నిడదవోలు తహశీల్దార్ కి *వినతిపత్రం* సమర్పిoచిన మీడియా మిత్రులు.
పెన్ పవర్ నిడదవోలు
పశ్చిమగోదావరి జిల్లాలో
నిడదవోలు ప్రెస్ క్లబ్/నిడదవోలు వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ( ఏ పి యూ డబ్ల్యూ జె అనుబంధ సంస్థలు) ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక గ్రామ కచేరి నందు వర్కింగ్ జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా పరిగణించాలని, రాష్ట్ర వ్యాప్త కోర్కెల దినంగా పాటించాలని కోరుతూ నిడదవోలు తహశీల్దార్కు మీడియా మిత్రులు వినతి పత్రం సమర్పించారు.
కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యం లో కరోనా నియంత్రణ కోసం సమాజం లోని విభిన్న రంగాల వారు సేవలు అందిస్తున్న విషయం తెలిసినదే.
ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న
ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారని,
రాష్ట్రం లో చాలామంది పాజిటివ్ గా నిర్ధారణ అయినారు. పలువురు పాత్రికేయులు కోవిడ్ ఆస్పత్రులలో, క్వారన్ టైన్ సెంటర్ లలో చికిత్స పొందుతున్నారని
ఆస్పత్రులలో సరైన చికిత్స అందటం లేదని,
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వారం లోనే కరోనా బారిన పడిన నలుగురు పాత్రికేయులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మీడియా మిత్రులు పలువురు వాపోయారు.
తిరుపతి సి.వి.ఆర్. న్యూస్ ఛానెల్ వీడియో జర్నలిస్ట్ పార్థసారథి, కడప జిల్లా ఎన్.టి.వి. రిపోర్టర్ మధుసూదన రెడ్డి, కడప స్థానిక పత్రిక జర్నలిస్ట్ వెంకట సుబ్బయ్య, ఏలూరు కు చెందిన పత్రిక విలేఖరి వినాయక బాబులు కరోనా బారిన పడి మరణించడం పాత్రికేయ వృత్తుల్లో ఉన్నవారికి తీవ్ర మనోవ్యధనను కలిగిస్తుందని,
పాత్రికేయులు భయానక పరిస్థితుల్లో పని చేయాల్సి
న పరిస్థితి నెలకొన్నదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నాయకుల పిలుపు మేరకు
దీని పై స్పందించిన నిడదవోలు మీడియా మిత్రులు ఈ రోజు తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.
మీడియా సిబ్బంది ని వెంటనే కరోనా వారియర్స్ జాబితాలో చేర్చాలని, వారికి కరోనా బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని,
కోవిడ్ ఆస్పత్రులలో వెంటనే సదుపాయాలను మెరుగు పరచాలని,
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లకు సమాచార శాఖ ద్వారా కరోనా భద్రతా పరికరాలు ఇవ్వాలని,
ఇప్పటికే కరోనా తో మృతి చెందిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని,
గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాల ఫైల్ ను వెంటనే క్లియర్ చేసి పాత్రికేయులకు వైద్య, ఆరోగ్య భద్రత కల్పించాలని
నిడదవోలు ప్రెస్ క్లబ్ మరియు నిడదవోలు వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ల సభ్యులు కోరారు.