అక్రమ మద్యం పట్టివేత ముగ్గురు అరెస్ట్
(కాకినాడ స్టాఫ్ రిపోర్టర్)
బుధవారం మధ్యాహ్నం కాకినాడ జె ఎన్ టి యు వద్ద జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తుల నుండి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు స్పెషల్ ఫోర్స్ మెంట్ బ్యూరో కాకినాడ నార్త్ సీఐ .జి వెంకట లక్ష్మి తెలిపారు .
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాకు వచ్చిన సమాచారం మేరకు,ఏపీ39 డిఓ155అను నెంబర్ గల ఆటో లో పిఠాపురం నుండి కాకినాడకు మద్యం తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని, తదనంతరం ఆ సమాచారం ఆధారంగా స్థానిక జె.ఎన్.టి.యు మెయిన్ గేట్ సమీపంలో సదరు ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో 180 ఎం.ఎల్.గల 40 మద్యం బాటిల్ ను కనుగొనడం జరిగిందని , వీటిని తరలిస్తున్న కాకినాడ రూరల్ మండలం సూర్యాపేటకు చెందిన ముమ్మిడి శివ శంకర్ సన్నాఫ్ ప్రకాష్ రావు, మరియు ఆవ శ్రీనివాసు సన్నాఫ్ అప్పారావును అరెస్ట్ చేసి మద్యాన్ని, ఆటోను సీజ్ చేసినట్లు చెబుతూ, వీరుఈ మద్యాన్ని పిఠాపురం ప్రభుత్వ మద్యం షాపు నుండి కొనుగోలు చేసి కాకినాడ కొత్తపేట మార్కెట్ సమీపంలో అధిక ధరలకు విక్రయించుటకు తీసుకెళ్తునట్లు ఆమె తెలిపారు. అలాగే కాకినాడ అన్నమ్మ ఘాటీ కి చెందిన ఎదలాడ చంటి అనే వ్యక్తి నుండి 180ఎం.ఎల్.12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఇతను కూడా అరెస్టు చేసినట్లు సి ఐ జి వెంకట లక్ష్మి తెలిపారు.ఆటో సీజ్ తో పాటు, వీరి ముగ్గురి పై కేసులు నమోదు చేసి కోర్టు తరలించినట్లు చెప్పారు.ఈ దాడులలో
సి.ఐ .జి.వెంకట లక్ష్మీ ,తోపాటు ఎస్.ఐ,యస్.ఈ.బి సిబ్బందిపాల్గొన్నారు.