రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి
అనకాపల్లి , పెన్ పవర్
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఎమ్మెల్సీ జగదీష్ పేర్కొన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త తీరు వల్ల పేదలకు సరుగులు పంపిణీ చేయకుండా రేషన్ డీలర్లు ధర్నాకు దిగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. జాతీయ ఉత్పత్తి పంపిణీ పధకం ద్వారా డీలర్ల యొక్క పరిస్థితి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అగమ్యగోచరంగా ఉందని విమర్శించారు. మొదట్లో డీలర్ వ్యవస్థ రద్దు చేస్తామని దాని స్థానంలో మినీ మార్ట్ లు ప్రారంభించి వాటిని డీలర్లకు అప్పగిస్తామని ప్రకటించారన్నారు. తరువాత పాత పద్ధతిలోనే ప్రజా పంపిణీ వస్తువులు బియ్యము, కంది పప్పు, నూనె, శనగలు మొదలగునవి డీలర్ల ద్వారా గ్రామాల్లోని పట్టణాల్లోని ప్రజా పంపిణీ యధావిధిగా కొనసాగిస్తున్నారు. కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుండి లబ్ధిదారులు తోపాటు డీలర్ల కూడా నాన అవస్థలకు గురయ్యారని లాక్ డౌన్ మూలంగా ప్రజలకు నిత్యవసర వస్తువులైన బియ్యము కందిపప్పు సెనగలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం వల్ల ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులైన బియ్యము ఇతర నిత్యవసర వస్తువులను పంపిణీ తోపాటు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని అదనంగా డీలర్ల ద్వారా రేషన్ కార్డు హోల్డర్ కి పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంత శ్రమ తో కూడిన పనికి ప్రభుత్వం వారికి ప్రతినెల ఇవ్వవలసిన కమిషన్ ఇవ్వడం లేదని దీని మూలంగా వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని కోటాలు ఇవ్వడం తప్ప మరొక పని మాకు సాధ్యం కాదని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న డీలర్లు వాపోతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించి వారికి ఇవ్వాల్సిన కమిషన్ వెంటనే చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కస్పా వీధిలో ఉన్న డిపో నెంబర్ 22 ని శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు సందర్శించారు. డిపో మూసివేసి ఉందని అదే విధంగా తక్కువ ప్రాంతాల్లో కూడా అన్ని మూసివేసి ఉన్నాయని అతనితోపాటు తెలుగుదేశం పార్టీ విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్ల సురేంద్ర, 15వ వార్డ్ అధ్యక్షులు మారిశెట్టి శంకర్రావు, 16వ వార్డ్ అధ్యక్షులు దొడ్డి జగదీశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.