Followers

కౌలు రైతు ధ్రువీకరణ పత్రాలపై అవగాహన సదస్సు





కౌలు రైతు ధ్రువీకరణ పత్రాలపై అవగాహన సదస్సు
         

పరవాడ పెన్ పవర్

 

పరవాడ:మండలం లోని నాయుడు పాలెం రైతు భరోసా కేద్రంలో కౌలు రైతు ధ్రువీకరణ పత్రాల పై అవగాహనా సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరు అయిన తహసీల్దార్ పి.వి.ఎల్.ఎన్ గంగాధర్.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిణి ఏవో చంద్రావతి రైతులకు ప్రభుత్వం కౌలు రైతులకు ఆర్ధికంగా ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన రైతు ధ్రువీకరణ పత్రాల పై రైతులకు బ్యాంక్ ల ద్వారా పంట రుణ సదుపాయం ఉంది అని తెలియ చేశారు.పట్టాదారు రైతులు కానీ కౌవులు రైతులు కానీ తప్పని సరిగా ఈ పంట నమోదును చేసుకోవాలి అని చెప్పారు.సి.హెచ్.సి(కస్టమ్ హైరింగ్ సెంటర్ గురించి అవగాహన కలిగించారు.మరియు రైతు భరోసా కేద్రంలో ఏర్పాటు చేసిన కియోస్కి పరికరం ద్వారా విత్తనాలు, ఎరువు ఎలా ఆర్థర్ చేసుకోవాలి అనే విషయాన్ని రైతు లకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ సంజీవరావు,ఏ.ఈ.ఓ వరలక్ష్మి,స్థానిక రైతులు పాల్గొన్నారు.


 

 




గ్రామంలో శానిటేషన్ పనులు ముమ్మరం





*గ్రామంలో శానిటేషన్ పనులు ముమ్మరం*

 

*ఆర్.బి. పట్నం పంచాయతీ సెక్రెటరీ పద్మరాజు*

 

పెద్దాపురం,పెన్ పవర్ 

 

పెద్దాపురం మండలం ఆర్.బి కొత్తూరు ఆర్. బి. పట్నం గ్రామాల్లో కరోనా పరీక్షలు చేయించుకున్న  వారిలో కరోనా ఉందని నిర్ధారణ అవ్వగా తక్షణం పంచాయతీ అధికారులు శానిటేషన్ పనులు ముమ్మరం చేశారు గ్రామ వీధుల్లో క్లోరిన్ రసాయనం బ్లీచింగ్ శానిటేషన్ పరికరాలతో గ్రామ వీధులన్నీ శానిటేషన్ చేశారు అలాగే గ్రామ వార్డు వాలంటరీ లు మెగా ఫోన్ ద్వారా గ్రామ వీధుల్లో ఇంటింటికి తిరిగి  తప్పనిసరిగా మాస్కు ధరించాలని పది నిమిషాలకు ఒకసారి శానిటేషన్ లిక్విడ్  రాసుకుని సబ్బుతో చేతులు కడుక్కోవాలి అని ఎవరికైనా కరోనా లక్షణాలు జ్వరం గాని రంప తలనొప్పి ఇటువంటి ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే గ్రామ వాలంటీర్స్ ద్వారా తెలియజేయాలని వారు పంచాయితీకి తెలియజేసి ఏ.ఎన్.ఎం.ల ద్వారా పై అధికారులకి తెలియపరచడం జరుగుతుందని పంచాయతీ సెక్రెటరీ పద్మరాజు అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీస్ శైలజ పంచాయతీ గుమస్తా శీను. ఏసు. శివ. నాని. రాము. దివాకర్ తదితరులు పాల్గొన్నారు


 

 




లాక్ డౌన్ ప్రకటించాలని టీడీపీ నాయకులు అధికారులకు వినతి





కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడం కోసం లాక్ డౌన్ ప్రకటించాలని టీడీపీ నాయకులు అధికారులకు వినతి.

 

గోకవరం పెన్ పవర్.

 

కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడం కోసం గోకవరం మండలం లో లాక్ డౌన్ ప్రకటించాలని మంగళవారం స్థానిక టిడిపి నాయకులు  మాజీ జెడ్పిటిసి పాలూరు బోసు బాబు, గునిపే. భరత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం బోసుబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కరోనా విలయ తాండవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉందని అదేవిధంగా గోకవరం గ్రామములో ఇటీవల పాజిటివ్ కేసులు అధికంగా పెరిగి మరణాలు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామములో వారపు సంత, కిరాణా జనరల్ స్టోర్స్, కాయగూరలు మరియు ఇతర వ్యాపారస్తులు అధికంగా ఉండటం వల్ల చుట్టుపక్కల గ్రామాల వారు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారు రాజమహేంద్రవరం నుండి ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలకు గోకవరం మీదుగా మార్గం ఉండటం వల్ల ప్రజలు రద్దీ విపరీతంగా పెరిగిపోవడం వలన కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని ప్రజలు మాస్క్లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా, ప్రజలు గుమిగూడి ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి అధికమవుతుందని ఆయన తెలిపారు. కాబట్టి అధికారులు గోకవరం గ్రామాన్ని 15 రోజులు లాక్డౌన్ ప్రకటించి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కల్పించి నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.


 

 




వి ఆర్ పురం మండలంలో కరోనా టెస్ట్లు


వి ఆర్ పురం మండలంలో కరోనా టెస్ట్లు.

 

వి ఆర్ పురం, పెన్ పవర్

 

తూర్పుగోదావరి జిల్లా వి ఆర్ పురం మండల పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవటంతో మండలం లోని ప్రజలు భయాందోళనకు గురైనారు. ఈలాంటి సమయములో చింతూరు ఐ టి డి ఎ పి ఓ ఆదేశాల మేరకు మండలంలోని యం ఆర్ ఓ ,యం డి ఓ ,డాక్టర్లు ఏ ఎన్ యం లు.ఆశావర్కర్లు, అందరి సహకారంతో కరోనా టెస్టులు మంగళవారం పత్రిక విలేకర్లు, మేజిక్,ఆటో డ్రైవర్లు,వ్యాపారస్తులు, అందరికి ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణంలో డాక్టర్ సుందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించినగా,  మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గున్నారు.ఈకార్యక్రమంలో  మండల తహశీల్దార్ ఎన్ శ్రీధర్,యం పి డి ఓ శ్రీనివాస్ రావు,డాక్టర్ సుందర్ ప్రసాద్, సెక్రెటరీ సుబ్రమణ్యం,ఎ ఎన్ యం లు ఆశావర్కర్లు, వి ఆర్ ఓ లు,వి ఆర్ ఏ లు ,మండలం ప్రజలు పాల్గొన్నారు.

కోవిడ్ పరీక్షలకు తప్పని ఇబ్బందులు


కోవిడ్ పరీక్షలకు తప్పని ఇబ్బందులు...!


ఆన్లైన్ నమోదు లేకుండా తరలివస్తున్న ప్రజలు తలలు పట్టుకుంటున్న అధికారులు. 


 సామర్లకోట, పెన్ పవర్:


సామర్లకోట పట్టణంలో కోవిడ్ పరీక్షలు కోసం ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ప్రజలు రానురాను వందల సంఖ్యలో పోటెత్తుతుండడంతో అధికారు వారిని నివారించేందుకు తలలు పట్టుకుంటున్నారు.సరియైన సమాచారం సాధారణ ప్రజల వరకు సరియైన పద్దతిలో చేరకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది.పరీక్షలు కోసం ఆశపడి వస్తున్న ప్రజలకు నివారించే విషయంలో అధికారులకు,ప్రజలకు మధ్య వాగ్వివాదాలకు తెరతీస్తుంది. సామర్లకోట పట్టణంలో పాజిటివ్ కేసులు విపరీతం అవుతున్న పరిస్థితులలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో సంజీవి -సంచార వాహనం ద్వారా పరీక్షలు జరుతున్నారు అని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతూ వచ్చించి. దానితో ఉదయం గంటలు సమయం అయ్యేసరికి పట్టణ ఇతర గ్రామాలకు చెందిన ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు తరలి వచ్చారు.అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు అర్బన్ హెల్త్ సెంటర్ ల పరిధిలో పనిచేస్తున్న ఎ ఎన్ ఎం లు వారి వార్డులో ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ సెకండరీ కంటాక్టుల ప్రజలకు పరీక్షలు జరిపేందుకు జాబితాను సిద్ధం చేసుకుని వారి పేర్లును తొలుత ఆన్లైన్ లోను నమోదు చేసి అవి మంజూరైన తప్ప ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు వీలులేని పరిస్థితి ఉంది.అయితే అలాకాక అప్పటికప్పుడు వచ్చిన ప్రజలు తమకు పరీక్షలు జరపాలని కోరుతూ చిన్నా చితకా తగాదాలు దిగారు.దానితో అధికారులు అయోమయానికి గురి అయ్యారు.కాగా ఈ సందర్భంగా పరీక్షలకు వచ్చే ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు కమిషనర్ చెప్పారు.కాగా ఈ సందర్భంగా వచ్చి ప్రజలకు వివరంగా ముందుగానే నిబంధనలు వివరిస్తూ రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని కమిషనర్,తహసీల్దార్,వైద్య సిబ్బంది కి సూచించారు. కాగా ఉదయం 10 గంటలకే సంజీవి-సంచార వాహనము రాగా రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగడంతో అప్పటి వరకు పరీక్షలు ప్రారంభించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్షలు ప్రాంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభవం అవగా రాత్రి వరకు పరీక్షలు కొనసాగాయి.దానితో ప్రజలు వర్షానికి కొంత ఇబ్బంది గురికాక తప్పలేదు.ఈ కార్యక్రమంలో కమిషనరు, తహసీల్దారుతో పాటు మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావు, శానిటరీ ఇన్స్పెక్టర్  రాజశేఖర్, ఎఇ రాజశేఖర్ తదితరులు పర్యవేక్షించారు.


మండలంలో లాక్ డౌన్ విధించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టండి





మండలంలో లాక్ డౌన్ విధించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టండి.

 

.... సనాతన ప్రబోధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తోట. సాయిబాబా.

 

గోకవరం పెన్ పవర్.

 

 

 

గోకవరం మండలంలో గత రెండు వారాలుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నప్పటికీ  ప్రజలు మాత్రం ఎక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించుట లేదు.  ప్రధాన రహదారి గుండా గుంపులుగుంపులుగా జనాలు సంచరిస్తున్నారు ఏ దుకాణం వద్ద చూసిన అనేక మంది జనం గుమికూడి ఉంటున్నారు. మాస్కులు ధరించడం లేదు సామాజిక దూరాన్ని అసలేమాత్రము  పాటించుట లేదు. దీని ఫలితంగా గోకవరం పరిసర ప్రాంతాల్లో కరోనా వ్యాధి  వ్యాప్తి  అనేది విస్తృతంగా జరుగుతున్నది కావున ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇటువంటి దుర్భర దుస్థితిలో నుండి గోకవరం మండలప్రజానీకాన్ని సంరక్షించుటకు సంబంధిత అధికారులు తక్షణమే  స్పందించి గోకవరం మండలంలో  15 రోజుల పాటు పూర్తి స్థాయిలో లాక్డౌన్  విధించి  తద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలని  ఆయన ఉన్నతాధికారులకు నివేదించారు  .                                                                   


 

 




ఆధార్ సెంటర్ వద్ద నిర్లక్ష్యం తగదు


ఆధార్ సెంటర్ వద్ద నిర్లక్ష్యం తగదు*

 

*పెద్దాపురం ఎస్సై బాలాజీ* 

 

*పెద్దాపురం ఆంధ్ర బ్యాంక్ లో ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం* 

 

పెద్దాపురం ,పెన్ పవర్

 

 

 స్థానిక ఆంధ్ర బ్యాంక్ ఆవరణంలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రం వద్ద జనం రోజు రోజుకి  పెరుగుతున్న దృష్ట్యా

అధికారులు బ్యాంకు వారికి ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్న వారికి సూచనలు సలహాలు ఇచ్చి ఆధార్ సెంటర్లో శానిటైజర్లు రౌండ్  సర్కిల్స్ ఏర్పాటు చేయాలని. ఆరడుగుల సామాజిక దూరం ఉండేలా చూడాలని తెలిపినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా వారిపని వారు నిర్వహిస్తున్నారు . కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా ఎవరికి వస్తే మాకేంటి  అనే ధోరణి లో వారు వ్యవహరించడం బాధాకరం. అయితే బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి  ఖాళీ స్థలంలో ఆధార్ సేవలు పొందే వారిని కూర్చోబెట్టాలని మెగా ఫోన్ ద్వారా వారికి టోకెన్స్ ఏర్పాటు చేసి వారికి టోకెన్స్ ఇవ్వాలని  అధికారులకు తెలిపినప్పటికీ  అలా కాకుండా లైన్లో నుంచోపెట్టి సేవలందిస్తున్నారు అయితే దానివల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని  కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదని. ఆధార్ కి బ్యాంకు ఓకే ప్లేస్ వలన ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పడం లేదని  వచ్చిన వినియోగదారులు తెలిపారు. *మరోసారి అధికారుల దృష్టికి* ఆంధ్ర బ్యాంక్ ఆవరణంలో నిర్వహిస్తున్నటు వంటి ఆదర్ సెంటర్లో దగ్గరదగ్గరగా  ఉంటున్నారనే సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమై తక్షణం అక్కడ సమస్యను  పరిష్కరించాలని స్థానిక ఎస్సై ఏ బాలాజీని  ఆదేశించగా సచివాలయ సిబ్బందితో పాటు  అక్కడికి వెళ్లి సమస్యని పరిష్కరించడం జరిగింది. నాల్గవ సచివాలయం  వీఆర్వో లక్ష్మి  మహిళా పోలీస్ సూర్యకుమారి. వాలంటీర్స్ ఎస్.నళిని. శీను. గౌరీ. శుభ .తదితరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...