Followers

ఊరు.. ఉలిక్కిపడింది


ఊరు.. ఉలిక్కిపడింది..

*  గోకవరంలో 38 కేసులు

* ఒకేరోజు 29 కేసులు నమోదు

* సంజీవని బస్ ని ఏర్పాటు చేయాలి

* అందరు జాగ్రత్తలు పాటించాలి

      

గోకవరం పెన్ పవర్.         

 

ప్రమాదం ఎదురుగా వచ్చేసింది... శ్వాస తీయటంలో తడబాటు పడే క్షణాలు కనిపిస్తున్నాయి.. పొగరుగా తల ఎగరేస్తే హాస్పిటల్ లో పడుకోబెట్టే రోజులను చూస్తున్నాము.. అందరు జాగ్రత్తలు పాటించాలి.. మీ ప్రాణాల తో పాటు పక్కవారి ప్రాణాలు కూడా ముఖ్యమే.. ఆలోచన చేయండి.. ప్రమాదాన్ని నివారించండి..గోకవరం మండల కేంద్రంలో ఒకేసారి 29 కరోనా కేసులు నమోదు అయ్యాయి..ఒక్కసారిగా ఊరు ఉలిక్కిపడింది..మత్తు నిద్ర వదిలిపోయింది.. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నమోదు అవుతున్న జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఒకేసారి 29 మందికి సోకటం తో అందరు భయపడుతున్నారు. గోకవరం తో పాటు పక్క గ్రామాలు కలవరపడుతున్నాయి. పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ తో పాటు నాయకులకు కరోనా సోకటం తో ఆందోళన మొదలైంది. గ్రామంలో ప్రధానమైన అధికారులకు పాజిటివ్ రావటం పై ప్రజలు ఆలోచించాలి. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. విచ్చల విడిగా తిరగటం మానుకోవాలి. ఇంకా గోకవరంలో కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఉంది కనుక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. అందరు రాజమండ్రి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోలేరు. కనుక అధికారులు సంజీవని బస్సుని ఏర్పాటు చేస్తే మంచిది. గోకవరం ప్రాంతంలో అనుమానం ఉన్న వ్యక్తులు ఈ బస్సు వద్ద పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ఉంటుంది. గోకవరం హై స్కూల్ వద్ద గాని, జూనియర్ కాలేజి వద్ద గాని సంజీవని బస్సు ని ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవటానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొంతమంది వెళ్లి పరీక్షలు చేయించుకోకుండా వెనక్కి వచేస్తున్నారు. ఎవరు చూసేవారు లేక పట్టించుకునే వారు కరువై దిగులతో వెను తిరుగుతున్నారు. గోకవరం నుండి రాజమండ్రి 30 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లిన ఫలితం శూన్యం. అధికారులు దృష్టి సారించి సంజీవని బస్సు వచ్చేందుకు ప్రయత్నాలు చేయాలి. అలాగే నియోజకవర్గ స్థాయి నాయకులు బస్ కోసం రికమండేషన్ చేయాలి.జనాలు విచ్చల విడిగా తిరగటం తగ్గించాలి.. మద్యం షాపులను వీలైతే మూసే విధంగా చర్యలు తీసుకోవాలి. సారా అమ్మకాలు ఆగాల్సి ఉంది.. శృతి మించి జరుగుతున్న సారా అమ్మకాల పై అధికారులు కొరడా ఝళిపించాలి.. టైం ప్రకారం దుకాణాలు మూసివేయ్యాలి.. దొంగచాటు వ్యాపారాలు కొద్ది రోజులు ఆపండి. ఇన్ని రకాల విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే కరోనను నియత్రించవొచ్చు.. ఇది అందరికీ సంభదించిన విషయం.. ఆలోచించండి..


 


దిశ చట్టం అమలు చేయాలని దళితసంఘల డిమాండ్





దిశ చట్టం అమలు చేయాలని దళితసంఘల డిమాండ్!

 

 

రాజమండ్రి, పెన్ పవర్ ప్రతినిధి

 

 ఏపీలో దిశ చట్టం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు అన్ని ఏమి అయ్యాయనే దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.రాజమండ్రిలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై దళిత సంఘాల నాయకులు పులి ప్రసాద్, నూకతట్టు వెంకటరమణ, బుంగ సతీష్ కుమార్ ,వల్లూరి సత్యనంధం ఐతి రాజు కుమార్  ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో బాదితురాలిని పరమర్శించినారు. అనంతరం మాట్లాడుతు బాలికపై అత్యాచారం అమానుషమని మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . చేస్తే సరిపోదు ఒక దళిత స్త్రీ కరోనా సమయంలో కుటుంబము  గడవక చెప్పులు షాప్ లో పని చేయడానికి తన పక్కింటి ఆమె అనిత తో మాట్లాడి పని చేయడానికి తీసుకు వెళ్లి ఒక అబ్బాయితో ప్రేమలో దింపి అబ్బాయి ద్వార  ఏడుగురు దుండగులు ఆటోలో ఎక్కించుకుని గోకవరం బస్టాండ్ సమీపంలో వేరే స్త్రీ ఇంటికి తీసుకెళ్ళి నాలుగు రోజులు అత్యాచారం చేయడం దారుణమైనటువంటి  పరిస్థితి మానవత్వమే మర్చిపోతున్న టువంటి స్త్రీలను కఠినంగా శిక్షించాలని అన్నారు. తమ కూతురు ఆచూకి తెలియడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని అసెంబ్లీలో ముక్తకంఠంతో ఆమోదం పొందిన దిశ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన రాజమండ్రిలోనే సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏం చేస్తుందని అన్నారు. చట్టం చేయడం కాదు నిబద్ధతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని అన్నారు.ముఠా అరాచకాలపై ఆ ఘటన దళితులందరూ తలదించుకునేలా చేసిందని నాలుగు రోజులు చిత్రహింసలు పెట్టి నా ఆ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సామూహిక అత్యాచార ఘటనలో నిందితులంతా రోడ్డుపై ఖాళీగా తిరుగుతు దోపిడీలు చేస్తూ మత్తుమందు సైతం వాడడం హాబీ బాలికను తీసుకెళ్లి ఆ బ్లేడ్ బ్యాచ్ కి యువకులకు అప్పగించింది .అనిత ముందస్తు ప్రణాళిక ప్రకారమే రాజమహేంద్రవరం గోకవరం  బస్టాండ్ దగ్గర నాలుగు రోజులు చిత్రహించలకు గురిచేసి కోరుకొండ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలి పెట్టి దైర్యంగా వెళ్లి పోయారు. అంటే వారి వెనుక పెద్ద నాయకులే ఉన్నారని పూర్తిస్థాయిలో విచారన జరిపి అందరిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.


 

 




దోషులను వెంటనే శిక్షించాలి







దోషులను వెంటనే శిక్షించాలి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జుట్టుక . నాగేశ్వరావు డిమాండ్.

 

జగ్గంపేట,పెన్ పవర్ 

 

 

 తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల కమ్యూనిటీ హాల్ దగ్గర  సమావేశమైన ఏ ఎం ఎం డి కె ఎస్ అధ్యక్షుడు దిరిశాల పండు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుట్టుక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల మధురపూడి గ్రామ  నివాసి అయిన ఒక మైనర్ దళిత బాలిక పై ఏడుగురు వ్యక్తులు హత్యాచారానికి వడి కట్టారు ఆ మైనర్ రాజమండ లో  లో ఒక షాపులో పని చేస్తూ ఉండేది ఆ క్రమంలోనే ఆమెకు మంచి పని ఇప్పిస్తామని  మాయమాటలు చెప్పి ఆమెను నేను ఒక ఇంటి లోన్ కి తీసుకెళ్ళి టీ లో మత్తు పదార్థం కలిపి ఆమెపై అత్యాచారం చేశారు మన రాష్ట్ర ప్రభుత్వంఒక దిశ చట్టాన్ని రూపొందించారు ఆ చట్టం ఎవరికి వర్తిస్తుంది ఇంతవరకు దానివలన  న్యాయం ఎవరికీ జరిగింది తెలియదు అసలు ఎందుకు ఆ  చట్టాన్ని రూపొందించారు కూడా తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఆ దిశ చట్టం ఉంది ఒక మైనర్ బాలికను ఏడుగురు వ్యక్తులు  ఇంతటి దారుణానికి పాల్పడిన లేదా అగస్త్యునికి పాల్పడితే ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు ఆ వ్యక్తులను ఎప్పటి వరకు అరెస్టు చేయలేదు దీనివలన ప్రజల్లో  ఆ దిశ చట్టంపై  నమ్మకం పోయింది తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షలను అమలుపర్చాలి కానీ నీరు ఖర్చా కూడదు ఈ దిశ చట్టం ఒక మహిళ కు అత్యాచారానికి గురైతే ఇరవై ఒక్క రోజు లలో ఆ వ్యక్తులను అరెస్టు చేసివారిని ఎంక్వయిరీ చేసి వెంటనే ఉరిశిక్ష విధించాలి కానీ మన ప్రభుత్వాలు ఆ పని చేయటం లేదు చట్టమైతే పెట్టారు కానీ దానిని అమలు పరచడంలో వెనకడుగు వేస్తోంది ఈ చట్టం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది ఎప్పటికైనా  ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ ఏడుగురు వ్యక్తులను వెంటనే ఉరి తీయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు కోరారు ఈ కార్యక్రమంలో ఏ ఎం డి కె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాజరు మాట్లాడుతూ ఇప్పటికీ కూడా దళిత స్త్రీల వై ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు వారి వెనకాల పెద్దపెద్ద నాయకులు ఉండటం వలన లేక ఆ దళితులకు ఎంతోకొంత డబ్బులు పడేస్తే పోతారు లే అనేటువంటి భావం తక్కువ తనం  ఉన్నది కాబట్టి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే  ఆ వ్యక్తులను ఎన్కౌంటర్ చేయాలని మా దళిత సంఘాలు అన్ని కోరుకుంటున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో లో ఆకుమర్తి పెద్ద పైడి మల్ల మల్లేష్ దిరిశాల సుబ్బారావు దిరిశాల చంటిబాబు సత్యవతి లక్ష్మి కటాక్షం మరియమ్మ నీలవేణి మార్తమ్మ జయమ్మ  తదితరులు పాల్గొన్నారు.


 

 




 



 



 



మద్యంకోసం ఎన్ని ఆంక్షలు విధించినా పాటిస్తాం


మద్యంకోసం ఎన్ని ఆంక్షలు విధించినా పాటిస్తాం..!


ఛత్రీలతో బారులుతీరి ఎగబడుతున్న మందుబాబులు.                         


 


సామర్లకోట, పెన్ పవర్


 


 


మద్యం కొనేందుకు కరోనా వ్యాప్తి చెందుతున్న అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా మేము మాత్రం మద్యం కొనుగోలు మాత్రం మానేది లేదనే ధోరణిలో మద్యం బాబులు  ఎగబడుతున్నారు.జిల్లాలో కరోనా కేసులు కట్టలు తెంచుకుంటున్న నేపధ్యంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఎలాంటి సామాజిక దూరాన్ని పాటించకుండా ఎగపడుతున్న పరిస్థితులు ఉన్నందున వారిని కరోనా వ్యాధి నుంచి కాపాడేందుకు గాను జిల్లా కలెక్టర్ ఒక అలోచన తో మద్యం కొనుగోలుకు వెళ్లే వారు విధిగా గొడుగులు వేసుకుని మాత్రమే వెళ్ళాలి అని అలా రాని వారికి మద్యం విక్రయాలు జరుపవద్దు అని తాజాగా ఆంక్షలు విధించారు.దానితో మంగళవారం తెల్లవారకుండానే  ఆ విషయం తెలుసుకున్న మందు ప్రియులు గొడుగులతో మద్యం దుకాణాల వద్ద బారులు తీరి ప్రత్యక్ష మయ్యారు.ఆ దృశ్యం పట్టణ పరిధిలో ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.దీనిని బట్టి మద్యం విలువ ఆ ప్రియులకు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఏమైనా మద్యం దుకాణాల వద్ద కొనుగోలు దారులు సామాజిక దూరాన్ని పాటించాలి అని అధికారుల ఆలోచన దానికి చేసిన ప్రయోగం మాత్రం చక్కగా పనిచేసింది.గొడుగులతో నిలిచి ఉన్న ప్రజలు వారికి తెలియకుండానే దూరాన్ని పాటించడం తో కొంత మేర కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసినట్టు అయిoది. అయితే వర్షం లేకుండానే మందు ప్రియులు గొడుగులు వేసుకుని మరీ మద్యం కొనుగోలు చేయడం మాత్రం కొత్త వరవడిని తెచ్చినట్టయిoది.


అక్రమం గా లారీలో తరలిస్తున్న గంజాయి ని పట్టుకున్న పోలీసులు



అక్రమం గా లారీలో తరలిస్తున్న గంజాయి ని పట్టుకున్న పోలీసులు

 

లారీలో తరలిస్తున్న 514 కేజీల గంజాయిని , లారీ ని సీజ్ 


 

 

 

 

పెన్ పవర్ పశ్చిమ గోదావరి  బ్యూరో

 

పశ్చిమగోదావరి జిల్లాలో

కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద లారీలో తరలిస్తున్న గంజాయి స్వాధీనం.

విశాఖపట్నం నుండి తెలంగాణా కు అక్రమం గా లారీలో తరలిస్తున్న గంజాయి ని పట్టుకున్న పోలీసులు

 లారీలో తరలిస్తున్న 514 కేజీల గంజాయిని , లారీ ని సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు.

 లారీని సీజ్ చేసి స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

 వైరస్ నియంత్రణకు రహదారులను మూసివేస్తున్న ప్రజలు


 


 వైరస్ నియంత్రణకు రహదారులను మూసివేస్తున్న ప్రజలు


  పాయకరావుపేట,పెన్ పవర్ 

 

తునిలో కరోనా పాజిటివ్ కేసులు అతివేగంగా పెరుగుతున్న సందర్బంగా ఆ ప్రభావం పేట ప్రజలమీద పడకుండా వైరస్ నియంత్రణకు గ్రామ పెద్దలు,వివిద పార్టీలకు చెందిన రాజకీయనాయకులు  రహదారుల మూసివేత నిర్ణయంతీసుకొన్నారు. ఈమేరకు వారు పాయకరావుపేట నుండి తుని మార్కెటుకు వెళ్ళే తాండవ నది బ్రిడ్జి ని బార్ గేట్లతో మూసేసారు.అదేవిదంగా నర్సీపట్నం జంక్షన్ నుండి పాయకరావుపేట పట్టణంలోనికి వచ్చే లింగాలకాలనీ మెయిన్ రోడ్డును కూడా మూసేసారు.ప్రయాణ అసౌకర్యానికి చింతించక సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గూటూరి శ్రీను,దనిశెట్టి తిరుమలేశ్వర్రావు,జగతా శ్రీనివాస్ ,ఇంజరపు సూరిబాబు,ఐఎన్ మూర్తి,రాజా రమేష్ ,పెంకే శ్రీను,జగతా ప్రసాద్  మరియు పంచాయితీ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

గౌడ్ జాతికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి  


బీసీ లో అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ జాతికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి
 


ఆత్రేయపురం,పెన్ పవర్


మండలం ర్యాలీలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టా వీరబాబు మాట్లాడుతూ త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు ఇతను దివంగత నేత  వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సన్నిహితంగా మెలిగే వారిని గతంలో  జోగి రమేష్ ఆర్టీసీ చైర్మన్ గా పని చేశారు2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో పెడన నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గత ప్రభుత్వం మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా గౌడ సామాజిక వర్గాన్ని వివక్షతకు గురి చేశారని ఆరోపించారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో గౌడ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం అవుతున్నది మన రాష్ట్రంలో బీసీల అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ కు అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వంలో అయినా జోగి రమేష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ముఖ్యమంత్రి వై.ఎస్  జగన్ మోహన్ రెడ్డి ని కోరారు, కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం చేసిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని ప్రజలందరిని కోరుకుంటున్నాను.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...