Followers

చిరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి






చిరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి.

 

సీఐ విజయ్ కుమార్.

 

పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి

 

 

  చిరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలని  పట్టణ సీఐ విజయ్ కుమార్ పామూరు రోడ్డు నందు తోపుడు బండ్లు మరియు ఇతర చిరు వ్యాపారస్తులకు తెలియజేశారు. మేము ఇచ్చిన సమయంలో మీరు వ్యాపారం చేసుకోవాలి ఉదయం నుంచి 11 గంటల వరకు మాత్రమే అలా కాకుండా అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
మీ కస్టమర్లు కి శానిటైజర్ చేసి పళ్ళు కూరగాయలు అమ్మాలని,  తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఈ మధ్య కాలంలో అరటికాయల వ్యాపారికి కరోనా సోకి చనిపోయాడు జాగ్రత్తగా ఉండకపోతే కందుకూరు లాక్ డౌన్ దిశగా పయనిస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై కొత్తపల్లి అంకమ్మ పాల్గొన్నారు. 

 

 




 



 



 



లాక్ డౌన్ సడలింపు లపై సీ ఐ సుధాకరరావు


లాక్ డౌన్ సడలింపు లపై సీ ఐ సుధాకరరావు

ఇక ప్రతి వారం సోమ. మంగళ. గురు. శుక్రవారాల లో. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యలో మాత్రమే లాక్ డౌన్ సడలింపు


గిద్దలూరు,పెన్ పవర్



ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్   కొమరోలు గిద్దలూరు రాచర్ల బెస్తవారిపేట లో  లాక్ డౌన్ సడలింపు లపై అత్యవసర సమావేశం అనంతరం సీఐ సుధాకరరావు మున్సిపల్ కమిషనర్ హైమావతి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు, లాక్ డౌన్ సడలింపు లపై ఈ సందర్భంగా సిఐ సుధాకర రావు మాట్లాడుతూ ఈ వారంలో  రేపు బుధవారం మరియు గురువారం కట్టుదిట్టమైన  లాక్ డౌన్  ఉంటుందండి ఈ వారంలో శుక్రవారం శనివారం లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే అనుమతులు ఇస్తూ నిత్యావసరాలు ముఖ్య గమనిక (పాలు కూరగాయలు నిత్యవసర వస్తువులు కు) మాత్రమే అనుమతులు ఉంటాయని ఇక ప్రతి వారం సోమ. మంగళ.గురు.శుక్ర వారాలలో మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అనుమతులు అని

మిగతా ఎటువంటి  వ్యాపార సముదాయాలకు ఎటువంటి దుకాణాలు వ్యాపారాలకు అనుమతులు లేవని 


సీఐ సుధాకరరావు వెల్లడించారు

అలానే నిరసనలు ర్యాలీలు నిర్వహించరాదు అని వివాహాది శుభకార్యాలు కూడా కోవిడ్-19 నిబంధనల అనుగుణంగా అనుమతులతో నిర్వహించాలని 

కేవలం అత్యవసర పరిస్థితులు ఆస్పత్రి మెడికల్ షాపులకు అనుమతులు ఉన్నాయని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ఇంటి నుండి బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు అలా కాదని ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా బయటికి వస్తే 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉంచుతామని హెచ్చరించారు

తదుపరి ప్రకటన విడుదల చేసే వరకు ఇవే లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయని సుధాకర రావు వెల్లడించారు.

కందుకూరు లో సంపూర్ణ  లాక్  డౌన్   






కందుకూరు లో సంపూర్ణ  లాక్  డౌన్               
రాకపోకలు  పూర్తిగా నిషేధం

 

వాహనాలు  తిరిగితే వాహనాలు సీజ్         

 

పరిమితం చేస్తున్న  మెడికల్ షాపులు                            

 

పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి

 

 ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్న మని ప్రజలు సహకరించాలని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి  అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో  టాస్క్ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టిన ప్రజలలో అవగాహన రానందున టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో కొంత ఇబ్బంది ఉన్నా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒంగోలు రిమ్స్ లో బెడ్స్ ఖాళీగా లేవని, ప్రైవేట్ హాస్పిటల్స్ లో సైతం బెడ్స్ ఖాళీగా లేవని మహమ్మారి రోజురోజుకు తీవ్రంగా ఉందని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని అన్నారు.  పట్టణములో రోజురోజుకు కేసులు ఉద్ధృతంగా నమోదవుతున్నాయని అందుకని  శుక్రవారం నుండి  కందుకూర్ లో కఠినంగా లాక్  డౌన్ అమలు చేయాలని, ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించమని మెడికల్ షాపులు సైతం పరిమిత సంఖ్యలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఫోన్ చేస్తే మందులు ఇంటికి చర్చా కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ వారం రోజులు బ్యాంకులు సైతం చేస్తామని అన్నారు. పట్టణంలో కేవలం పాస్సింగ్ వెహికల్స్ మాత్రమే అనుమతిస్తామని, చుట్టుపక్కల గ్రామాల వారు వ్యక్తిగతంగా కందుకూరు ఎవరూ రావద్దని ఆయన కోరారు. లాక్ డౌన్ ఎట్టి పరిస్థితిలో ఎటువంటి మినహాయింపులు ఉండవని ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ఆయన కోరారు. ఎవరైనా అత్యవసర చికిత్స కోసం  మాత్రమే హాస్పిటల్ కి వెళ్లాలని లేనిపక్షంలో బయటకు రావద్దని కోరారు. ఈ నెల 24 నుంచి 30 వరకు ప్రతి ఇంటిని, ప్రతి ప్రాంతాన్ని సంపూర్ణ పారిశుధ్యం చేస్తామని అన్నారు. కందుకూరు ఏరియా వైద్యశాలలో  ఇప్పటికే 24 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్నారని ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. డాక్టర్లు నర్సులకు  కూడా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయని ఎంత తీవ్రమైన పరిస్థితులలో వారు పని చేస్తున్నారో అర్థం చేసుకొని వారికి మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని వర్గాల వారు సహకరించి ప్రాణాంతక వ్యాధి నుండి బయటపడాలని ఆయన కోరారు. కష్టంగా ఉన్నా తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసం, సమాజం కోసం సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దొంగతనంగా ఎవరైనా షాపులు తీస్తే వాటిని లాక్ చేసే అధికారం సచివాలయాలకు ఇస్తామని హెచ్చరించారు. ఎవరైనా వాహనాలపై తిరిగితే ఆ వాహనాలను లాక్ డౌన్ పూర్తయ్యేవరకూ పోలీసుల ఆధీనంలోనే ఉంటాయని హెచ్చరించారు. మీ యొక్క సంక్షేమం కోసమే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని  అర్థం చేసుకొని సహకరించాలని  కోరారు. అనంతరం ఆర్డీవో ఓబులేసు మాట్లాడుతూ కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎక్కువ మంది వ్యాధి కి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అన్నారు. మరణాల రేటు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నాయని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అప్పుడే కరోనా తగ్గుతుందని అన్నారు. అంతేగాని హాస్పిటల్ కి వెళితే కరోనా తగ్గుతుంది అనే భావన నుంచి ప్రజలు బయటకు రావాలని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మనోహర్ మాట్లాడుతూ  పట్టణంలో ఇప్పటికే 175 కేసులు పైగా నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడు రోజులు ప్రజలు సంపూర్ణ లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. కూరగాయలు కేవలం 27వ తేదీ మాత్రమే అందుబాటులో ఉంటాయని కావున ప్రజలు కావలసిన సరుకులు, నిత్యావసరాలు ముందుగానే తెచ్చి పెట్టుకోవాలని ఆయన కోరారు. డి.ఎస్.పి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని రోడ్లపై చెక్ పోస్ట్ లు పెడతామని వెహికల్స్ ని ఇక్కడ రికార్డు చేస్తామని ఏ వెహికల్ ఇక్కడ ఆగకుండా చేస్తామని అన్నారు. ఎవరు కూడా సరదా కోసం టౌనుకు రావద్దని కోరారు. కఠినమైన నిర్ణయాలు తోనే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి పాల్గొన్నారు.


 

 




 



 



 



వ్యాధి ప్రబలకుండా హైపో క్లోరైడ్ పిచికారి





వ్యాధి ప్రబలకుండా హైపో క్లోరైడ్ పిచికారి

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్

 

 

రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ మరియు ప్రకృతి చికిత్సాలయం మహారాణి పేట జివిఎంసి మలేరియా శాఖవారి సహకారముతో బుద్ధవరపు గార్డెన్స్  లో మంగళవారం  కరోనా వ్యాధి ప్రబలకుండా   హైపో క్లోరైడ్  ద్రావణము పిచికారి చేశారు  ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్  భారతీయ జనతా పార్టీ వైద్య విభాగము కన్వీనర్ రూపాకుల రవికుమార్ ప్రసంగిస్తూ కరోనా వ్యాధి నివారణ కోసము ఈ కార్యక్రమము  చేస్తున్నామని అన్నారు మూడవ జోన్ పరిధిలో కరోనా ఎక్కువగా ఉన్నదని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సామాజిక దూరము పాటించాలని మాస్క్  దరించాలని అన్నారు .   ప్రభుత్వం వారు చేయు కరోనా పరీక్షలు ఫలితాలను వెంటనే ఇవ్వటానికి ప్రయత్నం చేయాలని లేనిచో  రోగికి వైద్యము  చేయుట ఆలస్యము అయినచో జబ్బు తీవ్రత అవుతుందని అన్నారు  ప్రజలు మనోధైర్యంతో ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ  సూచనలను పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి , ఎస్ మహేష్ ,డుతి ,గేదెల శ్రీహరి,  జి.వి.ఎం.సి సిబ్బంది  పాల్గొన్నారు.


 

 




చింతపల్లి సత్య కు నిత్యావసర సరుకులు అందించిన వాసుపల్లీ


చింతపల్లి సత్య కు నిత్యావసర సరుకులు అందించిన వాసుపల్లీ

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్.

 

36వార్డు కొత్త జాలరిపేట  ఏరియా లో నివసిస్తున్న  చింతపల్లి సత్య,  అంగవైకల్యం పెన్షన్ 2019 లో ఇప్పించటమే కాకుండా   కోవిద్-19 కరోనా వల్ల ఆ కుటుంభం జీవనోపాధిలేక ఇబ్బంది పడుతున్నారని కంప్లైంట్ నెంబర్ డయల్ యువర్ ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి  ఆ కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్.

కొమ్మది జే.ఎన్.ఎన్.యు.అర్.ఎం పక్క గృహాలుపై విజిలెన్స్ విచారణ జరపాలి


కొమ్మది జే.ఎన్.ఎన్.యు.అర్.ఎం పక్క గృహాలుపై విజిలెన్స్ విచారణ జరపాలి

 

 జిల్లా బి.జే.పీ. ఎస్సీ మూర్ఛ అద్యక్షులు చొక్కాకుల.రాంబాబు జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు.

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్

 

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నిర్మించిన అమరావతి కొమ్మాధి నందు జే.ఎన్.ఎన్.యు.అర్.ఎం పక్క గృహాలు ముందువారికి ఇవ్వగా వారు దిగని పక్షాన వేరే వారికి ఎంత మందికి ఇచ్చి యున్నారు వారు కూడా దిగక కాలిగా వున్నటువంటి గృహాలను కొంత మంది పెద్దలు 5నుండి 20 లేక 30 వారు చెప్పు చేతుల్లో  వుంచుకొని అద్దెకు ఇచ్చికుంటున్నారు దీనిపై విజిలెన్స్ విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ వారికి దరఖాస్తు చేశారు.

 

విశాఖపట్నం రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన అమరావతి కొమ్మాది  జే.ఎన్.ఎన్.యు.అర్.ఎం పక్క గృహాలు మొత్తంగా 32బ్లాకుల 1024 గృహాలు మొదట్లో మొత్తం మంజూరైనటువంటి  గృహము నందు దిగక  రాష్ట్ర నిర్మాణ సంస్థ వారు వివిధ స్కీములు వారికి అక్కడికి పంపగా వారు దిగక కొంత మంది దళారుల చేతుల్లో బడా బాబులు చేతుల్లో కబ్జా అయ్యాయని అక్కడ బాగా వినికిడి వినిపిస్తుంది దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని మరియు ఇందులో వున్న వారే ముఖ్య మంత్రి జగన్ ఇల్ల స్థలాలలో అప్లయి చేసి యున్నారూ ఈ జే ఎన్ ఎన్ యు అర్ ఎం  గృహాలలో వున్న వారికి అందలి ఇలా స్థల్లాల్లో లేకుండా చూడవలెను ఎలాట్ మెంట్ పత్రాలు ఒకరి పేరు మీద మీటర్లు వేరొక పేరు మీద వేయించుకొని అద్దెలకు ఇచ్చి అద్దెలు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై వెంటనే విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి ఇల్లు లేని ఎస్సీ వారికి దరఖాస్తు చేసుకున్నవారికి జే ఎన్ ఎన్ యు అర్ ఎం పక్కా గృహాలు మంజూరు చేసి వారికి శాశ్వత నీడను కల్పిస్తారని  చొక్కాకుల.రాంబాబు జిల్లా ఎస్సీ మూర్ఛ అద్యక్షులు జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రాన్ని ఇచ్చి ఇది ఎలాగైనా జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చ నాయకులు, శ్రీనివాసు,వడ్డాది.రాజు, దసమంతుల. సుశీల,వడ్డాది.సురేష్ పాల్గొన్నారు

ద్రోణంరాజు శ్రీనివాసరావుకు అభినందనలు తెలియజేసిన సబీరా బేగం





వి.ఏం.అర్.డి.ఏ.చైర్మన్ గా ఏడాది గడిచిన సంధర్భంగా ద్రోణంరాజు శ్రీనివాసరావుకు అభినందనలు తెలియజేసిన సబీరా బేగం.

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్

 

దక్షిణ నియోజకవర్గ మాజీ  శాసనసభ్యులు, సౌత్ సమన్వయ కర్త, ద్రోణంరాజు శ్రీనివాసరావు  వి .ఏం .అర్ .డి .ఏ.  చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది గడిచిన సంధర్భంగా అభినందనలు తెలియజేసిన వై .యస్ .ఆర్ .సి .పి. రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి సబిరా బేగం. ద్రోణంరాజు శ్రీనివాస్ రావు దక్షిణ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా జిల్లా స్థాయులోకూడ  ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని అలాగే వి.ఏం.అర్.డి.ఏ చైర్మన్ గా సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ఈ పదవికి నూటికి నూరు శాతం న్యాయం చేయగలిగారు అని ఆయన మరెన్నో పదవులు పొంది,ఆయన మరెన్నో విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.


 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...