Followers

బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శాకాంబరి పూజలు


బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శాకాంబరి పూజలు..!


సామర్లకోట, పెన్ పవర్:


   పంచారామా క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారా రామ భీమేశ్వరాలయoలో అమ్మవారైన బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శాకాంబరీ మాతా పూజల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాదికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆషాడ మాసంలో భిమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్ర దినమైన ఆదివారం ఆషాడ మాసంలో వచ్చే ఆఖరి ఆదివారం కావడంతో స్వామివారికి,అమ్మవారికి తెల్లవారుజామున నుంచి పంచామృతాభిషేకాలు,విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం  స్వామివారిని,అమ్మవారిని కూరగాయలతో,పండ్లతో ప్రత్యేక రీతిలో అలంకరించారు.అమ్మవారైన బాలా త్రిపుర సుందరీ అమ్మవారిని మరింత ప్రత్యేక రీతిలో శాకంబరిగా అలంకరించగా భక్తులను ఆ అలంకరణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయంలో ని పెద్ద నంది,ఊయల మండపం,ఇతర ఆలయ పరిసరాల్లో కురాగాయాతో కూడిన ప్రత్యేక అలంకరణలు చేపట్టగా భక్తులు వాటిని ఆశక్తితో తిలకించి ప్రత్యేక రీతిలో అలంకృతులైన స్వామివారు,అమ్మవారలకు ప్రత్యేక పూజలు చెప్పట్టారు.ఈ పూజల్లో ఆలయ పండితులు,సిబ్బంది తో పాటు ఆలయ భక్త సంఘo, అన్నదాన కమిటీ సభ్యులు పాల్గొని సేవలందించారు.


సంజీవిని వాహనంలో కొవిడ్-19 పరీక్షలు



సంజీవిని వాహనంలో కొవిడ్-19 పరీక్షలు


ముక్తేశ్వరం శ్రీ జయంతి రామయ్య పంతులు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం "సంజీవిని" వాహనంలో కొవిడ్-19 (కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించారు.


అయినవిల్లి , పెన్ పవర్ 


ఈ కార్యక్రమంలో అయినవిల్లి, వీరవల్లిపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు కుమారి బి.మంగాదేవి, ఎన్.సునీల్ సంజీవిని వాహనంలో గల వైద్య సిబ్బందితో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 120 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.


డాక్టర్లు మాట్లాడుతూ మండలంలో సుమారు 90 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి అని ఒక మరణం కూడా సంభవించిందని వ్యాధి ఉధృతమవుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించి వ్యాధి బారిన పడకుండా భౌతిక దూరం పాటిస్తూ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలని జాగ్రత్తలు సూచించారు.


ఈ శిబిరాన్ని సందర్శించిన అయినవిల్లి మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు శ్రీమతి గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ కరోనా వైరస్ రోజు రోజుకు ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి వారు డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు వహిస్తు అలాగే వ్యాధి సోకిన వారిని అవమాన, అవహేళనలు చేయకుండా ధైర్యం చెప్పి డాక్టర్లు గాని వైద్య సిబ్బంది నర్సులు,ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు, వాలంటీర్స్,పారిశుధ్య కార్మికులు పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్, రెవిన్యూ వారు చేస్తున్న సేవలు అనిర్వచనీయం అని వారి  కుటుంబ సభ్యులు ప్రాణాల సహితం ఫణంగా పెట్టి మన అందరి కోసం పాటుపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 45 వేల మందికి ఈ వైరస్ సోకిందని సుమారు 586 మంది చనిపోవడం వేరే వల్ల సోకిందని నిందించడం కన్నా  ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అన్నారు.


ఈ కార్యక్రమంలో అయినవిల్లి మండలం ఎంపీడీవో శ్రీమతి కె.ఆర్ విజయ,జి.ఎం.సి.బాలయోగి చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు గంగుమళ్ళ శ్రీనివాస్,ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు,వాలంటీర్లు,రెవిన్య,పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.


నిశబ్దంగా మారిన సామర్లకోట...!విజయవంతమైన కర్ఫ్యూ..


నిశబ్దంగా మారిన సామర్లకోట...!విజయవంతమైన కర్ఫ్యూ..


 సామర్లకోట, పెన్ పవర్


    కరోన వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూ నిర్వహించిన 24 గంటల కర్ఫ్యూ కార్యక్రమం సామర్లకోట పట్టణంలో ఆదివారం విజయవంతమైంది.జిల్లాలోని ప్రధాన జంక్షన్లలో ఒకటైన సామర్లకోట పట్టణంలో ఏ ప్రధాన రహదారి చూసిన,ఏ ప్రధాన కూడళ్లు పరిశీలించినా అంతా నిర్మానుష్యంగా మారి నిశ్శబ్ద వాతావరణమే కనిపించింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మార్గమధ్యంలో ఉన్న వాహనాలు మినహా ఎలాంటి వాహనాల రాకపోకలు లేక ప్రధాన రహదారులు వెలవెల   బోయాయి.చిన్న టి బడ్డి మొదలు అతిపెద్ద హోటళ్లు, వ్యాపార కూడళ్లు సయితం మూతపడి పట్టణమంతా ఖాళీగా కనిపించింది. ప్రతీ సెంటర్ కు పోలీస్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో రోడ్లపై అసలు ప్రజలు గాని,వాహనాలు కనిపించలేదు.ప్రభుత్వం ముందుగా చేసిన ప్రకటన తో వ్యాపారస్తులు,ప్రజలు స్వచ్ఛందంగా బయటకు రాకుండా గతంలో విధించిన జనతా కర్ఫ్యూ పూర్తి సహకారాన్ని అందించారు. అలాగే కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన పలు వాహన దారులకు స్థానిక మహిళ ఎస్ ఐ లక్ష్మీకాంతం అపరాధ రుసుములు చెల్లించి కేసులు నమోదు చేశారు.ఈ కర్ఫ్యూకు సంబంధించి పెద్దాపురం సిఐ జయకుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్,ఎస్పీలు కలసి కరోనా వ్యాప్తి చైన్ లింక్ ను తెంచెదుకు ఈ రోజు కర్ఫ్యూ కార్యక్రామానికి పిలుపునుచ్చినట్టు చెప్పారు.మరల ఆదేశాలు వచ్చేంత వరకు ప్రతీ ఆదివారం ఇదే మాదిరిగా 24 గంటల కర్ఫ్యూ కార్యక్రమాలను కొనసాగించనున్నoదున ప్రజలు దీనిని వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు.కేసుల సంఖ్య రోజుకు వెయ్యి దాటుతున్న పరిస్థితుల్లో ప్రతివారు ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకోవడం ద్వారానే కరోనా వ్యాప్తిని అరికట్టగలము అన్నారు.అలాగే సామాజిక దూరాన్ని పాటిస్తూ స్వీయ భద్రతతో ఉండాలన్నారు.కాగా ప్రజలు,వ్యాపారులు,ఉద్యోగుల సహాయంతో నిర్వహించిన కర్ఫ్యూ సామర్లకోట లో విజయవంతం కావడం పట్ల పోలీసులు,అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.


దిశచట్టప్రకారం చర్యలు తీసుకోవాలి


దిశచట్టప్రకారం చర్యలు తీసుకోవాలి



అన్నవరం ,పెన్ పవర్ 


దిశ చట్ట ప్రాకరం శిక్షించాలి  అని ఐ హెచ్ ఆర్ సి  జిల్లా వైస్ చైర్మన్ పిట్టానాగమణి అన్నారు .  మధురపూడికి చెందిన ఒక దళితమైనర్ బాలిక కరోనా వైరస్ కారణంగా కుటుంబం గడవక ఒక చెప్పుల షాపులో పనిచేయుటకు వేరె ఆమే ద్వారా  చెప్పుల షాపులో సేల్స్ గర్ల్ గా పెట్టింది ఆమే ద్వార ఏడుగురు అబ్బాయిలు  వచ్చి అమ్మయిని బలవంతంగా ఆటోలోఎక్కించి గోకవరం బస్టాండ్ ప్రాంతంలో నివసించే వేరొక మహిళ ఇంటిలో పెట్టి టి లో మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులపాటు మానభంగం చేసినా వారిని కఠిణంగ శిక్షించాలని, మహిళలపై జరిగే హత్యచరాలపై21 రోజులో ఊరితీయాలని దిశ చట్టం తీసుకు వచ్చారు  ఇప్పటీకీ ఎవ్వరికి శిక్షలు విదించినట్లు కనిపించడంలేదు ఇప్పుడైన దిశ చట్టం పుర్తిగా అమలు  చేసి ఏడుగురిని ఊరి తీయాలని పిట్టా నాగమణి డీమాండ్ చేసారు.


కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలని


కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలని..


ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ని పెంచాలని..


మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్..


మండపేట,పెన్ పవర్ 


కరోనా నియంత్రణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకునే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కరోనా పాజిటివ్ వచ్చిన వారి విషయంలో చూపించటం లేదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృబిస్తోన్న కీలక సమయంలో ప్రైమరీ కాంటాక్ట్ లకు కరోనా పరీక్షలు జరపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని ఆరోపించారు. సమయానికి కరోనా పరీక్షలు చేయకపోవడంలో ప్రజలు మానసికంగా తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారన్నారు. కరోనా కేసులు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను పెంచాలన్నారు. ఇక్కడ నుండి డిప్యుటేషన్ పై వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలన్నారు. కోవిడ్ 19 పై అధికారులు తమ సామర్ధ్యానికి మించి సేవలు చేస్తున్నారని, కాకపోతే ప్రభుత్వం నుండి వారికి సరైన సహకారం అందడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా ప్రజలు ధైర్యంగా వుంటూ కరోనాను జయించాలని కోరారు. స్వీయ నియంత్రణ చాలా అవసరమన్నారు.


స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో పలువురి అరెస్టు


స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో పలువురి అరెస్టు , సారా ద్విచక్ర వాహనాలు స్వాధీనం.


గోకవరం పెన్ పవర్.


తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ మరియు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పరిధిలో జరిగిన దాడుల్లో మూడు కేసులు నమోదు చేసి 70 లీటర్ల సారాను ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందని కోరుకొండ  ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ కె .వీరబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం జరిగిన దాడుల్లో కోరుకొండ మండలం కోరుకొండ గ్రామానికి చెందిన కోట శివ గంగాధర్, కోటి కేశవరం గ్రామానికి చెందిన జల్లూరి రాజ్ కుమార్, గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన  గుర్రాల చిన బాబు,నూతాటి శ్రీను లను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచగా 3వ తేదీ వరకు వాళ్లకు రిమాండ్ విధించడం జరిగింది అని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందు వలన గ్రామాలలో సారా అమ్మకాలు వలన తాగడం వలన కరోనా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి సారా అమ్మకాలు అనధికారిక మద్యం విక్రయాలు ఏమైనా జరిగితే తమకు తెలియజేయవలసిందిగా కోరారు. సమాచారం ఇచ్చేవారు వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలి


గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలి.


.... వై ఎస్ ఆర్ సి పి మండల ప్రచార కమిటీ కన్వీనర్ ఉంగరాల ఆదివిష్ణు.


గోకవరం పెన్ పవర్.


గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలని సోమవారం వైఎస్ఆర్ సిపి ప్రచార కమిటీ కన్వీనర్ ఉంగరాల . ఆదివిష్ణు విలేకర్ల సమావేశంలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోకవరం మండలం ప్రజలకు రాజమండ్రి నగరానికి అవినాభావ సంబంధం ఉందని ఆయన తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పునర్విభజన చేయడం మంచిదే .కానీ ఇక్కడి ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గోకవరం మండలం ప్రజలకు జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరం ఉంటే అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రభుత్వం జిల్లాల విభజన చేసే ముందు గోకవరం మండల ప్రజలు జిల్లా కేంద్రంగా రాజమండ్రి ఉండాలా, కాకినాడ ఉండాలా సర్వే చేసి మెజార్టీ ప్రజలు ఏది కోరుకుంటే ఆ జిల్లాలో ఈ మండలానికి కలపాలని భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్ విభజన జరిగే అవకాశం ఉంది కనుక ఇప్పుడున్న పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనుకోవడం సహేతుకం కాదని భౌగోళికంగా రాజకీయంగా వాణిజ్యపరంగా రాజమహేంద్రవరం తో దశాబ్దాల అనుబంధం కలిగిన గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపడమే సమంజసమని మండల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...