Followers
కౌలు రైతు ధ్రువీకరణ పత్రాలపై అవగాహన సదస్సు
గ్రామంలో శానిటేషన్ పనులు ముమ్మరం
లాక్ డౌన్ ప్రకటించాలని టీడీపీ నాయకులు అధికారులకు వినతి
వి ఆర్ పురం మండలంలో కరోనా టెస్ట్లు
కోవిడ్ పరీక్షలకు తప్పని ఇబ్బందులు
కోవిడ్ పరీక్షలకు తప్పని ఇబ్బందులు...!
ఆన్లైన్ నమోదు లేకుండా తరలివస్తున్న ప్రజలు తలలు పట్టుకుంటున్న అధికారులు.
సామర్లకోట, పెన్ పవర్:
సామర్లకోట పట్టణంలో కోవిడ్ పరీక్షలు కోసం ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ప్రజలు రానురాను వందల సంఖ్యలో పోటెత్తుతుండడంతో అధికారు వారిని నివారించేందుకు తలలు పట్టుకుంటున్నారు.సరియైన సమాచారం సాధారణ ప్రజల వరకు సరియైన పద్దతిలో చేరకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది.పరీక్షలు కోసం ఆశపడి వస్తున్న ప్రజలకు నివారించే విషయంలో అధికారులకు,ప్రజలకు మధ్య వాగ్వివాదాలకు తెరతీస్తుంది. సామర్లకోట పట్టణంలో పాజిటివ్ కేసులు విపరీతం అవుతున్న పరిస్థితులలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో సంజీవి -సంచార వాహనం ద్వారా పరీక్షలు జరుతున్నారు అని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతూ వచ్చించి. దానితో ఉదయం గంటలు సమయం అయ్యేసరికి పట్టణ ఇతర గ్రామాలకు చెందిన ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు తరలి వచ్చారు.అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు అర్బన్ హెల్త్ సెంటర్ ల పరిధిలో పనిచేస్తున్న ఎ ఎన్ ఎం లు వారి వార్డులో ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ సెకండరీ కంటాక్టుల ప్రజలకు పరీక్షలు జరిపేందుకు జాబితాను సిద్ధం చేసుకుని వారి పేర్లును తొలుత ఆన్లైన్ లోను నమోదు చేసి అవి మంజూరైన తప్ప ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు వీలులేని పరిస్థితి ఉంది.అయితే అలాకాక అప్పటికప్పుడు వచ్చిన ప్రజలు తమకు పరీక్షలు జరపాలని కోరుతూ చిన్నా చితకా తగాదాలు దిగారు.దానితో అధికారులు అయోమయానికి గురి అయ్యారు.కాగా ఈ సందర్భంగా పరీక్షలకు వచ్చే ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు కమిషనర్ చెప్పారు.కాగా ఈ సందర్భంగా వచ్చి ప్రజలకు వివరంగా ముందుగానే నిబంధనలు వివరిస్తూ రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని కమిషనర్,తహసీల్దార్,వైద్య సిబ్బంది కి సూచించారు. కాగా ఉదయం 10 గంటలకే సంజీవి-సంచార వాహనము రాగా రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగడంతో అప్పటి వరకు పరీక్షలు ప్రారంభించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్షలు ప్రాంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభవం అవగా రాత్రి వరకు పరీక్షలు కొనసాగాయి.దానితో ప్రజలు వర్షానికి కొంత ఇబ్బంది గురికాక తప్పలేదు.ఈ కార్యక్రమంలో కమిషనరు, తహసీల్దారుతో పాటు మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎఇ రాజశేఖర్ తదితరులు పర్యవేక్షించారు.
మండలంలో లాక్ డౌన్ విధించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టండి
ఆధార్ సెంటర్ వద్ద నిర్లక్ష్యం తగదు
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...