Followers

జనసైనికుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ


జనసైనికుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ.
               


 పరవాడ, పెన్ పవర్


 


పరవాడ: మండలం తానం గ్రామంలో జనసేన పార్టీ  ఆధ్వర్యంలో పరదేశిమాంబ గుడి వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఐదు కేజీల బియ్యం ,9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు మోటూరు సన్యాసినాయుడు , చుక్కా నాగు, మోటూరు హరి, స్థానిక జనసైనికులు శ్రీను (గబ్బర్), ఆచారి, కృష్ణ, పవన్  తదితర జన సైనికులు పాల్గొన్నారు. 

మిధిలా పురి   సూపర్ మార్కెట్లో అగ్నిప్రమాదం



మిధిలా పురి   సూపర్ మార్కెట్లో అగ్నిప్రమాదం


  విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



నగరంలోని మధురవాడ మిధిలా పూరి హుడా కాలనీలో  ఎం వి ఎస్ సూపర్ మార్కెట్ లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సర్క్యూట్ వల్ల చాలా రేగిన మంటల్లో  విలువైన  సరుకులు వస్తువులు సామాన్లు   కాలి బూడిద అయ్యాయి. హఠాత్తుగా మంటలు ఏర్పడటంతో ఫైర్ ఇంజన్ లు  వచ్చే సమయానికి మంటలు అల్లుకు పోయాయి. దీంత మంటలు అదుపు చేయడం ఫైర్ సిబ్బంది కి సాహసం గా మారింది.  సుదీర్ఘ సమయం సాహసం చేసి మంటలను అదుపు చేశారు.  ఈ అగ్ని ప్రమాదంలో భారీగా  ఆస్తి నష్టం జరిగినట్లు అంచనాలు వేశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో చుట్టుపక్కల పెను ప్రమాదం తప్పింది.


 

 

పరవాడ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు 


పరవాడ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు 

డంపింగ్.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు.

గాజువాక క్రైమ్ పోలీసుల పేరుతో రాయబేరాలు.

 

పరవాడ పెన్ పవర్

 

పరవాడ : గ్రామ రెవెన్యూ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారి పక్కన సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా గుర్తుతెలియని వ్యక్తులు ఏపి 31 టి.ఎఫ్ నెంబరు గల వాహనంతో డంపింగ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు రెడ్ హ్యాండెడ్  గా వ్యర్థాలను డంపింగ్ చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.స్థానిక పోలీసులతో పాటు విలేఖర్లకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని స్టేషన్ కి తరలించారు. ఇదిలా ఉంటే వాహన యజమాని గాజువాక క్రైమ్ పోలీసుల పేరుతో రాయ బేరాలకు దిగడం కొసమెరుపు. పరవాడ పరిసర ప్రాంతంలో ఇటీవల ఫార్మా వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంపింగ్ చేస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న విషయం తెలిసిందే.ఈ వ్యర్థాలకు నిప్పు పెట్టడం వలన పరవాడ గ్రామ ప్రజలు, సమీపంలో ఉన్న కాలనీవాసులు, వ్యర్థ పదార్థాల నుండి వచ్చే విషవాయువు పీల్చ లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంతే కాకుండా తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా పారిశ్రామిక వ్యర్థాలను డంపింగ్ చేయడంతో పరిసరాలను కలుషితం అవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంపింగ్ చేయడం, వాటికి నిప్పు పెట్టడం చట్టరీత్యా నేరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

మద్యం వద్దు_ కుటుంబం ముద్దు


  మద్యం వద్దు_ కుటుంబం ముద్దు
ప్రజా చైతన్యానికి  తెరతీసిన ప్రభుత్వం.
గోడ పత్రికలు ఆవిష్కరించిన విశాఖ అరకు ఎంపీలు.


  విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



ప్రజా చైతన్యంలో భాగంగా  మద్యం వద్దు కుటుంబం ముద్దు  నినాదంతో  గోడ పత్రికను  విశాఖ ఎంపీ సత్యనారాయణ అరకు ఎంపీ గొట్టేటి మాధవి వారం విశాఖ లో ఆవిష్కరించారు. ఆంధ్ర ప్రదేశ్ మధ్య విమోచన ప్రచారం లో భాగంగా ఈ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు సత్యనారాయణ మాధవిలు  మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంపూర్ణ మద్య నిషేధం  మొదటి దశ విజయవంతం అయ్యిందని రెండో విడతలో  ప్రజల్లో మద్యంపై అవగాహన కల్పించాలని  మద్యం వద్దు  కుటుంబం ముద్దు అనే నినాదంతో   ప్రచారం చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక  సమస్యల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల  ప్రయోజనం కోసం  సీఎం సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా ఉన్న లైసెన్స్ మద్యం దుకాణాలను కుదించి  ప్రభుత్వ ఆధీనంలో 75% ధరలు పెంచి మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెరిగిన ధరలు తగిన బ్రాండ్లు  లభించక  మందు బాబులు సంఖ్య తగ్గిందన్నారు. మద్యం షాపులపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతూనే ఉందని అలాగే సంపూర్ణ మద్య నిషేధానికి  ప్రజా చైతన్యం తీసుకురావాలని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు ఆంధ్ర ప్రదేశ్ మధ్య విమోచన కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో  ప్రచారాలు జరుగుతాయన్నారు. మద్యం మత్తు వల్ల కలిగే అనర్థాలను కళ్ళకు కట్టినట్లు ప్రజలకు  వివరించాలని గోడ పత్రికలు ప్రచారాలు మొదలయ్యాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఏ ఏ సి రాష్ట్ర ఇంచార్జ్ సురేష్ బేతా పాల్గొన్నారు.


అది మండల కేంద్రమా..మురికి కూపమా





అది మండల కేంద్రమా..మురికి కూపమా

 

  గూడెం కోత్త వీధి ,పెన్ పవర్

 

 పేరుకే అది మండల కేంద్రం కానీ రోడ్లు డ్రై నేజిలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. వర్షం కురిస్తే చాలు రోడ్ల పై నీరు వరదలా ప్రవహిస్తుంది.ఈ సమస్య ఏళ్ల తరబడి గిరిజనులు ఎదుర్కొంటున్న అధికార్లకు మాత్రం పట్టడం లేదు. మండల కేంద్రానికి వెళ్ళే మైయిన్ రోడ్డు పరిస్థితి

వర్ణనా తీతంగా మారింది. సిమెంట్  రోడ్లు నిర్మించిన‌‌‌ అదికార్లు రోడ్లు పక్కన డ్రైనేజ్ లు నిర్మిచకపోవ‌‌‌డం వల్ల వర్ష కురిస్తే  మురుగు నీరు వచ్చి ఎక్కడికక్కడే నిల్వ ఉండిపోతుంది. ద్విచక్ర వాహనాలు పాదచారులు రాక పోకలు  నరకప్రాయగా మారింది దీంతో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు రోడ్లు మీదకు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ కాలవలు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ నీత్యం నీరు ఉండటంవల్ల. దోమలు సైరవిహారంచేస్తున్నాయాని భాదితులు వాపోతున్నారు. వింటివల్ల మండల కేంద్రంలోని ప్రజలు దుర్వాసన. దోమల బెడదతో త్రివ‌‌‌ ఇబ్బందులు పడటమైకాకుండా. డేంగ్యూ. మలేరియా. వైరల్ జ్వరాలు. అనేక రోగాలు బారినపడుతున్నా. అధికారులు మాత్రం డ్రైనేజ్ కాల్వల నిర్మాణం కోసం 

పట్టించుకోలేదని మండల కేంద్రం ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరుయ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు స్పందించి క్షిణించిన‌‌‌ డ్రైనేజ్ వ్యవస్థ ను మేరుగు పరచాలని స్థానికులు కోరుతున్నారు.


 

 




ఎంపీల.చేతులమీదుగా ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచారం


ఎంపీల.చేతులమీదుగా ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచారం  కరపత్రాలను విడుదల 


 


పూర్ణ మార్కెట్, పెన్ పవర్.


రాష్ట్ర ప్రభుత్వం  మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంపూర్ణ  మద్యపానం నిషేధం దిశగా . ఇప్పటికే దశలవారీగా మద్యం షాపులు  సంఖ్య తగ్గించడం.  ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి  మద్యం వల్ల కలిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచడం కొరకు  మద్యం వద్దు - కుటుంబం ముద్దు అనే నినాదంతో ఏర్పాటుచేసిన ప్రచారం  కరపత్రాలను  ఆవిష్కరించిన అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి.మాధవి  విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ  వీరితో పాటు ఏపీఏఏసీ స్టేట్ ఇంఛార్జి సురేష్ బేత పాల్గొన్నారు.


నిబంధనలు అతిక్రమించిన వారిని క్వారంటైన్


నిబంధనలు అతిక్రమించిన వారిని క్వారంటైన్ కు తరలిస్తున్న సి ఐ సుధాకరరావు


గిద్దలూరు,పెన్ పవర్ 


ఎవరైనా కానీ అనవసరంగా బయట తిరిగే వారిని 14 రోజుల పాటు  క్వారంటైన్ కు తరలిస్తామని హెచ్చరిక


ప్రకాశం జిల్లా గిద్దలూరు లో రెండు రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన సి ఐ  సుధాకరరావు నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు


ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఈ రెండు రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని ఎవరైనా షాపులు తెరిచిన అనవసరంగా బయట తిరిగిన క్వారంటైన్ కు తరలిస్తామని సి ఐ  సుధాకరరావు హెచ్చరిస్తున్నారు


పూర్తి అత్యవసర సమయాల్లో మాత్రమే అనుమతి ఇస్తామని  ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే  14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతామని అన్నారు


లాక్ డౌన్ భద్ర ఏర్పాట్లను ఎస్ ఐ  లు త్యాగరాజు మల్లికార్జున రావు పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...