Followers

జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు శ్యామ్ ఎంపిక


జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు శ్యామ్ ఎంపిక



 ఆత్రేయపురం,పెన్ పవర్


మండలం అంకంపాలెం లో ప్రధాన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్న చింతా శ్యామ్ కుమార్ జాతీయ స్థాయిలో విద్యా సంబంధ అంశాలపై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్. సి. ఆర్. టి) జూలై 21నుండి సెప్టెంబర్ 15 వరకు నిషిత (నేషనల్ ఇనిషియేటివ్  ఫర్ స్కూల్ హెడ్స్ హోలిస్టిక్ అడ్వాన్స్ మెంట్) శిక్షణకు ఎంపిక అయినట్లు మండల విద్యాశాఖాధికారి వర ప్రసాద్ తెలిపారు. పూర్తిగా ఆన్ లైన్ పద్ధతిలో జరిగే ఈ శిక్షణకు హజరు కావలసినదగా ఎంపిక ఉత్తర్వులు ఎస్ సి ఆర్ టి నుండి శ్యామ్ అందుకున్నాడని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్యాము ను మండల మండల డెవలప్ మెంట్ అధికారి నాతి బుజ్జి, మండల విద్యాశాఖ అధికారి వరప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ ఎకడమిక్ మోనటరింగ్ ఆథికారి బి. సుబ్రహ్మణ్యం, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి విజయ భాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తదితరులు శ్యాం ను అభినందించారు.


ఒకేరోజు మండలంలో 9 పాజిటివ్ కేసులు

ఒకేరోజు మండలంలో 9 పాజిటివ్ కేసులు


పెన్ పవర్, సీతానగరం


మండలం నందు ఒకేసారి 9 పాజిటివ్ కేసులు రావడంతో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాక్షికంగా లాక్ డౌన్ అమలవుతున్న సందర్భంలో శుక్రవారం 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మండల వైద్యాధికారిణి డాక్టర్ హారిక తెలియజేశారు. డాక్టర్ హారిక మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలో పలువురికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 9 మందికి  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యురాలు తెలియజేశారు. ఇటీవల మండలంలో 12 కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఈ 9 కేసులతో 21 కేసులు నమోదు కావడంతో సీతానగరం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైనం ఏర్పడింది. ఇనుగంటివారి పేట 1, సీతానగరం 1, రఘుదేవపురం గ్రామానికి చెందిన చిన్నకొండేపూడి సచివాలయం నందు వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి 1, మొగ్గళ్ళ గ్రామం 2, ఉండేశ్వరపురం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రాజమహేంద్రవరం నందు పనిచేస్తున్న ఇబ్బంది 3, సీతానగరం పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ 1 ప్రస్తుతం వారు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని డాక్టర్ హారిక తెలిపారు.


కోవిడ్ పరీక్షల సమయంలో సిబ్బంది జాగ్రత్త వహించాలి



కోవిడ్ పరీక్షల సమయంలో సిబ్బంది జాగ్రత్త వహించాలి..,!డిప్యూటి కలెక్టర్ సుబ్బలక్ష్మి సూచన.          


సామర్లకోట,పెన్ పవర్


 కోవిడ్ పరీక్షలు జరిపే సమయంలో శాంపిల్స్ సేకరించే సిబ్బంది,అత్యంత జాగ్రత్త వహించాలని జిల్లా డిప్యూటి కలెక్టర్,సామర్లకోట కోవిడ్ ప్రత్యేక అధికారి సుబ్బలక్ష్మి అన్నారు.సామర్లకోట పట్టణం లో పలు విషయాలు పై పరిశీలనకు విచ్చేసిన సందర్భంగా ఆమె రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు,సామాన్య  ప్రభుత్వ ఆసుపత్రి ,మున్సిపల్ కార్యాలయాలను సందర్శించి పలు అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్ లలో పనితీరు సక్రమంగా ఉండటం లేదు అని ఫిర్యాదులు వస్తున్నట్టు చెప్పారు.ఈ విషయం లో సిబ్బంది వారి పనితీరును మార్చుకోవాలని అన్నారు.అలాగే వచ్చిన రోగి పరిస్థితిని అంచనా వేసి అత్యవసరమైన వారికి పరీక్షలు ముందుగా అందించాలన్నారు.వచ్చిన రోగి పరిస్థితి విషమంగా ఉంటే వారిని స్థానికంగా ఉన్న అంబులెన్స్ లో కాకినాడకు మెరుగైన వైద్య సేవల కోసం పంపించి ఆ సమాచారాన్ని ఉన్నత అధికారులకు అందించాలి అన్నారు.కాగా ప్రధానంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.కాగా స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని డిప్యూటి కలెక్టర్ సుబ్బలక్ష్మి సందర్శించారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో వివిధ అవసరాల పై  వచ్చిన ప్రజలు గుంపులు గొంపులుగా కనిపించడంతో అధికారులు పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వచ్చిన ప్రజలు సామాజిక దూరాన్ని పాటించే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయించి వారి పనులను త్వరితంగా పరిష్కరించి పంపించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. కరోన కట్టడి చేసేందుకు అందరూ పూర్తి సహకారాన్ని అందించాలి అని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.కాగా కోవిడ్ నియంత్రణకు పట్టణ పరిధిలో తీసుకుంటున్న చర్యలను డి ఇ ,సిహెచ్ రామారావు ను అడిగి తెలుసుకుని ఆమె పలు సూచనలు చేశారు.అలాగే స్థానిక ప్రధాన సామాన్య ఆసుపత్రిని ఆమె సందర్శించి వైద్య సిబ్బందికి ప్రజలు కు అందించే వైద్య సేవలపై పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట తహిసల్దార్ వి జితేంద్ర,మున్సిపల్ డిఇ రామారావ,సానిటర్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, వైద్య సిబ్బంది ఉన్నారు.


వాడపల్లి వెంకన్న దర్శనం 6 గంటల నుండి 11 వరకు కుదించిన అధికారులు


వాడపల్లి వెంకన్న దర్శనం 6 గంటల నుండి 11 వరకు కుదించిన అధికారులు


ఆత్రేయపురం ,పెన్ పవర్



 ఆత్రేయపురం, మండలం వాడపల్లిలో వేచివున్న తిరుమల తిరుపతి గా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు భక్తుల ద్వారా వచ్చిన కానుకలు ఈరోజు సాధార దర్శనం 552 మంది దర్శించుకోవడం ప్రత్యేక దర్శనం 653 మంది స్వామివారిని దర్శించుకున్నారు ప్రత్యేక దర్శనం ద్వారా 32 వేల ఆరు వందల యాభై రూపాయలు అన్నసమారాధన వచ్చిన ఆదాయం 21,602 రూపాయలు కేశఖండన ద్వారా 3000 రూపాయలు మొత్తం మీద ఈ శనివారం స్వామి వారి ఆదాయం 57,257 రూపాయలు ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రకటించడం జరిగినది భక్తులకు మనవి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ మన తూర్పుగోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో తో అధికారులు చూసిన మేరకు స్వామివారి దర్శనం ఉదయం 6 గంటల నుండి  11 గంటల వరకు దర్శనం జరుగునని మరలా అధికారులు సూచించే వరకు ఆ టైం కొనసాగుతుందని ఆలయ చైర్మన్ రమేష్ రాజు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలియజేశారు


కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలి


 


కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలి
-- ఎమ్మార్వో శ్రీనివాసరావు


అనకాపల్లి , పెన్ పవర్


ప్రభుత్వం ప్రజా సేవలను ప్రజల ఇంటివద్దకే అందించాలనే యోచన తో ముందుకెళ్తుందని  జనం రెవెన్యూ సేవలకై తహసిల్దార్ కార్యాలయానికి రానక్కర్లేదని ఎమ్మార్వో శ్రీనివాసరావు పేర్కొన్నారు. అవసరమైతే తప్ప కార్యాలయాం చుట్టూ ప్రదక్షిణలు చేయొద్దని సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పలు అంశాలపై సూచనలు చేశారు. ప్రభుత్వం ఇస్తున్న చేయూత పథకానికి సంబంధించి కుల దృవపత్రం కోసం విరివిగా దరఖాస్తులు వచ్చాయన్నారు. సచివాలయం కి దరఖాస్తు చేసుకుంటే అక్కడ నుంచి నేరుగా తమ కార్యాలయానికి వచ్చేస్తుందని వాటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తామే నేరుగా పరిశీలించి ఇస్తున్నామన్నారు. దరఖాస్తులు ఎక్కువవడం సేవల్లో జాప్యం అవుతున్న నేపథ్యంలో మధ్య సిబ్బంది ప్రమేయం లేకుండా తామే నేరుగా నిర్వహించేలా కలెక్టర్ స్థాయి అధికారులు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో మండలం లో ఎక్కడా ఇసుక తవ్వకాలు లేకుండా పర్యవేక్షిస్తున్నామనారు. ఇటీవల గ్రామంలో సీజ్ చేసిన ఇసుక నిల్వలో కొంతమేర తగ్గిందన్నా అదేమీ పెద్ద సమస్య కాదన్నారు. భూ సర్వే లో ప్రభుత్వానికి చెల్లించిన చలనాల ప్రకారమే క్రమపద్ధతిలో నే సర్వేలు చేస్తున్నారు. కాని పక్షంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములను ఎక్కడ ఆక్రమణకు గురి చేసినా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ దృశ్య జనం అత్యవసరమైతే తప్ప కార్యాలయంకు రావద్దని పేర్కొన్నారు. పాజిటివ్ గా నిర్ధారించిన రోగులకు సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారో లేదో అన్న కోణంలో తాను ఐసోలేషన్ కేంద్రాన్ని  ఎపటికప్పుడు పర్యవేక్షిస్తూనట్లు తెలిపారు. ప్రజలందరూ మాస్క్ ధరించడం వంటి ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలన్నారు.


వాడ్రాపల్లి పంచాయితీ భవన నిర్మాణ పనులు


వాడ్రాపల్లి పంచాయితీ భవన నిర్మాణ పనులు పరిశీలించిన
మునగపాక వైసీపీ కన్వీనర్ కాండ్రేగుల నూకరాజు
       


  మునగపాక, పెన్ పవర్



మునగపాక:మండలంలోని వాడ్రాపల్లి గ్రామంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబు రాజు సహకారంతో నిర్మిస్తున్న పంచాయతీ భవన రెండో అతస్తుకు వేయనున్న స్లాబ్ పనులను మండల వైసీపీ కన్వీనర్ కాండ్రేగుల నూకరాజు పర్యవేక్షించారు.వీరితో పాటు ప్రభుత్వ అధికారులు పిఆర్.డిఇ,పీఆర్.ఏవో తదితరులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.


లాక్ డౌన్ లో ప్రజలకు బియ్యం పంపిణీ 


లాక్ డౌన్ లో ప్రజలకు బియ్యం పంపిణీ 


ప్రత్తిపాడు,పెన్ పవర్ 


ప్రత్తిపాడు మండలం లంపకలోవ చిన్న శంకర్ల పూడి ఏలూరు పి.జగన్నాధపురం గ్రామాలలో ప్రజలకు సుమారు వంద మందికి దళ్ సూరిబాబు బియ్యం పంపిణీ చేశారు లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న టువంటి ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంలో చేస్తున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మార్వో మాట్లాడుతూ కరోనా ను జయించాలంటే ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని సామాజిక దూరం పాటించాలని అవసరమైతే నై తప్ప దూర ప్రయాణాలు చేయరాదని సూచించారు ఈ కార్యక్రమంలో దళ్ మహేశ్వర రావు ఏసుబాబు సింగరయ్య రామారావు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా దాడి గోపి వెంకన్న హరిబాబు త్రిమూర్తులు పాల్గొన్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...