Followers

ఊరొచ్చేస్తుంది



ఊరొచ్చేస్తుంది

 

పొదిలి, పెన్ పవర్

 

 

 

ఉన్న ఊరునొదిలి పట్నం బాట పట్టిన ఇద్ధరు రైతులు కరోనా కాలంలో ఎదుర్కొన్న కథనంతో .." ఊరొచ్చేస్తాంది" అనే సామాజిక  ప్రేరణతో కూడిన షార్ట్ ఫిల్మ్ షూటింగ్... పొదిలి పరిసర ప్రాంతాల్లోని పొలాలలో మేదరమెట్ల హైవే పై శని, ఆదివారాలు జరిగింది.. పొదిలి సిఐ శ్రీరాం మొదటి షాట్ కి దర్శకత్వం  వహించి షూటింగ్ ప్రారంభమైనట్లు ప్రకటించారు... లాక్ డౌన్ పరిస్థితులలో రైతుబిడ్డల మరోకోణం ఈ సామాజిక అవగాహన కల్పించే కథ కూర్పు బావుందన్న శ్రీరాం.... తెరపై మరి కొందరిలో మార్పు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించగా.... కేవలం రెండు నిముషాలు జరిగిన ఈ ప్రారంభోత్సవంలో   ఎస్ ఐ సురేష్ తదితరులు కూడా పాల్గొని షార్ట్ ఫిల్మ్  టీమ్ ని అభినందించారు..షూటింగ్ సమయంలో తీసుకోవలసిన కరోనా జాగ్రత్తలు సూచించారు.

 సీనియర్ జర్నలిస్టు కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ స్వీయ రచనా, దర్శకత్వం లో ఈ బుల్లిచిత్రం రూపుదిద్దుకుంది.  కరణం శ్యాంశరణ్, కోనూరు నాగరాజు లు మరో రెండు ప్రధాన పాత్రలను పోషించారు. విశ్వనాథ్, శ్రీనివాస్ తదితరులు నటించగా

 సినిమాటోగ్రఫీ  సుమంత్ వ్యవహరించారు

కరోనా కంటోన్మెంట్ జోన్ ను పరిశీలించిన అధికారులు





కరోనా కంటోన్మెంట్ జోన్ ను పరిశీలించిన అధికారులు

 

త్రిపురాంతకం, పెన్ పవర్

 

 

      ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల పరిధిలోనిరామాలయం వీధిలో రెండు కరోనా కేసులు నమోదు కావటంతో మంగళవారం ఆ ప్రాంతాల్లో 200 మీటర్ల  మేర ఎవరు బయటకు వెళ్లకుండా బయట వారు ఆ ప్రాంతానికి రాకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు   చేసి బ్లీచింగ్ తో ఆ ప్రాంతాన్ని శానిటేషన్ చేశారు.కోవిడ్ 19 నియోజకవర్గ ఇంచార్జ్ వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో వైద్య అధికారులు డా. నాగేశ్వరరావు నాయక్,ఎంపీడీఓ సుదర్శనం,ఈఓపిర్ది వెంకటేశ్వరవు రెవిన్యూ ,  ఎం.ఆర్.ఓ. వి. కిరణ్ కుమార్ ,ఎస్ ఐ యు వి కృషయ్య తదితరులు పరిశీలించారు.ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తూ అక్కడ నివసించే వారు బయట తిరగరాదని వారికి కావలసిన నిత్యావసర మొదలగునవి ఏర్పాటు చేస్తామన్నారు.ప్రతి ఒక్కరు సమన్వయం తో భౌతిక దూరం పాటించి,ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎమ్ లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, వలేంటిరీలు పాల్గొన్నారు.


 

 




గర్భవతులకి కోవిడ్  పరీక్షలు


 





గర్భవతులకి కోవిడ్  పరీక్షలు

 

తాళ్ళూరు, పెన్ పవర్

 

 

 తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం ఆరోగ్య కేంద్రం పరిధిలోని బొద్దికూరపాడు మరియు వెలుగువారిపాలెం గ్రామలలో  గర్భవతులు 20 మందికి కరోనా పరీక్షలు చేయడం జరిగింది. అని డాక్టర్ బంక రత్నం తెలిపారు ఆయన మాట్లాడుతూ నెలలు నిండి కాన్పుకి దగ్గరగా ఉన్న వారికి కరోనా పరీక్ష లేకుంటే వైద్యం నిరాకరిస్తూ ఉండటం వల్ల  గర్బవతులకు ముందుగా కరోనా  పరీక్షలు చేస్తే ఏ ఆసుపత్రిలో అయిన వైద్యం చేస్తారనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ సూచనలతో నెలలు నిండిన ప్రతి గర్భిణీకి  కరోనా పరీక్షలు తప్పక చేస్తాము అనీ  డాక్టర్ రత్నం తెలిపారు.గర్భిణి స్త్రీలకు అవసరమైన బీపీ, షుగరు, టెంపరేచర్, పల్స్ ఆక్సిమేటర్ సాయంతో పరీక్షలు చేయడం జరిగింది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో  స్టాఫ్ వాని, మస్తానమ్మ, సుశీలమ్మ,  అంగన్వాడీ కార్యకర్తలు ఆశాలు పాల్గొన్నారు.


 

 




కార్డులను పంపిణీ చేసిన వ్యవసాయ అధికారి


 గ్రామంలో  కౌలు రైతు గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన వ్యవసాయ అధికారి...... 



పెన్ పవర్, ఉలవపాడు


 ఉలవపాడు మండలం లోని మన్నేటికోట గ్రామం రైతు భరోసా కేంద్రం లో మండల వ్యవసాయాధికారి ఎం .మాల్యాద్రి అధ్యక్షతన మంగళవారం నాడు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.ప్రతి రైతు ఈ _క్రాఫ్ నమోదు చేసుకున్నట్లయితే ప్రభుత్వం అందజేస్తున్న లబ్ధి ఫలాలను పొందవచ్చని వ్యవసాయాధికారి తెలిపారు. అనంతరం గ్రామంలో ముగ్గురు కౌలు రైతు లకు  గుర్తింపు కార్డులను  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ బ్రహ్మయ్య వీహెచ్ ఏ  దీపిక మన్నేటికోట ఇంచార్జ్ వీఆర్వో పవన్ పంచాయతీ కార్యదర్శి జయశంకర్ గ్రామస్తులు గ్రామ రైతులు పాల్గొన్నారు.


సాగు దారునికి హక్కు పత్రాలు పై అవగాహన  


సాగు దారునికి హక్కు పత్రాలు పై అవగాహన                    


 

పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి

 

 పొలం యజమాని యొక్క హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులను  బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తహసిల్దార్ శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం మండలంలోని కొండముడుసుపాలెం  గ్రామంలో రైతు భరోసా కేంద్రం లో రైతులకు సాగు దారి హక్కు పత్రాలపై వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీం అధ్యక్షతన రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం భూములు, ఈనామ్ భూములు సాగు చేసే రైతులు విధిగా ఈ పత్రాలు పొంది చట్టబద్ధత తెచ్చుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీం మాట్లాడుతూ ఈ పత్రాల ఆధారంగా బ్యాంకులో పంట రుణాలు, రాయితీ విత్తనాలు, ఎరువులు ఇతర అవకాశాలు కౌలు రైతులు పొందవచ్చునని అన్నారు. మండల పశు వైద్యాధికారి ఏందోటి  చెన్నకేశవులు మాట్లాడుతూ త్వరలో రైతు భరోసా కేంద్రం లో పశు సంవర్ధక శాఖ ద్వారా వివిధ రకాల మందులు, దానా విక్రయాలు జరుగుతాయని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యానవన శాఖ అధికారిని రమాదేవి, విఆర్ఓ,  పంచాయతీ సెక్రటరీ, వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు. 

విఠలాపురం లో కరోనా పాజిటివ్ కేసు నమోదు







విఠలాపురం లో కరోనా పాజిటివ్ కేసు నమోదు

 

విఠలా పురం,పెన్ పవర్ 

 

  మండలంలోని విఠలా పురం   గ్రామంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడం జరిగిందని డాక్టర్ ఖాదర్ మస్తాన్ బి   తెలిపారు  ఆమె మాట్లాడుతూ సెకండరీ ప్రైమరీ   వారిని గుర్తించామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో 

తహశీల్దార్

 

బ్రహ్మయ్య, డాక్టర్ ఖాదర్ మస్తాన్ బి, ఆరోగ్య శాఖ  సిబ్బంది పాల్గొన్నారు.


 

 




 

 


 



బి. కె .పాడు. లో కౌలు రైతులకు పత్రాలు పంపిణీ


బి. కె .పాడు. లో కౌలు రైతులకు పత్రాలు పంపిణీ

 

తాళ్ళూరు, పెన్ పవర్

 

 

తాళ్ళూరు మండలంలోని బొద్దు కూరపాడు  గ్రామంలో  మండల వ్యవసాయ అధికారి బడే సంగమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సి సి ఆర్ సి కార్డ్ పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పి బ్రహ్మయ్య పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ సి సి ఆర్ సి కార్డు వల్ల భూమి యజమానులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని కౌలు రైతులు పంట సాగు చేసుకోవడానికి మాత్రమే సాగు హక్కు పత్రాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు అంతేకానీ భూమి యజమాని భూమి పై    కౌలుదారులకు భూమిపై ఎటువంటి అజమాయిషీ ఉండదని ఆయన తెలిపారు వ్యవసాయ అధికారి సంగమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులకు సి సి ఆర్ సి డి కార్డు లు ఇవ్వడం వల్ల   రైతు భరాోసా కేంద్రాల ద్వారా ఎరువులు పురుగు మందులు విత్తనాలు  ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకాలు లబ్ధి పొందుతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏవో సంగమేశ్వర రెడ్డి తాసిల్దార్ కి బ్రహ్మయ్య ఆర్ ఐ. ప్రశాంత్ వీఆర్ఓ నాగేశ్వరరావు నాగoబొట్లపాలెం సొసైటీ మాజీ అధ్యక్షులు పులి ప్రసాద్ రెడ్డి  మాజీ సర్పంచ్  పులి కృష్ణారెడ్డి  గ్రామ రైతులు పాల్గొన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...