Followers

35వ వార్డులో ఉచిత కోవిడ్ పరీక్షలు



35వ వార్డులో ఉచిత కోవిడ్ పరీక్షలు

 

పూర్ణ మార్కెట్, పెన్ పవర్

 

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ. వార్డు ప్రసాద్ గార్డెన్ పరిధిలో ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, 35వ. వార్డు. అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థి. అలుపనకనకరెడ్డి ఆధ్వర్యంలో వార్డు వాలంటరీ లకు, వార్డులో ఉన్న ప్రజలకు ఉచితంగా కోవిడ్ 19 టెస్టులు చేయించడం జరిగినది ఇందులో భాగంగా ముందుగా వార్డు అధ్యక్షులు కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి, అలుపనకనకరెడ్డి కూడా కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోవడం జరిగింది. ఈ  యొక్క టెస్ట్ లో నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది ఇదే సందర్భంలో ఈ కార్యక్రమంనకు వచ్చిన వారందరికీ కనకరెడ్డి శాని టైజర్ లు పంచడం జరిగినది.

 

 

 బాధిత మైనర్ బాలికను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం


 బాధిత మైనర్ బాలికను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం/

 రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా....

 

 

 రాజమహేంద్రవరం ,పెన్ పవర్

 

 

 

 కోరుకొండ మండలం మధురపూడి గ్రామ బలహీన వర్గానికి చెందిన మైనర్ బాలిక ఇటీవల అత్యాచారానికి గురై రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ఆమెను మంగళవారం నాడు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ తో కలిసి పరామర్శించి బాధితురాలు కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

 ఈ సందర్భంగా శ్రీ రాజా మీడియాతో మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిశ వంటి చట్టాలు రూపొందించి దోషులకు వెంటనే శిక్ష పడే విధంగా అనేక అడుగులు ముందుకు వేస్తున్న తరుణంలో కూడా ఇటువంటి ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని దోషులకు కఠిన శిక్ష పడే విధంగా ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశించామన్నారు. 13 మందిని అరెస్టు చేయడం జరిగిందని, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు అని మరొక వ్యక్తి    పరారీలో ఉన్నాడని  తెలిపారు. వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం, కిడ్నాప్, రేప్ కేసులు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో రాజానగరం నియోజకవర్గంలో ప్రచార సాధనాల ద్వారా మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళల పట్ల దారుణాలకు పాల్పడితే ఎటువంటి శిక్షలు ఉంటాయో వాలంటీర్ల ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది అన్నారు.

 

 ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి  అమ్మాజీ మాట్లాడుతూ జరిగిన సంఘటన పూర్తి వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారికి విన్నవించి బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిల సమన్వయ అధికారి డాక్టర్ రమేష్ కిషోర్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, స్థానిక నాయకులు కొల్లి వెలసి హారిక, ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, తదితరులు చైర్మన్ రాజాతో ఉన్నారు.

ఏంజెల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు, వితంతువులకు నిత్యావసరాలు పంపిణీ





ఏంజెల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు, వితంతువులకు నిత్యావసరాలు పంపిణీ....

 

ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్...

 

 ఆలమూరు,పెన్ పవర్

 

ఆలమూరు మండలంలోని మూలస్థానం అగ్రహారం గ్రామంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆ గ్రామంలో కొన్ని ప్రాంతాలను "రెడ్‌జోన్‌" "కంటైన్మెంట్"జోన్ లుగా  ప్రకటించడంతో ఆ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వృద్ధులకు, వితంతువులకు ఏంజెల్స్ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హీలింగ్ ప్రేయర్ టవర్ ఆవరణలో మోసెస్ కిరణ్, మాధుర్య ఏంజెల్ దంపతుల సహకారంతో సమకూర్చిన బియ్యం, కోడి గుడ్లు, నిత్యవసర వస్తువులను ఏఎంసి చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఏంజెల్స్ హోప్ పౌండేషన్ ద్వారా మోసెస్ కిరణ్ దంపతులు అందిస్తున్న సహాయం చాలా అభినందనీయమన్నారు. అనంతరం ఏఎంసి చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్ దంపతులను అలాగే ఏఎంసి డైరెక్టర్ సురేఖ గణేష్ దంపతులను ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, నాండ్ర నాగమోహన్ రెడ్డి, పామర్తి శ్రీనివాస్, ఉప్పులూరి సత్తిపండు, గంగారావు, మూరా సత్యానందం, మూరా సత్యనారాయణ, కర్రీ సత్తిబాబు, అరిగెల బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.


 

 




దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు 


దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు 

 

.........మండలం మాలమహానాడు అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ

 

 గోకవరం పెన్ పవర్

 

రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కోరుకొండ పోలీస్ డివిజన్ పరిధిలో దళితులపై దాడులు రోజురోజుకు ఎక్కువ వుతున్నాయి. దీనంతటికీ పోలీసులు పూర్తి బాధ్యత వహించాలి అని గోకవరం మండలం మాలమహానాడు అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ అన్నారు. గోకవరం లో మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజమహేంద్రవరం పోలీస్ అర్బన్ జిల్లా కోరుకొండ డి.ఎస్.పి పరిధిలో ఉన్న సీతానగరం, కోరుకొండ, గోకవరం మండలం లో దళితులపై దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి అన్నారు. దీనంతటికీ ఆయా పోలీసులు దళితులను చులకన భావంతో చూడటం కారణ మని దీనికి సీతానగరం పోలీసులు ముని కోడలికి చెందిన దళిత యువకుడిని అగ్రవర్ణాల పై ఫిర్యాదు చేశాడని నెపంతో పోలీస్ స్టేషన్కు పిలిపించి విచక్షణా రహితంగా కొట్టి శిరోముండనం చేయడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.పోలీసులు సక్రమంగా సకాలంలో స్పందించక పోవడం దళితులపై పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి కూడా ఇది ఉదాహరణగా ఉందని మండల మాల మహానాడు అధ్యక్షులు రామకృష్ణ అన్నారు, పోలీస్ వ్యవస్థ దళితుల పట్ల వివక్ష చూపించడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు, కోరుకొండ డివిజన్ పరిధి లో దళితులపై జరుగు తున్న  దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్ట కుండా నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

శివుని పాత్ర లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ





గాజువాకలో మళ్లీ మొదలైన జైమోదకొండమ్మ  చిత్రం.
   శివుని పాత్ర లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ.
  తాంత్రిక శక్తులు  దైవం మధ్య పోరాటమే చిత్రం.
     

విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


మన్యం  ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం జై. మోదకొండమ్మ  చిత్రం షూటింగ్  విశాఖ నగరంలో  మళ్ళీ మొదలైంది. మంగళవారం శ్రావణమాసం శుభ సందర్భంగా  గాజువాకలో షూటింగ్ ప్రారంభించారు.   పరమశివుని తపోభంగం చేయటానికి వచ్చిన మాంత్రికుని మధ్య జరిగిన సన్నివేశాన్ని చిత్రీకరించారు. మన్యంలో కొలువైన  కోర్కెలు తీర్చే కల్పవల్లి  ఇతివృత్తం గా  పోలాకి శివ దర్శకత్వంలో జై  మోదకొండమ్మ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ముహూర్తపు షాట్ మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో నిర్వహించారు. అనంతరం పాడేరు అరకు  మాదపల్లి  ప్రాంతాల్లో అమ్మవారి కథ సారాంశం పై  సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. తూర్పుగోదావరి పరిసరాల్లో కొన్ని షాట్లు  తీశారు. ఇంతలో కరోనా మహమ్మారి వ్యాపించడం లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ మూత పడిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు  తర్వాత ప్రభుత్వ అనుమతితో నిబంధనల మేరకు  సినిమా షూటింగులు మొదలయ్యాయి. జై మోద కొండమ్మ  చిత్రం మిగిలిన సన్నివేశాలను చిత్రీకరణ మళ్ళీ  ప్రారంభమైంది. జై మోదకొండమ్మ చిత్రంలో  శివుని పాత్ర చోడవరం  శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పోషిస్తున్నారు. తన స్వగృహంలో తపస్సులో  ఉన్న శివునిపై   తపో భంగానికి  వచ్చిన మాంత్రికుడు  పై  ఎదురుదాడి  సన్నివేశం చిత్రీకరించారు. విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి డైలాగ్   శ్రీనివాస్ లవ్ చైతన్య విభూది. ప్రొడ్యూసర్స్ చైతన్య లక్ష్మి పి ఎస్ ప్రసాద్ కో ప్రొడ్యూసర్  కడలి నిర్మల గోవిందా వ్యవహరిస్తున్నారు.

*కరణం కు  నటన అంటే ఎంతో ప్రీతి*
చోడవరం వైయస్సార్సీపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి  నటించడం అంటే ఎంతో ప్రీతి. రాజకీయాలకు ముందు నుంచి తన స్వగ్రామమైన కేజే పురం లో నాటకాల్లో పలు పాత్రలు వేసి ప్రజల మన్ననలు పొందారు.  2004లో తాను మొదటిసారి మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో  ఆయన అన్నమయ్య పాత్రలో లీనమై అయిపోయి సీఎం మన్ననలు పొందారు. ఆ తరువాత ఎప్పుడు కలిసినా రా అన్నమయ్య అని వై ఎస్ సంబోదించేవారు. 2005లో పెద్దేరు జలాశయం ప్రారంభోత్సవానికి వచ్చిన వైయస్ ఎలా ఉన్నావ్ అన్నయ్య అని పలకరించిన తీరు శ్రీ నటన ఎంత ఆకట్టుకుందో మరి. ఆ తరువాత గిరిజనుల దురాచార సంస్కృతి నేపథ్యంలో వచ్చిన దుర్గి చిత్రంలో కొండవలస శ్యామల తో కలిసి నటించారు. జైమోదకొండమ్మ  చిత్రంలో మళ్లీ నటిస్తున్నారు. అతనితో అనుబంధం ఉన్న వారు  చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.
 

 


 




బోస్ ను వెంటనే న్యాయస్థానంలో హాజరు పర్చాలీ 

బోస్ ను వెంటనే న్యాయస్థానంలో హాజరు పర్చాలీ 


ప్రత్తిపాడు,పెన్ పవర్ 


 


ఏలేశ్వరానికి చెందిన న్యాయవాది పైల సుభాష్ చంద్రబోస్ ,కుటుంబ సభ్యుల పట్ల పోలీసుల తీరు  సరికాదని ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ఆదేశాల మేరకు బోస్ ను వెంటనే న్యాయస్థానంలో హాజరు పర్చాలని కోరుతూ ప్రత్తిపాడులో న్యాయవాదులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు  అనంతరం జరిగిన సభలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొగత శివ మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని దిక్కరించి రాత్రివేళ న్యాయవాది ఇంటికి వెళ్లడం సరికాదన్నారు పోలీస్ శాఖ బోస్ ను న్యాయస్థానంలో హాజరు పరచకపోతే అన్ని ప్రాంతాల్లో ఆందోళన నిర్వహిస్తామని ఈమేరకు అసోసియేషన్ తీర్మానాన్ని ఆమోదించింది ఈ కార్యక్రమంలో కల్చరల్ కార్యదర్శి మధు మహిళా ప్రతినిధి దేవి సీనియర్ సభ్యులు పుల్లయ్య చిట్టిబాబు కాళీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


 రెండవ రోజు కొనసాగుతున్న లాక్ డౌన్ 


 రెండవ రోజు కొనసాగుతున్న లాక్ డౌన్ 


       

 పాయకరావుపేట,పెన్ పవర్ 

 

  గ్రామ పెద్దలు,వివిద పార్టీ నాయకుల నేతృత్వంలో ప్రజలు,వ్యాపారస్తులు స్వచ్చందంగా పాల్గొని నిర్వహిస్తున్న లాక్ డౌన్ రెండవరోజుకు చేరుకుంది.ఈ సందర్బంగా స్తానిక గ్రంధాలయ ఆవరణంలో సమావేశమైన పెద్దలు వైరస్ బారిన ప్రజలు పడకుండా పలు కీలకమైన కఠినమైన ఆంక్షలపై చర్చించారు.వ్యాపారస్తుల విజ్ఞప్తి మేరకు మార్కెట్లను,దుకాణాలను ఉదయం ఏడు గంటల నుండి మద్యాహ్నం పదకొండు గంటలవరకు సమయం  సడలిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.నిబందనలను ఉల్లంఘిస్తే కోవిడ్ చట్టం అమలు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రందాలయ మాజీ చైర్మెను ,బిజేపి నాయకులు తోట నగేష్ ,మార్కెటుయార్డు వైస్ చైర్మెను గుటూరి శ్రీను,వైసీపి టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా,టిడిపి నాయకులు పెదిరెడ్డి శ్రీను,మజ్జూరి నారాయణరావు,కాంగ్రేసు నాయకులు జగతా శ్రీనివాస్ ,ఇంజరపు సూరిబాబు,ఐఎన్ .మూర్తి,మాత రాజీవ్ ,పెంకే శ్రీను,బిఎస్ నారాయణ,జగతా ప్రసాద్ తదితరులు  మరియు ఎసై .విభీషణరావు  పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...