పేదలకు ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం
గోనెగండ్ల, పెన్ పవర్
జనసేన - బీజేపీ సంయుక్త ధర్నా
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఆంద్రప్రదేశ్ కు 2014 నుంచి 2019 కాలంలో 9000 కోట్ల రూపాయలు అందిస్తే పేదలకు రాష్ట్ర ప్రభుత్వాల అవినీతితో ఇళ్ల నిర్మాణ పథకంలో తూట్లు పొడుస్తు కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారని జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ పార్టీల పిలుపు మేరకు మండలకేంద్రమైన గోనెగండ్లలో జనసేన - బీజేపీ సంయుక్త ధర్నా కార్యక్రమన్ని చెప్పట్టారు,ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా,బీజేపీ,మండల నాయకులు యన్,యమ్, మహేష్ మాట్లాడుతూ జి+3 గృహాల కేటాయింపులో గత ప్రభుత్వం అలసత్వం వహిస్తే వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తుందో ప్రజలకు చెప్పాలన్నారు,లబ్ధిదారులు తమ వాటాలు మొత్తం చెల్లించిన తరువాత ప్రభుత్వాలు మారడంతో కేటాయింపులు జరపకుండా వదిలేస్తున్నారని, ప్రభుత్వాల తీరు ఇటుక ఇటుకలో అవినీతి, అడుగు అడుగులో అరాచకాలు చేస్తే లబ్ధిదారుల సొంతింటి కళ గానే మిగిలిపోతుందని అన్నారు,పేదలందరికి ఇళ్ళు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నీరు కారుతుందని ప్రభుత్వాలు మారితే కేటాయింపులు ఆపేస్తారా అని ప్రశ్నించారు,జి+3 ఇంటి నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేసి పంపిణీ ఎందుకు చేయడం లేదని అన్నారు,,పేదలకు ఇళ్ల కేటాయింపులో పాలకుల తీరు వల్ల అర్హులైన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ పథకాన్ని ఆటకెక్కించి సెంటు భూమి అందులో ఇంటి నిర్మాణం పేరుతో మాయాజాలం ప్రదర్శించి కొండలు,గుట్టలు, చూపించి చదునుపేరుతో అయిన వాళ్ళతో పనులు చేయిస్తున్నారని అన్నారు,బీజేపీ -జనసేన పార్టీలు చేప్పట్టిన ధర్నాలో జనసేన నాయకులు ఖాసీం,జానీ,హరికృష్ణ, షఫీ,చాంద్,బీజేపీ నాయకులు,మునిస్వామి గౌడ్,పుగ్యాల ఉరుకుందు,బజారి,రమేష్,పాల్గొన్నారు,