Followers
మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వెహికిల్ "సంజీవని" ఏలేశ్వరం రాక
ఆ భవనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి
ఆ భవనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి
గూడెం కోత్త వీధి పెన్ పవర్
గోవింద్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
అనంతగిరి పోలీసులకు చిక్కిన భారీ గంజాయి
అనంతగిరి పోలీసులకు చిక్కిన భారీ గంజాయి
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
జిల్లాలోని అనంతగిరి మండలం దముకు వద్ద గురువారం భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. అనంతగిరి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అక్రమ గంజాయి రవాణాని శోధించి పట్టుకున్నారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు డి ఎల్ 4 సీ ఎన్ ఈ 1300 నంబరు గల కార్ లో 120 కిలోల శీలవతి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడింది. కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు లో ఇద్దరు పరార్ కాగా సెంబి ప్రసాద్ ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి గంజాయి కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
కరోనాను జయించిన పోలీసులకి ఘన స్వాగతం
కరోనాను జయించిన పోలీసులకి ఘన స్వాగతం
పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి:
కరోనా పై పోరాడి విజయం సాధించి తిరిగి విధుల్లో చేరుతున్న కందుకూరు పోలీసులు శంకర్, రఫీ లకి కందుకూరు పట్టణ పోలీసు స్టేషన్ లో పూలతో ఘన స్వాగతం పలికారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు కానిస్టేబుళ్లు కు పాజిటివ్ వచ్చింది.వారిరువు కోలుకొన్నారు. గురువారం విధుల్లో కి చేరడానికి వచ్చిన సందర్భంగా కందుకూరు కందుకూరు డి ఎస్ పి కండే శ్రీనివాసులు, సి ఐ ఎం.విజయ్ కుమార్ నేతృత్వంలో రూరల్ ఎస్సై కె. అంకమ్మ మరియు పోలీసు సిబ్బంది పూలతో ఘన స్వాగతం పలికి,పుష్ప గుచ్ఛం ఇచ్చి పోలీసు స్టేషన్ లోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కందుకూరు డి ఎస్ పి కండే శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనాని జయించిన పోలీసు వారిలో మనో ధైర్యాన్ని నింపటానికి ఈకార్యక్రమం చేపట్టామని అన్నారు.కరోనా పట్ల ప్రజలు అవగాహనతో,పరిశుభ్రతలు పాటిస్తూ,అనవసరంగా బయటకు రాకుండా,ఒకవేళ అవసరముండి వస్తే సామాజిక దూరం పాటిసిస్తూ,బయట ఆహారం తీసుకోకుండా,సమయానికి ఇంటిలోని ఆహారం తీసుకొంటూ, కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటే కరోనా మన దరిచేరదు.ఒకవేళ కరోనా బారిన పడ్డా త్వరగా కొలుకొనవచ్చు అని డి ఎస్ పి శ్రీనివాసులు అన్నారు. పోలీసులు ఒక్కరు ఇలా కోవిడ్ ను జయించి విధులకు రావడం సంతోషం గా ఉందని, ఎస్సై తిరుపతిరావు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్ లను పంపిణీ
ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్ లను పంపిణీ
పెన్ పవర్, ఉలవపాడు
సింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామానికి చెందిన కాట్రగడ్డ వేణు ఆర్ధిక సహకారంతో ఫేస్ ప్రొటెక్షన్ మాస్కులను
ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ పిలుపుమేరకు పారాలీగల్ వాలంటీర్,ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిత్యం ప్రజల ఆరోగ్య రక్షణ భద్రత కోసం అహర్నిశలు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి పేస్ ప్రొటెక్షన్ మాస్క్ లను డాక్టర్ బ్రహ్మయ్య చేతుల మీదగా పంపిణీ చేశారు.వైద్య అధికారులు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యక్షంగా శరీరం లోనికి వ్యాధులు ప్రవేశించి టానికి అవకాశమున్న భాగాలలో ప్రధానంగా ముక్కు, కళ్ళు,నోరు అని,ఒకవేళ ముక్కుకి,నోటికి మాస్కులు ధరించి నప్పటికీ కరోనా వైరస్ ఎదుటివారు మాట్లాడినప్పుడు వారి నోటిద్వారా వచ్చే తుంపర్ల నుండి కంటి ద్వారా శరీరంలోనికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని,కనుక తప్పనిసరి పరిస్థితులలో ఎక్కువ మంది ప్రజలతో ఉండవలసి వచ్చినప్పుడు ముఖాన్ని అంతటికీ రక్షణగా ఫేస్ ప్రొటెక్షన్ మాస్కులు ఉపయోగపడతాయని తెలిపారు.గుంపులు గుంపులుగా ఉన్న సమయంలో ఈ మాస్క్ లు ఎదుటి వారు మాట్లాడేటప్పుడు తుంపర్లు పడకుండా ఉపయోగపడతాయని అన్నారు.ప్రజలు తమకు తాము జాగ్రత్తలు పాటించడం, సామాజిక బాధ్యత అన్నారు. అదేవిధంగా కనుమల్ల గ్రామ మలినేని కాలేజీ లోని కొరంటైన్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి కూడా పంపిణీ చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కోటేశ్వరరావు,సునీల్ గవాస్కర్,కీర్తి శ్రీ,ఆరిబోయిన రాంబాబు మరియు ఆశా వర్కర్లు,సిబ్బంది పాల్గొన్నారు.
మనం మన పరిసర ప్రాంతాలను కాపాడుకుందాం
మనం మన పరిసర ప్రాంతాలను కాపాడుకుందాం
కాలుష్యాన్ని తరిమికొడదాం
పెన్ పవర్ , ఉలవపాడు
మనం మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రత ద్వారా మన పల్లెల్లోనూ పట్టణాల్లోనూ ఇళ్లలో ఉండే చెత్తను పొడి చెత్త గా తడి చెత్త గా వేరు చేసి గ్రామపంచాయతీ వారు ఇచ్చిన 2 డబ్బాలు లోను ఒక దానిలో పొడి చెత్త ఒక దానిలో తడి చెత్త మన ఇంటిలో ఉన్న చెత్తను బయట వేయకుండా 2 డబ్బాలు ద్వారా చెత్త నుండి సంపద తయారీ కేంద్రం కి తరలించి మన పల్లె ను మన గ్రామాన్ని కాపాడుకుందాం ప్రజలందరూ భాగస్వాములమవుతాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కాలుష్యాన్ని తరిమికొడదాం చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నుండి గ్రీన్ అంబాసిడర్ ట్రై సైకిల్స్ ద్వారా తరలించి మనం ఇచ్చే చెత్త నుండి సంపదను తయారు చేద్దాం వ్యర్థ పదార్థాల ద్వారా వర్మి కంపోస్టు తయారవుతుంది అది రైతులకు ఉపయోగపడుతుంది పొడి చెత్త గా ఉండే వాటిని వేరు చేసి విక్రయించి నిధులను సమకూర్చుతుంది మహిళలు వాడే కొన్ని వ్యర్థ పదార్థాలను దూరంగా ఉంచుదాం వాటిని మసిచేద్దాం పర్యావరణానికి తోడ్పాటునందిస్తుంది మొక్కలు నాటుదాం కాలుష్యాన్ని తరిమికొడదాం ఈరోజు రామాయపట్నం ఆత్మకూరు గ్రామాలలో చెత్త నుండి సంపద తయారుచేసే కేంద్రాలను ప్రారంభించి మన ఇంటిలో ఉన్న చెత్తను ట్రై సైకిల్స్ ద్వారా తరలించడం జరుగుతుంది మన పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరుచుకుని మన గ్రామాన్ని కూడా భాగస్వాములుగా చేద్దాం ఇంటికి రెండు రూపాయలు ఇద్దాం నెలకు అరవై రూపాయల ఇద్దాం మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం మన పంచాయతీ కార్యాలయానికి సంపదను సమకూర్చుకున్నాం చెత్త నుండి సంపద తయారీ కేంద్రం లో పని చేయు గ్రీన్ అంబాసిడర్ జీతాలు కల్పిద్దాం అందరం ఒక్కటవుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కాలుష్యాన్ని తరిమికొడదాం.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...