Followers

హైరిస్క్‌ జోన్‌గా పాతూరు


హైరిస్క్‌ జోన్‌గా పాతూరు
పెద్ద బస్టాండ్‌ నుంచి చిన్న బస్టాండ్‌ వరకు సంపూర్ణం బంద్‌
మూడు రోజుల్లో 39 పాజిటివ్‌ కేసులు  నమోదు
అత్యధికం పాతూరులోని వ్యాపారవర్గా ప్రజలు 
వచ్చే శనివారం వరకు  నిబంధనలు  అమలు 
నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు  తప్పవు
తహశీల్దార్‌ జె ప్రభాకర్‌రావు
మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కుందురు
(పెన్‌పవర్‌, పొదిలి)
80 రోజల క్రితం వరకు పొదిలి పట్టణంలోని జిల్లా వ్యాప్తంగా కేసు వస్తున్నా ఇక్కడ మాత్రం కేసు లేకుండా అహర్నిశలు  భార్య, బిడ్డలను సైతం వదిలి మన ప్రాణాను కాపాడేందుకు పోలీసు, పంచాయతీ, వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ అధికాయి కృషి చేశారు. అయితే అనూహ్యంగా ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ఒక్క సారిగా కేసులు  పెరుగుతూ వస్తున్నాయి. సడలింపు ఇచ్చినప్పటికీ నెల రోజులు  పాటు పోలీసులు  నిబంధనల పట్ల కొంత కఠినంగా ఉండడంతో కేసులు  నమోదు తక్కువగానే ఉన్నాయి. అయితే అనూహ్యంగా వారం రోజుల వ్యవధిలో పొదిలి పట్టణంలో సుమారు 40 కేసులు  నమోదు అయ్యాయి. దీంతో అధికారులు  ఒక్క సారిగా ఏం చేయాలో అర్థం కాక తలలు  పట్టుకున్నారు. ఓ వైపు పోలీసులు  ఎంత కఠినంగా వ్యవహహరిస్తున్నా వ్యాపారులు  మాత్రం తమ వ్యాపారాలను దొంగ దారిలో అయినా సరే నిర్వహిస్తు  వ్యాపారమే పరమావధిగా సాగించారు.  వ్యాపారులు  ధనార్జనే కేసులు  అధిక సంఖ్యలో నమోదుకు కారణంగా పోలీసులు , ఇతర శాఖ అధికారులు  దాదాపు నిర్ణయానికొచ్చారు. ఈ వారంలో గురువారం అత్యధికంగా తొలిసారిగా 16 పాజిటివ్‌ కేసులు  నమోదు అయ్యాయి. దీంతో అధికారులు  ఒక్క సారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఏం చేయాలని ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపే శుక్రవారం, శనివారాల్లో 9, 14 కేసు నమోదు కావడం అధికారులను సైతం కవరపెట్టింది. దీంతో ఎలాగైనా కేసులను తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు  తీసుకోవాని అధికారులు నిర్ణయించారు. వెంటనే స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎంత కఠిన నిర్ణయాలు ఆయిన  తీసుకొని  కేసులను తగ్గించేందుకు చర్యలు  చేపట్టాని, అందుకు తన వంతు సహాయ, సహకారాలు  ఎళ్ళవేళలా ఉంటాయని ఎమ్మెల్యే అధికారులకు భరోసా కల్పించారు. దీంతో అధికారులు  ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. పొదిలి పెద్ద బస్టాండ్‌ నుంచి చిన్న బస్టాండ్‌ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. పెద్ద బస్టాండ్‌, చిన్న బస్టాండ్‌ సెంటర్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి పూర్తిగా దిగ్భంధించారు. పొదిలి ఎస్‌ఐ సురేష్‌ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆయన  ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆ ప్రాంతాన్ని తహశీల్దార్‌ జె ప్రభాకర్‌రావు, ఎస్‌ఐ ఇతర సిబ్బందితో కలిసి పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే శనివారం వరకు ఈ నిబంధనలు  ఉంటాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ బయటకు తిరగవద్దని హెచ్చరించారు. తమ ఉత్తర్వులను ఉలంఘిస్తే అవసరమైతే వారిపై కేసులు  నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమన్నారు. సోమవారం నుంచి రాబోయే శనివారం వరకు పట్టణంలోని రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయం, ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ఐసి కార్యాలయాలను కూడా మూసివేయించేందుకు అవసరమైన చర్యల తీసుకుంటున్నామన్నారు. అయితే పెద్దబస్టాండ్‌ వద్ద ఉన్న బ్రిడ్జి కింద నుంచి విశ్వనాధపురం ప్రాంతం వరకు నిత్యావసరాలు , కూరగాయలు , మెడికల్‌ షాపులకు మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంట వరకు అనుమతులు  ఇవ్వడం జరిగిందన్నారు. పొదిలి సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ వి శ్రీరామ్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సురేష్‌ ప్రత్యేకంగా తన సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతూరు లోని ఇండ్లలో నుంచి ఎవరు కూడా బయటకు రావద్దని పిలుపునిచ్చారు. ఎవరైనా సరే నిబంధనలు  అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మొత్తంగా పొదిలిలో మూడు రోజుల్లో సుమారు 40 కేసులు  రావడంతో అధికారులు  ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇప్పటికైనా ప్రజలు  అధికారుల  ఉత్తర్వులకు లోబడి నడుచుకోవాని వారు కోరుతున్నారు. 


కోటిరెడ్డి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుకు భోజనాలు  అందజేత


కోటిరెడ్డి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుకు భోజనాలు  అందజేత



(పెన్‌పవర్‌, పొదిలి)



పెన్‌పవర్‌ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు నిర్వహిస్తున్న భోజనాలు  94వ రోజుకు చేరుకున్నాయి. శనివారం భోజనాలను కోటిరెడ్డి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బాపూజీరెడ్డి ఆర్ధిక సహాయం అందించి బోజనాలను ఏర్పాటు చేశారు. కార్మికులకు ఒక రోజు భోజనాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, నారాయణ, భూమా సుమంత్‌, శశి, పంచాయతీ శానిటరి సిబ్బంది మురళి, కళ్యాణ్‌, కుమార్‌, మస్తాన్‌, రామారావు తదితరులు  పాల్గొన్నారు. 


వర్కింగ్ జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా పరిగణించాలి 


వర్కింగ్ జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా పరిగణించాలి 


రాజోలు,పెన్ పవర్ 


వర్కింగ్ జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా పరిగణించి భీమా పథకాలు వర్తింపజేయాలని కోరుతూ శనివారం  రాజోలు డిప్యూటీ తహశీల్దార్ దేవళ్ళ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేసారు.ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్  రాజోలు నియోజకవర్గ కార్యదర్శి కె. సురేంద్ర కుమార్ సభ్యులు పీతల రాజశేఖర్,ఎం .వెంకటేశ్వరరావు, కోళ్ల దుర్గాప్రసాద్,తిక్కిశెట్టి విజయ్ తదితరులు.


ఇళ్ల నుంచి బయటకు రావద్దు


కర్ఫ్యూ అమలుకు ప్రజలు సహకరించాలి.. 



- ఇళ్ల నుంచి బయటకు రావద్దు



-సి.ఐ కృష్ణ



రావులపాలెం, పెన్ పవర్



 జిల్లాలో తీవ్ర స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు రావులపాలెం సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల్లో 24గంటలపాటు అమలు చేస్తున్న కర్ఫ్యూ కు ప్రజలంతా సహకరించాలని సి.ఐ వి.కృష్ణ కోరారు. శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెంలో లాక్ డౌన్ నిబంధనలు అమలలో ఉన్నా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహన చోదకులకు శనివారం సాయంత్రం స్థానిక కళా వెంకట్రావు సెంటర్ లో సి.ఐ కృష్ణ, ఎస్సై పి.బుజ్జిబాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో  పెద్ద ఎత్తున నమోదు అవుతున్న దృష్ట్యా ప్రజలు ఇకనైనా జాగ్రత్త వహించాలన్నారు. అధికారులు ఇచ్చిన సమయంలో మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలన్నారు. ఆదివారం ఉదయం 6నుంచి సోమవారం ఉదయం 6వరకు అమలు చేస్తున్న కర్ఫ్యూ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్.సి దుర్గారావు, కానిస్టేబుల్స్ గీతాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


పేద బ్రాహ్మణులకు  నిత్యావసర సరుకులు పంపిణీ


పేద బ్రాహ్మణులకు  నిత్యావసర సరుకులు పంపిణీ....



రూపాకుల రవికుమార్, ఆంధ్ర ప్రదేశ్,బి.జె.పి. మెడికల్ కన్వీనర్.


 పూర్ణా మార్కెట్, పెన్ పవర్.


పేరుకు అగ్ర వర్ణము కానీ నేటి సమాజంలో అణగారిన వర్గము రూపాకుల రవికుమార్ ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ  వైద్య విభాగము కన్వీనర్  .రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ,ప్రకృతి చికిత్సాలయ మహారాణి పేట మరియు శ్రీ గాయత్రి వెల్ఫేర్  కల్చరల్ యూత్ అకాడమీ సంయుక్త నిర్వహణలో మహారాణి పేట ప్రకృతి చికిత్సాలయ ఆవరణలో  పేద బ్రాహ్మణులకు  నిత్యావసర సరుకులు పంపిణీ    111వరోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రూపాకుల రవికుమార్ ముందుగా అర్చకులకు ,పురోహితులకు బియ్యం,నూనె,గోధుమపిండి మొదలగునవి పంపిణీ చేశారు.కరోనా లాక్ డౌన్ సమయంలో దేవాలయాలు  మూసి వేయటం వలన  ఈరోజు తెరిచిన  తర్వాత భక్తుల రాక తగ్గినందున   అర్చకులకు కుటుంబ పోషణ భారముగా  ఉన్నదని కరోనా  వలన పురోహితులకు  పనులు లేవని , ప్రభుత్వము  వీరిని ఆదుకోవాలని  అన్నారు .విశాఖ జిల్లాలో పురోహితులు  సుమారు 35 వేలమంది ఉన్నారని. ఇందులో  నగరములో  22 వేలమంది   ఉన్నారని,విశాఖ జిల్లాలో అర్చకులు సుమారు 20 వేలమంది ఉన్నారని,ఇందులో నగరములో 6 వేలమంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వము  కరోనా   సహాయనిధి పేరుతో సుమారు 1158మందిఅర్చకులకు 5000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేసారు మిగిలిన వారికి సహాయము అందలేదు కొన్ని దేవాలయములలో ధర్మ కర్తలు అర్చకుల మీద దౌర్జన్యము చేయుచున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎక్కువమందికి సహాయము అందటం లేదని  అన్నారు. వంశ పారంపర్యముగా వస్తున్న అర్చకత్వం చేస్తున్నా అర్చకుల కుటుంబాలలో మరియు పురోహితుల కుటుంబాలలో ఉన్న యువకులకు వివాహమునకు కన్యాదానము చేయుటకు కన్యాదాతలు ముందుకు రావటం లేదని అన్నారు.ఆర్థికముగా, సామాజికముగా, బ్రాహ్మణ వర్గము వెనకబడినదని రాజకీయ దన్ను లేని ఈ వర్గ ప్రజలు  ఎదుగుటకు బ్రాహ్మణులు అందరూ సమైక్యంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ  కార్య్రమానికి ఏస్.మహేష్, డా.శ్రీలక్ష్మి, గేదెల.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


కారంచేడు ఉద్యమ స్పుార్తితో దళితులు ఐక్యతతో ముందుకు సాగాలి 


కారంచేడు ఉద్యమ స్పుార్తితో దళితులు ఐక్యతతో ముందుకు సాగాలి 

 

విజయవాడ (ఉయ్యూరు), పెన్ పవర్

 

కారంచేడు సంఘటన జరిగి 35సంవత్సరాలు పుార్తి అయిన సందర్భంగా క్రిష్ణాజిల్లా ఉయ్యూరు పట్టణంలో దళిత ఐక్యవేదిక  ఆద్వర్యంలో కారంచేడు అమరవీరులకు నివాళులు అర్పించారు.1985 జులై 17న కారంచేడు ఆదిపత్య కుల దురాహాంకురలు కుల ఉన్మాదంతో గ్రామములోని దళితులును ఉచకోత కోసి హత్యలు చేసారు.ఆ సంఘటన జరిగి 35ఏళ్లు అయిన సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించుకుంటుా... 

 

అనాటి దళిత మహాసభ కత్తి పద్మారావు అన్న నాయకత్వంలో పోరాటం చేసి ఆనాటి ఎస్సీ/ఎస్టీ  పార్లమెంటు సభ్యులును ఏకం చేసి 1989 అట్రాసిటీ చట్టము తెచ్చుకోవడానికి కారంచేడు ఉద్యమం నాంది అని దళిత ఐక్య వేదిక వ్యవస్థాపకులు పినమాల నాగకుమార్ తెలిపారు .

 

ఈ కార్యక్రమంలో దళిత అభ్యుదయ సేవా సమితి కన్వీనర్ శీలం రాజు, టీ డీ పీ ఎస్సీ సెల్ నాయకులు ఎమ్.జి రవి వై సీ పీ ఎస్సీ నాయకులు కొనగాల నాని , రమాబాయి పౌండేషన్ అధ్యక్షులు పిల్లి గంగాధర్ , మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్ , బొల్లెద్దు రమేష్ , వంపుగడవల జానీ , గోగులముడి రాజు , ఎమ్ ఆర్ పీ ఎస్  నాయుకుడు మట్టా పుార్ణా , గండిగుంట యువత రవితేజ , భాను , వడ్డాది ప్రసాద్ , వర్రే అజయ్ , మొవ్వ నాగరాజు , బేతపూడి అజయ్ , కొక్కిరగడ్డ ప్రదీప్ , కుాతాడి నాగరాజు , బొల్లెద్దు సతీష్ , గాలంకి శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు .

దళిత వేదిక జిల్లా అధ్యక్షులుగా సూదికొండ 

 



దళిత వేదిక జిల్లా అధ్యక్షులుగా సూదికొండ 


అనకాపల్లి , పెన్ పవర్


 ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక  జిల్లా అధ్యక్షులు గా సూదికొండ మాణిక్యాలరావు ని నియమిస్తు వేదిక రాష్ట్ర కన్వీనర్  విప్పర్తి ప్రసాద్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ తన మీద నమ్మకం తో జిల్లా అధ్యక్షులు గా బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు వంగిపురం గజ్జెప్ప,  రాష్ట్ర కార్యదర్శి బిరా గోవిందరాజు,  రాష్ట్ర కన్వీనర్ విప్పర్తి ప్రసాద్ లకు ధన్యవాదములు తెలిపారు. ప్రస్తుతం సమాజం లో దళిత బహుజన వర్గాల ప్రజలు ఎదురుకుంటున్న అనేక సమస్యలు మీద ప్రజలలో చైతన్యము కలిగించి వేదిక ద్వారా వారికి అండగా ఉండి పోరాడతమని అన్నారు. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...