Followers

కరోనాతోహడలెత్తి పోతున్న గోపాలపట్నం వాసులు


కరోనాతోహడలెత్తి పోతున్న గోపాలపట్నం వాసులు.

గోపాలపట్నం,పెన్ పవర్ 


దేశం యావత్తు కరోనా వైరస్ కు అతలాకుతలం అయిపోయింది పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీని బారిన పడ్డారు ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల లో ప్రజలు కరోనా వ్యాధి తో మృత్యువాత పడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కరోనా మరణ మృదంగం వాయిస్తూ ఉంది పెద్ద పెద్ద నగరాల్లో కాకుండా చిన్న చిన్న నగరాల్లో కూడా దీని ప్రతాపాన్ని చూపిస్తుంది నిన్నటి మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గోపాలపట్నం లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదై గోపాలపట్నం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది మంగళవారం ఒక్కరోజే గోపాలపట్నం లక్ష్మీ నగర్ లో 8 కేసులు నమోదవడంతో ప్రజల మరింత భయభ్రాంతులు గురయ్యారు అలాగే ప్రక్కనే ఉన్న ఇందిరానగర్. పెట్రోల్ బంక్ చుట్టుపక్కల ప్రాంతాలు. చాకలి గడ్డ. నరసింహ నగర్. ఏ పీ ఎస్ సి బి కాలనీ. ప్రజలు కరోనా వైరస్ ఏ క్షణంలో ఎవరికి సోకుతుందో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న వైనం నేడు గోపాలపట్నం ప్రజల వాసులు దయనీయ పరిస్థితి కావున జీవీఎంసీ వారు వెంటనే స్పందించి వీధి వీధినా శానిటేషన్ చేయాలని అలాగే పోలీసు వారు ప్రజల విచ్చలవిడిగా తిరగకుండా కంట్రోల్ చేసే బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు


విశాఖ కి చేరుకున్న ఆర్మీ ఉద్యోగి మృతదేహం







విశాఖ కి చేరుకున్న ఆర్మీ ఉద్యోగి మృతదేహం.

     

విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

 

కార్గిల్ లో అసువులు బాపిన ఆర్మీ అధికారి మృతదేహం మంగళవారం రాత్రి విశాఖ విమానాశ్రయం కు చేరుకుంది. విశాఖ ఆర్మీ అధికార్లు గోపాలపట్నం తహశీల్దారు బి.వి రాణి మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆర్మీ వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామం సిక్కులు కు తరలించారు.

ఈనెల 19వ తారీఖు శనివారం కార్గిల్ సమీపంలో తీవ్రవాదుల అమర్చిన బాంబులను నిర్వీర్యం చేస్తున్నప్పుడు  ఒక బాంబు పేలడంతో శ్రీకాకుళం జిల్లా వాసి ఆర్మీ ఉద్యోగి లావేటి ఉమామహేశ్వర రావు తీవ్ర గాయాల పాలయ్యాడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు ఈ సమాచారం కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు ఆదివారం తెలియజేశారు, ఈయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన పార్థివ దేహాన్ని ఈరోజు రాత్రి ఢిల్లీ నుంచి విశాఖపట్నం విమానంలో తీసుకువచ్చారు

విశాఖ విమానాశ్రయంలో ఆర్మీ అధికారులు మరియు గోపాలపట్నం ఎమ్మార్వో రాణి మృతదేహన్ని లాంచనంగా స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో భౌతికకాయాన్ని శ్రీకాకుళం తీసుకుని బయలుదేరారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆర్మీ అధికారులు తెలియజేశారు..


 

 




 



 



 



అమరవీరుల వారోత్సవాలు


               


 గూడెంకొత్తవీధీ పెన్ పవర్



అమరవీరులాసంస్సరణవారోత్సవాలువిజయవంతంచేసుకోవడానికిమవోయిస్థులు. విపలం చేయించడానికి పోలీసులు వీలు మద్య యుద్ధం వాతావరణం నెలకొనివుంది. మావోయిస్టులు ప్రతీ సంవత్సరం జూలై 28 నుంచి ఆగస్టు 03. వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఈవారం రోజులలో మావోయిస్టులు ఏజెన్సీలో ఏదో ఒక ప్రాంతంలో స్థూపాలు నిర్మించి పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారికి నివాళి అర్పిస్తూటారు. గత కొన్ని సంవత్సరాలుగా వారోత్సవాలు అడ్డుకొవడానికిపోలీసులబలగాలువిసృతుగా. గాలింపు చర్యలు చేపడుతున్నా. మావోయిస్టులు మాత్రం ఏదో ఒక ప్రాంతంలో సంస్మరణ సభ నిర్వహించిదినిసమాచారంప్రసారమద్యమలకు పంపిస్తున్నా సంగతి తెలిసిందే. గిరిజన ప్రాంతాలలో ఈ ఏడాది వారోత్సవాలు నిర్వవాణఏవిధంగావుంటోదోనని ఉత్కంఠగా గిరిజన ప్రాంతాలలో నెలకొనివుంది. ఏజెన్సీ అంతటా పోలీసు యంత్రాంగం అది ముందుగానే అప్రమత్తం అయి మావోయిస్టులు కొసం గాలింపు చర్యలు ముమ్మరంగాకొన సాగుతున్నాయి.


విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల వారోత్సవాలు

 


విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల వారోత్సవాలు


 గూడెంకొత్తవీధీ,పెన్ పవర్


 



విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల వారోత్సవాలు నెపద్యంలో అదికార. ప్రతిపక్ష పార్టీలు కు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు అప్రమత్తంగా వుండాలని పోలిసుశాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు ప్రతీ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 03 తేదీ వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తువుండడంతోపోలిసుశాఖముందుగానేఅప్రమత్తంఅయింది. మావోయిస్టులు నుండి ట్రైకెట్ వున్నవారు అంతామైదానప్రాంతాలకుతరిలివెళ్ళి. ఈవారం రోజులు సురక్షిత ప్రాంతాలలో వుండలంటు గూడెకొత్తవీధీమండలపోలిసుఅధికారులు అందరికి నోటిసులు జారీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పోలిసుశాఖ అనుమతి లేకుండా మారుమూల గిరిజన గ్రామాలలో పర్యటించవోదంటు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు . 


టెలికాం అధికారులు తక్షణమే స్పందించాలి 

 


టెలికాం అధికారులు తక్షణమే స్పందించాలి 


గూడెం కొత్తవీధీ, పెన్ పవర్


 



మండలంలో సప్పర్ల గ్రామంలో ఉన్న. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నుండి సెల్ సేవలు సక్రమంగా అందించే విధంగా బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులుచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తమ గ్రామంలో సేల్ టవర్ వున్నప్పటికీ సిగ్నల్స్ వ్యవస్థ సక్రమంగా వుండడం లేదని తాము ఫోన్ చేసుకోవాలన్న చివరకు అధికారులకు ఎటువంటి సమాచారం అందించాలన్న మాగ్రామానికి 20. కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడెంకొత్తవిది గానీ దారకొండ గ్రామాలకు వెళ్లి సెల్ టవర్ పైఆదారపడవలసివస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిగ్నల్స్ వ్యవస్థ మెరుగు పరిచి సెల్ సేవలు మెరుగు పరచడానికి టెలికాం అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కొరుతున్నారు


నాగు పాము కలకలం


  నాగు పాము కలకలం


 


చింతపల్లి  , పెన్ పవర్


 


నిశ్శబ్ద, నిషేధిత ప్రాంతాల్లో నివసించవలసిన విష పురుగులు జనావాసాల్లో జీవనం సాగిస్తున్నాయి. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నాగు పాము కలకలం సృష్టించింది. ప్రస్తుత మండల రెవెన్యూ కార్యాలయ భవనం ప్రధాన రహదారికి ఎదిరించి నిర్మించడంతో ఆ రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో కొత్త రెవెన్యూ భవన నిర్మాణ పనులు చేపట్టారు. కొత్త భవన నిర్మాణానికి పునాదులు వేసి పిల్లర్స్ నిర్మాణానికి కావలసిన ఇనుప ఊసల సామాగ్రిని ఉపయోగించారు. ఇంతలో ఏమైందో! ఏమో!  పిల్లర్స్ కు ఉపయోగించిన పునాదులకు సిమెంటుతో కాంక్రీట్ వేయకుండా  నిర్లక్ష్యంగా చాన్నాళ్ల నుంచి నిలిపివేశారు. దీంతో పునాదుల చుట్టూ తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో పిచ్చిమొక్కలు విపరీతంగా వెలిశాయి. నిర్జీవ ప్రదేశంలోనూ, దట్టమైన పొదల మధ్య జీవనం సాగించాల్సిన విషపురుగులు రెవెన్యూ కార్యాలయాన్ని నివాసయోగ్యంగా చేసుకున్నాయి. నిత్యం తహసిల్దార్ కార్యాలయంలో పనుల నిమిత్తం  వచ్చే గిరిజనులు వారి పని పూర్తి చేసుకునేంతవరకు ఆ పునాదుల పైనే నిరీక్షిస్తూ ఉండేవారు. అయితే మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులు పడడం, ఆ వెంటనే విపరీతమైన ఎండ కాస్తుండటంతో విపరీతమైన ఉక్కపోత మొదలైంది. దీంతో పునాది రంధ్రాల్లో విశ్రాంతి తీసుకుంటున్న నాగుపాము ఉక్కపోతను తాళలేక జనాల మధ్యకు అకస్మాత్తుగా వచ్చింది. అది చూసిన జనాలు గోల చేయడంతో ఏం చేయాలో తెలియక విషనాగు పిల్లర్స్ కు ఉపయోగించిన ఇనుప ఊసలపైకి ఎగబాకింది. అక్కడ నుంచి ఎటూ వెళ్లడానికి దారి లేక తిరిగి కిందకి వచ్చి పొదలమాటున మాయమైంది. దీంతో కార్యాలయానికి వచ్చిన జనాలు అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.ఇంకా పునాది రంద్రాల్లో ఏమైనా విష పురుగులు ఉన్నాయేమోనని కార్యాలయానికి వచ్చే వారితో పాటు సిబ్బంది భయాందోళనచెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి నూతన రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణం పూర్తయ్యేంతవరకు కార్యాలయం చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని మండల వాసులు కోరుతున్నారు.


న్యాయం కోసం సమైక్యంగా పోరాటం చేస్తాం


న్యాయం కోసం సమైక్యంగా పోరాటం చేస్తాం--

 

తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల రాజా.

 

ఏలేశ్వరం,పెన్ పవర్ 

 

 న్యాయం కోసం సమైక్యంగా ఉండి పోరాటం చేస్తామని ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల రాజా అన్నారు .ఇటీవల ఆదివారం అర్ధరాత్రి న్యాయవాది పైలా సుభాష్ చంద్రబోస్ ను  ఎటువంటి ముందస్తు నోటీసులు  లేకుండా తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లడం అన్యాయమన్నారు.  ఏలేశ్వరంలో  పైలా సుభాష్ చంద్రబోస్ గృహమునందు వారి కుటుంబ సభ్యులను కలసి విలేకరుల సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సర కాలంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులను పలు ఇబ్బందులకు గురి చేస్తూ తప్పుడు కేసులతో ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు అంటూ ఆరోపించారు. గతంలో  కత్తిపూడి లో శివ , బీసీ నాయకుడు ఎక్స్ సర్పంచ్ నరసయ్య, జనసేన కర్లపూడి వేపూరి శీను తదితరులపై  కక్షపూరితంగా నే వ్యవహరించి అక్రమ కేసులు బనాయించారు అన్నారు.   బోస్ అక్రమ అరెస్టుపై హైకోర్టు సీరియస్ అయిన సంగతి అందరికీ విదితమే ఇటువంటి దుశ్చర్యలను ఆపకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు .ఈ అక్రమాలపై పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు జ్యోతుల నెహ్రూ తనను అడిగి తెలుసుకున్నారని తేదేపా పార్టీ శ్రేణులకు ఎటువంటి ఆపద వచ్చినా న్యాయ పూర్వకంగా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...