Followers

ఇకపై వినియోగదారులే రాజులు


ఇకపై వినియోగదారులే రాజులు.. అమలులోకి రానున్న కొత్త చట్టం..! 


(బ్యూరో రిపోర్ట్ విశాఖపట్నం, పెన్ పవర్ )



           భారతప్రభుత్వం ఇకపై నూతన వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తేనుంది. వచ్చే వారం.. అంటే జూలై 20వ తేదీ నుంచి ఈ కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులకు తాము కొనే, పొందే వస్తువులు, సేవలకు పూర్తి హక్కులు ఉంటాయి. వారికి రక్షణ కల్పించబడుతుంది. ఈ మేరకు జూలై 20 నుంచి కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని అమలు చేయనున్నారు. కొత్త చట్టం అమలులోకి వస్తే వినియోగదారులే రాజులు అవుతారు. వినియోగదారులు ఇకపై తాము కొనే వస్తువులకు సంబంధించిన ప్రాంతంలో కాకుండా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వినియోగదారుల ఫోరంలో కేసులు వేసి ఆ మేరకు పరిహారం పొందవచ్చు. ఇక వినియోగదారులు వారు కొనే వస్తువుల వల్ల వారికి నష్టం కలిగితే ఆ వస్తువులను తయారు చేసిన కంపెనీ లేదా డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ లేదా అమ్మకం దారులకు గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది.1 లక్ష ఫైన్ వేస్తారు. అయితే వినియోగదారులకు తాము కొనే వస్తువుల వల్ల గాయాలైతే తయారీదారు, అమ్మకందారు, డిస్ట్రిబ్యూటర్‌లకు గరిష్టంగా రూ.5 లక్షల ఫైన్ విధిస్తారు. లేదా 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇక ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులు చనిపోతే గరిష్టంగా రూ.10 లక్షల ఫైన్ పడుతుంది. 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. తీవ్రత ఎక్కువ ఉంటే యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధిస్తారు. నూతనంగా అమలు చేయనున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం ఈ శిక్షలు, ఫైన్లు ఉంటాయి. వినియోగదారులు తాము కొనే వస్తువులు నకిలీవని తేలినా, వాటిలో కల్తీ అని గుర్తించినా.. డ్యామేజ్ అయినా.. ఇతర ఏ కారణాల వల్ల అయినా నష్టం కలిగితే అందుకు పరిహారం పొందవచ్చు. ఇక ఒకే సారి ఎక్కువ మంది వినియోగదారులకు నష్టం వాటిల్లితే దాన్ని సుమోటోగా తీసుకుని జాతీయ వినియోగదారుల ఫోరం కేసు విచారించి.. బాధితులకు రక్షణ, పరిహారం అందిస్తుంది. కాగా కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 బిల్లును గతేడాదే అమోదించారు. మొదట దీన్ని జూలై 8, 2019లో రాజ్యసభలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ప్రవేశపెట్టగా, జూలై 30, 2019న లోక్‌సభలో ఈ బిల్లును ఆమోదించారు. తరువాత ఆగస్టు 6, 2019న రాజ్యసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 9, 2019న ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలో ఈ బిల్లు జూలై 20, 2020 నుంచి అమలులోకి రానుంది. దీంతో ఇకపై వినియోగదారులకు తాము కొనుగోలు చేసే, పొందే వస్తువులు, సేవలకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది. కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారులకు 6 హక్కులను అందిస్తోంది..



1. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవలకు గాను వారికి పూర్తి స్థాయిలో రక్షణ హక్కు లభిస్తుంది.
2. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవలకు సంబంధించి క్వాలిటీ, క్వాంటిటీ, పొటెన్సీ, ప్యూరిటీ, స్టాండర్డ్‌, ధరలను తెలుసుకునే హక్కు ఉంటుంది.
3. అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసే, అన్ని రకాల సేవలను పొందే హక్కు, వాటిని ఎంపిక చేసుకునే హక్కులు వినియోగదారులకు ఉంటాయి.
4. వినియోగదారులు తమ ఫిర్యాదులను సంబంధిత ఫోరంలలో నమోదు చేసే హక్కు ఉంటుంది.
5. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవల వల్ల నష్టం వాటిల్లితే అందుకు పరిహారం పొందే హక్కు ఉంటుంది.
6. వినియోగదారులు తాము కొనే వస్తువులు, పొందే సేవలపై నష్టపోకుండా ఉండేందుకు వారు వివరాలను తెలుసుకునే హక్కు కూడా ఉంటుంది.
కాగా నూతన చట్టం గురించిన మరిన్ని వివరాలను ఒకటి, రెండు వారాల్లో ఓ నోటిఫికేషన్ రూపంలో తెలపనున్నారు. కానీ చట్టాన్ని మాత్రం జూలై 20 నంచి అమలు చేయనున్నారు.


ఉద్దేశ్ వైద్యానికి ఎన్నారై ల చేయూత




ఉద్దేశ్ వైద్యానికి ఎన్నారై ల చేయూత


రూ" 50 వేలు చెక్కు అందజేత


పరవాడ, పెన్ పవర్



పరవాడ గ్రామానికి చెందిన నవ యువత యూత్ సభ్యుడు పోస్ట్ మెన్  మేనల్లుడు గండి శ్రీనివాసరావు తో పరిచయం ఉన్న ఎన్నారైలు తమ గొప్ప మనసును చాటుకున్నారు.లుకేమియా వంటి ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న భరణికం గ్రామానికి చెందిన జర్నలిస్టు బొండా నాని నాలుగేళ్ల కుమారుడు ఉద్దేశ్ వైద్యానికి రూ"50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కు ను గురువారం ఉదయం  ఉద్దేశ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎన్నారై ల తరుపున చెక్కు ను పరవాడ గ్రామానికి చెందిన గండి శ్రీను, కూoడ్రపు నర్సింగ రావు, చుక్క గోపి, అంద చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల యూత్ అధ్యక్షులు పెది శెట్టి శేఖర్, ఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్  ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 




హోమ్ ఐసోలేషన్ లో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్


హోమ్ ఐసోలేషన్ లో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్



పరవాడ, పెన్ పవర్



 నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉండడంతో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ హోమ్ ఐసోలేషన్ లో  ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికార పార్టీకి చెందిన ఎక్కువ మంది శాసనసభ్యులు కరోనా వైరస్ బారిన పడుతున్న దృష్ట్యా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పది రోజుల పాటు అధికార, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటునున్నట్లు తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ అధికారులకు, పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఫోన్లో నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. అధికారులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, సహకరించాలని కోరారు. 


గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆలుపన కనకరెడ్డి




గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆలుపన కనకరెడ్డి


 


పూర్ణా మార్కెట్, పెన్ పవర్


 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి కల్లు పాకులు పరిధిలో ఉంటున్న గణేష్ వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో మృతి చెందినారు ఆ యొక్క కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి గారు చనిపోవడంతో కుమార్ ని గణేష్ ను ఓదారుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 35వ. వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థి. అలుపనకనకరెడ్డి అంతేగాక ఈ యొక్క కుటుంబానికి నేను అండగా ఉంటానని భరోసా ఇస్తూ రెండు నెలలకు సరిపడే రేషన్, నాలుగు బియ్యం బస్తాలు, కిరాణా సామాన్లు, కొంత నగదు ఇవ్వడం జరిగినది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది అని చెప్పడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆది విష్ణు రెడ్డి, వార్డు యూత్ ప్రెసిడెంట్, ఎస్కే, యాసీన్, దక్షిణ నియోజకవర్గం, సేవాదళ్  ప్రెసిడెంటు, ఏ, సుబ్బిరెడ్డి. వార్డు సీనియర్ నాయకులు, లండ త్రినాథ్, పి రమణమ్మ, జి రమణ, చల్లా రావు, నగేష్, వినోద్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు



35వ వార్డులో ఇంటింటికి ఆలుపన కనకారెడ్డి



35వ వార్డులో ఇంటింటికి ఆలుపన కనకారెడ్డి


 


పూర్ణా మార్కెట్, పెన్ పవర్


 

మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఐదవ రోజైన  ప్రసాద్ గార్డెన్ వద్ద వున్నా  ప్రజలకుగడపగడపకు వెళ్లి అడిగి తెలుసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ35వ. వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థి అలుపనకనకరెడ్డి ఈయొక్క కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రధాన కార్యదర్శి, ఏ ఆది విష్ణు రెడ్డి, వార్డు యూత్ ప్రెసిడెంట్, ఎస్.కె యాసీన్, దక్షిణ నియోజకవర్గం సేవాదళ్ ప్రెసిడెంట్, ఏ సుబ్బిరెడ్డి, వార్డు సీనియర్ నాయకులు లండ త్రినాథ్, నౌషాద్,రమణమ్మ, జి. రమణ, నగేష్. వినోద్. మాలి బాబు,  తదితరులు పాల్గొన్నారు


ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి




ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

- పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

 

 చింతూరు, పెన్ పవర్ 

 

     ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకట రమణ, చింతూరు అటవీశాఖ డివిజన్ డియఫ్ఓ వి సాయిబాబాలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది  నిర్వహిస్తున్న వన మహోత్సవంలో బుధవారం 71 వన మహోత్సవం (జగనన్న పచ్చ తోరణం) కార్యక్రమంలో భాగంగా చింతూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి ఏడాది 10 మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పాటు పడాలని పిలుపునిచ్చారు. నేటి మొక్కలు రేపటి మానవాళి మనుగడకు ఎంతో దోహద పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో లాగింగ్ డివిజన్ డియఫ్ఓ కొండల రావు, చింతూరు రేంజర్ కమృద్ధిన్, అటవీశాఖ అధికారులు చిన్న భిక్షం, వీర భద్రయ్య, సరిత, రాములమ్మ, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పదవి పట్ల హర్షాతిరేకాలు


మంత్రి పదవి పట్ల హర్షాతిరేకాలు


 


అంబాజీపేట,(పెన్ పవర్):


 



ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో నికి రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ను తీసుకోవడం పట్ల ఆయన అభిమానులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నాయకులు అయినటువంటి దొమ్మేటి వెంకటేశ్వరరావు, దొమ్మేటి సత్యమోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేకును పార్టీ మండల అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు కట్ చేసి నాయకులకు,కార్యకర్తలకు పంచారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ కు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి తామంతా ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు... కార్యకర్తలు, అభిమానులు జై జగన్.. జై వేణు అన్న అంటూ నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చి అందరికీ స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...