Followers

బిడ్డా!...ప్రయాణం భద్రం ... ప్రధాన రహదారులు  ఛిద్రం

పరీక్షలు నాటినుంచే హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటిస్తే శ్రేయస్కరం


పరీక్షలు నాటినుంచే హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటిస్తే శ్రేయస్కరం..


కోవిడ్ కేంద్రాలను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి.  


 సామర్లకోట,  పెన్ పవర్. 


 కరోనా నిర్ధారణకు గాను చేపడుతున్న కోవిడ్ పరీక్షలు చేయించుకున్న సమయం నుంచి పరీక్షలు చేయించుకున్న వారు హోమ్ క్వారంటైన్ నిబంధనలును పాటిస్తూ ఉంటే తద్వారా వారి గృహాలను కోవిడ్ నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందని అది ఎంతో శ్రేయస్కరం అని జిల్లా డిప్యూటీ కలెక్టర్ సామర్లకోట కోవిడ్ ప్రత్యేకాధికారి ఎస్వీ ఎస్ ఎస్ సుబ్బలక్ష్మి అన్నారు.సామర్లకోట పట్టణం లోని రెండు అర్బన్ సెంటర్ల పరిధిలో శుక్రవారం నిర్వహించిన కోవిడ్ పరీక్షలను ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్నా,లేకున్నా ఒకసారి పరీక్ష చేయించుకున్న వారు ఇంటికి వెళ్లి హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటిస్తే వారి కుటుంబాలకు ఎంతో మంచ్చిది అన్నారు.ముందుగానే వ్యాధి సోకితే తీసుకునే పోషకాహారం పండ్లు కూరగాయలు మందులు ఏమిటో వైద్య సిబ్బంది ద్వారా తెలుసుకుని జాగ్రత్తలు వహించాలి అన్నారు.అలాగే గృహంలో మిగిలిన కుటుంబం సబ్యులతో    సామాజిక దూరాన్ని పాటించడం,తరచు పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు వహిస్తే పాజిటివ్ వచ్చిన కొద్దీ రోజులలోనే సాధారణ స్థితికి రావడం సాధ్యమవుతుంది అన్నారు.అలా చేస్తూ ప్రభుత్వం అందించే హోమ్ క్వారంటైన్ కిట్టులను ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా స్థానిక తహశీల్దారు వి జితేంద్ర ,మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు ,డి  ఇ సి హెచ్ రామారావు లతో పాటు మెడికల్ సిబ్బందికి ఆమె సూచనలు అందించారు.ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ వెంట తహసీల్దార్,కమిషనర్,డి ఇ, అర్బన్ హెల్త్ సెంటర్ ల వైద్యులు తదితరులు ఉన్నారు.


కేంద్ర నిరంకుశ పాలనను ఖండించాలి


కేంద్ర నిరంకుశ పాలనను ఖండించాలి


చింతపల్లి , పెన్ పవర్


 కేంద్రంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ చర్యలను,రైల్వేల ప్రైవేటికరణను భారత దేశ ప్రజలు ఖండించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. రైల్వేల ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం స్థానిక ప్రధాన రహదారిలో ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అందులో భాగంగానే లక్షలాదిమంది ఉపాధి పొందుతున్న రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారని అన్నారు. నింగిలో ఎగురుతున్న విమానం దగ్గర్నుంచి జాతీయ రహదారుల వరకు   ప్రైవేటీకరణ చేయబోతున్నారని,కేంద్రం యొక్క నిరసన పాలనను ప్రజలు  అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో   చిరంజీవి  ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.


  కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం మూణ్ణళ్ల ముచ్చట గా రోడ్లు


  తారు రోడ్లు నిర్మాణంలో కానరాని నాణ్యత.
  కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం మూణ్ణళ్ల ముచ్చట గా రోడ్లు.
 విచారణ జరిపించాలని కలెక్టర్ కి వినతి.


   గూడెం కోత్త వీధి _పెన్ పవర్


 మారుమూల గిరిజన గ్రామాల్లలో ప్రభుత్వం చేపట్టిన
తారు రోడ్లు నిర్మాణాలలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆదివాసి జ్యయింట్ య్యాక్సన్ కమిటీ మండలం కన్వీనర్ కొర్రా బాలరాం. సభ్యులు రిమల పాల్ ఆరోపించారు. శుక్రవారం స్దానిక
విలేఖరులతో మాట్లాడుతూ గూడెం కోత్త వీధి మండలంలో ఆదివాసి గిరిజన చైతన్య యాత్రలు చేపట్టామని మారుమూల గ్రామాల్లో పలుసమాస్యలు తమ కమిటీ దృష్టికి తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. మారుమూల అయిన తిములబంద. కుంకుంపూడి. లక్కవరం. వాడు మామిడి. అమ్మవారి దారకొండ. గాలికొండ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వంలక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే శాశ్వత ప్రాతిపదిక మీద తారు రోడ్లు నిర్మిస్తున్నప్పటికి సంబంధిత శాఖ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు నిర్మాణంలో నాణ్యత పాటించక పోవడంతో తారు తక్కువగా వినియోగంచడంవలన నిర్మాణం పూర్తి చేసిన రోజులు వ్యవధిలోనే శిద్దిలవ్యవస్థల చేరుకుంటున్నయని. బలరాం ఆవేదన వ్యక్తంచేశారు. కుంకుంపూడి వద్ద నిర్మాణంలో ఉన్న తారురోడ్డు పరిశీలించగా నాణ్యత ప్రమాణాలు వెలుగు చూసాయి. 10. సంవత్సరాలు వుండవలసిన తారు రోడ్లు రోజులు వ్యవధిలోనే చెడిపోతున్నాయి.
 మారుమూల  కావడం  ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొరవడటం తో కాంట్రాక్టర్లు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని  ఆరోపించారు. మారుమూల రోడ్లపై విజిలెన్స్ తనిఖీ లు చేస్తే నాణ్యత బయటపడుతుందని  అయిన జిల్లా కలెక్టర్ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కోరారు. కొర్రా నిలకంఠం గౌతమ్. మల్లేస్.శ్వరావు. నారాయణ. కొడా ఆనందం. పాలుకున్నారు.


న్యాయవ్యవస్థపై దాడి


న్యాయవ్యవస్థపై దాడి


అయినవిల్లి ,పెన్ పవర్


దళిత న్యాయమూర్తిఎస్. రామకృష్ణ పై దాడి న్యాయవ్యవస్థపైన రాజ్యాంగ వ్యవస్థ పైన దాడి అని మండల టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు బి. జోగేష్ అన్నారు .ఈ మేరకు  ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో  దళితులపై ఒక పద్ధతి ప్రకారం దాడులు జరుగుతున్నాయన్నారు. జడ్జి రామకృష్ణ పై అగ్రవర్ణ నిందితులు దాడికి తెగపగడం రాష్ట్రంలో శాంతిభద్రతల తీరును ప్రతిబింబిస్తుందని అన్నారు. దళితుల మద్దతుతో గద్దెనెక్కిన జగన్ ప్రభుత్వం మిత్ర ద్రోహానికి పాల్పడుతుందన్నారు. డాక్టర్ సుధాకర్ ,డాక్టర్ అనిత, ప్రస్తుత సంఘటనలు  దళితులపట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని అన్నారు.  దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. రిజర్వ్ డ్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఇకనైనా మౌనం వీడాలని సూచించారు. దళిత వ్యతిరేకులకు ప్రాధాన్యతనిచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయ ఉద్యోగుల్లో అభద్రతా భావానికి ఈ సంఘటన కారణమౌతుందన్నారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.


కరోనా పాజిటివ్ నిండు గర్భిణీ కి ప్రసవం చేసి మానవత్వం చాటుకున్న వైద్యులు

కరోనా పాజిటివ్ నిండు గర్భిణీ కి ప్రసవం చేసి మానవత్వం చాటుకున్న వైద్యులు.


  విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


కరోనా పాజిటివ్ కేసు అనగానే ఆమడ దూరం పారిపోవడం సహజం. కానీ అదే  కరోనా పాజిటివ్ తో  ఉన్న ఒక నిండు గర్భిణీ కి శస్త్రచికిత్స చేసి  ఇద్దరు డాక్టర్లు  మానవత్వం చాటుకున్నారు. విశాఖ ఉక్కు నగరంలో  గురువారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉక్కు నగరానికి చెందిన  కరోనా పాజిటివ్  వచ్చిన నిండు గర్భిణీ  ప్రసవ వేదనతో ఉంది. ఈమెను విమ్స్ కు తరలించారు.  అనుమతి లేకపోవడంతో ప్రధమ ఆస్పత్రికి  రిఫర్ చేశారు. అక్కడా నిరాశే ఎదురైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు  ఆస్పత్రుల చుట్టూ తిప్పి ఫలితం లేకపోవడంతో  ఉక్కు నగరం లో జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరోనా రోగి అన్న విషయం మర్చిపోయారు. నిండు గర్భిణీ ప్రసవ వేదనకు  చలించిపోయారు. తక్షణం ఆసుపత్రిలో చేర్చుకొని కోవిడ్  19 నిబంధనల మేరకు  భద్రతను పాటించి  నిండు గర్భిణికి  సిజేరియన్ చేసి ప్రసవం కావించారు. తల్లి బిడ్డ ఆస్పత్రిలో ఉన్నారు. కరోనా పాజిటివ్ నిండు గర్భిణీ కి మానవత్వంతో పురుడు పోసిన వైద్యులు సుజాత అనంతలను ఉక్కు కార్మికులు  కృతజ్ఞతలు తెలియజేశారు.


ఈ క్రాఫ్ బుకింగ్ నమొదు ప్రారంభం


ఈ క్రాఫ్ బుకింగ్ నమొదు ప్రారంభం


పెన్ పవర్, వలేటి వారిపాలెం 


అయ్య వారి పల్లి గ్రామంలో ఈ క్రాఫ్ట్ బుకింగ్ ప్రారంభమైన నట్లు అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు పంట నమోదు చేయడం భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. ఈ క్రాఫ్ చేయడం వల్ల రైతులకు  పంటనష్టం సంభవిస్తే ప్రభుత్వం  నష్టపరిహారం అందిస్తుంది.  ప్రభుత్వం వారే పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రం వద్ద విత్తనాలు పురుగుమందులు అన్నీ అందుతాయని రైతులకు ఈ రైతు భరోసా కేంద్రం  ఎంతో లాభసాటిగా ఉండటంతో పాటు, పలు ప్రయోజనాలు చేకూరుతాయని  ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్వో సూరి బాబు, వాలంటీర్ సీతారామయ్య, రైతు మంచాల శ్రీనివాస రావు , పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...