Followers

రైతులకు వడ్డీ రాయితీ


 


 ముమ్మిడివరం,పెన్ పవర్


రైతులకు వడ్డీ రాయితీ విషయం లో  పాత విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు గుద్ధటి రమా కేశవ బాలకృష్ణ (జమ్మి) తన నివాసంలో జరిగిన సమావేశంలో తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నా ఈ క్రాఫ్ విధానం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ పొందడం సులభతరం కాదని, కాబట్టి ఈ క్రాఫ్ విధానం  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవలసిన అవసరం ఉందని తెలియజేశారు. త్వరలో రాష్ట్ర రైతు సంఘం నాయకులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు  సహకార శాఖ మాత్యులు శ్రీ కురసాల కన్నబాబు ని కలిసి  సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని రైతు సంఘం నాయకులుబాలకృష్ణ( జమ్మి)గారు తెలియజేశారు.


కాకినాడ పి.ఆర్.కళాశాలకు మరో అరుదైన గుర్తింపు


కాకినాడ పి.ఆర్.కళాశాలకు మరో అరుదైన గుర్తింపు..


 ప్రిన్సిపల్  డాక్టర్..చప్పిడి కృష్ణ.


కాకినాడ స్టాఫ్ రిపోర్టర్,పెన్ పవర్ 


నూటముప్పై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాకినాడ పిఠాపురం రాజా కళాశాలకు మరో అరుదైన గుర్తింపు లభించింది. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గుర్తింపును ఇస్తూ కళాశాల కమీషనర్ వారు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో "న్యాక్ " కి వెళ్లే సందర్భం లో ఈ గుర్తింపు ద్వారా మంచి గ్రేడ్ సాధనకు ఉపరిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. చప్పిడి. కృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు.
దీని ద్వారా అదనపు గదుల నిర్మాణం, గదుల మరమ్మత్తులు, ల్యాబుల సౌకర్యం,జాతీయ స్థాయిలో సిబ్బందికి శిక్షణా
కార్యక్రమాలు, ఆర్థిక వనరులు అందే అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ర్యాంకులు, జాతీయ స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించగల గొప్ప అవకాశం అందుతుందని
తెలిపారు. కళాశాలలో ఇప్పటికే ఉన్న ముప్పైకి  పైగా ఉన్నా కోర్సుల తో పాటు కొత్తగా మరో మూడు యుజి ,ఒక పీజీ కోర్సు కి కూడా అనుమతి లభించిందని, బీఎస్సీ విభాగంలో ఐ.ఒ.టి,బి.ఏ విభాగంలో ఆఫీస్ మెనజిమెంట్,బి. ఎం.ఎస్.ఏ, పీజీలో ఎంపీసీ బొటనీ కోర్సు కి అనుమతి లభించింది. అలాగే క్యాంపస్ ఎంపిక ల ద్వారా కళాశాల విద్యార్థులకు
ఉద్యోగ అవకాశాలు మెండుగా దొరుకుతాయని, గతంలో ఎన్నో కార్యక్రమాలు ద్వారా గుర్తింపు పొందిన ఈ కళాశాల ,మరో మైలు రాయిని చేరడం పట్ల కళాశాల సిబ్బంది,విద్యార్థులు,పూర్వ విద్యార్థులు,కాకినాడ నగర వసులు
సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ గుర్తింపు ద్వారా మేము మరింత ఉత్సాహంగా పని చేస్తూ, కళాశాలకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించగలమని ప్రిన్సిపాల్ గారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ 
డాక్టర్.చప్పిడి కృష్ణ తో పాటు,
 వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. వి. శ్రీనివాసన్, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్.హరి రాం ప్రసాద్,పరీక్షల విభాగం అధికారి,డాక్టర్.ఎన్. శ్రీనివాస్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని కళాశాల కమిషనర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.


ప్రశాంత మన్యంలో మారుమ్రోగిన తుపాకుల మోత


 


ప్రశాంత మన్యంలో మారుమ్రోగిన తుపాకుల మోత.


భయం గుప్పెట్లో మన్యం.


 


  విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



   కరోనా నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న  విశాఖ మన్యంలో మళ్లీ తుపాకీ తోటలు  మారుమ్రోగాయి. ఆదివారం మావోయిస్టు పోలీసులు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో  మావోయిస్టులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.  పాడేరు డివిజన్  పెదబయలు మండలం లుంగుడేరు    అడవి ప్రాంతంలో  మావోయిస్టుల  కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో  పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసులు మావోయిస్టులు తార్స పడడంతో ఎదురుకాల్పులు జరిగాయి ఈ సంఘటనలో   మరణాలు  తలెత్తగా పోయినా పలువురు మావోయిస్టులకు  గాయాలైనట్లు సమాచారం.  మావోయిస్టులు  తప్పించుకున్నారు.  గత కొంత కాలంగా విశాఖ మన్యం మావోయిస్టుల విధ్వంసకర సంఘటనలకు దూరంగా ఉంది. పోలీసులు కరోనా నిబంధనల  చర్యల వైపు  నిమగ్నమయ్యారు. విశాఖ మన్యం ప్రశాంతంగా ఉంది. ఈ క్షణంలో సడన్ గా మావోయిస్టులు  పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరగడంతో  మన్యం ఉలిక్కిపడింది.ప్రతీకార చర్యలు కోసం  ఎక్కడ ఎటువంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకుంటాయని  గిరిజనం  ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.


అర్హులకు కొత్త ఫింఛన్ల అందచేసిన కేబుల్ మూర్తి

 


అర్హులకు కొత్త ఫింఛన్ల అందచేసిన కేబుల్ మూర్తి


గాజువాక,పెన్ పవర్ 


-గాజువాక 65 వార్డు సంజీవిగిరి కాలనీ సచివాలయ పరిధిలో  కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.బీసీ రోడ్డులోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి  *బొడ్డు నరసింహ పాత్రుడు(కేబుల్ మూర్తి)* గారు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కొత్తగా పింఛన్ పొందాలంటే సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఒకప్పుడు ఉండేది అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పని సునాయాసంగా జరుగుతుంది అన్నారు.ప్రజల అవసరాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు.ఈ కార్యక్రమానికి మద్దాల అప్పారావు ,నాగిశెట్టి శ్రీను, ఇరోతి గణేష్, మణికంఠ ,లోకనాధం, మంగునాయుడు ,అడిగర్ల రమణ, ఫణి ,శ్రీను ,అర్జున్ ,అడ్మిన్ గణేష్, శ్రీనివాస్, భార్గవ్ ,భాస్కరరావు, వాలంటీర్స్,  తదితరులు పాల్గున్నారు .


 మరో కరోనా కేసు


 మరో కరోనా కేసు


చింతపల్లి , పెన్ పవర్


చింతపల్లి ఏజెన్సీలో సోమవారం మరో కరోనా కేసు నమోదయింది. మండలంలోని లోతుగడ్డ పంచాయతీ, చెరుకుం పాకలు గ్రామం నుంచి ఇటీవల ఓ  గర్భిణీ ప్రసవానికి విశాఖ కేజీహెచ్ లో చేరింది. ప్రసవం అనంతరం ఆమె నర్సీపట్నంలోని బంధువుల ఇంటిలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి స్వగ్రామం చెరుకుంపాకలు చేరుకుంది. ప్రస్తుతం నర్సీపట్నంలో కోవిడ్ వైరస్ పై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె బంధువులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు  గుర్తించారు. ఈ విషయాన్ని చింతపల్లి వైద్యాధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన చెరుకుంపాకలు గ్రామం వెళ్లి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెలో కరోనా లక్షణాలు  ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను విశాఖ కెజిహెచ్ ఐసోలేషన్ కు తరలించారు. ఆ గ్రామంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన బ్లీచింగ్ పౌడర్ జల్లి, సోడియం హైడ్రోక్లోరైట్ పిచికారీ చేశారు. దీంతో కరోనా వైరస్ లక్షణాలు కలిగిన ఆమె ఎవరితో సన్నిహితంగా ఉన్నదనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 34 మందిని అధికారులు గుర్తించినట్లు తెలిసింది.కరోనా వైరస్ లక్షణాలు కలిగిన ఆమె నివసించిన ప్రాంతాన్ని కంటెన్మెంట్ జోన్ చేశారు. ఈ సంఘటనతో మండలంలో ఇది 2వ,కరోనా లక్షణాలు కలిగిన కేసు. దీంతో మండల వాసులు భీతిల్లుతున్నారు.


ఏజెన్సీలో వైద్యులు డెంగ్యూ డ్రై డే గా పాటించాలి


 


ఏజెన్సీలో వైద్యులు డెంగ్యూ డ్రై డే గా పాటించాలి.



  ఐటిడిఓ పిఓ వెంకటేశ్వర సలిజామల



విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



 ఏజెన్సీలో వైద్యాధికారులు డెంగ్యూ డ్రై డే గా పాటించాలని  పాడేరు ఐ టి డి ఎ పివో  వెంకటేశ్వర్ సలిజామల అన్నారు. సోమవారం ఐ టి డి ఎ కార్యాలయం  11 మండలాల వైద్య అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో వర్షాలు ఉధృతంగా కురుస్తున్న  నేపద్యంలో డెంగ్యూ వ్యాధి విజృంభించే అవకాశం ఉన్నందున వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎపిడిమిక్  కావటంవల్ల వైద్యాధికారులు ఏజెన్సీ లో పీహెచ్సీల పరిధిలో అందుబాటులో ఉండాలని కోరారు. విధులకు  గైర్హాజర్ అయితే  చర్యలు తప్పవన్నారు. డెంగ్యూ కేసులు  నమోదు కాకుండా  హ్యాపీ హెచ్ ఎ లా పరిధిలో చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సిబ్బందిని కూడా అప్రమత్తం చేయాలని కోరారు.రక్త పూతల నమూనా ల సేకరణ లో యు. చీడిపాలెం మినుములూరు కిలగాడ సప్పర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వెనుక బడి ఉన్నాయ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాకినాడ నుంచి వీడియో కాన్ప రెన్స్ కు హాజరైన యు చీడిపాలం వైద్యుడు సురేష్ కు సోకాజ్ నోటి స్ జారీ చేశారు.


నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి


నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి.


  ప్రాజెక్ట్ కమీష్ నర్ మల్లికార్జునరావు.
         


మాకవరపాలెం పెన్ పవర్



రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సర్వ శిక్ష అభియాన్ సహాయ ప్రాజెక్టు కమిషనర్ పి.మల్లికార్జున రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మాకవరపాలెం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ఆయన, జరుగుతున్న పనులు పురోగతిని నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పథకం కింద ఆయా పాఠశాలల అభివృద్ధికి గాను మాకవరపాలెం మండలానికి రూ.4.7 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల భవనాల మరమ్మతులు, ప్రహరీలు, తాగునీరు, విద్యుత్ సదుపాయం తదితర పనులు 90 శాతం మేరకు పూర్తయ్యాయని మిగిలిన పనులు జూలై చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీవీ రమణ, ఎస్ శేషగిరిరావు, ఎన్.శ్రీరామూర్తి, ఎస్. సరితా దేవి తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...