Followers

మందుబాబుల నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం



మందుబాబుల నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం.
మద్యం దుకాణాల వద్ద సిగపట్లు పడుతున్న మందు  బాబులు.
మద్యం షాపుల వద్ద అమలుకాని నిబంధనలు.


నగరంలో చక్కెర్లు కొడుతున్న కరోనా మహమ్మారి.


అర వందకు చేరిన కోవిడ్_19 మరణాల సంఖ్య.


చోద్యం చూస్తున్న  అబ్కారీ శాఖ  అధికారులు.


     విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



నగరంలో మందుబాబుల తీరు జుగుప్సాకరంగా  మారింది. తెల్లారింది మొదలు మద్యం దుకాణాల వద్ద క్యూ. కడుతున్నారు. మద్యం కోసం  తోపులాటలు సిగపట్లు  నిత్యకృత్యంగా మారిపోయాయి. మాస్కులు భౌతిక దూరం మరిచిపోయారు. కిక్కు కోసం కరోనా వైరస్ ను ఆలింగనం చేసుకుంటున్నారు.ఈ పరిస్థితి  విభ్రాంతి కలిగిస్తున్న మందు బాబుల్లో  చలనం కనిపించడం లేదు. నగరంలో కరోనా మహమ్మారి చక్కెరలో కొడుతున్న విషయం పట్టడం లేదు. కోవిడ్ మరణాలను సైతం  నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకో కుండానే  మందుబాబులు లైను కడుతున్నారు. మద్యం కోసం  గంటల తరబడి  పడిగాపులు  కాస్తున్నారు. క్యూ  పెరిగిపోతే తోపులాటలు  కొట్లాటలు మొదలవుతున్నాయి. భౌతిక దూరం  మాస్క్ లు లేకపోయినా పట్టించుకోవడం లేదు. కోవిడ్ 19  లాక్ డౌన్  మార్చి 21 నుండి మొదలైంది. మద్యం షాపులు మూతపడడంతో  మందుబాబుల  నాలిక  పిడచ కట్టు పోయింది. కిక్కు కోసం  ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు. నాటుసారా మత్తు మాత్రలు తో  నిషాని కొనుక్కున్నారు. ఇంతలో ప్రభుత్వం మందుబాబులకు తీపి కబురు చెప్పింది. లాక్ డౌన్ సడలింపు ల నేపథ్యంలో మద్యం షాపులు  తెరిచారు. షాపుల వద్ద  3 అడుగుల దూరం  మాస్కులు  గొడుగు తో  క్యూలో ఉండాలని నిబంధనలు విధించారు. ఈ నిబంధనలు రెండు రోజుల ముచ్చటగా  మారింది. మద్యం దుకాణాల వద్ద  మందుబాబులు బారులు తీరుతున్నారు. మద్యం మత్తు కోసం ఎగపడుతు  కరోనా మహమ్మారిని మరిచిపోతున్నారు.మద్యం తీసుకు పోయి అదిక ధరలకు అమ్ముతున్నారు.
విజయనగరం జిల్లా జామి మద్యం షాపు వద్ద శుక్రవారం వర్షం లో కూడా క్యూలో మహిళలు మద్యం కొనుగోలు చేశారు. ఇది చూసిన వారు విస్తుపోయారు.
ఆ మహిళల ని అడిగితే కరోనా వల్ల పనులు లేవు మందు తీసుకు పోయి అధిక ధరకు అమ్ముతున్నం అని బదులు ఇచ్చారు. నగరం లో
 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. నిత్యం పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.   కోవిడ్19 ఉధృతి తో  నగరం అట్టుడికిపోతోంది. అయినా  మందు బాబులలో  మార్పు కనిపించడం లేదు. మద్యం సేవిస్తే కరోనా మహమ్మారి దరిచేరదని అనుకుంటున్నారేమో? కానీ కరోనా మహమ్మారి కి ఏ ఒక్కరు చుట్టం కాదు  చిన్నాపెద్ద తేడా లేకుండా కాటేస్తుంది. మద్యం దుకాణాల వద్ద మందు బాబుల వీరంగం చూస్తున్నా అబ్కారీ శాఖ అధికారులకు చలనం లేదు. దుకాణాల వద్ద నిబంధనలు అమలు చేయడంలో విఫలం చెందారు.  ఇప్పటికైనా  ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కళ్ళు తెరవకుంటే  నగరంలో  కరోనా  వైరస్  మరణ మృదంగం మ్రోగించనుంది. 


రేఖపల్లి పి హెచ్ సి వైద్యశాల మూడు రోజులు బంద్

 





 

వి ఆర్ పురం . పెన్  పవర్

 

వి ఆర్ పురం మండలంలో రేఖపల్లి పి హెచ్ సి లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయుచున్న ఆధికారులకు కరోనా టెస్ట్లు  14 మందికి చేయగా అందులో రేఖపల్లి పి హెచ్ సి కి సంబంధించిన అధికారికి  మరియు సున్నవారిగూడెం లో ఒక వ్యక్తి కి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ సుందర్ ప్రసాద్ తేలిపారు.వీరిని శనివారం సాయంకాలం క్వారంటేన్ కి తరలిస్తామని మీడియాకి తెలిపారు. ముందు జాగ్రత్త కారణంగా రేఖపల్లి పి హెచ్ సి కి మూడు రోజులు బంద్ ప్రకటించారు మండలం లోని ప్రజలను వైద్యశాలకు అనుమతించటలేదు.

ఎమర్జెన్సీ కేసులు వచ్చినట్లైతే  కూనవరం,కోతులగుట్ట పి హెచ్ సి కి తరలిస్తామని ప్రజలకు తెలిపినారు.మండలంలోని అన్ని గ్రామాలు ప్రజలు భయన్దోళనతో ఇంటినుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు.నిన్నటివరకు కరోనావ్యాది గూర్చి అంతగా భయపడలేదు,ఎప్పుడైతే వైద్యశాల సిబ్బంది లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని  తెలిసిందో ప్రజలందరూ అప్రమత్తమై మాస్కులు దరిస్తున్నారు.మనిషికి మనిషికి దూరం పాటిస్తున్నారు.ప్రతిఒక్కరు శానిటీజర్ ను వాడుతున్నారు.ఈకార్యక్రమంలో వి ఆర్ పురం మండల ఎస్సై వెంకట్,ఏ ఎన్ యం లు,ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.



భైరవ పట్నంలో నిర్వాసితుల కాలనీలు పరిశీలన


భైరవ పట్నంలో నిర్వాసితుల కాలనీలు పరిశీలన



వి.ఆర్.పురం. పెన్ పవర్ 



వి.ఆర్.పురం మండలం జిడిగుప్ప గ్రామ పంచాయితీకి సంబంధించిన పోలవరం ప్రాజెక్ట్ కారణంగా సర్వం కోల్పోతున్న గ్రామ ప్రజలకు కూనవరం మండలం భైరవ పట్నం  లో గ్రామాల వారీగా నిర్మిస్తున్న కాలనీలను వై.యస్.ఆర్. కాంగ్రెస్ పోలవరం నిర్వాసితుల డివిజన్ కమిటీ కన్వీనర్ చిచ్చడి మురళి కాలనీలను సందర్శించారు. సంబంధిత అధికారులను అక్కడి సదుపాయాలు  అడిగి తెలుసుకున్నారు. ఈ కాలనీలను పూర్తిచేసి నిర్వాసితులకు త్వరగా అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పోడియం గోపాల్, యూత్ కన్వీనర్ చిక్కాల బాలు, బొడ్డు సత్యనారాయణ, ముత్యాల శ్రీనివాస్, ముత్యాల మురళి, మాదిరెడ్డి సత్తిబాబు, రేవు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


దళితులు, బలహీన వర్గాలమీద ప్రభుత్వ దాడులు ఆపాలి..... మాజీ మంత్రి గొల్లపల్లి 


దళితులు, బలహీన వర్గాలమీద ప్రభుత్వ దాడులు ఆపాలి..... మాజీ మంత్రి గొల్లపల్లి 


రాజోలు, పెన్ పవర్,


 రాజోలు మండలం, తాటిపాక గ్రామంలో తన నివాసం వద్ద  మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు   విలేకర్ల  సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం లో దళితులు, బలహీన వర్గాల మీద  ప్రభుత్వ దాడులు రోజు, రోజుకు పెరిగిపోతున్నాయని, ఇది కక్ష పూరిత దాడులు అని గొల్లపల్లి అన్నారు. దళిత,బలహీన వర్గాల ఓట్లతో అధికారం లోకి వచ్చిన ఈ ప్రభుత్వం  దళితులపైనే కక్ష సాధింపు చర్యలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నదని ,ఇదిజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా భావిస్తున్నానని గొల్లపల్లి ఆవేదన చెందారు. దళితులు, వెనుబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమం పై   ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం గా  వ్యవహరిస్తుందని,
 బలహీన వర్గాలకు చెందిన  న్యాయమూర్తులు, ఉన్నతాధికారులపై దాడులు చేయటం, తప్పుడు కేసులు బనాయించటం, తద్వారా అరెస్ట్ లు చేయటం ప్రభుత్వానికి తగదని గొల్లపల్లి అన్నారు.వెనుకబడిన వర్గాల, దళితుల యొక్క సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేయటం లేదని, ప్రశ్నించే వారిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని ప్రభుత్వం అన్నిటా విఫలమైందని గొల్లపల్లి అన్నారు.


కారంచేడు మారణకాండకు 35 ఏళ్లు


కారంచేడు మారణకాండకు 35 ఏళ్లు


గండేపల్లి  పెన్ పవర్


 కారంచేడుమారణకాండకు35ఏళ్లువచ్చినావని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్ అన్నారు.ప్రకాశంజిల్లా చీరాల మండలంలో ఉన్నా గ్రామం కారంచేడు1985 జూలై15వరకు ఆ వూరు ఆ జిల్లాలోనే సరిగ్గా తెలియదు కానీ ఆ రోజు తర్వాత నుంచి దేశంలో కారంచేడు మారుమ్రోగిపోయింది జూలై 16 ఉదయం దళితుల త్రాగునీరు చెరువులో కి రాయినీడి శ్రీనివాసరావు పశువులను తోలాడు దీనిని మున్నంగి సువార్త అనే ఒక మాదిగ స్త్రీ ప్రశ్నించింది ఈ క్రమంలో కమ్మ యువకులు ఆమెతో వాగ్వాదానికి దిగడం తో పాటు కులం పేరుతో దూషించారు  దీనిపై ఆగ్రహించిన సువార్త తన మంచినీటి బిందెతో వారిపై దాడి చేసింది. దళితవాడకు చెందిన కత్తి చంద్రయ్య మన్నెం సువార్త శ్రీనివాసరావు వారించే ప్రయత్నం చేశారు .వెంటనే ఈ విషయం ఊరిలో తెలియడంతో శ్రీనివాసరావు కి మద్దతుగా కొందరు కమ్మ పెద్దలు యువకులు అక్కడికి వచ్చారు దళితులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు పెద్దల జోక్యంతో అప్పటికి వివాదం సద్దుమణిగింనప్పటికి ఏదో జరగబోతుందని భయం దళితులను వెంటాడింది. ఊహించినట్లుగానే 17వ తేదీ కారంచేడులో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వందలాదిమంది తెల్లవారుజామున దళిత వాడ పై విరుచుకుపడ్డారు గోడలు కత్తులతో రాక్షసంగా క్రూరాతి క్రూరంగా దళితయువకులను వెంటాడారు స్త్రీల పై అత్యాచారం చేసినారు. అక్కడితో ఆగకుండా గాయపడిన మహిళలను ఒక చోటకు చేర్చి తగలబెట్టే ఎందుకు ప్రయత్నం చేశారు ఈ ఘటనలో ఆరుగురు మాది కులస్తులు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ మారణ కాండ భయాందోళన గురైన దళితులు కారంచేడు వదిలి చీరాలకు పారిపోయారు వారి ని చీరాల మాలలు లూధరన్ చర్చిలో ఆశ్రాయం కల్పించి మాదిగల చుట్టు మాలలు కాపలకస్తు భోజన లు ఏర్పటు చేసి మాలలు రక్షణ కల్పించారు ఈ సంఘటనపై రాష్ట్రం దేశం ఉలిక్కిపడ్డాయి దళిత, సామాజిక ప్రగతిశీల సంఘాలు బాధితులకు అండగా నిలిచాయి. నెలాఖరులో కారంచేడు బాధితులు ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పడి న్యాయ పోరాటం చేసింది బాధితులకు భూమి నివాసం ఏర్పాటు చేయాలనే 28 డిమాండ్లతో కత్తి పద్మారావు సలగల రాజశేఖర్ బొజ్జా తారకం వంటి వారు ఉద్యమించారు .దీంతో దిగివచ్చిన ప్రభుత్వం బాధితులకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు పనులను పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శంకరన్ ను నియమించింది ఆయన పొలాలు, స్థలాలు ,పక్కా ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి పనులు .స్వయం శిక్షణ ఇలా అనేక మార్గాల్లో బాధితులకు అండగా నిలిచారు .మరోవైపు సుదీర్ఘ విచారణ అనంతరం 24 ఏళ్ల తర్వాత దోషులకు శిక్షలు పడ్డాయి.
 దీనికి ప్రధాన సూత్రధారిగా  ఆరోపణలు ఎదుర్కొన్న నాటి సీఎం ఎన్టీఆర్ వియ్యంకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటి చెంచురామయ్యను నక్సల్స్ కాల్చి చంపారు 2008 లో ఈ కేసులో సుప్రీం జోక్యం చేసుకోవడంతో విచారణ వేగంగా సాగింది తుది తీర్పు వెలువడే నాటికి దోషుల్లో చాలామంది చనిపోయరు. చివరకు నిందితుల్లో ఒకరికి జీవితఖైదు 29 మందికి మూడేళ్ల శిక్ష పడింది మరోవైపు కారంచేడు ఘటనకు సాక్షిగా ఉన్న ఆలేసమ్మ హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది. అయితే ఈ మారణ హోమం తర్వాత దళితులు తమ అస్తిత్వం కోసం హక్కుల కోసం ఆత్మరక్షణకోసం పిడికిలి  బిగించారు. 1989 లో వచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తో పాటు దేశవ్యాప్తంగా సాగిన పలు దళిత ఉద్యమాలకు కారంచేడు ఘటనే స్పూర్తి.దళితుల సమస్యలన్నిటికీ పరిష్కారం రాజ్యాధికారమే అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు నినాదాన్ని దళితులు మెదళ్లలో నింపింది దళితకులాల సమస్యలను సమాజంలో ప్రభుత్వంలో చర్చకు పెట్టింది అప్పటి వరకు మీగిలిన పార్టీలనే నమ్ముకుని బతికిన దళితుల్లో కారంచేడు ఘటన తర్వాత ఊహించలేనంతటి మార్పు వచ్చిందని పులి ప్రసాద్ అన్నారు.


నిబంధనలు పాటించని వారికి కేసులు నమోదు 



నిబంధనలు పాటించని వారికి కేసులు నమోదు 


ఏలూరు పట్టణంలో వాహన తనిఖీ నిర్వహించినారు అనవసరంగా రోడ్డుమీద తిరిగే వాళ్లకు ఏలూరు టూ టౌన్ సిఐ  ఫైన్ విధించడం జరిగినది 


పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో  పెన్ పవర్


పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి  కె.ఎన్. నారాయణ్  ఐపీఎస్ ఆదేశాల మేరకు   ఏలూరు 2 టౌన్ సిఐ  బి. అది ప్రసాద్  సిబ్బంది ఏలూరు   ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ వద్ద  పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్  రేవు ముత్యాలరాజు  యొక్క ఉత్తర్వులపై ఏలూరు పట్టణం నందు నియమ నిబంధనలను అనుసరించి పట్టణంలో వాణిజ్య పరమైన ప్రజా రవాణా  వాహనములకు అనుమతులు లేనందున ఏలూరు పట్టణం నందు తిరుగుతున్న ఆటోలను ఆపి ఆటో డ్రైవర్ లకు   కౌన్సిలింగ్ ఇచ్చి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పిస్తున్న ఏలూరు 2 టౌన్ పోలీస్ లు  ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో  మాస్క్ లు లేకుండా సంచరించే వారు కోవిడు 19 నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపై ఈ.చలన విధిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలను  ప్రజలు పాటించాలి అని అవగాహన కల్పిస్తూ, మోటార్ సైకిళ్ళు మరియు పాదచారుల కు మాస్క్ కు ధరించాలి అని మరియు  కరోనా వైరస్ ను గురించి దాని వలన ప్రజల యొక్క ఆరోగ్యానికి జరిగే అనర్ధాలు గురించి ప్రచారము చేస్తూ  ఏలూరు పట్టణంలో వాహన తనిఖీ నిర్వహించినారు అనవసరంగా రోడ్డుమీద తిరిగే వాళ్లకు ఏలూరు టూ టౌన్ సిఐ  ఫైన్ విధించడం జరిగినది ఈ సందర్భంగా సిఐ  మాట్లాడుతూ ముఖ్యంగా విధి నిర్వహణ చేస్తున్న ఉద్యోగస్తులు అందరూ దయచేసి ఇ వారి ఆఫీసుకి వెళ్లేటప్పుడు వారి యొక్క లంచ్ బాక్సులు కూడా తీసుకు వెళ్ళినట్లయితే మధ్యాహ్నం పూట రద్దీని తగ్గించే అవకాశం కూడా ఉంటుందని దాని వలన ఇతరుల నుండి కరుణ వైరస్ వ్యాప్తి చెందకుండా స్వాయ  రక్షణ పొందగలుగుతారు అని తెలియజేసినారు*


 


  దళితుల మేనమామ నీవెక్కడ

  దళితుల మేనమామ గా చెప్పుకునే  ఏ.పీ. సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి 


*ఏపీలో మరో అరాచకం..... దళిత జడ్జి పై వై.సీ.పీ శ్రేణుల దాడి*


అయినా వెళ్లి పెన్ పవర్



*ఏపీలో దళితులపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గరగపాడు కఛులూరు లో జరిగిన బోటు ప్రమాదం లో 51 మంది చనిపోతే దాని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి నందుకు మాజీ ఎం.పీ. హర్ష కుమార్ ను అక్రమ అరెస్ట్ చేసి 48 రోజులు జైలులో పెట్టారు. అలాగే గరగపాడు అంబేద్కర్ విగ్రహం ఘటనలో అరెస్ట్ చేశారు. అలాగే  మహాజన్ పార్టీ నాయకులైన సరిపల్లి  రాజేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, కాకినాడ, సామర్లకోట లో కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారు. అలాగే విశాఖలో డాక్టర్ సుధాకర్ గారి పై ,చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనిత రాణి పై జరిగిన దాడులు.. మరువకముందే, అదే జిల్లాలో దళిత జస్టిస్ పై కూడా అదే జులుం ప్రదర్శించారు. తంబలపల్లి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఏకంగా దళిత జడ్జి జస్టిస్ రామకృష్ణ పై దాడులకు తెగబడ్డారు. వైసిపి నేతలు చేస్తున్న రాజకీయాలను ప్రశ్నించిన పాపానికి జడ్జి పై వైసీపీ నేతలు భౌతిక దాడులకు పూనుకున్నారు. బి.కొత్తకోటలో దళిత జడ్జి రామకృష్ణ నివసిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న భూ కబ్జాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి,  పోరాడుతున్నారు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఫిర్యాదు చేశారు అన్న , అక్కసుతో స్థానిక* *ఎమ్మెల్యే, మంత్రి అనుచరులు రెచ్చిపోయి, జడ్జి ఇంటి పైనే దాడి చేసి తమ దురహంకారాన్ని చాటుకున్నారు. గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన జడ్జి పదవిలో ఉన్న వారికే ఇలా జరిగితే సాధారణ ప్రజలు, దళితుల పరిస్థితి ఏంటని అందరూ విస్తుపోతున్నారు. ఇంత జరుగుతున్నా.. స్థానిక పోలీసులు మాత్రం దుండగుల పై కేసు నమోదు చేయకుండా చోద్యం చూడడం అనేక అనుమానాలకు తావిస్తోంది.  స్థానిక ఎమ్మెల్యే అండతో అధికార పార్టీ నాయకుల అక్రమాలు, దాడులు, వివక్ష రోజు రోజుకి ఎక్కువగా ఉందంటూ  బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని మాల మహానాడు గిడ్ల వెంకటేశ్వరరావు నేతలు ప్రకటించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి ,జడ్జి గారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాల మహానాడు జిల్లా* *అధ్యక్షులు గిడ్ల వెంకటేశ్వరరావు స్వేరో తెలిపారు. దళిత బహుజనులు ఇలాంటి దాడులకు భయపడకుండా, ముందుకు వచ్చి, అందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరారు.దీనికి  అయినవిల్లి మండల మాలమహానాడు సంఘీభావం తెలిపింది.        ఈ కార్యక్రమంలో*                    *గిడ్ల వెంకటేశ్వరరావు, మద్దా చంటిబాబు ఎస్,దుర్గారావు , జంగా కృష్ణమూర్తి, వజ్రపు బాల కుమార్, బడుగు దుర్గారావు, కాకర శ్రీను, గిడ్ల సురేష్ ,కొట్టాల  మురహరి, మాగాపు ఈశ్వరరావు, నామాడి భీమయ్య, కుమ్మరి రమణ, మచ్చా నాగయ్య, పరమట సత్యనారాయణ, బండి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు*


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...