Followers

40 మంది ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు




40 మంది ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు..

 

 

సామర్లకోట, జూలై,22 పెన్ పవర్

 

 

సామర్లకోట పట్టణ పరిధిలో బుధవారం పలు ప్రభుత్వ శాఖలకు చెందిన 40 మంది ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులకు సయితం పాజిటివ్ రిపోర్టులు నమోదవుతున్న నేపధ్యంలో సామర్లకోట పట్టణ పరిధిలో మున్సిపాలిటీ,మెప్మా,ప్రజారోగ్య శాఖ,పోలీస్ శాఖలకు సంబంధించి ఒక్కో శాఖ నుంచి పది మంది చొప్పున రోజుకు 40 మందికి ఈ పరీక్షలను నిర్వహిస్తూ వస్తున్నారు.దానిలో భాగంగా ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబుతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. కాగా మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరికి పాజిటివ్ రాగా బుధవారం తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటి వరకు మున్సిపాలిటీ పరిధిలో వందమందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు కమిషనర్ చెప్పారు.మిగిలిన సిబ్బందికి కూడా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.

 

 




ప్రభుత్వం పనితీరు పెంచడం పంచడం తప్ప అభివృద్ధి శూన్యం


ప్రభుత్వం పనితీరు పెంచడం పంచడం తప్ప అభివృద్ధి శూన్యం

 

 

గోనెగండ్ల, పెన్ పవర్ 

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు పెంచడం పంచడం తప్ప అభివృద్ధి శూన్యం అని టీడీపీ విద్యార్థి సంఘం(టీఎన్ఎస్ఎఫ్)మండల అధ్యక్షులు రంగస్వామినాయుడు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బివి ఆదేశాల మేరకు పత్రికా సమావేశం చేయడం జరిగిందన్నారు.ఈ ప్రభుత్వ పనితీరు ప్రజల దగ్గర వివిధ రూపాల్లో బాదుడే బాదుడుగా డబ్బులు వసూలు చేస్తూ వారికే పంచిపెట్టడం గొప్ప కార్యంగా పెట్టుకుందని ఆరోపించారు.దేశంలో ఎక్కడా లేనంతగా వ్యాట్ వసూలు చేయడం భావ్యం కాదన్నారు.నేడు ఈ కోవలోకి పెట్రోల్ పై రూ.1.24,డీజిల్ పై 93 పైసలు వ్యాట్ పెంచడం కాక పెట్రోల్ పై 31 శాతం పన్నుతో పాటు అదనంగా 4 రూపాయలు.డీజిల్ పై 22.25 శాతంతో వ్యాట్ తో పాటు అదనంగా రూ.4 సుంకాన్నీ పెంచడం సిగ్గుచేటని అన్నారు.పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు వ్యాట్ పెంచిందంటే నేడు ఈ రాష్ట్రంలో ఏ పాలన కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.నాడు ప్రతిపక్షంలో గొప్పలు చెప్పి నేడు అధికారంలోకి వచ్చాక శ్రీరంగా నీతులు వళ్ళుతున్నారని ప్రమాణ స్వీకారం రోజునే విద్యుత్ చార్జీలు ఇతర చార్జీలు పూర్తిగా తగ్గించేస్తాం అని చెప్పి మాట తప్పడం మడమ తిప్పడం ఈ ప్రభుత్వ పెద్దమనిషికి చెల్లిందన్నారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 వ్యాట్ తగ్గిస్తే మీరూ పెంచుకుంటూ పోవడం ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో ప్రజల దగ్గర రెండింతలు పిండుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.ఈ కరోనా సమయంలో ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీలు,బస్ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డివిరిచిందని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని దౌర్జన్యంగా పేదల గుడిసెలు తొలగించడం,అధికారులతో దౌర్జన్యాలు,హత్యలు,దోపిడీలు, అత్యాచారాలు,దళితులపై దాడులు తప్ప ఏమి సాంధించారని ప్రశ్నించారు.కక్ష్య సాధింపు లో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతల అక్రమ అరెస్టులు,బెదిరింపులు తప్ప  ఈ ప్రభుత్వం వెలగబెట్టింది ఏంది లేదన్నారు.సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే డబ్బులు,గుట్కాలతో పట్టుపడుతున్నా వారికి ప్రభుత్వం కొమ్ముకాయడం సిగ్గుచేటని అన్నారు.ఇకపోతే గోనెగండ్లలో ఎల్ఎల్సీ కాలువ రహదారిలో భారీ అక్రమాలు అవినీతి చోటుచేసుకుందని అవి తప్పకుండా బయటకు తిస్తామని అన్నారు.

పేదలకు ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం 


పేదలకు ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం 

 

 

గోనెగండ్ల, పెన్ పవర్

 

జనసేన - బీజేపీ సంయుక్త ధర్నా 

 

 

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఆంద్రప్రదేశ్ కు 2014 నుంచి 2019 కాలంలో 9000 కోట్ల రూపాయలు అందిస్తే పేదలకు రాష్ట్ర ప్రభుత్వాల అవినీతితో ఇళ్ల నిర్మాణ పథకంలో తూట్లు పొడుస్తు కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారని జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ పార్టీల  పిలుపు మేరకు మండలకేంద్రమైన గోనెగండ్లలో జనసేన - బీజేపీ సంయుక్త ధర్నా కార్యక్రమన్ని చెప్పట్టారు,ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా,బీజేపీ,మండల నాయకులు యన్,యమ్, మహేష్ మాట్లాడుతూ జి+3 గృహాల కేటాయింపులో గత ప్రభుత్వం అలసత్వం వహిస్తే వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తుందో ప్రజలకు చెప్పాలన్నారు,లబ్ధిదారులు తమ వాటాలు మొత్తం చెల్లించిన తరువాత ప్రభుత్వాలు మారడంతో కేటాయింపులు జరపకుండా వదిలేస్తున్నారని, ప్రభుత్వాల తీరు ఇటుక ఇటుకలో అవినీతి, అడుగు అడుగులో అరాచకాలు చేస్తే లబ్ధిదారుల సొంతింటి కళ గానే మిగిలిపోతుందని అన్నారు,పేదలందరికి ఇళ్ళు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నీరు కారుతుందని ప్రభుత్వాలు మారితే కేటాయింపులు ఆపేస్తారా అని ప్రశ్నించారు,జి+3 ఇంటి నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేసి పంపిణీ ఎందుకు చేయడం లేదని అన్నారు,,పేదలకు ఇళ్ల కేటాయింపులో పాలకుల తీరు వల్ల అర్హులైన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ పథకాన్ని ఆటకెక్కించి సెంటు భూమి అందులో ఇంటి నిర్మాణం పేరుతో మాయాజాలం ప్రదర్శించి కొండలు,గుట్టలు, చూపించి చదునుపేరుతో అయిన వాళ్ళతో పనులు చేయిస్తున్నారని అన్నారు,బీజేపీ -జనసేన పార్టీలు చేప్పట్టిన ధర్నాలో జనసేన నాయకులు ఖాసీం,జానీ,హరికృష్ణ, షఫీ,చాంద్,బీజేపీ నాయకులు,మునిస్వామి గౌడ్,పుగ్యాల ఉరుకుందు,బజారి,రమేష్,పాల్గొన్నారు,

శ్రీశైలం ఎమ్మెల్యే డిశ్చార్జ్


శ్రీశైలం ఎమ్మెల్యే డిశ్చార్జ్

 

పెన్ పవర్, శ్రీశైలం

 

గత ఐదు రోజుల క్రితం కరోన బారిన పడి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు.ఈ మేరకు ఆయన ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు.

నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో క్షేమంగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చానని, మరో రెండు వారాలు హోమ్ క్వారంటైన్ లో ఉండనున్నట్లు తెలిపారు. తనను పరామర్శించేందుకు ఎవరు రావొద్దని, ఏదైనా అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మాత్రమే

సంప్రదించండి అని కోరారు.

పరవళ్లు తొక్కుతున్న రాజోళి ఆనకట్ట


పరవళ్లు తొక్కుతున్న రాజోళి ఆనకట్ట

 

 

పెన్ పవర్, ఆళ్లగడ్డ

 

 

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చాగలమర్రి మండలంలోని రాజోళి ఆనకట్ట వద్ద ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి సుమారు 13 అడుగుల మేర వరదనీరు వచ్చి ఆనకట్ట వద్దచేరుకుంది.సుమారు 11.120 క్యూసెక్కుల నీరు లోతట్టు ప్రాంతాలకు విడుదల అవుతున్నట్లు కేసీ కెనాల్ ఏఈ మురళి తెలిపారు.ఆరు గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేసినట్లు వివరించారు. ఆనకట్ట మీదుగా 3 అడుగుల మేర

వరదనీరు లోతట్టు ప్రాంతాలకు వెళ్తున్నాయి.మొత్తం ఆనకట్ట నుండి 13.188 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు వెల్లడించారు.

నేటి నుంచి  ఆటోలు బంద్


నేటి నుంచి  ఆటోలు బంద్.                 

 

 

ఆటో యూనియన్ అధ్యక్షు,కార్యదర్శులు

 

చింతపల్లి  , పెన్ పవర్

 

 విశాఖ మన్యంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలలో ఆటో సర్వీసులను రద్దు చేయాలని ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్వి రమణ, నీలకంఠం లు బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో ఉన్న ఆటో  సర్వీసుల వలన కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.  వివిధ ప్రాంతాల నుంచి ఆటోలలోమైదాన ప్రాంత వ్యాపారస్తులు ప్రయాణిస్తున్నారని వీరి ద్వారా తొందరగా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.  ఆటో యూనియన్ సభ్యులందరూ యూనియన్ నిబంధనలను పాటించి నేటి నుంచి పది రోజుల పాటు ఆటోలను నడప రాదని సూచించారు. యూనియన్ నిబంధనలను అతిక్రమించి ఆటో సర్వీసులు చేస్తే వారిపై యూనియన్ పరంగా చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా పచ్చతోరణం ప్రారంభం




ఘనంగా పచ్చతోరణం ప్రారంభం...

 

సామర్లకోట, పెన్ పవర్

 

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తున్న పచ్చతోరణం కార్యక్రమం క్రింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో  మున్సిపాలిటీ లో బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈవో పిఆర్డీ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఏసుబాబు,తహసీల్దార్ వి జితేంద్ర, ఈవోపిఆర్డీ సూర్యనారాయణ లు మాట్లాడుతూ ఈ పథకం క్రింద అన్ని గ్రామ సచివాలయల పరిధిలో 6500 మొక్కలు నాటుతునట్టు చెప్పారు.పర్యావరణ పరిరక్షణకు,పచ్చదనాన్ని వృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నoదున ఈ కార్యక్రమాలను అన్ని గ్రామాల్లో చేపడుతున్నట్టు వారు చెప్పారు.మొక్కలు నాటడంతో వదలి పెట్టకుండా వాటిని సంరక్షించే విషయంలో ను పంచాయతీ,గ్రామ సచివాలయ సిబ్బంది బాధ్యత తీసుకోవాలని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ సి హెచ్ రామారావు, శానిటర్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్,గ్రామ వైసీపీ నాయకులు గోలి వెంకట్రావు,బొబ్బరాడ సత్తిబాబు,పంచాయతీ, సచివాలయ సిబ్బంది హెచ్ ఎం లు పాల్గొన్నారు.

 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...