెంపకం లో చేతి వాటం చూపి నిధులను స్వాహా చేశారని అన్నారు. ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  85 శాతం మొక్కలు బ్రతికితే బిల్లు చెల్లించే విధంగా అధికారులకు ఆదేశాలు అందాయని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం ఎంత ఉత్సాహంగా చేశారో  అంతే ఉత్సాహంగా మొక్కలు బ్రతికే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని వీటిపై ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. హరిత విప్లవం ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులను సమతుల్యం చేసే శక్తి చెట్లకు మాత్రమే ఉందని అన్నారు. అంతేకాకుండా వర్షపాతం  బాగా పడడానికి ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు. అంతేకాక పచ్చదనం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం సచివాలయం  అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  సంపూర్ణంగా నిధులు స్వాహా చేసే కార్యక్రమానికి స్వస్తి పలికి పేదల కలలు  కన్న  గృహ నిర్మాణ సముదాయాలలో పచ్చతోరణం కింద ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి తీవ్ర కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అందరి సహకారంతో ఊహించిన దాని కంటే అదనంగా మొక్కలన్నీ బ్రతికే విధంగా చూసి కందుకూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. మొక్కలు నాటడమే కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి వాటిని కాపాడాలని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లో  భిన్నమైన రూపకల్పనకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఆర్డీవో ఓబులేసు మాట్లాడుతూ ఇన్ని రోజులు ఇంత అందమైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడి పేదల గృహాలకు ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈ మొక్కలు అన్ని కాపాడి కాలనీ ని అందంగా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసిల్దార్ శ్రీనివాస రావు,  ఏ ఈ  గుళ్ళా లోకేష్, వైసీపీ నాయకులు పబ్బిశెట్టి శివ, జాజుల కోటేశ్వరరావు, చక్కా వెంకట కేశవరావు, పల్నాటి చెన్నయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్జ్యోగులకు కరోనా టెస్టులు చేయించండి మహా ప్రభో

 



 


ఆర్టీసీ ఉద్జ్యోగులకు కరోనా టెస్టులు చేయించండి మహా ప్రభో....


.......ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి పైడిమళ్ల లక్ష్మణరావు


 


గోకవరం పెన్ పవర్


 

గత కొంతకాలంగా ఆర్టీసీ అధికారులను  కరోనా టెస్టులు చేయించమని వేడుకున్నా ఇంతవరకు ఏవిధమైన చర్యలు తీసుకొకపోవటoపై స్థానిక ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి పైడి మశ్ణ. లక్ష్మణ్ రావు మండి పడ్డారు. ఇటీవల

గోకవరం డిపోలో సిస్టమ్ సూపర్ వైజర్ కు కరోనా పాజిటివ్ వచ్చినా డిపోలో పనిచేసే కార్మికులు అందరికీ టెస్ట్ లు చేయించకపోవటం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంఅని కాబట్టి కరోనా వైరస్అందరికీ సోకే ప్రమాదం ఉంది అని వెంటనే ఆర్టీసీ ఉద్జ్యోగులకు కరోనాటెస్టులు చేయించి దైర్యం నింపవలసిన బాద్యత అధికారుల పై వుందని ఆయన తెలిపారు. అదేవిధంగా 

 ఉద్జ్యోగులకు ఇన్సూరెన్స్ కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని లక్ష్మణ్ రావు కోరారు.

 

 

 


ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ మరియు సెల్సే రిప్రెజంటేటి వ్స్  ఆధ్వర్యంలో నిరసన


ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ మరియు సెల్సే రిప్రెజంటేటి వ్స్  ఆధ్వర్యంలో నిరసన


 


 


అక్కయ్యపాలెం, పెన్ పవర్


 


 


ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ మరియు సెల్సే రిప్రెజంటేటి వ్స్  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖప్నంలోని కార్మిక శాఖ(లేబర్ ఆఫీస్) ఎదురుగా ఉపాధ్యక్షులు మంగళ్ దాన్ అధ్యక్షతన నిరసన కార్య క్రమం జరిగింది.

జిల్లా కార్యదర్శి డి. స్రవంత్ మాట్లాడుతూ ఈ కరోనా కాలంలోనే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చింది అంతే కాక మెడికల్ రిప్రెజంటేటి వ్స్  కీ రక్షణ కవచంలా వున్న ఏస్ పి ఈ ఆక్ట్ ను పూర్తిగా తొలగించడం జరిగింది, అలాగే కారోనాని ఆసరాగా తీసుకుని మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు జీతాలు ఎగ వేయడం, కోత పెట్టడం,ఉద్యోగాలు తీసివేయడం అన్యాయమని తెలియజేశారు.

రాష్ట్ర కార్యదర్శి కె వి పి చంద్ర మౌళి మాట్లాడుతూ ఫార్మా రంగం కరిన కాలంలో కూడా విపరీతమైన లాభాలు ఆర్జించినప్పటికీ కూడా  జీతాలు కోత విధించటం, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం అన్యాయమని తెలియజేశారు.

ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర  ప్రధనకార్యదర్శి  టి.కామేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కాలంలో కూడా అనైతిక విధానాల ద్వారా ప్రమోట్ చేయడం మందుల ధరలు  విపరీతంగా పెంచడం చాలా అన్యాయమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

సీఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన





కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు 


 


సీఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన


           


పరవాడ పెన్ పవర్


 


పరవాడ:కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలపై సిఐటియు మరియు ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.మండలం లోని దేశపాత్రుని పాలెం సచివాలయం వద్ద సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ,ఐద్వా మండల నాయకురాలు పి.మాణిక్యం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.కరోనా విజ్రంభిస్తున్న తరుణంలో ప్రజలను ఆదుకోవాలి అని ప్రతి కుటుంబానికి 7500 రూ కుటుంభం లో ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం ఆరునెలల పాటు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.కార్మిక చట్టాల మార్పును విరమించాలి అని కరోనా కాలంలో కూడా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రక్షణ ఇన్స్యూరెన్స్ కల్పించాలి అని ఉపాధి హామీ పనులు పట్టణాల్లో ఉన్న పేదలకు కూడా కల్పించాలి అని నినాదాలు చేశారు.కరోనా విపత్తులో ప్రజలను అదుకోవలిసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలూ పూర్తిగా విఫలమయ్యాయి అని కరోనా టెస్టుల్లో నాణ్యత కానీ కరోనా సోకిన వారికి వైద్య సదుపాయాలు అందిచడం లో  ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు నాయకులు వి.వి శ్రీనివాసరావు,వి.రమణ,పారిశుద్య కార్మికులు,ఇతర రంగాల కార్మికులు పాల్గొన్నారు.


 

 




కేంద్ర ప్రభుత్వం కార్మిక  రైతాంగ  ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి





కేంద్ర ప్రభుత్వం కార్మిక  రైతాంగ  ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి


 


సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు 


బోనంగి చిన్నయ్య పడాల్.


 


 చింతపల్లి  ,  పెన్ పవర్


 

 బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్రంలో తీసుకున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు.గురువారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక నాయకులతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ ఎల్ తిరుమల బాబుకు పదకొండు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు కార్మిక చట్టాలను రద్దు చేయడంతోపాటు కార్మికులను అనేక విధాలుగా ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రైతు,కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి సుస్థిర పాలన సాగించాలన్నారు. కరోనా కష్టకాలంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, అంగనవాడి, గ్రామ వాలంటరీల సేవలను గుర్తించి మూడు నెలల పాటు అదనంగా నెలకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, మధ్యాహ్న భోజన యూనియన్ నాయకులు నాగలక్ష్మి, నాగరత్నం, కుమారి తదితరులు పాల్గొన్నారు.


 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...