Followers
కోటిరెడ్డి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుకు భోజనాలు అందజేత
కోటిరెడ్డి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుకు భోజనాలు అందజేత
(పెన్పవర్, పొదిలి)
పెన్పవర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు నిర్వహిస్తున్న భోజనాలు 94వ రోజుకు చేరుకున్నాయి. శనివారం భోజనాలను కోటిరెడ్డి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బాపూజీరెడ్డి ఆర్ధిక సహాయం అందించి బోజనాలను ఏర్పాటు చేశారు. కార్మికులకు ఒక రోజు భోజనాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, నారాయణ, భూమా సుమంత్, శశి, పంచాయతీ శానిటరి సిబ్బంది మురళి, కళ్యాణ్, కుమార్, మస్తాన్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
వర్కింగ్ జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా పరిగణించాలి
వర్కింగ్ జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా పరిగణించాలి
రాజోలు,పెన్ పవర్
వర్కింగ్ జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా పరిగణించి భీమా పథకాలు వర్తింపజేయాలని కోరుతూ శనివారం రాజోలు డిప్యూటీ తహశీల్దార్ దేవళ్ళ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేసారు.ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజోలు నియోజకవర్గ కార్యదర్శి కె. సురేంద్ర కుమార్ సభ్యులు పీతల రాజశేఖర్,ఎం .వెంకటేశ్వరరావు, కోళ్ల దుర్గాప్రసాద్,తిక్కిశెట్టి విజయ్ తదితరులు.
ఇళ్ల నుంచి బయటకు రావద్దు
కర్ఫ్యూ అమలుకు ప్రజలు సహకరించాలి..
- ఇళ్ల నుంచి బయటకు రావద్దు
-సి.ఐ కృష్ణ
రావులపాలెం, పెన్ పవర్
జిల్లాలో తీవ్ర స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు రావులపాలెం సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల్లో 24గంటలపాటు అమలు చేస్తున్న కర్ఫ్యూ కు ప్రజలంతా సహకరించాలని సి.ఐ వి.కృష్ణ కోరారు. శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెంలో లాక్ డౌన్ నిబంధనలు అమలలో ఉన్నా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహన చోదకులకు శనివారం సాయంత్రం స్థానిక కళా వెంకట్రావు సెంటర్ లో సి.ఐ కృష్ణ, ఎస్సై పి.బుజ్జిబాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో పెద్ద ఎత్తున నమోదు అవుతున్న దృష్ట్యా ప్రజలు ఇకనైనా జాగ్రత్త వహించాలన్నారు. అధికారులు ఇచ్చిన సమయంలో మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలన్నారు. ఆదివారం ఉదయం 6నుంచి సోమవారం ఉదయం 6వరకు అమలు చేస్తున్న కర్ఫ్యూ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్.సి దుర్గారావు, కానిస్టేబుల్స్ గీతాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ
పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ....
రూపాకుల రవికుమార్, ఆంధ్ర ప్రదేశ్,బి.జె.పి. మెడికల్ కన్వీనర్.
పూర్ణా మార్కెట్, పెన్ పవర్.
పేరుకు అగ్ర వర్ణము కానీ నేటి సమాజంలో అణగారిన వర్గము రూపాకుల రవికుమార్ ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైద్య విభాగము కన్వీనర్ .రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ,ప్రకృతి చికిత్సాలయ మహారాణి పేట మరియు శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ సంయుక్త నిర్వహణలో మహారాణి పేట ప్రకృతి చికిత్సాలయ ఆవరణలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ 111వరోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రూపాకుల రవికుమార్ ముందుగా అర్చకులకు ,పురోహితులకు బియ్యం,నూనె,గోధుమపిండి మొదలగునవి పంపిణీ చేశారు.కరోనా లాక్ డౌన్ సమయంలో దేవాలయాలు మూసి వేయటం వలన ఈరోజు తెరిచిన తర్వాత భక్తుల రాక తగ్గినందున అర్చకులకు కుటుంబ పోషణ భారముగా ఉన్నదని కరోనా వలన పురోహితులకు పనులు లేవని , ప్రభుత్వము వీరిని ఆదుకోవాలని అన్నారు .విశాఖ జిల్లాలో పురోహితులు సుమారు 35 వేలమంది ఉన్నారని. ఇందులో నగరములో 22 వేలమంది ఉన్నారని,విశాఖ జిల్లాలో అర్చకులు సుమారు 20 వేలమంది ఉన్నారని,ఇందులో నగరములో 6 వేలమంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వము కరోనా సహాయనిధి పేరుతో సుమారు 1158మందిఅర్చకులకు 5000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేసారు మిగిలిన వారికి సహాయము అందలేదు కొన్ని దేవాలయములలో ధర్మ కర్తలు అర్చకుల మీద దౌర్జన్యము చేయుచున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎక్కువమందికి సహాయము అందటం లేదని అన్నారు. వంశ పారంపర్యముగా వస్తున్న అర్చకత్వం చేస్తున్నా అర్చకుల కుటుంబాలలో మరియు పురోహితుల కుటుంబాలలో ఉన్న యువకులకు వివాహమునకు కన్యాదానము చేయుటకు కన్యాదాతలు ముందుకు రావటం లేదని అన్నారు.ఆర్థికముగా, సామాజికముగా, బ్రాహ్మణ వర్గము వెనకబడినదని రాజకీయ దన్ను లేని ఈ వర్గ ప్రజలు ఎదుగుటకు బ్రాహ్మణులు అందరూ సమైక్యంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్య్రమానికి ఏస్.మహేష్, డా.శ్రీలక్ష్మి, గేదెల.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కారంచేడు ఉద్యమ స్పుార్తితో దళితులు ఐక్యతతో ముందుకు సాగాలి
దళిత వేదిక జిల్లా అధ్యక్షులుగా సూదికొండ
దళిత వేదిక జిల్లా అధ్యక్షులుగా సూదికొండ
అనకాపల్లి , పెన్ పవర్
ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక జిల్లా అధ్యక్షులు గా సూదికొండ మాణిక్యాలరావు ని నియమిస్తు వేదిక రాష్ట్ర కన్వీనర్ విప్పర్తి ప్రసాద్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ తన మీద నమ్మకం తో జిల్లా అధ్యక్షులు గా బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు వంగిపురం గజ్జెప్ప, రాష్ట్ర కార్యదర్శి బిరా గోవిందరాజు, రాష్ట్ర కన్వీనర్ విప్పర్తి ప్రసాద్ లకు ధన్యవాదములు తెలిపారు. ప్రస్తుతం సమాజం లో దళిత బహుజన వర్గాల ప్రజలు ఎదురుకుంటున్న అనేక సమస్యలు మీద ప్రజలలో చైతన్యము కలిగించి వేదిక ద్వారా వారికి అండగా ఉండి పోరాడతమని అన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...