Followers

అధ్వానంగా రోడ్లు పట్టించుకోని మండల  అధికారులు 


అధ్వానంగా రోడ్లు పట్టించుకోని మండల  అధికారులు 


గూడెం కోత్త వీధి, పెన్ పవర్


గూడెం కోత్త వీధి మండలం కేంద్రంలో రోడ్లు అధ్వానంగా తయారైంది దీంతో డ్రైనేజ్ వ్యవస్థ క్షిణించింది సమస్య పట్టినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు వివరాలు ఈవిధంగా వున్నాయి. గూడెం కోత్త వీధి మండలం కేంద్రానికి వెళ్లే మేయిన్ రోడ్డు పరిస్థితి వర్షాలు పడితే అధ్వానంగా తయారైంది స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మేయిన్ రోడ్డు పక్కన సిసిరోడ్లునిర్మించినరోడ్లు పక్కన డ్రైనేజ్ లు నిర్మిచకపోవడంతో వర్షం పడితే మురుగు నీరు వచ్చి ఎక్కడికక్కడే నీరు నిల్వ ఉండిపోతుంది ద్విచక్ర వాహనాలు మరియు పాదచారులు ప్రయాణించడం నరకప్రాయగా మారింది దీంతో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం నీరు రోడ్లు మీదకు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ కాలవలు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలిగిపోతాయి. కానీనీత్యంనీరునిల్వఉండటంవల్లదోమలుసైరవిహారంచెస్తున్నాయానిబాథితులువాపోతున్నారు. వింటి వల్ల మండల కేంద్రంలోని ప్రజలు దుర్వాసన. దోమల బెడదతో త్రివఇబ్బందులు పడటమే కాకుండా. డేంగ్యూ. మలేరియా. ఫైలేరియా. వైరల్ జ్వరాలు. అనేక రోగాలు బారినపడుతున్నా. అధికారులు మాత్రం డ్రైనేజ్మంపైపట్టిచుకోవడంలేదనిమండలకేంద్రంప్రజలుఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా. జిల్లా కలెక్టర్ మరుయ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు స్పందించి క్షిణించిన డ్రైనేజ్ వ్యవస్థను మెరుగు పరిచి సమస్య పరిష్కారంచేలా చర్యలు చేపట్టాలని మండల కేంద్రం ప్రజలు కోరుతున్నారు


 


ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పెండింగ్  ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి


ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పెండింగ్  ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి



సాంఘీక  సంక్షేమ శాఖ జాయింట్‌ సెక్రటరి కె. ఆంజనేయలు  డిమాండ్‌ 



(పెన్‌పవర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌, ఒంగోలు)



ఎస్సీ ఎస్టీ కేసుల్లో, పెండిరగ్‌ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్‌ సెక్రెటరీ కే ఆంజనేయులను దళిత నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం సచివాలయంలో జాయింట్‌ సెక్రెటరీ ఛాంబర్‌లో దళిత హక్కు ల పరిరక్షణ సమితి అధ్యక్షులు  నీలం  నాగేంద్రం, మాదిగ సంక్షేమ పోరాట సమితి అధ్యక్షులు  కొమ్ము సుజన్‌ మాదిగ, మాల  మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య కలిశారు .ఎస్సీ ఎస్టీ కేసులలో జిల్లా స్థాయిలో, కలెక్టర్‌ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, క్లారిఫికేషన్‌ పేరుతో సెక్రటేరియట్‌ కు పంపించారు. విస్తర్ల వెంకట శేషమ్మ, మిట్ట గౌతమ్‌ కుమార్‌, పాపర్తి పద్మ అనే ఎస్సీ ఎస్టీకు, ఉద్యోగాల లిస్టు  సాధారణ పరిపాన శాఖకు పంపించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలు కేసును సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటేరియట్‌ విభాగానికి పంపించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు జీవో ఎంఎస్‌ 95 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు హత్య కేసులో వెంటనే ఉద్యోగాలు ఇవ్వాల్సి  ఉందని, గతంలో ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సాంఘిక సంక్షేమ శాఖ ముద్దాడ రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ జాయింట్‌ సెక్రెటరీ కే ఆంజనేయులను కలిసి చర్చించగా, త్వరలో పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలకు ఉత్తర్వులు  ఇస్తానని చెప్పారన్నారు. 


నూతన పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌


నూతన పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌



150 రోజుల్లో పోలీస్‌ స్టేషన్‌ నూతన భవనం పూర్తి చేయాలి



(పెన్‌పవర్‌, మర్రిపూడి)



మర్రిపూడి మండంలలో నూతన పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి  భూమి పూజ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ నిర్వహించారు. బుధవారం స్థానిక ఎస్‌ఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో చేపట్టిన భూమి పూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నూతన భవన నిర్మాణానికి నేడు బీజం పడిందన్నారు. నూతన పోలీస్‌ స్టేషన్‌ను 150 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. మండంలలోని నాయకులందరూ ముందుకు వచ్చి నూతన పోలీస్‌ స్టేషన్‌ భవనానికి నిధులు సమకూర్చి ఇస్తున్నందుకు అందరికీ అభినందనలు  తెలిపారు. 1984 సంవత్సరం నుండి పోలీస్‌ స్టేషన్‌ అద్దె భవనంలో పనిచేస్తుందన్నారు. ఎంతో సంతోషకరమైన విషయం ఏమిటంటే ఎస్‌ఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతున్నందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానన్నారు. అందరూ మంచి మనస్సుతో ఏంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికి అభినందనలు తెలియజేశారు. దీంతో పాటు కరోనా వైరస్‌ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా బీసీ నాయకుడు మాచేపల్లి నాగయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ 150 రోజుల్లో పోలీస్‌ స్టేషన్‌ నూతన భవనాన్ని పూర్తి చేయాలని అన్నారు. కానీ మనమందరం కలిసి 120 రోజుల్లోనే పూర్తి చేసి ఇవ్వాలని సభాముకంగా తెలియపరుస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ ప్రకాశరావు, పొదిలి సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ వి శ్రీరామ్‌, దొనకొండ ఎస్‌ఐ ఫణిభూషణ్‌, కొనకనమిట్ల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు నాయక్‌, మర్రిపూడి ఎస్‌ఐ సుబ్బరాజు, పొదిలి ఎస్‌ఐ సురేష్‌, పోలీస్‌ సిబ్బంది, డిప్యూటీ తహశీల్దార్‌ రవిశంకర్‌, ఎఓ తిరుమరావు, మండల కన్వీనర్‌ బొదా రమణరెడ్డి, మాచేపల్లి నాగయ్య, ఇనుకొల్లు  సుబ్బారెడ్డి, బోగసముద్రం విజయ భాస్కర్‌ రెడ్డి, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


జిల్లా అభివృద్ధికై దివంగత  దామచర్ల ఆంజనేయు చేసిన కృషి ఎనలేనిది


జిల్లా అభివృద్ధికై దివంగత  దామచర్ల ఆంజనేయు చేసిన కృషి ఎనలేనిది



జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గుర్రా రాజ్‌విమల్‌



(పెన్‌పవర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌, ఒంగోలు )



మాజీ మంత్రి, మాజీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల ఆంజనేయులు 91వ జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులు బుధవారం ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా తొలుత ఒంగోలు  నగరంలోని బాపూజీ కాంప్లెక్స్‌, కర్నూలు  రోడ్డు ప్లైఓవర్‌ వద్ద గల  దామచర్ల ఆంజనేయలు , నందమూరి తారకరామారావు, తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దామచర్ల ఆంజనేయలు  91వ జయంతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గుర్రా రాజ్‌ విమల్‌ మాట్లాడుతూ దామచర్ల ఆంజనేయలు  తూర్పునాయుడుపాలెం అనే గ్రామంలో సాధరణ వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా  ఎదుగుతూ చుట్టూ ఉన్నవాళ్ళకి సహాయపడతూ, తెలుగుదేశం జెండా భుజాన వేసుకొని, కొండపిలో తె.దే.పా జెండా పాతి, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ... కొండపిని తెలుగుదేశంపార్టీ కంచుకోటగా నిలిపి రాజకీయాలలో సైతం తనదైన ముద్రవేసి ప్రకాశంజిల్లా నుంచి మంత్రిగా ప్రజాసేవ చేసి, అందరూ, ఆప్యాయంగా పెద్దాయన అని  పిలిపించుకునేవారన్నారు. ఆయన చనిపోయిన కూడా మంత్రిగా చేసిన అభివృద్ధిలో ఆయన వారసుడు మన తె.దే.పా జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌ రావు ఒక టర్మ్‌ ఎమ్మెల్యేగా చేసిన కూడా ఒంగోలు నియోజకవర్గంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ఒంగోలు  నియోజకవర్గం అభివృద్ధి ప్రధాతగా ప్రకాశంజిల్లా తె.దే.పా అధ్యక్షులుగా మూడు దఫాలుగా అటు ఇటు జోడెద్దు మాదిరిగా రెండిరటి బాధ్యతలను నిర్వహిస్తూ తన వారసుడుగా తనదైన ముద్రను నిలుపుకున్నారని అన్నారు. మేమందరం కూడా తె.దే.పా దామచర్ల ఆంజనేయలు  ఆశయ సాధన కోసం మన జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధనరావు అడుగు జాడలో నడుస్తూ జిల్లాలో, రాష్ట్రంలో తె.దే.పా అధికారంలో తీసుకురావటానికి శక్తివంచనలేకుండా కృషిచేస్తామని అన్నారు. ఒంగోలు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ దామచర్ల ఆంజనేయలు  మంత్రిగా జిల్లాకు ఎనలేని సేవలు  అందించారని, జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులుగా పార్టీని సుదీర్ఘకాం ముందుకు నడిపించినటువంటి ఘనత ఆంజనేయలుకే దక్కుతుందన్నారు. వ్యక్తిత్వంలో సౌమ్యుడిగా ఎన్ని పదవులు  అలంకరించినా, క్రింద స్థాయి కార్యకర్తను కూడా ఆప్యాయంగా పలుకరించే వారని, ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒంగోలు మాజీ ఏఎంసి మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దామచర్ల ఆంజనేయలు సుదీర్ఘకాం జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు  నిర్వహించడంలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ఆయన జిల్లాలో దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజి, పాలిటెక్నిక్‌ కాలేజీ విద్యాసంస్థలు  నెలకొల్పి అనేక మంది విద్యార్ధులకు విద్యను అందించిన విద్యాదాత అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు  నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, జిల్లా తెదేపా నాయకులు  ఎద్దు శశికాంత్‌ భూషణ్‌, జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు  రావు పద్మజ, రాష్ట్ర మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం, ఉప్పపాటి నాగేంద్రమ్మ, జిల్లా తె.దే.పా కోశాధికారి ఎల్‌.టి భవాని, ప్రధాన కార్యదర్శి దాయనేని ధర్మ, పెళ్లూరి చిన్న వెంకటేశ్వర్లు, నగర ఎస్సీసెల్‌ అధ్యక్షులు  నావూరి కుమార్‌, జిల్లా తె.దే.పా నాయకులు  పాతూరి ప్లుయ్య చౌదరి, మారినేని వెంకటేశ్వర్లు, బొడపాటి వెంకట్‌, కనుమూరి నారాయణ, డొక్కా శ్రీమన్నారాయణ, కసుకుర్తి అంకరాజు, జిల్లా తెలుగుమహిళా నాయకులు  గంగవరపు పద్మ, టి.అనంతమ్మ, ప్రశాంతి, నాగేశ్వరమ్మ, కొక్కిగడ్డ లక్ష్మీ, అజిమున్నీసా, తదితరులు పాల్గొన్నారు.


రైతుకు ప్రయోజనం ఈ క్రాపింగ్‌ బుకింగ్‌ విధానం

రైతుకు బహుళ ప్రయోజనం కల్పించేందుకు ఈ క్రాపింగ్‌ బుకింగ్‌ విధానం



జిల్లా సంయుక్త కలెక్టర్‌ జె వెంకట మురళి



(పెన్‌పవర్‌, ఒంగోలు)



వ్యవసాయ రంగంలో రైతులకు బహుళ ప్రయోజనం కల్పించడానికి ఈ - క్రాపింగ్‌ బుకింగ్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ (ఆర్‌.బి.అండ్‌ఆర్‌) జె. వెంకట మురళి తెలిపారు. ఈ - క్రాప్‌ బుకింగ్‌ విధానంపై బుధవారం కొత్త పట్నం మండలం  గమండ్లపాలెం గ్రామాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు అన్ని విధలుగా  ప్రయోజనం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జె.సి. తెలిపారు. ఈ - క్రాప్‌ బుకింగ్‌ విధానం ద్వారా రైతు పండిరచిన పంటకు మద్దతు ధర భించేలా అన్ని చర్యలు  తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో లాభసాటి వ్యవసాయం కోసం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహధం  పడుతుందన్నారు. రైతులతో ముఖాముఖిగా ఆయన మాట్లాడారు. ఈ - క్రాప్‌ విధానంతో రాయితి పై విత్తనాలు, భీమా, రైతు భరోసా ఆర్థిక సహాయం, పంట స్థిరీకరణ నిధి వర్తిస్తుందని రైతులకు ఆయన వివరించారు. ముందుగా రైతులనుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు  సాగుచేస్తున్న పంట నమోదు ప్రక్రియను జె.సి. స్వయంగా పరిశీలించారు. అగ్రిక్చరల్‌ అసిస్టెంట్‌ చేస్తున్న విధుల పై ఆయన ఆరాతీశారు. ఈ - క్రాప్‌ బుకింగ్‌ లో రైతు ఆధార్‌ కార్డు నెంబరు, భూమి సర్వే నెంబరు నమోదు చేసి అగ్రిక్చరల్‌ అసిస్టెంట్‌ వేలిముద్ర ధృవీకరణతో వి.ఆర్‌.ఓ. లాగిన్‌కు పంపడంపై ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ లాగిన్‌ కు వచ్చిన అనంతరం ప్రభుత్వానికి వివరాలు  సమర్పించే ప్రక్రియ వద్ద సాంకేతిక సమస్య తలెత్తుతున్నాయని అగ్రి కల్చరల్  అసిస్టెంట్‌ జె.సి. దృష్టికి తెచ్చారు. వీటిపై పలుమార్లు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జె.సి. అన్నారు. ఆయన వెంట కొత్త పట్నం మండల తహసిల్దార్‌ వి. పుల్లారావు, వ్యవసాయ అధికారిణి సుచరిత, సర్వే వి.ఆర్‌.ఓ, తదితయి వున్నారు.


 


జాప్ విశాఖ అధ్యక్షుడిగా శ్రీనివాస్



జాప్ విశాఖ అధ్యక్షుడిగా శ్రీనివాస్


ఉపాధ్యక్షుడిగా రవికుమార్


విశాఖపట్నం, పెన్ పవర్


జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్)  విశాఖ అధ్యక్షుడిగా సింగంపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు.  బుధవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో  అధ్యక్షులుగా శ్రీనివాస్,  ఉపాధ్యక్షునిగా రవికుమార్,  వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా చాంద్ మాల్ అగర్వాల్,  కో చైర్మన్ గా సత్యనారాయణ నియమితులయ్యారు.  సమావేశంలో ఎన్ యు  జె నాయకులు ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ  జర్నలిస్టుల సంక్షేమానికి,  సమస్యల పరిష్కారానికి జాప్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు.  నూతనంగా  పదవులు పొందిన వారు చిత్తశుద్ధితో  పని చేయాలని సూచించారు.  కోవిడ్ 19 వలన జర్నలిస్టులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నారని,  వారికి జాప్ అండగా నిలుస్తుందని  తెలిపారు. అధ్యక్షుడు గా నియమితులైన సింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమం లో జాప్ పాత్ర ఎనలేనిదని అన్నారు.  జర్నలిస్టుల సంక్షేమానికి,   జాప్ పురోభివృద్ధికి  అందరితో కలిసి పని చేస్తానని పేర్కొన్నారు.  సమావేశంలో జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ఎ ఆర్ పాత్రుడు,  జిల్లా ప్రధాన కార్యదర్శి డి కాశీనాథ్,  ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్,  కోశాధికారి టీవీఎన్ ప్రసాద్,  కార్యదర్శులు కే ఎన్ కీర్తన్,  ఎస్ ఆర్ సి మోహన్,  సంయుక్త కార్యదర్శి శ్యాంసుందర్,  కార్యనిర్వాహక కార్యదర్శి జగన్మోహన్,  ఈసీ సభ్యులు మదన్ తదితరులు పాల్గొన్నారు.


పందుల పోటీ లాడిన పందెం జూదరులు


కరోనాని సమయంలో పందుల పోటీ లాడిన పందెం జూదరులు


           పరవాడ, పెన్ పవర్

 

పరవాడ:ప్రపంచమంతా కరోనా సమస్యతో బాధపడుతుంటే అచ్యుతాపురం,గాజువాక యువత (చూసిన వారు చెప్పింది) మాత్రం  కరోనాని లెక్కచేయకుండా కనీసం ముఖానికి మాస్క్ కూడా పెట్టు కోకుండా వింత పోకడలతో వింత పోటీలు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు.మండలం లోని భరిణికం చెరువులో సుమారు100 నుంచి 150 మంది అచ్యుతాపురం, లనుంచి వచ్చిన 17 నుండి 27 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులు పందుల పోటీ నిర్వహించారు.పందుల యజమానులు రెండు పందులను రెచ్చగొట్టి ఒకదానికి ఒకటి ఎదురు తీసుకు వెళ్లి కేకలతో అరుపులతో వాటిని రెచ్చ గొట్టగా అవి రెండూ ఢీకొనగా క్షణాలలో నే ఒకపంది ఓడిపోయి పారిపోవడం జరిగింది అని స్థానికం గా చూసినా వారు చెప్పారు.పందెం విలువ లక్షల్లో ఉంది అని అక్కడ ఉన్న స్థానికులు చెప్పారు.  అచ్యుతాపురం,గాజువాక లలో కరోనా కేసులు ఎక్కువ కావడం వచ్చిన వారు కనీసం మాస్క్ కూడా లేకుండా రావడం తో వీరిని చూసి స్థానికులు భయంతో పోలీసు వారికి ఫోన్ చేయగా వారు వచ్చే లోపే క్షణాల్లో పoదేం ముగియడం మెరుపు వేగంతో  యువకులు ఎటువారు అటు తమ దిచక్ర వాహనాలు,కార్లు,ఆటోలలో పరారయ్యారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...