Followers

లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోండి


లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోండి


జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు కృష్ణవేణి


గోకవరం ,పెన్ పవర్


కరోనా మహమ్మారి తరిమి కొట్టాలంటే జిల్లా లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని తదనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు బురా కృష్ణవేణి అన్నారు. శనివారం ఏజెన్సీ పర్యటన వెళ్లి వస్తున్నా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు బూరా కృష్ణవేణి గోకవరం లో తనను కలిసిన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు అక్కడ అక్కడ నమోదవుతున్నా ఆ సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుందని వైరస్ నిర్మూలన కోసం జిల్లాలో పూర్తిస్థాయి లో లాక్ డౌన్ విధించాలని ఈ విషయంపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ను కలిసి చర్చించడం జరుగుతుందనన్నారు, జిల్లా లో శనివారం ఒక్కరోజే వెయ్య యాభై ఒక కేసులు నమోదయ్యాయి అంటే కరోనా వైరస్ ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని మాస్క్ ధరించాలని,ప్రతి మనిషికి మనిషికి మధ్య రెండు మీటర్లు సామాజిక దూరం పాటించాలని జిల్లా ప్రజలను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు బూరా కృష్ణవేణి కోరారు.


అంబెడ్కర్ నివాసం పై దాడి...రాజ్యాంగం పై జరిగినట్టే  



అంబెడ్కర్ నివాసం పై దాడి...రాజ్యాంగం పై జరిగినట్టే  
 


మాదిగ జేఏసీ  రాష్ట్ర ప్రచార కార్యదర్శి. గద్దల.నాగేశ్వరరావు


 అశ్వాపురం, పెన్ పవర్



   ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య 
దేశమైన భారతదేశానికి చెక్కుచెదరని రాజ్యాంగాన్ని అందించి ఈ దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు తెలిసేలా 
కృషిచేసిన మహనీయుడు 
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.అని మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల. నాగేశ్వరరావు అన్నారు..శనివారం నాడు మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డా.పిడమర్తి.రవి పిలుపు మేరకు..ముంబాయి లో అంబెడ్కర్ నివాసం  (రాజగృహపై)దాడి చేసిన దానికి నిరసనగా అంబెడ్కర్ విగ్రహాల దగ్గర నిరసన దీక్షకు పిలుపు నివ్వడం జరిగింది...ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ఆ మహనీయుడు ఎంతో ఇష్టంతో నిర్మించిన "రాజ గృహ" ఇంటిపై దుండగులు దాడి చేయడం అంటే 
అది రాజ్యాంగం మీద దాడి చేయడమే.అని అన్నారు..అలాగే
ఆ మహనీయుడి ఇంటిపై దుండగులు దాడి చేయడం అంటే మన అందరి ఇంటి పైన దాడి చేసినట్లే.అని అన్నారు..
 మహా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి  తక్షణమే "రాజ గృహ"పై దాడిని దేశద్రోహం కింద సుమోటోగా స్వీకరించి అలాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలి అన్నారు. 
 ప్రత్యేక పోలీసు బలగాలతో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 
గారు నిర్మించిన రాజ గృహానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి. అని డిమాండ్ చేశారు.
ఇలాంటి దాడులు 
పునరావృతం కాకుండా తగు చర్యలు 
తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని  
డిమాండ్ చేస్తున్నాము..ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నియోజక వర్గ నాయుకులు మేకల.అంజిబాబు-అలవాల. కార్తిక్-ఇరుగు.కృష్ణతేజ-వెంకట్-జయశ్రీ-మానస-తదితరులు పాల్గొన్నారు.


మంత్రి కారులో పట్టుబడ్డ 5 కోట్ల 20 లక్షల డబ్బు


మంత్రి కారులో పట్టుబడ్డ 5 కోట్ల 20 లక్షల డబ్బు ఫై విచారణ జరపాలి..............మాజీమంత్రి గొల్లపల్లి 


రాజోలు,  పెన్ పవర్ 


 


 
ఇటీవల మంత్రి బాలినేని కారులో దొరికిన 5 కోట్ల 20 లక్షల రూపాయల నగదు పై
ప్రభుత్వం వెంటనే  విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ
శనివారం రాజోలు మండల తాసిల్దారు కి
 మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వినతి పత్రం సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం లో మంత్రి బాలినేని కారులో దొరికిన  నగదు ఫై విచారణ జరపాలని, మంత్రి బాలినేని రాజీనామా చెయ్యాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రత లు పూర్తిగా క్షిణించాయని,  వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు ఈ సందర్బంగా గొల్లపల్లి,  మంత్రి బాలినేని స్టిక్కర్ తో ఉన్న కారు లో పెద్ద మొత్తం లో సొమ్ము తమిళనాడు పోలీస్ లకు  దొరకడంతో   నిజం చెప్పవలసిన భాద్యత మంత్రి తో బాటు ముఖ్యమంత్రి కూడ ఉందని, అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న బాలినేని తక్షణమే రాజినామ చెయ్యాలని గొల్లపల్లి డిమాండ్ చేశారు.   ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన దళిత న్యాయమూర్తి రామకృష్ణ ఫై  వైయస్సార్స సీపీ నాయకుల అండదండలతో రౌడీ మూకలు రాళ్లు రువ్వి, కర్రలతో పైశాచికంగా దాడి చేసి న్యాయమూర్తి రామకృష్ణ కుడి చెయ్యి విరగగొట్టడం జరిగిందని దీనిపై ప్రభుత్వం స్పందించి  ఆయనకున్యాయం చేయాలనిి కోరారు.ఇటీవల దళితులు, దళిత డాక్టర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాగే రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు,బలహీన వర్గాలకు చెందిన నాయకుల ఫై, తప్పుడు కేసులు బనాయించి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని గొల్లపల్లి అన్నారు, ప్రస్తుత ప్రభుత్వం ఏ వర్గాల ఓట్లు తో అధికారం లోకి వచ్చిందో అదే వర్గాల వారిని అణగతొక్కే ప్రయత్నం చేస్తుందని  ఆయన అన్నారు , పై కేసులు పెట్టి నానా హింసలకు ప్రజల ను గురి చేస్తున్నారని రాష్ట్రం లో అరాచక పాలన నడుస్తుందని గొల్లపల్లి అన్నారు.ఈకార్యక్రమంలో  మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకి లక్ష్మణ్,మట్టా రాధ,  గుబ్బల శ్రీనివాస్, చాగంటి స్వామి, కసుకుర్తి త్రినాధస్వామి, అడబాల చంటి, బేతినీడి శ్రీనివాస్, కేతా శ్రీనివాస్, రాపాక నవరత్నం, రాపాక ఆనంద్బాబు, రేవు జీవరత్నం, నార్కేడమిల్లి కనకం, రావి మురళి కృష్ణ, పామర్తి రమణ, కడలి నాగేశ్వరావు,ఉండ్రు రామకృష్ణ, కడలి వెంకటేశ్వరావు,  గుబ్బల కుమార్, కడలి వెంకటరమణ, దాడి కృష్ణ, మట్టా శ్రీనివాస్, పొన్నమండ కొండ, నార్కేడమిల్లి విష్ణు, దాకే ఏడుకొండలు, చిట్టూరి కిట్టు, పితాని సూరిబాబు, నల్లి శ్రీనివాస్, మట్టపర్తి అబ్బులు,  చెల్లుబోయిన మోహన్  శ్రీనివాస్, బొడ్డపల్లి చిట్టిబాబు, పెచ్చెట్టి గణేశ్వరావు కట్టా లక్ష్మీపతిరావు, పెచ్చెట్టి వెంకటశ్రీనివాస్, కట్టా జయరామారావు, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..


సీనియర్ న్యాయవాది సుదీర్ కుమార్ కు పలువురి అభినందనలు


సీనియర్ న్యాయవాది సుదీర్ కుమార్ కు పలువురి అభినందనలు.....!  


  సామర్లకోట, పెన్ పవర్


  సామర్లకోట పట్టణంలో ప్రముఖ న్యాయవాదిగా సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్న తాండ్ర సుదీర్ కుమార్ ను పలువురు పట్టణ ప్రముఖులు శనివారం అభినందించారు. ఈయన న్యాయవాధ వృత్తిని ప్రారంభించి నేటికి మూడు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా ఆయనను మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు తో పాటు డి ఇ, సిహెచ్ రామారావు,జిల్లా మానవహక్కుల సంఘo అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా న్యాయవాది సుదీర్ కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నం ఆంద్రా యూనివర్సిటీ లోని డా.అంబెడ్కర్ కాలేజి ఆఫ్ లా లో ఎల్ ఎల్ బి డిగ్రీని పూర్తి చేసుకుని 1990జూలై 17 న తన న్యాయవాధ వృత్తిని ప్రారంభించినట్టు చెప్పారు.అప్పటి నుంచి ఎన్నో కీలకమైన సివిల్ కేసులు ను వాదించి విజయాలను సాధిస్తూ వచ్చానన్నారు.ప్రస్తుతం సామర్లకోట స్టాండింగ్ కౌన్సిల్ గాను పనిచేస్తున్నట్టు చెప్పారు.కాగా మూడు దశాబ్దాలుగా న్యాయ వృత్తిలో కొనసాగుతూ సేవలందిస్తున్న సుధీర్ కుమార్ ను ఈ సందర్భంగా అభినందించిన వారిలో మానవహక్కుల సంఘo నాయకులు కుంచె నానిబాబు,జుత్తుక అప్పారావు, వల్లీ బాషా తదితరులు ఉన్నారు.


రెవెన్యూ సచివాలయ సిబ్బందికి మాస్క్ లు శానిటైజర్లు పంపిణీ చేసిన  జనసేన మోటూరు



రెవెన్యూ సచివాలయ సిబ్బందికి మాస్క్ లు శానిటైజర్లు పంపిణీ చేసిన
 జనసేన మోటూరు


  పరవాడ పెన్ పవర్



పరవాడ మండలం: రావాడ గ్రామ పంచాయతీ లో గల సచివాలయం లో  పనిచేస్తున సెక్రటరీ,వీఆర్వో, సచివాలయం సిబ్బంది 26 మంది కి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి నియోజవర్గ జనసేన నాయకులు మోటూరు సన్యాసినాయుడు ఆర్థిక సాయం తో కేఎన్ 95 మాస్కులు అలాగే శానిటైజర్ లు ఒక్కొక్కరికి రెండేసి చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే మోటూరు హరి బాబు ఆర్థిక సాయం తో పారిశుద్ధ్య కార్మికులకు 25 కేజీలు బియ్యం,పది రకాల కిరాణా, ఏడు రకాల కాయగూరలు,ఒక జత బట్టలు ఇచ్చి సన్మానం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో రావాడ గ్రామ పంచాయతీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


వర్కింగ్ జర్నలిస్టులను వారియర్స్ గా గుర్తించాలి


*వర్కింగ్ జర్నలిస్టులను వారియర్స్ గా గుర్తించాలి*
*ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నినాదాలు*
*కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల  కుటుంబాలకు సత్వరమే 50 లక్షల భీమ వర్తింపజేయాలి*
*డిటి రామ్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు*


పెద్దాపురం పెన్ పవర్



 రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న పాత్రికేయులను కరోనా వారియర్స్ గా గుర్తించి కరోనా భీమాను వర్తింపజేయాలని ఏపీయుడబ్ల్యూజే పెద్దాపురం నియోజకవర్గ  పాత్రికేయులు కోరారు యూనియన్ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్త కోర్కెల దినం పురస్కరించుకొని ఏపీ యుడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకుర్తి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం ఆర్టీవో కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం డి.టి. రామ్ కుమార్ కు  వినతిపత్రం  అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు  అడపా వెంకట్రావు రెడ్డిపల్లి రమణమూర్తులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారికి మించిన విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు బీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే కరోనాతో మృతిచెందిన జర్నలిస్ట్ల కుటుంబాలకు  సత్వరమే 50 లక్షల రూపాయల భీమాను వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకుర్తి రాంబాబు . ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్ర దాస్ కోశాధికారి వర్మ లు మాట్లాడుతూ విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు సమాచార శాఖ ద్వారా భద్రత పరికరాలను అందజేయాలని మిత్రులందరికీ వైద్య ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్  పూర్వపు  అధ్యక్షులు బురాడ శ్రీనివాసరావు నియోజకవర్గ నాయకులు ఆలి ఎన్ పి ఎస్ .  వినాయక్  ఎన్ శ్రీరామ్ పచ్చ ఆకుల లోవరాజు చవ్వాకుల ఈశ్వరరావు రాయవరపు వీరబాబు  వెంకట్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు


కంటోన్మెంట్ జోన్ గా తాహిశాల్దార్ కార్యలయం రోడ్డు


కంటోన్మెంట్ జోన్ గా తాహిశాల్దార్ కార్యలయం రోడ్డు


అయినవిల్లి,పెన్ పవర్



నిత్యం ప్రజలతొ రద్దిగా వుండే అయినవిల్లి మండల తాహిశాల్దార్ కార్యలయం మరియు ఎంపిడిఒ కార్యలయనికి వెళ్లే దారిలో పక్కనే వున్న ఒక అలయనికి చెందిన పురోహితునికి కరొనా పాజిటివ్ రావడంతో అప్రాంతన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించినట్లు  ఎంపిడిఒ కె అర్. విజయ తెలిపారు శనివారం అప్రాంతన్ని కంటోన్మెంట్ జొనగా బ్యానర్ కట్టి భద్రత ఎర్పటు చేసారు పాజిటివ్ వచ్చిన వారిని కాకినాడ క్వారంటైన్ కు తరలించారు ఇప్పటికే అయినవిల్లి మండలంలొ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నా ఈనేపద్యంలొ భద్రత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే విరవల్లిపాలేం, తొత్తరముడి, అయినవిల్లి, ఎన్.పేదపాలేం, నేదునురు, తదితర గ్రామలలొ పాజిటివ్ కేసులు రావడంతో అప్రాంతాలు కంటోన్మెంట్ జోన్లుగా కొనసాగుతున్నాయి ఇప్పటికే గ్రామలలొ శానిటేషన్ పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని తప్పనిసరిగా మాస్కు దరించాలని సామజిక దూరం పాటించాలని లాక్ డౌన్ అమలను ప్రజలు దిక్కారిస్తే వారిపై కఠినమైన చర్యలు తప్పవని అయినవిల్లి ఎస్ఐ జి వేంకటేశ్వరరావు హెచ్చరిస్తున్నారు
నేడు సంపూర్ణ లాక్ డౌన్ కు సహకరించాలి :-నేడు అదివారం సంపూర్ణ లాక్ డౌన్ కు మండల ప్రజలు సహకరించాలని అయినవిల్లి ఎంపిడిఒ కె అర్ విజయ తెలిపారు అదివారం ఉదయం6గంటలనుండి మరునాడు  6గంటల వరకు పుర్తిగా లాక్ డౌన్ అమలులొ వున్నందున ప్రతి ఒక్కరు బాధ్యతగా సహకరించాలని కొరారు ఈకార్యక్రమంలొ అయినవిల్లి పంచాయతి అదికారి కె.రామచంద్రరావు, తదితరులు ఉన్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...