Followers

డంపింగ్ యార్డ్ గా మారిన భూపతి పల్లి గ్రామం


గుండ్లకమ్మ వాగు డంపింగ్ యార్డ్ గా మారిన భూపతి పల్లి గ్రామం


 మార్కాపురం, పెన్ పవర్


ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం భూపతిపల్లి  గ్రామంలో నెరవేరని స్వచ్ఛభారత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ఉండాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు దీనిలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో చెత్త నిల్వ కేంద్రాలను  రూ.లక్షలు ఖర్చు చేసి డంపింగ్ యార్డ్ నిర్మాణం చేశారు . స్వచ్ఛ భారత్ భూపతి పల్లి గ్రామంలో అటకెక్కింది.తాగునీరు, సాగునీరు  ,ఖమ్మం చెరువు నుంచి వచ్చే  వాగులో గ్రామంలో సేకరించిన చెత్తను గుండ్లకమ్మ వాగులో వేయడం వలన ఇబ్బంది పడుతున్న ప్రజలు పలుసార్లు పంచాయతీ కార్యదర్శికి గ్రామప్రజలు చెప్పినప్పటికీ.....నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న కార్యదర్శి. ....గ్రామాల్లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న  నిర్లక్ష వైఖరి వ్యవహరిస్తున్న అధికారులు .......తక్షణమే అధికారులు పంచాయతీ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాలని వాపోతున్న గ్రామ ప్రజలు


ఆర్ విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల వస్తువుల పంపిణి


రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బి.జె.పి ఎమ్మెల్సీ పి.వి.యన్ మాధవ్   నిత్యావసరాల వస్తువుల పంపిణి


పూర్ణా మార్కెట్ పెన్ పవర్


రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్, ప్రకృతి చికిత్సాలయం మహారాణి పేట, భారతీయ జనతా పార్టీ వైద్య  విభాగము, మెహర్ బాబా ఆర్థిక సహకారంతో 110  వ రోజు  కలిసి నిర్వహించిన నిత్యావసర సరుకులు పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి.వి.యన్ మాధవ్. ఎమ్మెల్సీ ముందుగా నిత్యావసర సరకులను బియ్యం, నూనె,గోధుమపిండి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్   సమయంలో నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా  ప్రతివారు  సామాజిక సేవలో తోటి వారికి సహాయం అందించాలని గత 110 రోజులుగా రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.ప్రతివారు మాస్క్, గ్లౌజ్, సానిటైజర్ లను  ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని ,అప్పుడే కరోనాను దూరం చేయవచ్చునని అన్నారు .కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి మోడీ  ప్రతి క్షణము మాస్క్ వేసుకుంటున్నారాని వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమమునకు   ఆర్థిక సహకారం    అందించిన  మెహర్ బాబా ని  అభినందించారు . ఈ కార్యక్రమంలో డా.శిష్ట్లా శ్రీలక్ష్మి, రుపాకుల. రవి కుమార్, ఏపీ స్టేట్  బి జె పీ. మెడికల్ సెల్ కన్వీనర్, ఏస్.మహేష్, ఏస్.చాతుర్య, 29వ వార్డు బి జె పి. ప్రేసినెంట్ పల్లా.లక్ష్మి , డా. వై.లక్ష్మణ రావు, బి జె పి. లీడర్స్ పల్లా. చలపతి రావు, చుక్కాకుల.రాంబాబు, గెదల. శ్రీహరి, టి.గిరిజ, గౌతం, జీ.రాము, సీ హెచ్. రాజబాబు తదితరులు పాల్గొన్నారు


సామాజిక సేవలో ఉద్యోగ సంఘాలు ముందుండాలి


సామాజిక సేవలో ఉద్యోగ సంఘాలు ముందుండాలి



ప్రభుత్వ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు



(పెన్‌పవర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌, ఒంగోలు)



ప్రభుత్వ ఉద్యోగులు  తమ సంఘం ద్వారా ఉద్యోగులు సంక్షేమాన్ని ఏ విధంగా కాంక్షిస్తారో అలాగే సమాజంలోని పేదలకు అవసరమైన సహాయం అందించటానికి ముందుకు వచ్చి తమ సామాజిక బాధ్యతను నెరవేర్చాని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు ఆకాంక్షించారు. ఒంగోలు సంజయ్‌గాంధీ నగర్‌లోని పేద ముస్లిం ఇంట్లో వివాహానికి ఒంగోలు నగర  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరుపున ఇనుప బీరువాను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు  కె పాండురంగారెడ్డి, ఈదర విజయ భాను, కె శివరామకృష్ణ పాల్గొన్నారు.


కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం  


కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం  



ఒంగోల్‌ రిమ్స్‌, మార్కాపురం జిల్లా వైద్యశాలల్లో సౌకర్యాు లేక ప్రజలు  ఇక్కట్లు



కరోనా కట్టడిలో సమావేశానికి మాత్రమే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం 


క్షేత్ర స్థాయిలో ఆచరణ శూన్యం


ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని కరోనా బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి


అధికారులు నిర్లక్ష ధోరణి  విషయాలపై కలెక్టర్‌ కి లేఖ



తిరుపతిలో మీడియా మిత్రుడు మరణించడం బాధాకరం



బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి



బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి



బిజెపి ఒంగొలు  పార్లమెంట్‌ అధ్యక్షులు  శిరసనగండ్ల శ్రీనివాసు డిమాండ్‌



(పెన్‌పవర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌, ఒంగోలు)



రాష్ట్రంలో రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్న కరోనా వైరస్‌ ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫమయిందని రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు  వారి నిర్ణయాలు నిర్లక్షానికి అద్దం పట్టేలా ఉన్నాయని బిజెపి ఒంగోలు  పార్లమెంట్‌ అధ్యక్షలు  శిరసనగండ్ల శ్రీనివాసు మండిపడ్డారు. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుతో ప్రజలు  బయన్దోళనలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలం  అయిందని స్పష్టం చేశారు. జిల్లాలో పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసులు, మరణాలతో ప్రజలు  ఆందోళనకు గురవుతున్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు  నివారణ చర్యలు  సమావేశానికే తప్ప క్షేత్ర స్థాయిలో అమలయ్యే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. గతంలో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న సమయంలో కనీసం స్పష్టత ఉండేదని, కాని నేడు కరోనా వైరస్‌ విస్తృతంగా పెరుగుతున్న సమయంలో పట్టించుకోవడం మానేసారని మరి ఇది దేనికి సంకేతమో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో వైద్యాధికారు నిర్లక్ష్యం వల్ల  27,000 శ్యాంపిల్స్‌ వృధా అయ్యాయని, ఈ విషయంపై స్వయానా కలెక్టర్‌ వైద్యాధికారులపై మండిపడ్డారని, మరి ఇలా ప్రజల  ప్రాణాతో చెగాటలాడేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాని ఆయన కోరారు. ముఖ్యంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితులకు రిమ్స్‌లో అరకొర సౌకర్యాలతో చేతులు దుపుకుంటున్న పరిస్థితి ఏర్పడిరదని, మాములు  రోజుల్లో కంటే వ్యాధి బారిన పడిన వారికి ముఖ్యంగా ఆత్మ స్థైర్యం నింపాలని, దానివల్ల  తొందరగా కోలుకునే పరిస్థితి ఉంటుందని, కాని ప్రజలు భయాందోళనకు గురయ్యేలా రిమ్స్‌లో ఏర్పాట్లు దారుణంగా ఉన్న పరిస్థితి అని ప్రశ్నించారు. కనీసం వ్యాధి బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  చెబుతున్న కనీసం కడుపునిండా శుభ్రంగా ఉన్న ఆహారం కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో రాస్ట్రం  ఉండటం చాలా బాధాకరమని మండిపడ్డారు. నిరంతరం రోజు వ్యాధిబారిన పడి చేరుతున్న బాధితులు  ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిరదన్నారు. ప్రభుత్వం మాత్రం పైకి అన్ని ఉన్నాయని ఫోటోలకి, మాటలకే  పరిమితం అయ్యిందని అన్నారు. రిమ్స్‌లో సరైన సౌకర్యాలు  లేక బాధితులకు సరైన ఆహారం అందక ఎవరికి చెప్పిన పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి వల్ల   తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని ప్రభుత్వంకి మాత్రం ఇవేవీ కనపడకపోవడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. రిమ్స్‌లో ఇబ్బందులపై పలు పత్రికల్లో, ఛానళ్ళలో కధనాలు వస్తున్నాయని, అయినా ప్రభుత్వం, అధికార్లు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సరైన ఆహారం అందించలేకపోతున్నా...  కాంట్రాక్టర్లకు  దోచిపెడుతూ బాధితులకు సరైన, శుభ్రంగా ఉన్న ఆహారం అందించడంలో విఫలం అయిందన్నారు. కరోనా పరీక్ష కోసం గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, అదే విధంగా టెస్ట్‌ తరువాత రిజల్ట్‌ కోసం రోజులు తరబడి వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు. అదే విధంగా నేడు మార్కాపురం జిల్లా వైద్యశాలలో పాజిటివ్‌ వచ్చిన దంపతులు ఇద్దరు వారికి వైద్యశాల పరిస్థితి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వారి బాధను వీడియో ద్వారా రికార్డ్‌ చేసి వైద్యం చేయాంటూ వారు ఆవేదన చెందుతున్నారని, ఒక రూములో తాళం  వేసి బంధించి, వారికి ఎలాంటి వైద్యం కానీ, ఆహారం కానీ వారి ఆరోగ్య పరిస్థితి పై పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రజల  ప్రాణాలపై ప్రభుత్వం, అధికారులకు ఎంత శ్రద్ధ ఉన్నదో అర్థం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు . వెంటనే ప్రభుత్వం, అధికారులు  వీడియోలో చెప్పిన బాధితులకు వైద్యం అందించాని కోరారు. జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో నివారణ చర్యలు  శూన్యమని ప్రభుత్వం, కొంత మంది అధికారులు  వ్యవహరిస్తున్న తీరును  సంఘటనలు  విషయాలపై కలెక్టర్‌కి లేఖ రాయడం జరిగిందని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాని సూచించారు. కరోనా కేసు నమోదు అయిన ప్రాంతాల్లో శానిటేషన్‌ ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉన్నదని, బ్లీచింగ్‌కి బదులు సున్నం చల్లి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఏర్పడిరదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వైద్యశాలల్లో బాధితులకు సరైన ఆహారం, వైద్యం అందించాని  ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఉత్తుత్తి పబ్లిసిటీ పిచ్చితో కాకుండా ప్రజల రక్షణకై నివారణ చర్యలు తీసుకోవాని వారు కోరారు. అదే విధంగా కరోనా సమయంలో సైతం ముందుండి విధులు నిర్వహించడంలో భాగంగా ప్రాణాలను కోల్పోయిన తిరుపతి సీవీఆర్‌ న్యూస్‌  కెమెరామెన్‌ పార్థసారధికి ఆయన భారతీయ జనతా పార్టీ వైపు నుండి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాని ఆయన కోరారు. అదేవిధంగా కడప ఎన్టీవీ రిపోర్టర్‌ మధుసూదన్‌ సైతం వ్యాధి బారినపడి చికిత్స అందక తన బాధని వీడియో రూపంలో చిత్రీకరించారని సమాజంలో ప్రతి విషయాన్ని ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేయడంలో ముందుండి పనిచేస్తున్న మీడియా మిత్రులు కుడా  సరైన వైద్యం కోసం  బాధపడటం  చాలా భాదకరమైన విషయమని ఆయనకి మెరుగైన వైద్యం అందించాని త్వరగా కోలుకోవాని కోరారు. ఫ్రంట్‌ లైన్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కరోనా కట్టడికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


నిరుద్యోగ యువతకు చుక్కులు చూపిస్తున్న ఉపాధి కల్పనాధికారి


నిరుద్యోగ యువతకు చుక్కులు చూపిస్తున్న ఉపాధి కల్పనాధికారి



మాస్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు శివాజీ ఆరోపణ



కరోనా సాకుతో ఆఫీసుకు ఢుమ్మా 



ఒకరిద్దరొచ్చినా స్మార్ట్‌ ఫోన్‌ గేమ్‌తో బిజీ



(పెన్‌పవర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌, ఒంగోలు)



జిల్లా కేంద్రమైన ఒంగోలు  ఎంప్లాయ్‌మెంటు కార్యాలయంలో నిరుద్యోగులుగా నమోదు చేసుకునే పక్రీయను అధికారులు  నిలిపి వేశారని మాస్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు జి శివాజి ఆరోపించారు. జిల్లా మారుమూల నుండి ప్రతిరోజు ఎంతోమంది నిరుద్యోగ యువత, విద్యార్దులు  తమ విద్యార్హత సర్టిఫికేట్లు నమోదు కొరకు ఎంప్లాయ్‌మెంటు కార్యాలయంకు వచ్చి ఉసూరు మంటూ తిరిగి వెళుతున్నారు. ఇదేమిటని అక్కడి విధుల్లో ఉన్న సిబ్బందిని అడిగితే కోవిడ్‌-19 కరోనా బారినపడకుండ అంటూ వింత సమాధానం చెబుతూ విద్యార్థులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని శివాజి విమర్శించారు. స్మార్టు ఫోన్ల పై ఉన్న శ్రద్ధ  నిరుద్యోగులపై లేకపోవడం పట్ల ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  ప్రభుత్వం  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను ఎంప్లాయ్‌మెంటు కార్యాలయం సౌజన్యంతో  పోస్టులను ఎ.పి.సి.ఓ.యస్‌. ద్వారా భర్తీ చేయనుందన్నారు. దీని కోసమై నిరుద్యోగులు విద్యార్హత నమోదు కోసం రోజులు తరబడి  కార్యాలయం చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలోని ఉద్యోగుల లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ, విధులకు హాజరై ప్రజలకు సేవలు అందిస్తుంటే కేవలం ఎంప్లాయ్‌మెంటు కార్యాలయ ఉద్యోగులు  మాత్రం  ఇలా ప్రవర్తించడం ఏమిటని శివాజి ప్రశ్నించారు. రోజుకు కొద్దిమంది చొప్పున భౌతిక దూరం పాటిస్తూ, కోవిడ్‌-19 జాగ్రత్తలు  పాటిస్తూ నిరుద్యోగ విద్యార్థులకు నమోదు అవకాశం కల్పించాని వారు కోరారు.


రైల్వే ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలి


రైల్వే ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలి



డివైఎఫ్‌వై ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ వద్ద నిరసన



(పెన్‌పవర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌, ఒంగోలు)



రైల్వే ప్రవేటికరణను ఉపసంహరించుకోవాని డిమాండ్‌ చేస్తూ  ఒంగోలు రైల్వే స్టేషన్‌ దగ్గర డివైఎఫ్‌వై ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌వై నగర కార్యదర్శి కెఎఫ్‌ బాబు మాట్లాడుతూ ప్రజల  సంపదైన రైల్వేలను ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాని డిమాండు చేశారు. మోడీ 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ, బీజేపీ ప్రభుత్వం రెండవ సారి కూడా అధికారంలోకి రావడం జరిగిందన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు  సంగతి కాస్త మర్చిపోయారు. ప్రభుత్వ రంగం సంస్థను కార్పొరేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడమే పనిగా పెట్టుకున్నారు. దానిలో భాగంగానే రైల్వేను ప్రయివేట్‌ కంపెనీ చేతిలో పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక లాభాలను తెచ్చి పెడుతున్న 150 రైల్వే లైన్లను ప్రయివేటికరణ చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల  భవిష్యత్తులో యువకులకు ఉద్యోగ అవకాశాలు  లేకుండా పోతాయన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌వై నగర అధ్యక్షుడు పి కిరణ్‌, నాయకులు హరికృష్ణ, ఎం బ్రహ్మానందం, జి ఏడుకొండు, కె దాసు, తదితరులు పాల్గొన్నారు.


లాక్‌డౌనా...... జాంతా నై, గీంతా నై !


లాక్‌డౌనా...... జాంతా నై, గీంతా నై !



అధికారులు  ఉత్తర్వులిస్తే పాటించాలా !!



రోడ్ల వెంట క్యూ కట్టిన ప్రజనీకం



(పెన్‌పవర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌, ఒంగోలు )



జిల్లాలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్‌ విధించిన లాక్‌డౌన్‌ జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోనే విఫలమౌతుంది. లాక్‌డౌన్‌ నిబంధన లు  జనాలu బేఖాతరు చేస్తూ యధేచ్చగా రోడ్ల మీద ద్విచక్ర వాహనాల్లో సంచరిస్తున్నారు. ఇంట్లో ఖాళీగా  కూర్చోవడానికి బద్దకించి రోడ్లమీదకు షికారుగా రావడం సర్వసాధారణం అయ్యింది. నిబంధనలను ఉలంఘిస్తున్న వారికి అక్కడక్కడా పోలీసులు  జరిమానాలు విధిస్తున్నా కూడా జనం గుంపులు, గుంపులుగా గుమిగూడటం, కార్లు, బైకులతో బయటకు రావడం మాత్రం మానుకోవడం లేదు. జిల్లాలో లాక్‌డౌన్‌ కఠినంగా అములుచేస్తే కాని కేసులు అదుపులోకి రావని అధికారులు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నా రాకపోకలు నియంత్రించడంలో ఘోరంగా  వైఫల్యం  చెందారని స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నా, చితక వ్యాపారస్తులు  షాపు ముగించడం మినహా,  జనం రాకపోకపైన పెద్దగా దృష్టి సారించని పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా ద్విచక్ర వాహనాలు రద్దీని పరిశీలిస్తే అసలు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు లో ఉన్నాయా? అనే సందేహం కలగక మానదు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు ఇంతటి నిర్లక్ష్యం సరికాదని వైద్యులు చెబుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో కెసులు నమోదు అవుతుంటే మరింత జాగ్రత్తగా వుండాలని, లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలుపరచేందుకు ప్రజలు సహకరించాని అధికారులు కోరుతున్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...