Followers

పేదోడి సొంతింటి కల సాకారం చేయడం బీజేపీ లక్ష్యం


పేదోడి సొంతింటి కల సాకారం చేయడం బీజేపీ లక్ష్యం..

 

మండపేట పెన్ పవర్

 

మోసగించడం లో వైసీపీ , టీడీపీ లు రెండూ ఒక్కటే..

మండపేట: దేశంలో ఉన్న పేదలందరూ కలలు కంటున్న సొంతింటి కోరికను నెరవేర్చడమే బీజేపీ లక్ష్యం అని నియోజక వర్గ బీజేపీ కన్వీనర్ కోన సత్య నారాయణ పేర్కొన్నారు. బీజేపీ జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆయన జనసేన పార్టీ నాయకులు శెట్టి రవి కుమార్ పార్టీ  కార్య కర్త లతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. స్థానిక టౌన్ హాల్ వద్ద బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ టీడీపీ , వైసీపీ పార్టీలు ప్రజలను మోసగించడం లో రెండూ ఒకటేనన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇళ్ళ నిర్మాణం పేరు చెప్పి దోచుకున్నారని ఆరోపించారు. ఇటుక ఇటుకలో అవినీతి జరిగిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోరని ఎద్దేవా చేశారు. అడుగు అడుగు లో అరాచకమేనని విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ  సూచన మేరకు  10 గంటల నుండి  12 గంటల వరకు పేదల ఇళ్ళ కోసం బీజేపీ-జనసేన పోరుబాట పట్టామని అన్నారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ టి రామ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు 24 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చింది అన్నారు. ఇప్పటికి 5 వేల కోట్లు విడుదల చేసిందన్నారు. కేంద్రం పంపిన నిధులు ఏమయ్యాయో లెక్క చెప్పాలన్నారు. పేదల ఇళ్ళ విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు.   ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు తక్షణం  మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  గోళ్ళ శ్రీను, కొంతం ప్రసాద్, చంద్రమల్ల చిట్టియ్య, బండారు సతీష్, బొమ్మన సతీష్, పైడిమళ్ల సతీష్, మోటుపల్లి జానీ, జక్కా రామకృష్ణ, మోరం బాలాజీ, కనపర్తి వీర్రాజు, పోలిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మునికోడలి దళిత యువకుడిపై శిరోడనపై న్యాయ విచారణ







 

మునికోడలి దళిత యువకుడిపై శిరోడనపై న్యాయ విచారణ చేయాలి దళిత సంఘల డిమాండ్ 

 

 

మల్లవరం కలిజోళ్ళ ,పెన్ పవర్ ప్రతినిధి

 

 మునికోడలి దళిత యువకుడిపై శిరోమండనంపై పూర్తి స్థాయిలో విచరణ జరిపించలని దళిత నాయకులు పులి ప్రసాద్ నూకతట్టు వెంకటరమణ వల్లూరి సత్యనంధం లు మాట్లాడుతు    రాజానగరం నియోజకవర్గం ,సీతానగరం మండలం మునికోడలి గ్రామంలో లో దళిత యువకుడిని  పోలీస్ స్టేషన్లో రాత్రంతా అమానుషంగా ఉంచి వర ప్రసాద్  అనే దళిత యువకుడినిశిరోముండనం  చేయడాన్ని దళిత సంఘలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ గత రెండు నెలలుగా ఇసుక మాఫియాపై దళిత యువకులు అనేక విషయాల్లో ఇసుక వ్యాపారి కే కృష్ణమూర్తి తో వాదన జరుగుతున్నాయని దీనికి కక్ష పెట్టుకుని  ఇసుక వ్యాపారి పోలీసులను ఉసికల్పి పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు వరప్రసాద్ ను రాత్రంతా లాఠీఛార్జ్ చేసి శిరోమండనపై చేయడాన్ని తప్పుబట్టారు .ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని వారు అన్నారు .ఈ ఘటనకు కారకులైన ఎస్ ఐ ,కానిస్టేబుళ్లు ,ఇసుక వ్యాపారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని దీనిపై న్యాయ విచారణ కు ప్రభుత్వం  ఆదేశించాలని డిమాండ్ చేశారు దళితులపై రోజురోజుకి దాడుళు పెరుగుతున్నావి దీనికి కారణం చట్టలు పుర్తిగా అమలు జరగక పోవాడమే నని అన్నారు చట్టలపై అవగహన ఎక్కువగా కల్పించాలని అన్నారు.


 

 




 



 



 



జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే


జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు 

 

జగ్గంపేట, ( పెన్ పవర్ ప్రతినిధి)

 

:ప్రతి ఒక్కరం పది మొక్కలు ప్రతినబూని నాటుదాం అనే నినాదంతో రాష్ట్రంలో ఇరవై కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో, ప్రతి ఇల్లు ప్రతి ఊరు పచ్చదనంతో సింగారించే ఉద్దేశ్యంతో ఆకుపచ్చని ఆంద్రావని మన లక్ష్యంగా ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  జగనన్న పచ్చతోరణం కార్యక్రమం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు  జగ్గంపేటలో పేదలకు ఇవ్వతలపెట్టిన 72 ఎకరాల దివాణంతోట ఇళ్ళ స్థలాల ప్రాంగణంలో మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు రాజా, వమ్మి రఘురాం, ఫారెస్ట్ రేంజర్ మురళి కృష్ణ, మండలస్థాయి అధికారులు, ఫారెస్ట్ అధికారులు,  పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు -

జగనన్న పచ్చతోరణంతో ఆరోగ్యవంతమైన రాష్ట్రం


జగనన్న పచ్చతోరణంతో ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.*కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల

 

 

 ఆలమూరు పెన్ పవర్ ;

 

     హరితహారంతో  ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న "పచ్చతోరణం" ఎంతో ప్రాధాన్యతతో కూడిన పథకమని కొత్తపేట ఎమ్మెల్యే, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలం గుమ్మిలేరులో పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన ప్రభుత్వ లే అవుట్ లో 71వ వనమహోత్సవంలో భాగంగా బుధవారం జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో  వివిధ రకాల పండ్ల జాతి, టేకు, నీడనిచ్చే మొక్కలను ఆయన నాటారు. కాగా నాటిన మొక్కల సంరక్షణ పూర్తిగా పంచాయతీ వారే బాధ్యత వహించడంతో ఈ మొక్కలు పూర్తి స్థాయిలో ప్రజలకు నీడతో పాటు వివిధ రకాల పండ్లను అందించనున్నాయి. ఈ సందర్భంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తూ పచ్చదనాన్ని వెల్లివెరిసేలా చేస్తామని ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తామని అధికారులు నాయకులుతో ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జేఏ జాన్సీ, తహశీల్దార్ జవ్వాది వెంకటేశ్వరి, మండల ప్రజాపరిషత్తు ఏవో టీవీ సురేందర్ రెడ్డి, ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ్మన శ్రీనివాస్, జిల్లా పశుపోషక సంఘం డైరెక్టర్ గుణ్ణం రాంబాబు, నెక్కింటి వెంకటరాయుడు (పెదపళ్ల బుజ్జి), రాష్ట్ర వైఎస్సార్ సేవాదళ్ కన్వీనర్ చల్లా ప్రభాకరరావు, నామాల శ్రీనివాస్, ఏపీఓ ఎ రామారావు, నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీరామ్ జన్మదిన వేడుకలు



ఘనంగా శ్రీరామ్ జన్మదిన వేడుకలు


అనకాపల్లి , పెన్ పవర్


సమాజ సేవకుడు వినాయక నిమజ్జనోత్సవ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ రామ్ సేవలు ఎనలేనివి అని పలువురు కితాబిచ్చారు.  బుధవారం ఆయన జన్మదినం సందర్భంగా పలువురు కలిసి శుభాకాంక్షలు వెల్లడించారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన చేసిన సేవలను వివరించారు.అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ల ప్రవీణ్ కుమార్, సుబ్బు , సమాజసేవకులు కొణతాల భాస్కర్ రావు  తదితరులు పాల్గొన్నారు.


 70వ, వనమహోత్సవం


 70వ, వనమహోత్సవం

జగనన్న పచ్చతోరణం --
నవ్యాంధ్రప్రదేశ్ పచ్చల హారం

చింతపల్లి   , పెన్ పవర్

 దేశంలో ప్రస్తుతం 17 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలనే దృక్పథంతో జగనన్న పచ్చతోరణం- నవ్యాంధ్రప్రదేశ్ పచ్చల హారం పేరుతో 71వ, వనమహోత్సవం కార్యక్రమం చేపట్టామని స్థానిక అటవీ శాఖ రేంజ్ అధికారి     పి వి రవి వర్మ అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన 20 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా స్థానిక అటవీశాఖ అధికారులు విజ్ఞాన భారతి పాఠశాల పరిసరాలు, జగనన్న కాలనీ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అటవీ రేంజ్ అధికారి మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి ఇల్లు ఉండాలని, ప్రతీ పేదవాడు సొంత ఇంటిలో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జగనన్న కాలనీ అనే పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులందరికీ ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. వాటిలో త్వరలో ఇళ్లు కట్టి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అటువంటి కాలనీలో నివసించే లబ్ధిదారులు పచ్చని వాతావరణం,చల్లని గాలి ఆస్వాదించి తీరాలనే ఉద్దేశంతో ఆ కాలనీలో ప్రతి లబ్ధిదారుడు కనీసం పది మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమం కార్తీక పౌర్ణమి వరకు ప్రజల సహకారంతో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ ఉషశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హలియా రాణి, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, అటవీ శాఖ డి ఆర్ ఓ  టివి భార్గవ వర్మ, మరియు సిబ్బంది పాల్గొన్నారు.


 

 

 రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిపై భాజపా నిరసన








 రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిపై భాజపా నిరసన

 

 

అనకాపల్లి, పెన్ పవర్

 

 

 ప్రతి పేదవాడికి సొంత ఇంటిని కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని భాజపా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ , వైకాపా పార్టీ లు  ఒకరికొకరు పోటీగా అవినీతి చేస్తూ పేదవాడిని అణగ తొక్కుతున్నారనారు. ఇటుక ఇటుక లో చంద్రన్న అవినీతి అడుగు అడుగు లో వైకాపా అరాచకం నినాదంతో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్ళ కాలంలో మోడీ ప్రభుత్వం 11 లక్షల ఇళ్లు ఏపీకి కేటాయించినట్లు వెల్లడించారు.  ప్రతి లబ్దిదారునికి కేంద్రం వాటా 1.5 లక్షలను కేటాయిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మూడు లక్షల పదివేలు గృహాలకు సంబంధించి రు .4, 600 కోట్లు కేంద్రం పూర్తిగా చెల్లించినట్లు గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో ఇల్లు ఎవరికి కేటాయించకపోవడం, జగన్ పాలనలో స్థల కొనుగోలు లోనే భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపించారు. చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఇజిఎస్ నిధులను కూడా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కేటాయించినా నిధులను దుర్వినియోగం తప్ప పనులకు ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డి. పరమేశ్వర రావు, పట్టణ కార్యదర్శి కర్రీ రామకృష్ణ, మండల అధ్యక్షులు కసిరెడ్డి శ్రీను, మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు, మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి అలమండ శ్రీను , మీడియా సెల్ కన్వీనర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు పలికింది.


 

 




 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...