Followers

త్రిశంకు స్వర్గంలోఎం.టి.ఎస్ లెక్చరర్ల ,వివిధ శాఖల ఎం.టి.యెస్ ఉద్యోగుల అగచాట్లు







త్రిశంకు స్వర్గంలోఎం.టి.ఎస్ లెక్చరర్ల ,వివిధ శాఖల ఎం.టి.యెస్ ఉద్యోగుల అగచాట్లు.     

 

 

   ఆత్రేయపురం,  పెన్ పవర్

 

 

 

19 85 నుండి పార్ట్ టైం  ఉద్యోగుల వ్యవస్థ ప్రారంభ మైనది.

  గంటకు ఐదు రూపాయల నుండి , 10 రూపాయలు 20 రూపాయలు, నెలకు 1440, మూడు వేల ఒక వంద రూపాయలుగా నెలసరి జీతం క్రమ క్రమంగా పెరిగింది .1991లో జీవో నెంబర్ 278 ప్రకారం  అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్ధనరెడ్డి  పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులర్ చేయడానికి ప్రయత్నించారు. అనంతరం 302,305,365,14,45,221,212, 166 జి.ఓ లు రావటం జరిగినది.ఈ జి.ఓ లన్ని 1991 నుండి1995 మధ్యన రావటం జరిగినది. తర్వాత 1996లో212 జి.ఓ.ప్రకారం  జూనియర్ కాలేజ్ ,డిగ్రీ కాలేజ్ లలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్ లను రెగ్యులర్ చేయడానికి అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ప్రయత్నించి ,1985 నుండి 1988 మధ్యన పార్ట్ టైం ఉదోగులగా జాయిన్ అయిన సుమారు 500 మందిని 212 జి.ఓ ప్రకారం రెగ్యులర్ చేయడం జరిగినది. ఆ జీ.వో పరిధికి రానివారు ఈ రోజు నాటికి పార్ట్ టైం లెక్చరర్లుగా పని చేస్తున్నారు. 25 .11 .19 93 నాటికి 600 రోజులు లేక 1991 జూలై 31 నాటికి 360 రోజులు ఉన్నవారిని రెగ్యులర్ చేయడం జరిగినది. రెగ్యులర్ కాని ఎం.టి .ఎస్ లెక్చరర్,వివిధ శాఖల ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడం జరిగినది. ఆ రెగ్యులర్ లో అనేక అవకతవకలు జరిగినవి .కట్ ఆఫ్ డేట్ నాటికి కొంత మందికి తేదీలు లేక పోయినా వారిని తెలుగు దేశం ప్రభుత్వం  రెగ్యులర్  చేసినది.మరి కొంత మందికి  360 లేక 600 రోజులు ఉన్నప్పటికీ, రెగ్యులర్ చేయలేదు. దానికి కారణం 1989లో జాయిన్ అయిన పార్ట్ టైం వ్యక్తులను రెగ్యులర్ చేయలేదు.వీరు కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జాయిన్ అయ్యారు అని,వారికి పబ్లిక్ ,జాతీయ సెలవులు కలపలేదు.అలాగే పరీక్షలకు ఉపయోగించుకుని ఆ రోజులను పని దినాలుగా ప్రకటించలేదు.పేపర్ వాల్యూషన్ చేసిన రోజులను లెక్కలోకి తీసికోలేదు,1989 తరువాత అనగా కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జాయిన్ అయ్యిన వారిని పిరియడ్లను,అవర్, రోజులు, ప్రభుత్వ ,జాతీయ పరీక్షలు, పేపర్ వాల్యూషన్  రోజులు,రకరకాలు గా ఇడదీసి,వీరిని రెగ్యులర్ కాకుండా 1996లో  తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుపడింది.తనకు కావలసిన వారికి పై శెలవులు కలిపి రెగ్యులర్ చేసింది.

 దీనికి కారణం. 1989నుండి1995 మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంవల్ల వీరిని కాంగ్రెసు వాదులని తెలుగుదేశం ప్రభుత్వం 1996లో వీరిని రెగ్యులర్ చేయలేదు. 1989  నుండి ఈరోజు వరకు సుమారు 31 సంవత్సరాల సర్వీసు లో ఉన్న వీరికి, పే-డి .ఎ. మాత్రమే వస్తున్నది. పార్ట్ టైం  లెక్చరర్ల నుండి  ఎం.టి ఎస్ గా  ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి  మార్పు చేసి,జీతాలు పెంచారు.త్వరలో రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ , ఆంధ్ర రాష్ట్ర ప్రజల,దురదృష్టం, మా దురదృష్టంమో, దురదృష్టవశాత్తు వారు ప్రమాదంలో మరణించడం వల్ల ,ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఎం.టి .ఎస్. గా చేస్తున్న జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల పనిచేస్తున్న,ఎం.టి.ఎస్  జనరల్ అధ్యాపకులు, ఒకేషనల్ అధ్యాపకులు, ల్యాబ్ అటెండర్ సమస్యలు, పరిస్కరిస్తారని, వై .ఎస్.రాజశేఖరరెడ్డి, ఆశయాలు నెరవేర్చే, వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిరు మాట గురించి ఎం.టి .ఎస్ గా పనిచేస్తున్న  ,విద్య,యూనివర్సిటీ,ఖజానా,గ్రామ పంచాయతీ,మునిసిపల్ పట్టణాభివృద్ధి,జలవనరులు, పి.ఆర్ ఆర్.డబ్ల్యూ.ఎస్, పట్టు పరిశ్రమల శాఖ,గిరిజ శాఖ,బి.సి వెల్ఫేర్,ఎస్. సి.వెల్ ఫేర్,వాణిజ్య పన్నుల శాఖ,పశు సంవర్ధక శాఖ,అటవీ పర్యావరణ శాలలో     సుమారు 5589 మంది,ఎం.టి.యెస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.వీరిని రెగ్యులర్ చెయ్యటం వలన ప్రభుత్వానికి ఏ విధమైన ద్రవ్య భారం లేదు,ఒక హెచ్.ఆర్.ఎ తప్పా.వీరు అందరూ 50 సంవత్సరాలు దాటినా వారే,చనిపోయే ముందు ,ప్రభుత్వ ఉద్యోగులు అనిపించే కుంటారు.లేక పోతే ఉద్యోగుల్లో, నిరుద్యోగులో తెలియకుండా మరణిస్తారు.31 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిన వారికి వారి కోరిక తీర్చటం తప్పు కాదేమో,ఒక్కసారి మానవతా  దృక్పథంలో ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వానికి, అధికారులకు,నాయకులకు ఉంది.

 ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట గురించి ఎం.టి.ఎస్ ఉద్యోగులందరు  ఎదురుచూస్తున్నారు. 2000 సంవత్సరంలో తెలుగుదేశం హయాంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా జాయిన్ అయిన వారికి రెగ్యులర్ చేయడానికి మంత్రుల కమిటీ ప్రయత్నం చేస్తున్నారు.కానీ  1989లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారిని వదిలి, రెండువేల సంవత్సరములో , జాయిన్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయడం మంచిదే కానీ , వివిధ శాఖలకు సంబంధించిన ఏం.టి .ఎస్. ఎస్ అధ్యక్షులు ఈ సందర్భంగా1989 నుండి వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న, ఎం.టి.ఎస్ అయిన,  మమ్ములను కూడా రెగ్యులర్ చెయ్యమని కోరుతున్నారు. ఎం. టి ఎస్ ఉద్యోగులకు సుప్రీం కోర్ట్, హై కోర్ట్, ట్రిబ్యునల్ కోర్ట్,  రెగ్యులర్ చేయమని జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది .

పి.ఆర్ సి కూడా ఎం.టి. ఎస్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలపడం జరిగింది .వివిధ శాఖల ఎం.టి. ఎస్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకులు, మంత్రి వర్గము ను, మంత్రుల సబ్ కమిటీని ,వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ లను, కమిషనర్లను ,కలిసి  తమ సమస్యను విన్నవించుకోవడం జరిగినది .వారందరూ అలాగే తప్పనిసరిగా చూస్తామని తెలియ జేసారు .కానీ ఇప్పుడు అడుగుతుంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయం చూస్తున్నాం. మీది ఆ తరువాత మాట్లాడుదాం చూస్తాం అంటున్నారు. ముందు ప్రభుత్వంలో పని చేసిన వారిని వదిలేసి వెనుక ప్రభుత్వం లో జాయిన్ అయిన వారి సమస్యలు  చూడడం ఎంతవరకు సబబు  అని వారు వాపోయారు. వారికి చేయండి, వారితో పాటు మాకు  కూడా చెయ్యండి అని  ప్రభుత్వం వారిని,  సి.ఎం వై .ఎస్ జగన్  ఎం.టి.ఎస్ వివిధ శాఖల ఉద్యోగ  సంఘాలు కోరుతున్నాయి.  దీనిపై ప్రభుత్వ   సబ్ కమిటీ తమ నిర్ణయాన్ని ,మంత్రివర్గ కమిటీ కి తెలియజేయ బాధ్యత ఉన్నది.

  వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ లు, వారివారి శాఖల్లో ఉన్న వివిధ సమస్యలను మంత్రివర్గ మండలి ముందు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముప్పై రెండు సంవత్సరముల నుండి పనిచేస్తున్న వీరికి ఏ విధమైన ఇంక్రిమెంట్ కానీ,ఏర్న్ లీవ్ కానీ ,హెచ్. ఆర్ 

ఏ .గాని ,సి. సి ఏ  గాని ,ఏ విధమైన  ప్రమోషన్ లు గాని , పెన్షన్ కానీ లేకపోవటం మీరు చేసుకున్న  పుణ్యఫలం మని వాపోతున్నారు.  కావున ప్రభుత్వం వారు ,వివిధ శాఖలలో ఉన్న ఎం.టి.ఎస్ ఉద్యోగుల బాధలను అర్థం చేసుకుని పార్ట్ టైం ,ఫుల్ టైం కంటింజెంట్ ,మినిమం టైం, రోజువారి, కన్సల్టెంట్ లలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ముందుగా రెగ్యులర్ చేసి తరువాత కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులను రెగ్యులర్ చేయడం ధర్మ సమ్మతమని ఉద్యోగుల సంఘం నాయకులు తెలియజేస్తున్నారు .ఈ రోజు నాటికి సీఎం ను, కలవడానికి ఆస్కారం లేక తమ బాధలు చెప్పుకోవడానికి పర్మిషన్ లేక బాధపడుతున్నారు. వీరి బాధలను అర్థం చేసుకుని సీఎం  ను కలవడానిక పర్మిషన్ ఇస్తారని, ఎదురుచూస్తున్నారని ఎం.టి ఎస్ ఉద్యోగుల సమస్యలను వింటారని, వైయస్ రాజశేఖర్ రెడ్డి  ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తారని ,1989 నుండి  ఇప్పటివరకు చేస్తున్నవారు కాంగ్రెస్ అభిమానులని, వీరిని తెలుగుదేశం ప్రభుత్వం ప్రక్కన పెట్టి నది,అన్నా విషయం  సి.ఎం. జగన్ గ్రహిస్తారని ఎం.టి.యెస్ ఉద్యోగులందరు కోరు తున్నారు.సి.ఎం. ఈ  సమస్యను పరిశీలించి 5589 ఎం.టి.ఎస్ ఉద్యోగ కుటుంబాలకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు. .


 

 




 

 



 



 



బి.జె.పి.సిటీ కార్యాలయంలో  నిరసన







బి.జె.పి.సిటీ కార్యాలయంలో  నిరసన.

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్

 

 

భారత ప్రధాని నరేంద్ర మోడీ  ఆశయాల మేరకు ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల సంఖ్యలో ఇళ్లను కేటాయించడం జరిగింది కానీ, ఈ పథకం ద్వారా టి.డి.పి. ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల కాంట్రాక్టుల్లో అవినీతి చోటుచేసుకుందని కారణం చూపుతూ, ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదివరకే నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా వాటిని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ  బుధవారం ఉదయం లాసన్స్ బే కాలనీ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు  ఏం.రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం మాజీ ఎం.పి. డా.కంభంపాటి హరిబాబు విచ్చేసారు.

 

ఈ సందర్భంగా డా.కంభంపాటి హరిబాబు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2022 వ సంవత్సరానికల్లా ప్రతి కుటుంబానికి స్వంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో కోటి ఐదు లక్షల ఇళ్లను దేశవ్యాప్తంగా మంజూరు చేయగా, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇరవై లక్షలకు పైగా ఇళ్లను కేటాయించారు అని తెలిపారు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం తప్పుచేస్తే దోషులను శిక్షించాలి కానీ పేదలకు అన్యాయం చేయకూడదు అని అన్నారు.

 

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఏం.రవీంద్ర మాట్లాడుతూ దేశంలో అనేక పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 20 శాతం ఇళ్లను కేటాయించడం అనేది ఎంతో గొప్ప విషయం అని అన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేల రూపాయలను సబ్సిడీ రూపంలో అందించినా కూడా అప్పట్లో అధికారంలో ఉన్న టి.డి.పి. ప్రభుత్వం సజావుగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టలేకపోయిందని మరియు విపరీతమైన అవినీతికి పాల్పడిందని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై సీ పీ ప్రభుత్వం ఇదివరకే నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా తాత్సారం చేస్తుందని ఆయొక్కగృహాలు టి.డి.పి. ప్రభుత్వం యొక్క స్వంత నిధులతో నిర్మించలేదని గ్రహించి, తక్షణమే అర్హులకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను అందించాలని డిమాండ్ చేసారు.

 

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నగర అధ్యక్షులు చిరికి.సత్యనారాయణ, తురగ, శ్రీరామ్,ప్రసాద్ గారు తదితరులు సామజిక దూరం పాటిస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేసారు. 


 

 




 

 



 



 



 కరోనా పై పోరాటానికి సిద్దంగా వుండాలి




 కరోనా పై పోరాటానికి సిద్దంగా వుండాలి:తోట నగేష్ 
 

 

పాయకరావుపేట,పెన్ పవర్

.

తునిలో కరోనా మహమ్మారి విజృబించడంతో మూడురోజులనుండి పేటలో లాక్ డౌన్ ను స్వచ్చందంగా పాటిస్తున్నా మహమ్మారి చాపకింద నీరులా కెమికల్ కంపెనీ ఎంప్లాయిస్ ద్వారా స్తానిక లింగాలకాలనీకి చేరుకొని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుందని గ్రామ పెద్దలు, బిజేపి నాయకులు తోట నగేష్ అన్నారు.ఈనేపద్యంలో ఆయన వివిద పార్టీనాయకులతో శాఖా గ్రంధాలయంవద్ద బుదవారం అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవాడ్ —19నియంత్రణకు ప్రభుత్వాలు,అదికారులు చర్యలు తీసుకుంటున్న మహమ్మారిని అరికట్టలేక పోవడానికి కారణం ప్రజల్లో  నిర్లక్ష్యం,బాద్యత లేకపోవడం ,నిబందనలు పాటించకపోవడం  అన్నారు.సకల సౌకర్యాలతో అనుకూలంగావున్న పట్టణంను ఆనుకొని హెటొరో,డెక్కన్ కంపెనీలు వున్నాయి.వీటిలో పనిచేస్తున్న వర్కర్లు రెండువేలమందివరకూ టౌన్ లో అద్దెకు వుంటున్నారు. కనుక ప్రజాసంక్షేమం కొరకు ఇంటి యజమానులు బాద్యత తీసుకొని వారి రాకపోకలపై నిఘావుంచి తగుసూచనలు సలహాలుఇవ్వాలని కోరారు.వైరస్ ఆనవాళ్ళుతో అనుమానితులు వుంటే వారిని కోరెంటైనుకు పంపేందుకు సంప్రదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెటుయార్డు వైస్ చైర్మెను గుటూరి శ్రీను,వైసీపి టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా,మాజీ పాండురంగస్వామి దేవాలయ చైర్మెను యాళ్ళ వరహాల బాబు,టిడిపి నాయకులు పెదిరెడ్డి శ్రీను,కాంగ్రేసు నాయకులుజగతా శ్రీనివాస్ ,సిపిఐ నాయకులువెలుగుల అర్జునరావు,దనిశెట్టి తిరుమలేశ్వర్రావు,ఇంజరపు సూరిబాబు,ఐఎన్ మూర్తి,పెంకే శ్రీను, బిఎస్ నారాయణ,మాత రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.


 

 




 శిలాఫలకం వేశారు రహదారి మరిచారు



 శిలాఫలకం వేశారు రహదారి మరిచారు

చింతపల్లి  , పెన్ పవర్

మండలంలోని అంజలి శనివారం రహదారి ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా బురద పొలాన్ని తలపిస్తుంది. దీంతో స్థానిక గిరిజనులు ఈ రహదారిపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం రూ.3 కోట్లతో తాజంగి గ్రామం నుంచి జాజుల పాలెం గ్రామం వరకు తారు రోడ్డు నిర్మించింది. జాజుల పాలెం గ్రామం నుంచి అంజలి శనివారం గ్రామం వరకు రహదారి నిర్మించేందుకు రూ.2.75 కోట్ల నిధులు విడుదల కావడంతో నాటి శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి 2018 లో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. శిలాఫలకం ప్రారంభించిన అధికారులు రహదారి నిర్మాణాన్ని విస్మరించారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అంజలి శనివారానికి "శనిగ్రహం" పట్టింది. దీంతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఏజెన్సీలోని జి.మాడుగుల మండలంతో పాటు మైదాన ప్రాంతంలోని కొత్తకోట, రావికమతం గ్రామాల వరకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. చింతపల్లి మండలంతో పాటు జి.మాడుగుల మండలానికి చెందిన సుమారు 40 గ్రామాల గిరిజనులు ఈ రహదారి పైనే ఆధారపడి, రాకపోకలు సాగిస్తూ, జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంత గర్భిణీ స్త్రీలు ఏ క్షణంలో ఎలా ఉంటుందోనని ప్రసూతికి ముందుగా పుట్టింటికి వెళ్ళినట్టు మూడు నెలల వైద్య సహాయం అందే చోట మకాం వేస్తున్నారు.ప్రసూతి తరువాత మూడు నెలలకు స్వగ్రామం తిరిగి చేరుకుంటున్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా నేటి వరకు అంజలి శనివారం రహదారి నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం ఈ రహదారి వర్షాలకు అధ్వాన్నంగా తయారై నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. రహదారి పై ఆధారపడిన గిరిజనులకు ఆటోలో ప్రయాణం తప్ప వేరే మార్గం లేదు. అటువంటిది నేడు ఆటో కాదు కదా! ద్విచక్ర వాహనం ఆఖరికి సైకులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర వైద్య సేవలకు కనీసం ఫీడర్ (బైక్) అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులకు మా పాట్లు, ఫీట్లు పట్టవా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంజలి శనివారం గ్రామ రహదారి నిర్మించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.


మండలంలో మరో కరోనా పాజిటివ్

మండలంలో మరో కరోనా పాజిటివ్


 


జడ్డంగి ,పెన్ పవర్ 


 


మండలంలోని జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్  వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నాడు సంజీవిని వాహనం ద్వారా  స్థానిక పీహెచ్సీ సిబ్బంది68 మందికి రాపిడ్  కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. మంగళవారం నాడు పాజిటివ్ వచ్చిన రాజవొమ్మంగి 99 బిల్డింగ్ నివాసులు ఇద్దరిని, ఫారెస్ట్  ఉద్యోగిని భార్య భర్తల ను రాజమండ్రి  జి ఎస్ ఎల్ కు బుధవారం నాడు తరలించారు. స్థానిక ఏ పీ ఎఫ్ డి సి కార్యాలయంవద్ద,బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కార్యాల యం  వద్ద, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద, కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటి వద్ద సోడియం హైపో  క్లోర్తెడ్  ద్రావణం(  ఎన్ఏ  సి ఎల్ వో) పిచికారి తో పాటు బ్లీచింగ్   స్థానిక పంచాయతీ కార్యద మల్లేశ్వరరావు  జల్లించారు.  వారు నివాసం ఉంటున్న చుట్టుపక్కల  ప్రదేశాల వద్ద పారిశుద్ధ్య పనులు చేయించారు. 


మానవాళికి మొక్కలు జీవాధారం





మానవాళికి మొక్కలు జీవాధారం

 

 

వైస్సార్సీపీ మండల కన్వీనర్ *సింగిరెడ్డి* *రామకృష్ణ*

 


జగనన్న పచ్చ తోరణం...71వ వనమహోత్సవ కార్యక్రమం ఈరోజు రాజవొమ్మంగి లో ఫారెస్ట్ రేంజర్ ఎం.అబ్బాయిదొర ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్   నందు జడ్డంగిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్  డి ఎస్ ఎన్   మూర్తి ఆధ్వర్యంలోను,జడ్డంగినుండి చిన్నయ్యపాలెం రోడ్ నందు ఇంచార్జ్ మండల అభివృద్ధి అధికారి కామేశ్వరరావు,ఉపాధిహామీ ఎ పి ఓ సత్యనారాయణ అద్వర్యం లోనూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల వైస్సార్సీపీ కన్వీనర్,సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామకృష్ణ పాల్గొని మొక్కలు మానవా కి జీవరాధమని,మొక్కలు మానవ మనుగడకు వివిధ రకాలుగా ఉపయోగపడేవని ప్రతీ ఒక్కరూ పది మొక్కలు నాటే విధంగా  అందరినీ ప్రోత్సహించాలని అన్నారు.వైస్సార్సీపీ నాయకులు, అధికారులు చేతులు మీదుగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావ్, మాజీ సర్పంచ్ లు కొంగర మురళీకృష్ణ,కనిగిరి దుర్గాప్రసాద్, అడపా కామేష్,అంకం రవికుమార్,వాసంశెట్టి గంగాధర్,సింగిరెడ్డి రవి,తోట దుర్గాప్రసాద్, గొంతిరెడ్డి సత్యన్నారాయణ, చప్పా ప్రసాద్,కనిగిరి వీరబాబు,వీరమల్ల సత్యనారాయణ,ఈగల జ్ఞానేశ్వర్,తాటికొండ శివ మరియు ఇంఛార్జి ఎంపీడీఓ కామేశ్వరరావు, రేంజర్ ఎమ్  అబ్బాయిదొర, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డి ఎస్ ఎన్  మూర్తి, ఉప్పు శ్రీనివాస్,గంగరాజు,కె.అప్పారావు,ఫారెస్టు సిబ్బంది   కుమార్,కృష్ణ, భూలోకం, శ్రీను,కాశీ మరియు జడ్డంగి పంచాయతీ కార్యదర్శి వెంకట్,APO సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేశ్వరరావు,జడ్డంగి ఆశ్రమస్కూల్  హెచ్ ఎమ్  మరియు వార్డెన్,ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు 

 

 




కరోనా పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


కరోనా పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- రాజవొమ్మంగి తాసిల్దార్


 


రాజవొమ్మంగి,పెన్ పవర్ 


 


రా జవొమ్మంగి మండలం తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో కరోనా విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక తాసిల్దార్ వై వి సుబ్రహ్మణ్యం ఆచారి కోరారు. 
రోజురోజుకు కరోనా బాధితులు  పెరుగుతున్నారని అనవసరంగా రోడ్లపైకి వచ్చి  వైరస్ పట్ల బాధితులు కాకూడదు అన్నారు.  నిర్ణీత సమయంలో దుకాణాలు తెరచి ఉంటాయని ఇంటికి ఒకరు చొప్పున బయటకు మాస్కు ధరించి వచ్చి  నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని స్థానిక ఎస్ఐ బి వినోద్ విజ్ఞప్తి చేశారు. వ్యాపారస్తులు దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా సర్కిల్ ను ఏర్పాటు చేయాలని, తప్పనిసరిగా శానిటైజర్ ఉపయోగించాలని ఎస్ ఐ వినోద్ అన్నారు.  11 గంటలు దాటినతర్వాత అనవసరంగా రోడ్లపైకి వస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో   వైసీపీ యువ నాయకులు కనిగిరి వీరబాబు, సిహెచ్ ప్రసాద్, ఈగల జ్ఞానేశ్వర్, వర్తకులు ఉన్నారు. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...