Followers

అన్నా మినిస్ట్రీస్" కరోనా వారియర్ అవార్డ్ కు ఎంపికైన ప్రసాదం


*"అన్నా మినిస్ట్రీస్" కరోనా వారియర్ అవార్డ్ కు ఎంపికైన ప్రసాదం*


ఆలమూరు,  పెన్ పవర్ :


అన్నా మినిస్ట్రీస్ ఇండియా స్వచ్ఛంద సేవాసంస్థ" వారు అందించే "కరోనా వారియర్ అవార్డ్"కు మండల కేంద్రమైన ఆలమూరుకు చెందిన సంగీత శ్రీ విద్య వైద్య ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు వరిగీటి ప్రసాదం ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు ఐఈ కుమార్ నుండి సమాచారం అందిందని ప్రసాదం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నా మినిస్ట్రీస్ సంస్థ ప్రతి ఏటా 25 మంది స్వచ్ఛంద సేవకులను గుర్తించి వారికి "మదర్ సోలప్రిడ్ స్వేన్డ్ సన్" పేరుతో ఈ అవార్డ్ ప్రధానం చేస్తుంది. స్వచ్ఛంద సేవ సభ్యురాలైన ప్రసాదం లాక్ డౌన్  సమయంలో అలమూరుతో పాటు రాజమహేంద్రవరం సిటీ, రూరల్ , మండపేట, కపిలేశ్వరపురం, కె గంగవరం మండలాల్లోని పేదలకు,పారిశుద్ధ్య కార్మికులకు, రోడ్లు ప్రక్కన నివసించే యాచకులకు ఆహారం, కరోనా భద్రత కిట్లు పంపిణీ చేయడంతో పాటు వారికి  చేసిన సేవలకు గానూ ఈ అవార్డ్ కు ఎంపిక చేసినట్టు అన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత ఐఈ కుమార్ తెలిపారని పేర్కొన్నారు. ఈ అవార్డ్ రావడం ప్రజలకు సేవలను చేసేందుకు మరింత బాధ్యత పెంచిందన్నారు. ఆగస్టు 5వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరిగే వేడుకల్లో  ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందజేస్తారన్నారు. ఈ సందర్భంగా అన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇండియా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు ఐఈ కుమార్ కు ప్రసాదం కృతజ్ఞతలు తెలిపారు.


అదుపుతప్పిన లారీ త్రుటిలో తప్పిన పెనుప్రమాదం


 


*అదుపుతప్పిన లారీ త్రుటిలో తప్పిన పెనుప్రమాదం.*



   ఆలమూరు, పెన్ పవర్:


 తూర్పు గోదావరి జిల్లా  కొత్తపేట నియోజకవర్గం  ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో కొందరు అధికారుల నిర్లక్ష్యం వలన పలు వాహనదారులకు శాపంగా మారింది. వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే జొన్నాడ - కాకినాడ ఆర్ అండ్ బి రోడ్డు తరచూ ప్రమాదాలకు నిలయంగా మారింది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన ఆలమూరు సెంటర్లో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల మలుపులో ఓ లారీ డ్రైన్లో దిగబడి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒక్క అడుగు ముందుకు వెళ్లి ఉంటే ప్రక్కనే గల 11కెవి విద్యుత్ ట్రాన్స్ పరం పై పడి ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు తెలిపారు. ఆలమూరులో  చిన్నపాటి వర్షం వస్తే అన్ని రోడ్లు జలమయం అయ్యి రోడ్డు వెంబటి ఉన్న డ్రైన్లు నీటితో నిండిపోయి కనిపించకుండా పోతున్నాయి. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు డ్రైన్లో వాహనాలు దిగబడి అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. డ్రైన్లు మట్టితో పూడుకుపోవటం వల్లనే నీరు పారక ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటు పంచాయతీ అధికారులు కానీ, అటు ఆర్ అండ్ బి అధికారులు కానీ రోడ్డుని పూర్తిగా వదిలేయడంతో వాహనదారులకు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ వారు డ్రైన్లలోని పూడికను తీసి ప్రమాదాల జరగకుండా నివారిస్తాయని  వాహనదారులు కోరుకుంటున్నారు.


శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాలు రద్దు.


*శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాలు రద్దు.*



  ఆలమూరు, పెన్ పవర్:


తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో వెలిసిన స్వహోంభు శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయాల గ్రూప్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ఆర్ కృష్ణ (క్రిష్టప్ప) తెలిపారు. ప్రస్తుతం మూలస్థాన అగ్రహారంలో  నాలుగు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో అధికారులు కంటోన్మెంట్ (రెడ్ జోన్) ప్రకటించటం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈవో తెలిపారు. అలాగే ప్రతి రోజూ ఆది దంపతులకు జరిగే ఏకాంత సేవ, కైంకర్యాలు యధావిధిగా జరుగుతాయని, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చే వరకు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.


మనం_మన పరిశుభ్రత



ఆత్రేయపురం మండలంలో పైలట్ గ్రామాల్లో మనం_మన పరిశుభ్రత కార్యక్రమంలో తడిచెత్త_పొడిచెత్త సేకరణ 


 ఆత్రేయపురం ,పెన్ పవర్



పంచాయతీరాజ్ కమీషనర్ శ్రీ గిరిజా శంకర్ గారి ఆదేశాల మేరకు ఆత్రేయపురం మండలంలోని బొబ్బర్లంక, పేరవరం గ్రామాల్లో *మనం_మన‌ పరిశుభ్రత* లో  భాగంగా గ్రామ సచివాలయ సిబ్బంది కి, వాలంటీర్లకు ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించి. గ్రామంలో ఇంటి ఇంటికి తడిచెత్త , పొడిచెత్త సేకరణకు తొట్టి రిక్షాలను గ్రామ పంచాయతీ ద్వారా సమకూర్చుకొని గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ ప్రారంభించినట్లు ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి తెలిపారు..అలాగే గ్రీన్ అంబాసిడర్ లను ఏర్పాటు చేసి వారికి జిల్లా రిసోర్స్ సెంటర్ ద్వారా వచ్చిన  దుస్తులు, గ్లోవ్స్,బూట్లు  అందించామన్నారు. కరోనా రక్షణ చర్యల్లో భాగంగా మిగిలిన పంచాయతీలలో పారిశుధ్య కార్మికులకు జిల్లా పంచాయతీ నుండి ఇచ్చిన దుస్తులను కార్యదర్శుల ద్వారా అందించామన్నారు. ఈ నెల 24 వ తేదీ నుండి పదిహేను రోజుల పాటు ఉన్నతాధికారుల షెడ్యూల్ ప్రకారం పారిశుధ్య పక్షోత్సవాలను నిర్వహించి ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ విస్తరణాధికారి శ్రీనివాస్, కార్యదర్శి శివ రామ కృష్ణ ఉన్నారు


బీసీ లో అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ జాతికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి


బీసీ లో అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ జాతికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి



 ఆత్రేయపురం ,పెన్ పవర్


ఆత్రేయపురం మండలం ర్యాలీలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టా వీరబాబు మాట్లాడుతూ త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు ఇతను దివంగత నేత  వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సన్నిహితంగా మెలిగే వారిని గతంలో  జోగి రమేష్ ఆర్టీసీ చైర్మన్ గా పని చేశారు2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో పెడన నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గత ప్రభుత్వం మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా గౌడ సామాజిక వర్గాన్ని వివక్షతకు గురి చేశారని ఆరోపించారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో గౌడ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం అవుతున్నది మన రాష్ట్రంలో బీసీల అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ కు అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వంలో అయినా జోగి రమేష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ముఖ్యమంత్రి వై.ఎస్  జగన్ మోహన్ రెడ్డి ని కోరారు, కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం చేసిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని ప్రజలందరిని కోరుకుంటున్నాను


*కర్ఫ్యూతో పట్టణరోడ్లన్నీ నిర్మానుష్యం*



*కర్ఫ్యూతో పట్టణరోడ్లన్నీ నిర్మానుష్యం*



*పట్టణ ప్రధాన రహదారులు మూసివేత*



*ప్రజల రక్షణనే మా బాధ్యత*



*ప్రజల శ్రేయస్సు కొరకు అనునిత్యంపోరాడుతాం ఎస్సై ఏ,బాలాజీ*


  పెద్దాపురం పెన్ పవర్:


కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు విధించిన కర్ఫ్యూ ను  పట్టణ మరియు మండలంలోని అన్ని గ్రామాల్లో  పోలీసు బృందంతో కలిసి పటిష్టంగా అమలు చేశారు. ఆదివారం కర్ఫ్యూ విధింపు చర్యలో భాగంగా ఎస్సై బాలాజీ నేతృత్వంలో  సిబ్బంది పర్యటించారు. గ్రామాల్లో ఎవరూ ఇంటి నుండి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎస్సై బాలాజీ  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకె కర్ఫ్యూ ను విధించడం జరిగిందన్నారు  ముందుగా గ్రామాల్లో ప్రచారం చేయడం వల్ల ప్రజలు కూడా అప్రమత్తం అయ్యారని . పట్టణ మరియు  గ్రామా ప్రజలు కూడా సహకరిస్తున్నారని . .. ఇదే విధంగా కరోనా వైరస్ వేగం తగ్గేంతవరకు ప్రతి ఆదివారం  కర్ఫ్యూకొనసాగుతుందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమలు జరిపిన ఈ కర్ఫ్యూ లో అత్యవసర వైద్య సేవలు, మెడికల్ షాప్ లకు మినహాయింపు ఉందని మిగిలిన ఏ దుకాణాలకు అనుమతి లేదని చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల క్షేమం కోసమే నని  ఆయన అన్నారు.  అయితే ప్రజలు ఒక్క ఆదివారమే కాకుండా ప్రతిరోజు కరోనా వైరస్  ఉధృతి తగ్గేంతవరకు  సైనికుల్లా తమ తమ ఇళ్లలోనే ఉండి వైరస్ అరికట్టేందుకు పోరాడాలని  నిత్యావసర సరుకుల దుకాణాలు నిర్వహించే దుకాణదారులు వారి షాపులు ముందు కనీసం ఆరడుగుల సామాజిక దూరాన్ని పాటించాలని అదేవిధంగా మాస్కు తప్పని సరి అని మాస్క్ లేనిదే అట్టివారికి ఎటువంటి వస్తువులు అమ్మరాదని ఆయన కోరారు పోలీస్ వైద్య మరియు ఆరోగ్య మున్సిపాలిటీ అనునిత్యం మీకోసం కష్టపడుతున్నారని ఈ విషయాన్ని ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా గుర్తెరగాలనీ ఆయన తెలిపారు ఎస్సై బాలాజీ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ మూర్తి విజయ్ సాల్మన్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు


రోడ్డు గుంటలను పూడ్చిన పంచాయితీ అధికారులు


రోడ్డు గుంటలను పూడ్చిన పంచాయితీ అధికారులు


వి.ఆర్.పురం పెన్ పవర్ :



వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామ పంచాయితీ కి సంబంధించిన బి.సి.కాలనీ గ్రామంలో సాయిబాబా గుడివద్ద రోడ్డు మొన్న కురిసిన వర్షాల వలన అద్వాన్నంగా మారింది. ఆ రోడ్డు లో ప్రజలు కానీ, వాహన దారులు కానీ తిరగడానికి ఇబ్బందులు పడేవారు.  ఇది గమనించిన వడ్డిగూడెం గ్రామపంచాయతీ అదికారులు, ఆ రోడ్డు లోని గుంటలను పూడ్చినారు. ఆ గ్రామ ప్రజలు పంచాయితీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం(సెక్రటరీ), బొడ్డు సత్యనారాయణ, ముత్యాల శ్రీనివాస్, పలివెల నాగేశ్వరరావు, బొర్రా నాగేశ్వరరావు, బాగుల ముత్యాల రావు, పుల్లిందల సత్యనారాయణ, బాగుల రేవతి, కోట్ల శేఖర్, కోట్ల శ్రీను, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...