Followers

మూఢనమ్మకాల చట్టం తీసుకురావాలి





మూఢనమ్మకాల చట్టం తీసుకురావాలి

 

ఒంగోలు, పెన్ పవర్

 

 

ఏ. పి. హేతువాద సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో

 రాష్ట్ర అధ్యక్షులు నార్నె వెంకట సుబ్బయ్య, కార్యవర్గ సభ్యులు సోము వెంకట రంగారెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు యం. కె. బేగ్ లు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్ములనా చట్టాన్ని తీసుకొనిరావాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 

51 ఏ(హెచ్)ను అమలు పరచాలని డిమాండ్ చేశారు.


 

 




నేడు టౌన్ ఎస్ఐ డిశ్చార్జ్ 


నేడు టౌన్ ఎస్ఐ డిశ్చార్జ్     


 

పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి

 

 గత కొంత కాలంగా కరోనా బారిన పడి నెల్లూరు ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎస్ ఐ తిరుపతి రావు బుధవారం డిశ్చార్జి కానున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. అనంతరం తిరుపతి రావు పదిహేను రోజులు హోమ్ క్వారంటైన్ లో  ఉంటారని శ్రీనివాసులు తెలిపారు. టౌన్ ఎస్ఐ తిరుపతి రావు క్షేమంగా డిశ్చార్జ్ అవుతున్నారన్న వార్త తెలియగానే పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బుధవారం పలు శాఖల అధికారులు కూడా డిశ్చార్జ్ కానున్నట్లు తెలిపారు. 

భౌతిక దూరం పాటించాలి


భౌతిక దూరం పాటించాలి: డిఎస్పి కండే  శ్రీనివాసులు   


 

 పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి

 

 

ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అప్పుడే కరోనాను కట్టడి చేయగలమని డిఎస్పి కండే శ్రీనివాసులు అన్నారు. మంగళవారం వివిధ బ్యాంకుల వద్ద దుకాణాల వద్ద గుంపులుగుంపులుగా ఉన్న ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ కరోన మహమ్మారి రోజురోజుకు ఉదృతం అవుతుందని కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారిని  హెచ్చరించారు. 

సీఐ సుధాకర రావు ను అభినందించిన  డిజీపీ


సీఐ సుధాకర రావు ను అభినందించిన  డిజీపీ


 

గిద్దలూరు, పెన్ పవర్

ప్రకాశం జిల్లా గిద్దలూరులో మంగళవారం గిద్దలూరు పోలీస్ స్టేషన్ వీడియో కాన్ఫరెన్స్ లో
ఏపీ డీజీపీ గౌతమ్ నవంగ్ గిద్దలూరు సీఐ సుధాకర రావు ను అభినందించారు, ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ లో అప్రమత్తంగా మెలిగి బాల కార్మికులకు కరోనా సోకిన వారిని గుర్తించి వారితో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపి ఏడుగురిని కరోనా బారిన పడినట్లు గుర్తించడం పట్ల డీజీపీ అభినందించారు.ముందు జాగ్రత్తగా వ్యవహరించి న సీఐ సుధాకర రావు ను అభినందించారు అలానే గిద్దలూరు లో జరుగుతున్న లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు .అలానే ఆపరేషన్ ముస్కాన్ లో 39 బాల కార్మికులను గుర్తించడం కరోనా నేపథ్యంలో అప్రమత్తం గా మెలగడం పట్ల అభినందించారు .అందరూ పోలీసు అధికారులు సిబ్బంది  కరోనా నేపథ్యంలో చేస్తున్న కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

కరోనా పై ప్రత్యేక సమావేశం


కరోనా పై ప్రత్యేక సమావేశం: ఎమ్మెల్యే అన్నా

 

గిద్దలూరు,పెన్ పవర్ 

 

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఈరోజు మంగళవారం గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక సమావేశాన్ని గిద్దలూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో డి ఎఫ్ ఓ  సతీష్ , డి ఎస్ పి నాగేశ్వర్ రెడ్డి,  సీఐ సుధాకరరావు ఎస్ ఐ త్యాగరాజు మున్సిపల్ కమిషనర్ హైమావతి పాల్గొన్నారు 

ఈ సందర్భంగా సమావేశంలో కరోనా నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాక్ డౌన్ పై చర్చించారు, రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని 

వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అధికారులను ఆదేశించారు

సిబ్బంది కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి




సిబ్బంది కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి

పెద్దారవీడు, పెన్ పవర్
 

 

పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ ఐ రామకృష్ణ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా స్టాఫ్ ఎవరు కరోనా బారిన పడకుండా కాపాడేందుకు సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా వారికి బీ కాంప్లెక్స్ , విటమిన్ సి టాబ్లెట్స్ మరియు డ్రైఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూయిట్స్ అయిన బొప్పాయి బత్తాయి , బెల్లం , మిరియాలు పోలీస్ స్టేషన్లోని స్టాఫ్ అందరికీ పంపిణీ చేశారు. చేసి స్టాఫ్ అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ వేడి నీళ్లు తాగడం ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి మంచిదని ఎస్ ఐ రామకృష్ణ సిబ్బందికి సూచించారు. 


 

 




మొగిలిచర్ల లో  ప్రధాన రహదారిపై ఆంక్షలు ఎత్తివేయాలి 




మొగిలిచర్ల లో  ప్రధాన రహదారిపై ఆంక్షలు ఎత్తివేయాలి 
 



పెన్ పవర్  కందుకూరు  ఆర్ సి   ఇన్ చార్జి 

 

ఈనెల 1వతేదీ  మొగిలిచెర్ల గ్రామం లో ఒకే కుటుంబంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ జరిగాయని, గ్రామం లోని ప్రధాన రహదారిని మూసివేశారు.. ఆ కుటుంబం మొత్తానికి మరో వారం తరువాత నెగటివ్ వచ్చింది. వాళ్ళు క్షేమంగా వున్నారు, కానీ ప్రధాన రహదారిపై రాకపోకలపై నిషేధం మాత్రం అలానే ఉంచారు.తాతాహోటల్ నుంచి పామూరు వెళ్లే ప్రధాన రహదారి  కావడం తో అదినిత్యం రైతులు తమ తమ పొలాలకు వెళ్లాలన్నా, సరుకు రవాణా చేయాలన్నా,అదే రహదారి దిక్కు. ఇప్పటికి 19 రోజులు గడిచాయని,గ్రామం లో ని మిగతా ప్రాంతాలను కంటైన్మంట్ లో వుంచినా కనీసం ప్రధాన రహదారిపై ఆంక్షలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.



 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...