Followers

సంపూర్ణ లాక్ డౌన్ రెండరోజు


సంపూర్ణ లాక్ డౌన్ రెండరోజు సోమవారం గిద్దలూరు సి ఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలోవిజయ వంతంగా సాగుతోంది. 


గిద్దలూరు,పెన్ పవర్ 


గిద్దలూరు లో కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు జరుగుతున్న సంపూర్ణ రెండు రోజుల్లో భాగంగా రెండవ రోజు సోమవారం కూడా సంపూర్ణ లాక్ డౌన్  విజయవంతంగా సాగుతోంది



సంపూర్ణ లాక్  సందర్భంగా జన సంచారం లేక పెద్డ  కూరగాయల మార్కెట్,సాయి బాబా గుడి రోడ్డు లో నిర్మానుష్యంగా మారాయి


వ్యాపార వాణిజ్య కూరగాయల మార్కెట్ కూడా మూసివేయబడ్డాయి. ప్రజలందరూబయటికి రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు


సోమవారం ఉదయం నుంచి గిద్దలూరు సి ఐ   సుధాకర్ రావు ఆధ్వర్యంలో పట్టణంలో  గట్టి బందోబస్తు నిర్వహించారు.


ఆర్మీ క్యాంటీన్ మద్యం షాపులు బంద్


నిత్య అవసరాల కోసం రేపు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు: సి ఐ సుధాకరరావు


ఆర్మీ క్యాంటీన్ మద్యం షాపులు కూడా బంద్*


 ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు సర్కిల్లోని కొమరోలు, రాచర్ల, బేస్తవారిపేట, గిద్దలూరు మండలాలలో రేపు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు లాక్ డౌన్ సడలిస్తునట్లు సి ఐ సుధాకర రావు వెల్లడించారు.


 అలానే కేవలం నిత్యవసర వస్తువులు, కూరగాయల దుకాణాలు తప్ప మిగతా దుకాణాలు ఏవి కూడా తెరవకూడదని, ఎటువంటి దుకాణాలకు అనుమతులు లేవని అంతేకాకుండా *ఆర్మీ క్యాంటీన్ మద్యం దుకాణాలు కూడా లేవని* ప్రజలు గమనించాలని అన్నారు.


 తదుపరి కార్యాచరణ రేపు సాయంత్రం వెల్లడిస్తామని ఆప్పటివరకు ప్రజలు జాగ్రత్తగా వ్యవహరిస్తూ రేపు ఉదయం 9 గంటల తర్వాత ఇళ్లకే పరిమితం కావాలని లాక్ డౌన్ కొనసాగుతుందని అన్నారు.


 అంతే కాకుండా ప్రజలు కూడా ఇంటి నుండి ఒకరు మాత్రమే బయటకు వచ్చి నిత్యవసర వస్తువులు, కూరగాయలను తీసుకువెళ్లాలని అంతేకానీ గుంపులుగుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని, కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా సి ఐ  సుధాకరరావు విజ్ఞప్తి చేశారు. 


బ్యాంకులో ఉద్యోగికి కరోనా బ్యాంకు మూత


బ్యాంకులో ఉద్యోగికి కరోనా బ్యాంకు మూత    


  కందుకూరు, ఆర్ సి  ఇన్ చార్జి,  పెన్ పవర్


 పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ బ్రాంచ్ లో  ఉద్యోగి కి  కరోనా సోకడంతో సోమవారం అధికారులు బ్యాంకు మూత వేశారు. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశం బ్యాంకులు  కావడంతో  బ్యాంకుల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రజలు భౌతికదూరం పాటించకుండా బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్రతిరోజు బ్యాంకుల వద్ద పోలీసులు వారిని అదుపు చేసి భౌతిక దూరం పాటించేలా చేసినప్పటికీ ప్రజల్లో చైతన్యం రాకపోవడం గమనార్హం. ఎవరికి వారు త్వరగా పని చూసుకోవాలనే  ధోరణి తప్ప జాగ్రత్తలు తీసుకునే ఆలోచన లేకపోవడం కరోనకు  కలిసొచ్చే అవకాశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగి కరోనా రావడంతో బ్యాంకు మూసేశారు  కానీ ఎదురుగా ఉన్న  బ్యాంక్ ఆఫ్ ఇండియా  లో   ప్రజలు  భౌతిక దూరం  పాటించకుండా  నిలబడి ఉండటం   పలు విమర్శలకు దారి తీస్తోంది. కావున ప్రజలు బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


పట్టణంపై ఇంద్రధనస్సు ప్రజలకు కనువిందు


పట్టణంపై ఇంద్రధనస్సు ప్రజలకు కనువిందు


 


కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి,  పెన్ పవర్


 


ఆకాశం మేఘావృతమై మబ్బులు పట్టణంలోని భవంతులను తాగుతున్నట్లు ఆ సమయంలోనే ఇంద్రధనస్సు ఏర్పడటంతో ప్రజలు ఆసక్తిగా ఈ దృశ్యాన్ని తిలకించారు. ఇంద్రధనుస్సు లో పట్టణం ఉండటం ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. సోమవారం  సాయంత్రం పెద్దలు చిన్నారులు డాబా లపై ఉండి  దృశ్యాన్ని చూశారు. 


శీతల పానీయం కోసం కోతి ఆరాటం  


శీతల పానీయం కోసం కోతి ఆరాటం  


                         


కందుకూరు, ఆర్ సి  ఇన్ ఛార్జి , పెన్ పవర్


  వేసవిలో దప్పిక తీర్చుకోవడానికి వానరాలు నానా అవస్థలు పడుతుంటాయి. ఇటీవల వర్షాలు పడడంతో తాగునీటి సమస్య తీరింది. ఈ నేపథ్యంలో శీతల పానీయం కోసం కోతి ఆరాటపడిన దృశ్యం పెన్ పవర్ కంటపడింది. ఓ వ్యక్తి శీతల పానీయం తాగి డబ్బా మూత పెట్టి రహదారిపై వేశారు. అది గమనించిన ఒక కోతి డబ్బాను తీసుకువెళ్లి మూత ఊడదీసి సీసాలోని చుక్క కింద పడకుండా నోటిలోనే వేసుకోవడం సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర చోటుచేసుకుంది. 


కన్న తల్లి ఆవేదన


నా కొడుకు ఆచూకీ తెలపండి.
కన్న తల్లి ఆవేదన.



ఏలేశ్వరం,పెన్ పవర్ 


నా కొడుకు ను ఆదివారం అర్ధరాత్రి పోలీసుల పేరుతో కొంతమంది దౌర్జన్యంగా మా ఇంట్లో ప్రవేశించి తీసుకు పోయారని కన్నతల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. వివరాల్లోకి వెళితే ఏలేశ్వరంకు చెందిన జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైలా సుభాష్ చంద్రబోస్ ను ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బోస్ కుటుంబసభ్యులు సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బోస్ను అరెస్టు చేసిన తీరు పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో భార్యతో సహా తన బెడ్ రూములో నిద్రిస్తున్న సమయంలో పోలీసులు మూసివేసిన గేటు దూకి మూసివున్న తలుపులను తన్ని కొంతసేపు భయానక వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చినవారు పోలీసులా, బయటి వ్యక్తులా అని తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా బోసును సినీఫక్కీలో తరలించుకుపోయారు అని వాపోయారు. ప్రస్తుత కరోనా సమయంలో తమ కుమారుని ఎక్కడికీ తీసుకెళ్లారో తెలియదని బోస్ తల్లి, తండ్రి ఏలేశ్వరం మాజీ వైస్ చైర్మన్ ఫైల సత్యనారాయణ భార్య, కుమారుడు, సోదరుడు ప్రతాప్ విలేకరుల సమావేశంలో బోరున విలపించారు.


న్యాయవాది బోస్ అరెస్టును ఖండించిన బార్ అసోసియేషన్


న్యాయవాది బోస్ అరెస్టును ఖండించిన బార్ అసోసియేషన్.



 ఏలేశ్వరం,పెన్ పవర్ 


ఏలేశ్వరం కు చెందిన యువ న్యాయవాది పైల సుభాష్ చంద్రబోస్ ను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా సోమవారం ఏలేశ్వరం విచ్చేసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుగత శివ మాట్లాడుతూ రాజమండ్రిలో నమోదైన కేసులో ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు బోస్ ఇంటిపై ఆదివారం అర్ధరాత్రి దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు  గురిచేసి  అరెస్టు చేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితున్ని అరెస్ట్ చేసే ముందు సి ఆర్ పి సి సెక్షన్ 41 ఏ నోటీసును ఇవ్వాలన్నారు. కానీ పోలీసులే నిబంధనలను తుంగలో తొక్కి అరెస్టుకు పాల్పడ్డారని బార్ అసోసియేషన్ భావిస్తోందన్నారు. అరెస్టుపై విచారణ జరిపించి ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...