Followers

గోదావరి లో  కొట్టుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


గోదావరి లో  కొట్టుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


పెన్ పవర్ , సీతానగరం 


 సింగవరం గ్రామం కైలాసగిరి వెళ్లే దారి హెచ్ పి సి ఎల్ గ్యాస్ పైప్ లైన్  సమీపం నందు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గోదావరి ప్రవాహానికి కొట్టుకొచ్చిందనే సమాచారం అందడంతో ఇంచార్జ్ ఎస్ఐ ఫిరోజ్ సంఘటనా స్థలానికి చేరుకొని సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈసందర్భంగా పత్రికా విలేఖరులతో ఎస్ఐ ఫిరోజ్ మాట్లాడుతూ నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన మృతదేహం పురుషునిగా గుర్తించడం జరిగిందని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరుగుతుందని తెలియజేశారు. చనిపోయిన వ్యక్తి యొక్క వయస్సు సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాలు ఉండవచ్చునని పలువురు అంటున్నారు


నిరుపేదలైన మగవారిపై అధికారులకు ఎందుకు చిన్నచూపు


నిరుపేదలైన మగవారిపై అధికారులకు ఎందుకు చిన్నచూపు..


ఇంటి స్థలం మంజూరు కాకపోవడంతో ఆవేదన.


పోలవరం పెన్ పవర్


ప్రతి పేదవాడికి సొంతిల్లు  అనేది ఒక కల . ఆ కల నెరవేర్చుకోలేని స్థితిలో మన రాష్ట్రంలోని అనేక మంది నిరుపేదలు ఉన్నారు. వారందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే భార్య లేదన్న కారణం చేత తన పేరును అర్హుల జాబితాలో తొలగించారని పోలవరం మండలం స్థానిక గ్రామానికి చెందిన బొల్లంపల్లి యేషయ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. నీకు అన్ని అర్హతలూ ఉన్నా  స్థలం రిజిస్ట్రేషన్ ఆడవారి పేరు మీద మాత్రమే అవుతాది మగవారి  పేరు మీద అవ్వదు అని  చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాడు. భార్య లేక పోతే నేమ్ పిల్లలతో అద్దె ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నానని నిరుపేద నైనా నాకు అన్ని అర్హతలు ఉండి కూడా ఇంటి స్థలం నాకు ఎందుకు మంజూరు చేయలేదు అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మగ వారి పట్ల ఇంత చిన్నచూపు ఎందుకు అని బొల్లంపల్లి యేషయ ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ళగా అద్దె ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నామని భార్య లేని మగ వారి పేర్లను కూడా అర్హుల జాబితాలో చేర్చి ఇంటి స్థలం మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ వంటి భార్య లేని నిరుపేద కుటుంబాలు కేవలం 1 , 2 శాతం మాత్రమే ఉంటారని వారందరినీ  గుర్తించి ఇల్లు స్థలాలు మంజు అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదల అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పగానే సొంతింటి కల తీరబోతుంది ఆని ఎంతో ఆనందించాలమని ఆడవారి పేరు మీద మాత్రమే ఇంటి పట్టాలు ఇస్తాం మగవాడి పేరుమీద ఇవ్వం అనేసరికి ఆవేదనకు గురి అయ్యామని అన్నారు. కరోనా ప్రభావంతో నాలుగు నెలలుగా పనులు లేకపోవడంతో జీవనం సాగించడం ఎంతో కష్టంగా ఉందని ఇంటి అద్దె  కట్టుకోవడం కష్టమైపోతుంది అని ఆన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి మాకు ఇంటి స్థలాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా ప్రభావంతో నాలుగు నెలలుగా  పనులు లేక జీవనం సాగించడంమే ఎంతో కష్టంగా ఉందని  అన్నారు . 


నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం


నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం


తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట



 జగ్గంపేట సి ఐ .సురేష్ బాబు హెచ్చరించారు. రోజురోజుకు కరోనా  కేసులు మండల పరిధిలో పెరిగిపోవడంతో నిబంధనలను మరింత కఠినతరం చేశారు. జగ్గంపేట లో లాక్ డౌన్ కారణంగా అత్యవసర సరుకులు సంబంధించిన దుకాణాలు మాత్రమే 6 గంటల నుంచి 11 గంటల వరకు పనిచేస్తాయి. సమయం దాటిన తర్వాత దుకాణాలు తెరిచి ఉంచితే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదని తప్పనిసరి వచ్చినవారు నిబంధనలు పాటించాలి అన్నారు. అదేవిధంగా మోటార్ సైకిల్ పై ఒక్కరే వెళ్ళాలని ఇద్దరు వెళ్ళకూడదని హెచ్చరించారు. జగ్గంపేట మండల పరిధిలో కరుణ పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జగ్గంపేట మండల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అందరూ నిబంధనలు పాటిస్తే మీకే కాకుండా మీ కుటుంబాలకు కూడా శ్రేయస్కరం. పోలీసులను చూసి  భయపడటం కాదు. మీ కుటుంబాల గురించి ఒక్కసారి ఆలోచించండి. మమ్మల్ని చూసి నిబంధనలు కొంతమంది పాటిస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దానివల్ల నష్టపోయేది మీరు, మీ కుటుంబ సభ్యులతో పాటు అందరి ప్రాణాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అది అందరు గమనించి నిబంధనలను పాటించాలని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు కోరారు.


ఏ టి ఎల్ లాబ్ లో కోవిడ్ రక్షణ పరికరాలు ఆవిష్కరణ




ఏ టి ఎల్ లాబ్ లో కోవిడ్ రక్షణ పరికరాలు ఆవిష్కరణ.


గోకవరం పెన్ పవర్.


 గోకవరం మండలం రంప యర్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న అటల్ టింకరింగ్ లాబ్ నందు గురువారం విద్యార్థులు ఉపాధ్యాయులు  నుండి కోవిడ్ నుండి రక్షణ పొందే రక్షణ పరికరములను గురువారం ఆవిష్కరించారు.టిక్ టీమ్ సొల్యూషన్ విశాఖపట్నం వారి సహకారంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పెడల్ శానిటైజర్ స్టాండ్స్, త్రీడీ ఫేస్ షిల్స్, క్లాత్ మాస్క్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ధర్మల్ స్కానర్ కూడా లాబ్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోలా సత్యనారాయణ, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు కుంచె వీరబాబు, లాబ్ ఇంచార్జ్ మండపాక హరిబాబు, షాప్ సెక్రటరీ పి ధర్మారెడ్డి, కోలా అచ్చన్న, జి. ఆంజనేయులు, ఐ. సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


రాజమహేంద్రవరం జిల్లాతోనే  ప్రయోజనం


రాజమహేంద్రవరం జిల్లాతోనే  ప్రయోజనం. 
 ........మరోసారి గోకవరం మండలాన్ని అన్యాయం చేయొద్దు
........ప్రభుత్వానికి అఖిలపక్షం వినతి
గోకవరం మండలం యుటిఎఫ్ అధ్యక్షుడు ఎస్.అనిల్ కుమార్.
 
గోకవరం పెన్ పవర్.


 గోకవరం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే రాజమహేంద్రవరం జిల్లాలోని  ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా జిల్లా ఉన్నతాధికారులు సహకరించాలని గోకవరం మండలం అఖిల పక్షానికి చెందిన ప్రజానీకం  విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉండటంతో గోకవరం మండలంలో ఈ విషయమై చర్చనీయాంశం మొదలయింది. మెట్ట ప్రాంతం, ఏజెన్సీకి ముఖద్వారమైన గోకవరం మండలం నైసర్గికంగా  రాజమహేంద్రవరానికి 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ మండలంలో 14 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో గుమ్మళ్లదొడ్డి, అచ్యుతాపురం, వెదురుపాక, ఇటికాయలపల్లి, తిరుమలాయపాలెం, రంపఎర్రంపాలెం, తంటికొండ, గాదెలపాలెం గ్రామ పంచాయతీలు ఇటు రాజమండ్రి వైపు దగ్గరిగా ఉన్నాయి. గోకవరం మండలం   పూర్వము  రాజమండ్రి తాలూకా లో ఉండేది.  అనంతరం ఏర్పడ్డ కోరుకొండ తాలూకాలో  గోకవరం మండలం ఉండేది. అంతేకాకుండా మండల వ్యవస్థకు పూర్వం పంచాయతీ సమితి ఉన్న రోజుల్లో కోరుకొండ పంచాయతీ సమితిలో గోకవరం మండలం చేరి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్ టి రామారావు మండల వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో గోకవరం మండలం ఏర్పడింది. ఈమండలం ఇప్పటివరకు రాజమండ్రి రెవెన్యూ డివిజన్ లోనే సాగుతూ వచ్చింది. 1952 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడిన నాటి కాలం నుండి ఉన్న బూరుగుపూడి నియోజకవర్గంలో కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాలు ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం గోకవరం మండలంని బూరుగుపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలగించి జగ్గంపేట అసెంబ్లీ, కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో  చేర్పించేందుకు కొంతమంది వ్యక్తులు చేసిన కృషి ఫలించింది.  కడియం నియోజకవర్గంలో ఉన్న రాజానగరం మండలాన్ని తీసుకువచ్చి కోరుకొండ, సీతానగరం మండలాలతో కలిపి రాజానగరం నియోజకవర్గంగా ఏర్పాటు చేయించుకునేందుకు వారు చేసిన ప్రయత్నం ఫలించింది. అయితే  గోకవరం మండలాన్ని జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపినప్పటికీ కొంతమేరకు ప్రజలు అసౌకర్యానికి గురైనా పెద్దగా ఇబ్బంది కలగలేదు. అయితే జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న గోకవరం మండలం కాకినాడ లోక్ సభ పరిధిలో ఉండటంతో ఒక్కొక్క లోక్ సభ నియోజకవర్గాన్ని ఒకొక్క జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉండటంతో గోకవరం మండలం ప్రజానీకానికి ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు రాజమండ్రి రెవెన్యూ డివిజన్ లో వున్న గోకవరం మండలం పోలీస్  సీఐ, డీఎస్పీ కార్యాలయాలు, వ్యవసాయశాఖ సబ్ డివిజన్ , ఉద్యానవనశాఖ, విద్యుత్ డిఇఇ, ఐసిడిఎస్ కోరుకొండ ప్రాజెక్టు తదితర ప్రభుత్వశాఖలు సైతం కోరుకొండ, రాజమండ్రి ప్రాంతాలతో ముడిపడి గోకవరం మండలం అనుభందం కలిగివుంది. ఈపరిస్థితుల్లో కాకినాడ లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న గోకవరం మండలంని కాకినాడ జిల్లాలో కలిపితే ఈ ప్రాంత ప్రజల కష్టాలు మొదలైనట్టేనని  జనం ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం పునర్విభజనలో ఈ మండలం విడిపోయిన సమయంలో చాలామంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, ప్రస్తుతం ఈమండలాన్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న  రాజమహేంద్ర వరం   లోక్ సభ నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాగా ఏర్పాటు చేయబోతున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ నుండి దూరం చేసి, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలో కలిపితే  జనం ఏ విధంగా కష్టాలు అనుభవించాల్సివస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్ధానికులు అంటున్నారు. కాకినాడ జిల్లాలో కలిపితే 45 కిలోమీటర్ల దూరంలో వున్న పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కు, కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంనకు వెళ్లాల్సి వస్తుందని జనం అంటున్నారు. నైసర్గికంగా 30 కిలోమీటర్ల దూరంలో దాదాపు మూడు వంతుల మండలం రాజమండ్రికి దగ్గరలో ఉన్నప్పటికీ, కాకినాడ జిల్లాలో కలిపే ఆలోచన చేస్తే జనం అధోగతి పాలు అవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా గోకవరం మండలం ప్రజానీకం తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు.  రాజమహేంద్రవరం జిల్లాను ఏర్పాటు చేస్తే రాజమహేంద్రవరం జిల్లాలోనే గోకవరం మండలం ఉంచే విధంగా  చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. న్యాయమైన గోకవరం మండలం ప్రజానీకం కోరికను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం జరిగిన పక్షంలో ప్రజా పోరాటం, న్యాయపోరాటం చేందుకు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు గోకవరం మండలానికి కష్టాలు తెచ్చిపెడుతోందా ?  లేక రాజమండ్రి లో చేర్చి జనానికి సౌకర్యవంతంగా ఉంచుతారా వేచి చూడాల్సిందే.


 క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ లారీలకు గ్రీజు కొట్టే కార్మికులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ


 క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ లారీలకు గ్రీజు కొట్టే కార్మికులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ......


జగ్గంపేట పెన్ పవర్


 తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో టోల్గేట్ ఏర్పడిన దగ్గరినుండి  పనిచేస్తున్న  కొంత మంది కార్మికులు ఉన్నారు నేషనల్ హైవే మీదుగా వెళ్లిపోయే లారీలకు గ్రీజు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులకు కు క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్ జుత్తు క నాగేశ్వరరావు సహకారంతో జగ్గంపేట మండలం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో లో వారి చేతుల మీదుగా అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి మాస్కులు శానిటైజర్స్   పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఎమ్ డి కె ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దిరిశాల పండు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి విపరీతంగా విరిగిపోతుంది దాని నుండి మనం రక్షించుకోవాలంటే  ప్రతి ఒక్కరూ మాస్ కులను వాడాలని అలాగే శానిటైజర్ వాడాలని అలాగే  సామాజిక దూరం పాటిస్తూ తమ జీవన విధానాన్ని కొనసాగించాలని అన్నారు అలాగే ఎ ఎం డి కే ఎస్ ప్రధాన కార్యదర్శి గోర్తా లాజర్ మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ  ఈ కరోనా యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉండాలని మనకు మనమే ఈ కరోనా వైరస్ నుండిమనకు మనమే కాపాడుకుంటూ ఇతరులను కాపాడాలని ప్రతి ఒక్కరూ అవసరమైనప్పుడు బయటకు రావాలని అంతేగాని  చిన్నచిన్న అవసరాలకు బయటకు రాకుండా చూసుకోవాలని అలాగే పిల్లలను బయటకు రాకుండా  కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లో క్రిస్టఫర్. లోవరాజు .యు. మరిడమ్మ .రాఘవ .సూర్యం తదితరులు పాల్గొన్నారు.


నీటి కొరత తీర్చిన టి.డి.పి. నాయకులు


నీటి కొరత తీర్చిన టి.డి.పి. నాయకులు


వి.ఆర్.పురం, పెన్ పవర్:


 వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామంలో నివసిస్తున్న గ్రామ ప్రజలు గోదావరి వరదలు ఎక్కువగా వుండటం వలన గోదావరినుండి నీళ్లు తెచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న మండల టి.డి.పి. నాయకులు మానవతా దృక్పథంతో ఆ గ్రామానికి ముప్పైవేల రూపాయల విలువ గల ఒక మోటార్ ను ఉచితంగా అందజేసినారు. టి.డి.పి. సీనియర్ నాయకుడు ముత్యాల రామారావు వడ్డిగూడెం నరసింహస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి మోటార్ ను ప్రారంభించారు. అలా మోటార్ అందజేసిన వారికి ఆ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి.టి.సి. వాళ్ళ వెంకటేశ్వరరెడ్డి, వాళ్ళ రంగారెడ్డి, ముత్యాల చంద్ర శేఖర్, ముత్యాల శ్రీనివాస్(స్మాల్), పాయం రామారావు, బురకా సారయ్య, బొర్రా వాసు, ఆచంటి శ్రీనివాస రావు, బొర్రా నరేష్, బీరక సూర్యప్రకాష్ రావు, బొర్రా దుర్గారావు, ముత్యాల సిద్దు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...