Followers

గ్రామాలలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం


గ్రామాలలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం.


రాజోలు, పెన్ పవర్


రాజోలు మండలం పొన్నమండ,చెన్నడం,వేగివారిపాలెం, బి. సావరం గ్రామాలలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. తొలుత పొన్నమండ గ్రామ సచివాలయం వద్ద తహశీల్ధార్ బి. ముక్తేశ్వరరావు మరియు ఎంపీడీఓ తాడి శ్రీ వెంకటా చార్య సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.ఈ సందర్భముగా తహశీల్ధార్ బి. ముక్తేశ్


రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలలో కరోనా టెస్టులు





రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలలో కరోనా టెస్టులు.

 

వి ఆర్ పురం, పెన్ పవర్ .

 

 

తూర్పుగోదావరి జిల్లా వి ఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో బుధవారం ప్రభుత్వ వైద్యశాలలో గ్రామ ప్రజలకు కరోనా టెస్టలు నిర్వహించినారు ,ఈసందర్భంగా డాక్టర్ సుందర్ ప్రసాద్ మాట్లాడుతూ మంగళవారం  100 మందికి కరోనా టెస్టలు చేయగా నలుగురికి పాజిటివ్ అని తెలింది.  వారిని బొమ్మూరులో క్వారెంటెన్ కి తరలించారు. బుధవారం మండలంలోని  రేఖపల్లి పి హెచ్ సి వైద్యశాలలో అరవై మందికి కరోనా టెస్టలు చేయగా ముగ్గురికి పాజిటివ్ అని తేలింది.వీరిని రాజమండ్రి దగ్గిర బొమ్మూరు క్వారంటేన్ కి తరలిస్తామని  అయన మీడియాకు తెలిపారు.ఈకార్యక్రమంలో శ్రీనివాస్ రావు,సూపర్ వైజర్.పున్నమ్మ,ఎ ఎన్ యం లు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.


 

 




రోడ్లకిరువైపులా పచ్చ తోరణం 




 

రోడ్లకిరువైపులా పచ్చ తోరణం 

 

అయినవిల్లి,పెన్ పవర్ 

 

జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా అయినవిల్లి మండలంలోని అన్ని గ్రామాలలోను రోడ్లకిరువైపులా మరియు ప్రభుత్వం వారు మంజూరు చేసిన ఇండ్ల స్థలములలోను మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంబించడం జరిగింది. మొదటగా అయినవిల్లి హౌసింగ్ కాలని సైట్ నందు గౌరవ ఎమ్మెల్యే గారు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఒ., తహసీల్దారు, ఇ.ఒ.పి.ఆర్.డి., ఎ.పి.ఒ, పంచాయతి సెక్రటరీ ఇతర నాయకులు పాల్గొన్నారు.

 

 




పర్యావరణ పరిరక్షణ





పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత___ మంత్రి విశ్వరూప్

 

అమలాపురం పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్

 

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు  ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పచ్చ తోరణం ( వన మహోత్సవం)కార్యక్రమాన్ని పురస్కరించుకొని బుదవారం మంత్రి అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ తో కలిసి అల్లవరం మండలం కోడూరుపాడులో పేదల కొరకు తీసుకున్న ఇండ్ల స్థలాలు వద్ద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు ఎంతగానో ఉపయోగ పడతాయని, మొక్కలు పెంచడం ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని  మంత్రి సూచించారు. లక్ష్యా లను నిర్దేశించుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా రాష్ట్రం హరిత ఆంధ్ర ప్రదేశ్ గా మారుతుందని మంత్రి అన్నారు. అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కు మొక్కలు ఎంతగానో తోడ్పడుతాయని,జీవనాధారమైన మొక్కలను నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎం.పి సూచించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, అల్లవరం మండల తహశీల్దార్ అప్పారావు, ఎం.పి.డి. ఓ,సుగుణ శ్రీకుమారి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్.బి.ఎన్.వి. హరికుమార్, ఇళ్ళ శేషారావు, కొనుకు బాపూజీ, బొమ్మి ఇజ్రాయిల్,గుబ్బల బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.

 

అనంతరం మంత్రి అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి లో కూడా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా తీవ్రత ఎక్కువగా వున్న దృష్ట్యా ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ వైరస్ సోకకుండా స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొక్కా ఆదినారాయణ, అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, మండల తహశీల్దార్ మాధవరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్.బి.ఎన్.వి. హారికుమార్, అమలాపురం మాజీ జడ్పీటిసి సభ్యులు కుడుపూడి వేంకటేశ్వర (బాబు), బొంతు గోవిందశెట్టి, కాట్రు చంద్రమోహన్, కుడుపూడి ఈశ్వరరావు, ఏ.పి. ఓ శ్రీమతి శివకుమారి,మాజీ ఎం.పి.టీ.సి.కుడిపూడి జగదీశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.


 

 




ఆంధ్రప్రదేశ్ లో దళితలుకు రక్షణ కరువుయ్యింది


ఆంధ్రప్రదేశ్ లో దళితలుకు రక్షణ కరువుయ్యింది.

 

పరమట భీమమహేష్ కోనసీమ మలమహానాడు అధ్యక్షుడు

 

అమలాపురం పెన్ పవర్:

 

ఎస్టీ వర్గానికి చెందిన ప్రసాద్ పై దాడికి పాల్పడినపోలీసులు విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకోవడం మాత్రమే కాదు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనిఈ సంఘటన వెనకాల ఉన్న ప్రముఖుల అందరినీ శిక్షించాలనిఇలాంటి సంఘటనలు  భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలనికుల వివక్ష చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.  సీత నగరంలో దళిత యూవకుడు ప్రసాద్ కి   శిరోముండనంచేయండం చాలా దారుణం  అయిన సంఘటన అని   తూర్పుగోదావరి జిల్లా లో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తూర్పుగోదావరి ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ కి దళితులు ఎన్నికల్లో మాత్రేమే గుర్తు వస్తారా అని దళితులు మీద దాడిని ఇప్పుడు కైనా స్పందించాలని ఎస్సై కానిస్టేబుల్ ను శాశ్వతంగా ఉద్యోగం తొలగించి ఈ కుట్ర వెనక ఉన్న వారందరినీ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాలమహానాడు అధ్యక్షుడు  పరమట భీమమహేష్ డిమాండ్ చేశారు

మొక్కలు నాటుతున్న వైసిపి నాయకులు

ప్రత్తిపాడు లో మొక్కలు నాటుతున్న వైసిపి నాయకులు


ప్రత్తిపాడు,పెన్ పవర్ 



జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా  ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు ఈరోజు ప్రత్తిపాడు లో వైసిపి నాయకులు మొక్కలు నాటడం జరిగింది వాతావరణ సంతులిత పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ కార్యక్రమంలో లో వైఎస్ఆర్ మండల కన్వీనర్ బెహరా దొరబాబు మాట్లాడుతూ అడవుల సంరక్షణ పచ్చదనం పెంపొందించడం జగనన్న ప్రభుత్వం అతి ముఖ్య ప్రాధాన్యత ఇస్తుందని జాతీయ గీతాన్ని అనుగుణంగా 30 శాతం పచ్చదనాన్ని పెంపొందించడం తద్వారా పర్యావరణ సమతుల్యత సాధించడానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు వన మహోత్సవం లో పాల్గొన్న నాయకులు గుడాల వెంకట రత్నం పి ప్రకాష్ ఏ వీరబాబు ఫారెస్ట్ డి ఆర్ వో ఎస్ రామకృష్ణ పంచాయతీ సెక్రెటరీ  D శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు


అర్హులైన లబ్దిదారులకు న్యాయం చేయాలి:బిజేపి మండల శాఖ


అర్హులైన లబ్దిదారులకు న్యాయం చేయాలి:బిజేపి మండల శాఖ


     

   పాయకరావుపేట,పెన్ పవర్

 

అర్హులైన నిరుపేద లబ్దిదారులకు ఇళ్ళస్థలాలు మంజూరు చేయడంలో  అన్యాయం జరిగిందని ,       గ్రంధాలయ మాజీ చైర్మెను,సీనియర్ బిజేపి నాయకులు తోట నగేష్ అన్నారు.ఈమేరకు  బుదవారం ఆయన స్వగృహంనందు విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టృ బిజేపి పార్టీ ఆదేశాలమేరకు,రాష్టృ పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ పిలుపుమేరకు  రాష్టృ ప్రజలకు వైఎస్సార్ ప్రభుత్వం నయవంచక మోసం చేసి  ఇళ్ళస్థలాల మంజూరులో  తీవ్ర అన్యాయం చేసినందుకుగాను మండల స్థాయి నిరసనలు తెలియజేస్తున్నామన్నారు.పేదోటి కల సాకారం చేస్తాడని,ఒక్క చాన్స్ అని నమ్మించి గద్దెనెక్కిన వైసీపి.ఇప్పుడు ఇళ్ళ స్థలాల విషయంలో  ప్రజల గొంతుమింగుడు పడని మోసాలకు పాల్పడుతుంది.మండల ప్రతీ గ్రామంలో అవకతకలు జరిగాయి.లబ్దిదారుడువు అంటూ సెలక్షన్ లిస్టుల్లో పేర్లు చూపించి వైసీపి నాయకుల చేతివాటంతో అనర్హులు లబ్డిదారులగా ఎంపిక అయ్యారు.ఏళ్ళ తరబడి ఒకే ఇంటిలో నలుగురైదుగురు కుటుంబాలు కాపురాలు చేస్తుండటం చూస్తున్నాము.నిజమైన అర్హులను గుర్తించడంలో అదికారులు చేతిలెత్తేసారు.నిబందనల ప్రకారం గతంలో హౌసింగ్ లోన్ తీసుకున్న వారు,కరెంటుబిల్లు అదికంగా కట్టేవారు,భూస్వాములు,పింకు రేషన్ కార్డు కలిగినవారు  ఇళ్ళ స్థలాలకు అనర్హులు.కాని ఇవేమి పట్టరాని నాయకులు ఇష్టానుసారంగా అనర్హులను అర్హులుగా చేసారు.దీనిపై పార్టీ పిలుపుమేరకు నిరసనలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు రవిరాజు,మంచాల గాంధి,నానాజి,కోనా రంగయ్యస్వామి,జగతా శ్రీదర్ ,జగతా రమణ,కువల కుమార్ ,పెంకే శ్రీను,ఇంజరపు సూరిబాబు,ఐఎన్ .మూర్తి,రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...