Followers

తలసీమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం


తలసీమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం


 పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి:   


  తలసీమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు రక్తదానం చేసిన ఇస్కాల ప్రతాప్ కు  అభినందనలు తెలుపుతూ ప్రశంశా పత్రాన్ని  ఎల్ ఐ సి  అధికారి చిన్ని బాల గంగాధర్ తిలక్ అందజేశారు .ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ కరోనా సమయం లో బ్లడ్ బ్యాంకు ల్లో రక్తం నిల్వలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో రక్తదానం చేయటం గొప్ప విషయమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సక్షం రాష్ట్ర ప్రతినిధి చెన్నా రామాంజనేయులు, ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు పాల్గొన్నారు. 


ట్రాఫిక్   నియంత్రణ చేస్తున్న అధికారులు


ట్రాఫిక్   నియంత్రణ చేస్తున్న అధికారులు   


పెన్ పవర్,కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి


  కందుకూరు లో కరోనా కేసులు పెరుగుతున్న నేపద్యంలో ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా రైతు బజార్ వద్ద కార్లు,ఆటోలు అటువైపు వెళ్లకుండా పార్కింగ్ దగ్గరే ఉండేటట్లు కందుకూరు రూరల్ ఎస్సై  అంకమ్మ ,మునిసిఫల్ కమీషన్ మనోహర్  రైతు బజార్ కి ఇరువైపులా తోపుడు బండ్లను ఉంచి వాహనాలను నియంత్రించారు.రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా పార్కింగ్ దగ్గర నిలిచిఉన్న నీటిని,చెత్తని శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై  అంకమ్మ మాట్లాడుతూ కందుకూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు గుమ్మిగూడకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈరోజు ఒక ప్రయత్నం చేశామని ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ  నాయకులు గణేశం గంగిరెడ్డి, చక్కా వెంకట కేశవరావు పాల్గొన్నారు. 


సింహాచలం  ఇ. ఓ. భ్రమరాంబిక ను కలిసిన బీజేపీ నాయకులు




సింహాచలం  ఇ. ఓ. భ్రమరాంబిక ను కలిసిన బీజేపీ నాయకులు


పూర్ణా మార్కెట్,  పెన్ పవర్


సింహాచల దేవస్థానం కృష్ణాపురం గోశాలలో గోవులను సంరక్షణ చేసే కార్మికుల ను విధుల నుంచి తొలగించారనే  విషయం తెలిసి విశాఖ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కె.ఎన్.పి.చక్రవర్తి భారతీయ జనతా యువమోర్చా జోనల్ ఇంచార్జ్ 98 వార్డు బి జె పి, జనసేనా ఉమ్మడి అభ్యర్థి  పేరి శ్రావణ్ కుమార్  సింహాచల దేవస్థానం ఈవో భ్రమరాంబికాన్ని కలిసి సింహాచల దేవస్థానం గోశాలలో జరిగేటటువంటి  విషయం సింహాచల అడగడం జరిగినది, ఇ. ఓ సానుకూలంగా స్పందించి గోశాలలో పాత టెండర్ అయిపోవడం వల్ల మాత్రమే కార్మికులను ఆపడం జరిగిందని, కొత్త టెండర్ వచ్చిన తక్షణం విషయాలన్నీ సాధ్యమవుతాయని ఇ. ఓ.ఓ.  చెబుతూ ప్రస్తుతం గోవులకు ఇబ్బంది లేకుండా కార్మికులను పెడుతూ గోసంరక్షణ సక్రమంగా జరిగేటట్లు చూస్తున్నామని  తెలిపారు, ఈ కార్యక్రమం లో 98 వార్డు కన్వీనర్ పురుషోత్తం రావు, బీ.జె.పి,నాయకులు చైతన్య ప్రభు.  బి.జె.వై.ఎమ్, నాయకులు చొప్పా వెంకట్రావు,బి.జె.వై.ఎమ్, పీతల చిరంజీవి యాదవ్ 94వార్డు బిజెపి సీనియర్ నాయకులు మల్లవరపు రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


రైల్వే ప్రైవేటీకరణ విధానాలకు నిరసిస్తూ


రైల్వే ప్రైవేటీకరణ విధానాలకు నిరసిస్తూ.


సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో నిరసన


పెన్ పవర్ తాడేపల్లిగూడెం


పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో రైల్వే స్టేషన్ వద్ద
సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబూరావు ఆధ్వర్యంలో
రైల్వే ప్రవేటీకరణ విధానాలకు నిరసిస్తూ సి.ఐ.టి.యు ఆధ్వర్యం లో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు .  బాబూరావు మాట్లాడుతూ కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తుా,ప్రజలందరికి తక్కువ ధరకు ప్రయాణ సధుపా యాన్ని అందిస్తున్న రైల్వే లను కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరించడాన్ని  ఆయన తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పోరేట్  శక్తులకు కట్టపెట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరిస్తున్న దని విమర్శించారు.ప్రజల ఆస్థితో స్థాపించుకున్న సంపదలను ప్రవేట్ వారికి అప్పగించడం సరైనది కాదన్నారు.ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడానికి ప్రజలంతా ఉద్యమించాలన్నారు.ఈ కార్యక్రమం లో సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ,నాయకులు మడక రాజు,కరెడ్ల రామకృష్ణ ,జవ్వాది శ్రీను తదితరులు పాల్గొన్నారు .


పెన్ పవర్ వార్త కు స్పందన


పెన్ పవర్ వార్త కు స్పందన


ఐ పోలవరం,పెన్ పవర్


 ఐ పోలవరం మండలానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షపునీరు తో  నిండి పోయి మొత్తం గుంతలు గుంతలు ఉండటంతో అధికారులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డు కీమోక్షం ఎప్పుడు అని వ్రాసిన పెన్ పవర్ వార్త కు ఐ పోలవరం సచివాలయ అధికారులు  స్పందించి  రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా జెసిబితో పనులు చేయించారు 


ముందు జాగ్రత్త కోసం కరోనా టెస్ట్లు


ముందు జాగ్రత్త కోసం కరోనా టెస్ట్లు.


వి ఆర్ పురం పెన్ పవర్.


వి ఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో గలాపి హెచ్ సి వైద్యశాలలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయుచున్న సిబందికి ముందు జాగ్రతకోసం కరోనా టెస్ట్లు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించినారు.శుక్రవారం కరోనా టెస్ట్లు 14 మందికి నిర్వహించామని డాక్టర్ సుందర్ ప్రసాద్ తెలిపారు.ఈ విషయం పై మండల తహశీల్దార్ ఎన్ శ్రీధర్ ను వివరణ కోరగా వి ఆర్ పురం మండలంలో కరోనా మహమ్మారి కరణం గా ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని ముందు జాగ్రత్తకోసం మండల ప్రజలు కరోనా టెస్ట్లు చేయించుకోవాలి.మనిషి మనిషికి దూరం పాటించాలి,ప్రతిఒక్కరు మాస్కులు ధరించాలి,లేనియెడల 50 రూపాయలు జరినామా విధించబడును.ద్విచక్ర వాహనంపై ఒక్కరే ప్రయాణించాలి,ఇద్దరు ముగ్గురు ప్రయాణించినచో షిజ్ చేయబడును.ఆటోలు,మేజిక్ లు పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించిన ఎడల,అలాంటి వాహనాల ను షీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరుగుతుంది. కిరాణా షాపులు మరియు ఇతర షాపులు ఉదయం 6 గంటలనుండి 11 గంటల వరకే తెరిసి ఉంచాలి, అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవాహరించిన వారిపై కేసులు నమోదం చేయబడును.ప్రతి కిరాణా సేపు యొద్ద సైనటీజర్ ,సబ్బు నీళ్లు సిద్ధంగా ఉంచ్చలి.మా పై అధికారుల ఉత్తర్వులు మేరకు మండల ప్రజలకు తెలియజేయటం జరిగింది. ఈకార్యక్రమంలో మండల యం పి డి ఓ శ్రీనివాసరావు, డాక్టర్ నాగార్జున, వి ఆర్ పురం ఎస్సై వెంకట్ పోలీస్ సిబ్బంది ,రివెన్యూ కార్యాలయ సిబ్బంది,యం డి ఓ కార్యాలయ సిబ్బంది,ఏ ఎన్ యం లు మండల ప్రజలు పాల్గొన్నారు.


ఆన్ లైన్ సేవలతో కరోనా కట్టడి -ఎంవిఐ విఠల్


ఆన్ లైన్ సేవల తో కరోనా కట్టడి -ఎంవిఐ విఠల్



చింతూరు. పెన్ పవర్ 



:ఆన్ లైన్ సేవల వినియోగంతో కరోనా కట్టడికి దోహద పడ్డవారమౌతామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విఠల్ అభిప్రాయ పడ్డారు.ఈ మేరకు వాహనదారులకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో రవాణా శాఖకు చెందిన సేవలను ప్రజలు ఉన్నచోటినుండే పొందవచ్చని పేర్కొన్న ఆయన  డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ (కాకినాడ) సీహెచ్.ప్రతాప్ జారీచేసిన ఆదేశాల వివరాలను ఎంవిఐ విలేకరులకు వెల్లడించారు. సెకండ్ హ్యాండ్ వాహనాల పరిశీలన,పట్టుబడ్డ వాహనాలను విడిపించుకోవటం, తపాలా శాఖ ద్వారా వెనక్కి తిరిగివచ్చిన వాహన,డ్రైవింగ్ లైసెన్స్ ల స్మార్ట్ కార్డు పొందటం,ఇతర రికార్డ్ ల సవరణ తదితర సేవలు వినియోగానికి  ఆర్టీవో కార్యాలయ వాట్సాప్ నెంబర్ 7670931573 ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అలాగే కొన్ని వాహనాలు తనిఖీ నిమిత్తం చూపవలసి ఉన్నందున వాటి వివరాలకై స్థానిక రవాణా శాఖా కార్యాలయ నెంబర్లలో కూడా సంప్రదించ వచ్చని ఎంవిఐ పేర్కొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...