Followers

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములు కాపాడాలి





శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములు కాపాడాలి

 

 మార్కాపురం, పెన్ పవర్

 

 అన్యాక్రాంతం అవుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములను కాపాడాలి. ఆర్డిఓ కార్యాలయం లో సిపిఎం నాయకులు అర్జి అందజేత. మార్కాపురం పట్టణం సమీపంలోని సర్వేనెంబర్ 206 ఏ ,బి లో ఆరు ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి చెందిన భూమిని పట్టణంలోని కొందరు ఆక్రమించారని, సదరు స్థలంలో వ్యాపారం కొరకు  నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని, వివిధ దిన పత్రికలలో కూడా వార్తలు ప్రచురితం అయినాయి అని, కానీ దేవస్థానం అధికారులు పట్టీపట్టనట్లు గా వ్యవహరిస్తున్నారని, సదరు భూమిని వెంటనే కాపాడాలని కోరుతూ మార్కాపురం ఆర్డిఓ కార్యాలయం ఎఓ గారికి సిపిఎం ఆధ్వర్యంలో అర్జి అందజేయడం జరిగింది. అర్జీ అందజేసిన వారిలో సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, సిపిఎం తాజా మాజీ కౌన్సిలర్ జవాజి రాజు, సిపిఎం నాయకులు ఏనుగుల సురేష్కుమార్ అర్జీ అందజేసిన వారిలో ఉన్నారు.


 

 




రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి


పెన్ పవర్ ఉలవపాడు 


 



ఉలవపాడు రైల్వే గేట్ నెంబర్ 175 వద్ద  గూడ్స్ ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి...... 


 


 


 ఉలవపాడు మండలం లోని చాగొల్లు చాకిచెర్ల రైల్వే గేట్ నెంబర్ 175 వద్ద మంగళవారం నాడు సాయంకాలం 6 గంటలకు  చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న స్టీల్ సిటీ గూడ్స్  ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు అతని వయసు సుమారు  35 నుండి 40  ఉంటుంది గూడ్స్ డ్రైవర్ సమాచారం మేరకు ఉలవపాడు రైల్వే సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. మృతుడి  వివరాలు ఇంకా తెలియరాలేదు.


ఒకరికి సి సి ఆర్ సి కార్డ్స్


 


మార్కాపూర్,పెన్ పవర్ 


ప్రకాశం జిల్లా మార్కాపూర్ మండలం లోని చింతకుంట తిప్పాయపాలెం రైతు భరోసా కేంద్రాల్లో పంట సాగు హక్కు పత్రాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఎన్.లక్ష్మీనారాయణ ,పశువైద్యాధికారి లీనా గ్రేస్  , ఉద్యాన అధికారి ఎన్.తేజ రెవిన్యూ ఇన్స్పెక్టర్  గోపి పాల్గొన్నారు కొత్తగా చింతగుంట లో 4 తిప్పాయపాలెం లో ఒకరికి సి సి ఆర్ సి కార్డ్స్ ఈరోజు ఇవ్వడమైనది.


వీరేపల్లి లో ఇసుక నిల్వ కేంద్రాలను పరిశీలించిన  జాయింట్ కలెక్టర్ మురళి


వీరేపల్లి లో ఇసుక నిల్వ కేంద్రాలను పరిశీలించిన  జాయింట్ కలెక్టర్ మురళి


 

పెన్ పవర్, ఉలవపాడు

 

 

 

 మండలం లోని వీరేపల్లి మార్కెట్ యార్డ్ ను జాయింట్ కలెక్టర్ మురళి మంగళవారం నాడు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం.గా చేపడుతున్న ఇసుక నిల్వ కేంద్రాల పరిశీలనలో భాగంగా వీరే పల్లి మార్కెట్ యార్డ్ ఇసుక నిల్వ చేయడానికి అనువైన ప్రాంతంగా ఉందని పరిశీలనలో ఆయన తెలిపారు. రాబోయే వర్షాకాల సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎక్కువ పడకుండా నెల్లూరు జిల్లా లోని సంఘం తదితర దగ్గర ప్రాంతాలనుంచి ఇసుకను తరలించి వీరేపల్లి మార్కెట్ యార్డులో నిల్వ చేసి ప్రజలకు తక్కువ ట్రాన్స్పోర్ట్ చార్జీలు వర్తించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నరసింహారెడ్డి,అసిస్టెంట్ డైరెక్టర్ డి జగన్నాద రావు, తహసిల్దార్ పి  మరియమ్మ, వ్యవసాయ అధికారి ఎం.మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

జగన్న పచ్చతోరణం కార్యక్రమం


జగన్న పచ్చతోరణం కార్యక్రమం విజయవంతం చేయండి.

 

 

తాళ్ళూరు, పెన్ పవర్

 

 

 తాళ్ళూరు  మండలంలోని శివరామపురం గ్రామంలో వనమహోత్సవం జగనన్న పచ్చతోరణం కార్యక్రమ విజయవంతానికి మంగళవారం గ్రామ సచివాలయంలో ముందస్తు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల పచ్చదనాన్ని వ్యాపింప చేయాలని ఉద్దేశంతో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలన్నారు గ్రామ ప్రత్యేక అధికారి మండల విద్యాశాఖ అధికారి గురజాల సుబ్బయ్య మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత పక్షోత్సవాలు జరగనున్నాయని వాటిని ఏ విధంగా నిర్వహించాలో వివరించారు గ్రామంలో ఎక్కడ ఎలాంటి అపరిశుభ్రత సమస్యలు లేకుండా చూడాలని ఆయన తెలిపారు దీనిపై కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వనం మనం గ్రామ ప్రత్యేక అధికారి గ్రామ కార్యదర్శి పి శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు ఏఎన్ఎం మరియు  ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

రాగసముద్రంలో పర్యవేక్షించిన ఎస్.ఐ 


 


తర్లుపాడు,పెన్ పవర్ 


ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం రాగసముద్రంలో పర్యవేక్షించిన ఎస్.ఐ  ఆవుల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ నరసింహులు,డాక్టర్ వంశీకృష్ణ,
కరోన పైన అవగాహన కల్పించారు,సూచనలు సలహాలు తెలియజేసారు. అత్యవసరం అయితేనే పక్క ప్రాంతాలకు వెళ్ళాలని, అనవసరంగా  పక్క ప్రాంతాలకు వెళ్ళొద్దని అన్నారు.


కార్యదర్శులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు




కార్యదర్శులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు. ... ఎంపీడీవో 
 

టంగుటూరు, పెన్ పవర్ 

 



మండల కేంద్రమైన టంగుటూరు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో  కార్యదర్శులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో జమి ఉల్ల పాల్గొని  ఆయన మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణం, మనం మన పరిశుభ్రత, వైయస్సార్ భరోసా, సచివాలయంలో డిజిటల్ సర్వీసులు పై సమీక్ష పచ్చ తోరణం లాంటి పథకాలన్నీ ఈనెల 24వ తేదీన నిర్వహించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి పంచాయతీలో  మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ప్రతి 200 మొక్కలకు ఒక వాచ్ మెన్ ను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో జరుగుతాయని కావున ప్రతి ఒక్క కార్యదర్శి శ్రద్ధతో గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన తెలిపారు. అలాగే మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన చేపట్టాలని పరిశుభ్రత పక్షోత్సవాలు లో భాగంగా మురికి కాలువ లో శుభ్రం చేయడం మరమ్మతులు చేయడం చెత్తకుప్పలు లేకుండా చూడడం మలవిసర్జన బహిరంగంగా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే కోవిడ్-19 కి సంబంధించి ప్రజలలో దూరం పాటించే విధంగా  మాస్కులు ధరించడం చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసర పరిస్థితుల్లో నే బయటకు వెళ్ళే విధంగా ప్రజలను అవగాహన పరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో పనిచేసే కార్యదర్శుల పై  మండల స్థాయి అధికారులు రెండు టీములు గా ఉంటారని ఎంపీడీవో, ఏ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ మరియు ఈవో ఆర్ డి, పి ఆర్ జె ఈ లు పర్యవేక్షణలో ఉంటారని ఆయన తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ సర్వీసులు ఎప్పటికప్పుడు సచివాలయాల లో నమోదు చేస్తూ ఇచ్చిన గడువు లోపల చేయాలని అధికారులకు సూచనలిచ్చారు. వైయస్సార్ భరోసా కింద ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు బోర్లు, బావులు ప్రభుత్వం ద్వారా తీయించడం జరుగుతుందని అయితే  ఈ పథకాలను గ్రామ సచివాలయం ద్వారా ఆన్లైన్ చేసుకొని పొందవచ్చని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో కార్యదర్శులు మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...