అర్హులు అయిన వారికి వెంటనే గృహాలు ఇవ్వాలని బిజెపి డిమాండ్
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురంమండలం తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలో, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం నివాసంలో, ఒకరోజు నిరసన కార్యక్రమం జరిగింది. కొత్తపేట మండల బీజేపీ అధ్యక్షుడు, పాలాటి మాధవ స్వామి అధ్యక్షతన నిరసన దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులకు గృహాలు స్వాదీనం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా లబ్ది దారులకు వెంటనే గృహాలు స్వాధీనమం చేయాలని , ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. బుదవారం వారం ప్రధాన మంత్రి యోజన పథకం కింద
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ఆదుకోని ఉద్దేశంతో 20, 00, 000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. 90% పూర్తయిన ఇల్లును లబ్ధిదారులకు అందజేయకుండా, అవినీతి జరిగిందంటూ స్వాధీనం చేయడం మానివేశారు, అని దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బుధవారం ఉదయం 10 గంటల నుండి బిజెపి కార్యకర్తలు నాయకులు ధర్నా . కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి ఇల్లు నిలిపివేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లల్లో అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. అవినీతి జరిగి ఉంటే ఎందుకు విచారణ చేయడం లేదనే ప్రశ్నించారు. చదరపు అడుగు వెయ్యి రూపాయలు 2500 టిడిపి ప్రభుత్వం వసూలు చేసిందని అవినీతి జరిగిందని ఏం చేస్తున్నారు వైసిపి ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా ఒక పేదవాడికి ఇవ్వడం గానీ గృహనిర్మాణ రుణాలు ఇవ్వడం గానీ చేయలేదని విమర్శించారు కేవలం టిడిపి మీద ఉన్న కక్ష సాధింపు ప్రజలపై సాధించడం తగదన్నారు ఇప్పటికే 30 వేల ఇళ్లు పూర్తయ్యాయని అవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు తప్పుడు ఆరోపణలతో అసలైన అసలైన లబ్ధిదారులు కాకుండా వైసీపీ కార్యకర్తలకు ఇచ్చేందుకే ప్రభుత్వం నాటకం ఆడు తోంది అన్నారు 30,000 ఇల్లు పూర్తయినప్పటికీ గతంలో లబ్ధిదారుల ఎంపిక అందరికీ స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యొక్క మోస పూరిత విధానానికి నిరసనగా రాష్ట్రంలో బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించడం జరిగింది ...అలాగే జర్నలిస్ట్ సోదరులు కూడా ఆక్రెడియేషన్ నాన్ ఆక్రెడేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సోదరులు గృహం లేదా ఇంటి స్థలం కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది ... ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు పాలాటి మాధవ స్వామి, యువ మోర్ఛా రాష్ట్ర కార్యదర్శి పాలూరి జయ ప్రకాష్ నారాయణ, మండల ఉపాధ్యక్షుడు నాగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.