Followers

రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి

రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి


అనకాపల్లి , పెన్ పవర్


రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఎమ్మెల్సీ జగదీష్ పేర్కొన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త తీరు వల్ల పేదలకు సరుగులు పంపిణీ చేయకుండా రేషన్ డీలర్లు ధర్నాకు దిగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. జాతీయ ఉత్పత్తి పంపిణీ పధకం ద్వారా డీలర్ల యొక్క పరిస్థితి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అగమ్యగోచరంగా ఉందని విమర్శించారు. మొదట్లో డీలర్ వ్యవస్థ రద్దు చేస్తామని దాని స్థానంలో మినీ మార్ట్ లు ప్రారంభించి వాటిని డీలర్లకు అప్పగిస్తామని ప్రకటించారన్నారు. తరువాత పాత పద్ధతిలోనే ప్రజా పంపిణీ వస్తువులు బియ్యము, కంది పప్పు, నూనె, శనగలు మొదలగునవి  డీలర్ల ద్వారా గ్రామాల్లోని పట్టణాల్లోని ప్రజా పంపిణీ యధావిధిగా కొనసాగిస్తున్నారు. కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుండి లబ్ధిదారులు తోపాటు డీలర్ల కూడా నాన అవస్థలకు గురయ్యారని లాక్ డౌన్ మూలంగా ప్రజలకు నిత్యవసర వస్తువులైన బియ్యము కందిపప్పు సెనగలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం వల్ల ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులైన బియ్యము ఇతర నిత్యవసర వస్తువులను పంపిణీ తోపాటు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని అదనంగా డీలర్ల ద్వారా రేషన్ కార్డు హోల్డర్ కి పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంత శ్రమ తో కూడిన పనికి ప్రభుత్వం వారికి ప్రతినెల ఇవ్వవలసిన కమిషన్ ఇవ్వడం లేదని దీని మూలంగా వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని కోటాలు ఇవ్వడం తప్ప మరొక పని మాకు సాధ్యం కాదని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న  డీలర్లు వాపోతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించి వారికి ఇవ్వాల్సిన కమిషన్ వెంటనే చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  కస్పా వీధిలో ఉన్న డిపో  నెంబర్ 22 ని శాసనమండలి సభ్యులు  బుద్ధ నాగ జగదీశ్వరరావు సందర్శించారు. డిపో మూసివేసి ఉందని అదే విధంగా తక్కువ ప్రాంతాల్లో కూడా అన్ని మూసివేసి ఉన్నాయని అతనితోపాటు తెలుగుదేశం పార్టీ విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్ల సురేంద్ర, 15వ వార్డ్ అధ్యక్షులు మారిశెట్టి శంకర్రావు, 16వ వార్డ్ అధ్యక్షులు దొడ్డి జగదీశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


వి ఆర్ ఆర్ పేట లో  భారీ కొండచిలువ హతం.

 


వి ఆర్ ఆర్ పేట లో  భారీ కొండచిలువ హతం.


       విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


 బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేటలో  భారీ కొండచిలువ  హల్ చల్ చేసింది. సరగడం కొండవలస  పొలాల్లో మాటు వేసిన కొండచిలువను గ్రామస్తులు సోమవారం  హతమార్చారు. నెలరోజులుగా కోళ్లు మేకలు ఆవు దూడలను తినేస్తుంది. రైతులు మాటువేసి కొండచిలువను హతమార్చారు. కొండచిలువ పది అడుగులకు పైనే ఉందని రైతులు తెలిపారు.


తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను  తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి


తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను  తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి


పూర్ణా మార్కెట్, పెన్ పవర్.



సింహాచలం దేవస్థానములో తొలగించిన ఔట్ సోర్సింగ్.
ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోనీ ధార్మిక విధులకు ఆటంకం కలగకుండా చూడాలని, మూగజీవ పరిరక్షణలో భాగంగా గోవులను కాపాడి, భక్తులు మొక్కుల రూపంలో ఇచ్చిన గోవులను కాపాడాలని విశాఖలో అర్బన్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు వాసుపాల్లి గణేష్ కుమార్ ఈ రోజు సింహాచలం దేవస్థానము ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రమరాంబకు వినతి పత్రం అందజేశారు 183 సిబ్బందిని తొలగించి వారి కుటుంబాలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చించారు దేవస్థానం కార్పెస్ ఫండ్ ద్వారా ప్రభుత్వానికి యేట 25 కోట్లు సమకూరుస్తుంది అని కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆదాయంతో నిధులు సమకూర్చి జీతాలు ఇవ్వలేర అని ప్రశ్నించారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక పక్క కార్పొరేషన్ స్థాపించి ఒక పక్క ఉన్న ఉద్యోగుల్ని తీసేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు త్వరలో కలెక్టర్ని  కలసి విషయం వివరిస్తామని తెలియజేశారు గత రెండు వారములుగా తెలుగు దేశం భీమిలి కోర్ కమిటీ సభ్యులు పాసర్ల ప్రసాద్ వార్డ్ అధ్యక్షులు పి వి.నరసింహం ఆధ్వర్యములో చేసిన పోరాటం వలన 30 మంది గోశాల సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారని అదే విధంగా మిగిలిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని  వాసూపల్లి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా భీమిలి కోర్ కమిటీ సభ్యులు పాశర్ల ప్రసాద్, కొరడా రాజబాబు, గంట నూకరాజు, డి ఎ వి.రాజు, కె. లీలావతి, అధికార ప్రతినిధి సతివాడ శంకర్ రావు, 98వ వార్డ్ అధ్యక్షులు పి వి. నరసింహం, లండ శ్రీను, జీ. వి.రమణ, పి. శ్రీనివాస్, జీ.బాబు తదితులు పాల్గొన్నారు.


ఇండ్ల పథకం అవినీతిపై నిరసన కార్యక్రమం


ఇండ్ల పథకం అవినీతిపై నిరసన కార్యక్రమం


బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ


చింతపల్లి ,పెన్ పవర్


కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరుతో ఉన్న ఇళ్ల నిర్మాణ పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటుందని, దీనికి నిరసనగా ఈనెల 22న,జనసేన సైనుకులను కలుపుకొని మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేయాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ అన్నారు. సోమవారం చింతపల్లిలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు జైతి ప్రభాకర్ అధ్యక్షతన ఆ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకుల గాంధీ మాట్లాడుతూ ఇప్పటివరకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రానికి 20 లక్షల15 వేల 458 ఇళ్ళు మంజూరు చేసిందన్నారు. వీటి నిర్మాణానికి రూ.30 వేల 440 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. గత తెదేపా ప్రభుత్వం 3 లక్షల34 వేల 368 ఇళ్లు మాత్రమే నిర్మించిందన్నారు. మిగిలిన 16 లక్షల 81 వేల 90 ఇళ్ళు నిర్మాణం కాక నేటికీ అలాగే ఉన్నాయన్నారు. గత తెదేపా ప్రభుత్వం చదరపు అడుగు నిర్మాణానికి రూ.1 వెయ్యి ఖర్చు అయ్యేదానికి రూ.2,500 లుగా నిర్ణయించడం వలన భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు పూర్తయిన ఇండ్లను పేదలకు స్వాధీనం చేయకుండా  తెదేపా ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వైయస్సార్ ప్రభుత్వం ఆరోపిస్తూ కాలయాపన చేస్తుందన్నారు.తెదేపా ప్రభుత్వ హయాంలో అవినీతి,అక్రమాలు జరిగితే దోషులను శిక్షించాలసింది పోయి పేదలను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులతో పేదలకు నిర్మిస్తున్న ఇళ్ళలో భారీ అవినీతి జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం పక్షపాత ధోరణిని విడనాడి అవినీతి అక్రమాలపై పారదర్శకంగా వ్యవహరించి పేదలకు కేటాయించిన ఇండ్లను వారికి స్వాధీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపిటిసి అభ్యర్థి పొటుకూరి బాలరాజు, దేపూరి సోమలింగం, సాగిన బాలకృష్ణ, బొబ్బిలి వెంకటరమణ,పాంగి సుబ్బారావు,వసుపరి శ్రీనివాసు, అరిమెల రాజు,రోలంగి అచ్యుత్, కంకిపాటి లక్ష్మణ్ మరియు ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


మన్యానికి చేరిన సంజీవిని వాహనం.


 


మన్యానికి చేరిన సంజీవిని వాహనం.
      
  విశాఖపట్నం _బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


కోవిడ్19   పరీక్షలకోసం పాటు చేసిన సంజీవిని వాహనం  సోమవారం మన్యానికి చేరుకుంది. కరోనా వైరస్ గుర్తించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంజీవిని  బస్సుని  అధికారులు ఏజెన్సీకి కేటాయించారు. ఏజెన్సీ 11 మండలాల్లో కరోనా వైరస్ పలుచోట్ల బయటపడ్డాయి. గిరిజన ప్రాంతం కావడం వల్ల రవాణా సౌకర్యం లేని గ్రామాలకు కరోనా పరీక్షలు అందించాలని జిల్లా కలెక్టర్ ఏజెన్సీకి సంజీవని బస్సును తరలించారు. ఈ వాహనం  ఏజెన్సీలోని అన్ని గ్రామాల  ప్రజలకు పరీక్షలు చేసి కరోనా వైరస్ గుర్తిస్తారు. అనుమానం ఉన్న గిరిజనులు సంజీవిని బస్సులో  వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.


 గాయాలైన మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్య సేవలు  అందిస్తాం


 గాయాలైన మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన



వైద్య సేవలు  అందిస్తాం. పాడేరు డిఎస్పి రాజ్ కమల్


విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



  గాయాలపాలైన మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్య సేవలు  అందచేస్తామని పాడేరు డి.ఎస్.పి రాజ్ కమల్  అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ  పెదబయలు మండలం లుంగడూరు  ఈ ప్రాంతంలో ఆదివారం  పది గంటల ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు ఈ సంఘటనలో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు  అక్కడ పరిస్థితుల బట్టి తెలుస్తుందని అన్నారు. గాయాలపాలైన మావోయిస్టులకు వైద్యం అందక  మీమాంస లో పడ్డారని తెలుస్తుందని ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోతే  మెరుగైన వైద్య సేవలు   అందించటానికి విశాఖ పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. సంఘటనా స్థలంలో 5 కిట్ బ్యాగులు  ఒక రైఫిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టులు విధ్వంసకర సంఘటన పాల్పడేందుకు  ప్రయత్నిస్తున్నారని తెలిపారు.  కరోనా సమయంలో జనావాసాల్లోకి   వచ్చేది లేదని  పోలీసులతో  తలపడ బొమ్మని  పోలీసులను ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఇటీవల ఒడిశా ఎదురుకాల్పులు తర్వాత విశాఖ మన్యంలో  కూడా మావోయిస్టులు  ఎదురు కాల్పులకు తెగ పడ్డారని డి.ఎస్.పి రాజ్ కమల్ అన్నారు.


 


గొడవలకు ... నో ఛాన్స్

 


బక్రీదు పండుగ సందర్భంగా గోడవ   జరిగితే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు



పశ్చిమ గోదావరి ,పెన్ పవర్ బ్యూరో


 


సెప్టెంబర్ 2వ తేదీన జరుగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా కాని మరే ఇతర రో జులలోగాని గేదెలు, ఎద్దులను గాని వధించడం, లేదా వధించడానికి అమ్మ చూపిన పాలిచ్చే గేదెలనుగాని, వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులను చంపినా, చంపడానికి అమ్మినా అటువంటి వ్యక్తులపై 1977 గోవధ నిషేధం, పశుసంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి అటువంటి నేరాలకు పాల్పడేవారిని వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం ఉండటంతోపాటు, వేయి రూపాయల వరకు జరిమానా లేదా 6 నెలలవరకు జైలుశిక్ష లేదా రెండింటితోగాని నే రస్తులను శిక్షించడం జరుగుతుందని తెలిపారు. సకల జీవాల పట్ల దయాభావంతో మెలగడం పౌరుల ప్రాధమిక కర్తవ్యాలలో ఒకటిగా గ్రహించి తదనుగుణంగా అందరూ మెలగాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆ ప్రకటనలో తెలిపారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...