Followers
త్రిశంకు స్వర్గంలోఎం.టి.ఎస్ లెక్చరర్ల ,వివిధ శాఖల ఎం.టి.యెస్ ఉద్యోగుల అగచాట్లు
బి.జె.పి.సిటీ కార్యాలయంలో నిరసన
కరోనా పై పోరాటానికి సిద్దంగా వుండాలి
శిలాఫలకం వేశారు రహదారి మరిచారు
శిలాఫలకం వేశారు రహదారి మరిచారు
చింతపల్లి , పెన్ పవర్
మండలంలోని అంజలి శనివారం రహదారి ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా బురద పొలాన్ని తలపిస్తుంది. దీంతో స్థానిక గిరిజనులు ఈ రహదారిపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం రూ.3 కోట్లతో తాజంగి గ్రామం నుంచి జాజుల పాలెం గ్రామం వరకు తారు రోడ్డు నిర్మించింది. జాజుల పాలెం గ్రామం నుంచి అంజలి శనివారం గ్రామం వరకు రహదారి నిర్మించేందుకు రూ.2.75 కోట్ల నిధులు విడుదల కావడంతో నాటి శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి 2018 లో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. శిలాఫలకం ప్రారంభించిన అధికారులు రహదారి నిర్మాణాన్ని విస్మరించారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అంజలి శనివారానికి "శనిగ్రహం" పట్టింది. దీంతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఏజెన్సీలోని జి.మాడుగుల మండలంతో పాటు మైదాన ప్రాంతంలోని కొత్తకోట, రావికమతం గ్రామాల వరకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. చింతపల్లి మండలంతో పాటు జి.మాడుగుల మండలానికి చెందిన సుమారు 40 గ్రామాల గిరిజనులు ఈ రహదారి పైనే ఆధారపడి, రాకపోకలు సాగిస్తూ, జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంత గర్భిణీ స్త్రీలు ఏ క్షణంలో ఎలా ఉంటుందోనని ప్రసూతికి ముందుగా పుట్టింటికి వెళ్ళినట్టు మూడు నెలల వైద్య సహాయం అందే చోట మకాం వేస్తున్నారు.ప్రసూతి తరువాత మూడు నెలలకు స్వగ్రామం తిరిగి చేరుకుంటున్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా నేటి వరకు అంజలి శనివారం రహదారి నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం ఈ రహదారి వర్షాలకు అధ్వాన్నంగా తయారై నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. రహదారి పై ఆధారపడిన గిరిజనులకు ఆటోలో ప్రయాణం తప్ప వేరే మార్గం లేదు. అటువంటిది నేడు ఆటో కాదు కదా! ద్విచక్ర వాహనం ఆఖరికి సైకులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర వైద్య సేవలకు కనీసం ఫీడర్ (బైక్) అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులకు మా పాట్లు, ఫీట్లు పట్టవా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంజలి శనివారం గ్రామ రహదారి నిర్మించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
మండలంలో మరో కరోనా పాజిటివ్
మండలంలో మరో కరోనా పాజిటివ్
జడ్డంగి ,పెన్ పవర్
మండలంలోని జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నాడు సంజీవిని వాహనం ద్వారా స్థానిక పీహెచ్సీ సిబ్బంది68 మందికి రాపిడ్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. మంగళవారం నాడు పాజిటివ్ వచ్చిన రాజవొమ్మంగి 99 బిల్డింగ్ నివాసులు ఇద్దరిని, ఫారెస్ట్ ఉద్యోగిని భార్య భర్తల ను రాజమండ్రి జి ఎస్ ఎల్ కు బుధవారం నాడు తరలించారు. స్థానిక ఏ పీ ఎఫ్ డి సి కార్యాలయంవద్ద,బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కార్యాల యం వద్ద, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద, కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటి వద్ద సోడియం హైపో క్లోర్తెడ్ ద్రావణం( ఎన్ఏ సి ఎల్ వో) పిచికారి తో పాటు బ్లీచింగ్ స్థానిక పంచాయతీ కార్యద మల్లేశ్వరరావు జల్లించారు. వారు నివాసం ఉంటున్న చుట్టుపక్కల ప్రదేశాల వద్ద పారిశుద్ధ్య పనులు చేయించారు.
మానవాళికి మొక్కలు జీవాధారం
జగనన్న పచ్చ తోరణం...71వ వనమహోత్సవ కార్యక్రమం ఈరోజు రాజవొమ్మంగి లో ఫారెస్ట్ రేంజర్ ఎం.అబ్బాయిదొర ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ నందు జడ్డంగిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డి ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలోను,జడ్డంగినుండి చిన్నయ్యపాలెం రోడ్ నందు ఇంచార్జ్ మండల అభివృద్ధి అధికారి కామేశ్వరరావు,ఉపాధిహామీ ఎ పి ఓ సత్యనారాయణ అద్వర్యం లోనూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల వైస్సార్సీపీ కన్వీనర్,సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామకృష్ణ పాల్గొని మొక్కలు మానవా కి జీవరాధమని,మొక్కలు మానవ మనుగడకు వివిధ రకాలుగా ఉపయోగపడేవని ప్రతీ ఒక్కరూ పది మొక్కలు నాటే విధంగా అందరినీ ప్రోత్సహించాలని అన్నారు.వైస్సార్సీపీ నాయకులు, అధికారులు చేతులు మీదుగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావ్, మాజీ సర్పంచ్ లు కొంగర మురళీకృష్ణ,కనిగిరి దుర్గాప్రసాద్, అడపా కామేష్,అంకం రవికుమార్,వాసంశెట్టి గంగాధర్,సింగిరెడ్డి రవి,తోట దుర్గాప్రసాద్, గొంతిరెడ్డి సత్యన్నారాయణ, చప్పా ప్రసాద్,కనిగిరి వీరబాబు,వీరమల్ల సత్యనారాయణ,ఈగల జ్ఞానేశ్వర్,తాటికొండ శివ మరియు ఇంఛార్జి ఎంపీడీఓ కామేశ్వరరావు, రేంజర్ ఎమ్ అబ్బాయిదొర, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డి ఎస్ ఎన్ మూర్తి, ఉప్పు శ్రీనివాస్,గంగరాజు,కె.అప్పారా
కరోనా పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కరోనా పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- రాజవొమ్మంగి తాసిల్దార్
రాజవొమ్మంగి,పెన్ పవర్
రా జవొమ్మంగి మండలం తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక తాసిల్దార్ వై వి సుబ్రహ్మణ్యం ఆచారి కోరారు.
రోజురోజుకు కరోనా బాధితులు పెరుగుతున్నారని అనవసరంగా రోడ్లపైకి వచ్చి వైరస్ పట్ల బాధితులు కాకూడదు అన్నారు. నిర్ణీత సమయంలో దుకాణాలు తెరచి ఉంటాయని ఇంటికి ఒకరు చొప్పున బయటకు మాస్కు ధరించి వచ్చి నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని స్థానిక ఎస్ఐ బి వినోద్ విజ్ఞప్తి చేశారు. వ్యాపారస్తులు దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా సర్కిల్ ను ఏర్పాటు చేయాలని, తప్పనిసరిగా శానిటైజర్ ఉపయోగించాలని ఎస్ ఐ వినోద్ అన్నారు. 11 గంటలు దాటినతర్వాత అనవసరంగా రోడ్లపైకి వస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు కనిగిరి వీరబాబు, సిహెచ్ ప్రసాద్, ఈగల జ్ఞానేశ్వర్, వర్తకులు ఉన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...