ఉలవపాడు లో మరో మూడు పాజిటివ్ కేసులు
పెన్ పవర్, ఉలవపాడు
మండల కేంద్రమైన ఉలవపాడు లో ఈరోజు గురువారం నాడు రాపిడ్ టెస్టుల్లో మరో ముగ్గురు కి కరోనా పాజిటివ్ గా తేలింది వీరి ముగ్గురు వి కిరాణా షాపులు మండలంలోని ప్రజలందరూ కొంతమేర ఈ షాపులలోనే సరుకులు కొంటారు ఈ షాపుల వారికి కొందరికి ఖాతాలు కూడా ఉన్నాయి మండలంలో ఎంతమందికి ఉందో తెలియదు ఉలవపాడు ప్రజలందరూ భయాందోళన చెందుతున్నారు ఇప్పటికైనా మండలంలోని ప్రజలు మేలుకోవాలి భయం లేకుండా మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా శానిటీజర్ లు వాడకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు అధికారులు పనులు చేసుకొని బ్రతకండి అన్నారని మీ ఇష్టారాజ్యంగా తిరుగుతారా ఇప్పుడు చూడండి ఒకరి ద్వారా ఒకరికి అందరికీ అంటుకుంటుంది ఈ షాపులో కొన్న వారు ఎంతమంది ఉన్నారో ఎంతమందికి పాజిటివ్ సోకిందో తెలియని పరిస్థితి ఇప్పుడు ఆ పాజిటివ్ వచ్చిన పేషెంట్లను 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ కు ఇంకా కొన్ని నిమిషాలలో తరలిస్తారు కావున మండలంలోని ప్రజలందరికీ ఇదే పరిస్థితి రాకుండా అందరూ ఒంగోలు కి వెళ్తే అక్కడ స్థలం లేదు అక్కడకు పోయినవాళ్లు ఊపిరాడక చచ్చి పోతున్నారు ఇప్పటికైనా మేల్కొండి ఇప్పటికైనా మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి శానిటైజర్ లు వాడండి కొత్త వారిని ఇళ్లల్లోకి రానివ్వద్దు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు పోలీసు యంత్రాంగం వారు ఈ కరోనాపై ప్రాణాల కు తెగించి అహర్నిశలు కష్టపడి చెబుతున్న పట్టించుకోని ప్రజలు కళ్ళు తెరవండి బయటకు రాకండి ఇళ్ల లోనే ఉండండి మన అందరి ప్రాణాలను మన పొరుగు వారి ప్రాణాలను కాపాడుకుందాం మన పరిసర ప్రాంతాలను శుభ్రపరచు కుందాం జాగ్రత్తలు పాటిద్దాం తలచుకుంటే ఎలాంటి రోగమైన జాగ్రత్తలు పాటిస్తే మన దరికి చేరదు ఖచ్చితంగా పాటించాలి వాడుదాం శానిటేషన్ మన దగ్గరలో ఉంచుకుందాం