పర్యావరణం పరిరక్షణ మన అందరి బాధ్యత
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురంమండలం ఆత్రేయపురం లో కాలుష్య నియంత్రణ కొరకు, పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.గణపతి అన్నారు. జగనన్న పచ్చ తోరణం లో భాగంగా ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు సేకరించిన లే అవుట్ లలో, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో, చెరువు గట్ల పైన, రోడ్డు కిరువైపులా సమారు ఏడు కిలోమీటర్ల మేర మూడు వేల మొక్కలు ఈ వారంలో నాటేందుకు ఉపాధి హామీ అటవీ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస ప్రసాద్, ఏపీఓ ముదునూరి రామకృష్ణంరాజు, ఈఓఆర్డీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి విజయ్, సాంకేతిక సహాయకులు అజయ్, సోషల్ ఫారెస్ట్ నర్సరీ సుబ్బారావు, సచివాలయ సిబ్బంది,స్థానిక నాయకులు దాట్ల సూర్య నారాయణరాజు ,తూము సుబ్రమణ్యం,మీసాల తాత రావు,
తూము చక్రధర కాశీ విశ్వనాదం పాల్గొన్నారు