Followers

మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వెహికిల్ "సంజీవని" ఏలేశ్వరం రాక





మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వెహికిల్ "సంజీవని" ఏలేశ్వరం రాక

 

ఏలేశ్వరం, పెన్ పవర్

 

స్థానిక నగర పంచాయతీ, ఏలేశ్వరం మండల పరిధి గ్రామాల్లో కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ మేరకు మరింత మందికి కరోనా సోకకుండా ఉండేందుకు కోవిడ్- 19 పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చొరవ మేరకు కాకినాడ డిఎంఅండ్ హెచ్ ఓ ఆదేశాల మేరకు కరోనా రోగుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్నవారికి ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన సంజీవిని బస్సులో కోవిడ్-19 పరీక్షలు చేసేందుకు గురువారం ఏలేశ్వరం వచ్చింది. ఈ వాహనంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు డి రవీంద్రనాథ్, ఏ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విరివిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మండల వైద్యాధికారి ఏ విరమణ, ఎస్ ఐ కే సుధాకర్, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.


 

 




 


ఆ భవనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి

 



ఆ భవనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి


గూడెం కోత్త వీధి పెన్ పవర్


గూడెం కోత్త వీధి మండలంలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలు పై ప్రస్తుతప్రభుత్వం దృష్టి సారించక పోవడంతో చాలా భవనాలు నిరూపయోగంగా దర్శనం ఇస్తున్నాయి. గూడెం కోత్త వీధి మండలం అభివృద్ధి పైజీల్లా అధికార యంత్రాంగం సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని గిరిజనులు నుండి విమర్సలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కార్యక్రమం అమలు పరుస్తున్నా నాడు ప్రభుత్వం నిర్మించిన భవనాలు నేడు ప్రభుత్వం పట్టించుకోదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 2018-2019. సంవత్సరంలో మండల కేంద్రంలో కంపోస్టు యార్టు భవనం నిర్మించింది. అప్పటిలో ఈ యార్టు భవనం నిర్మాణం కొరకు సుమారు 5లక్షలు రూపాయులు ఖర్చుచేసినట్లు సమాచారం. యార్టు నిర్మాణం పనులు చేపట్టిన సదరు కాంట్రాక్టర్లు భవనం అసంపూర్తిగా నిర్మాంచి పూర్తి స్థాయిలో బిల్స్ తీసుకుని వదలివేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న కంపొస్టు యార్టు భవనంలో ఉద్యోగుల కార్లు గూడెం కోత్త వీధి పంచాయతీ కి చేందిన ట్రాక్టర్ ద్విచక్ర వాహనాలు పెట్టుకోవడానికి  వినియోగిస్తున్నారు. గూడెం కోత్త వీధి మండలం లో వివిధ శాఖలు ప్రభుత్వం కార్యాలయలు వున్నప్పటికీ సిబ్బంది సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి భవనాలు లేక సిబ్బంది అంగన్వాడీ. అశా వార్కర్లు. వైద్య సిబ్బంది. గ్రామ సచివాలయం సిబ్బంది పడుతున్నా బాధలు వర్ణనాతీతం.  ప్రస్తుతం కంపోస్టు యార్టుభవనం ఏవిధంగా వినియోగపడకపోవడంతో,  కనీసం మండల స్థాయిలో జరిగే సమీక్షా సమావేశాలకు ఉపయోగపడేవిదంగా ఈ భవనాన్ని  తీర్చి దిద్దాలని గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న పలుశాఖల అదికారులు ఉద్యోగులు స్థానిక ప్రజలు  కోరుతున్నారు

గోవింద్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి




 

గోవింద్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి


 

 

 

 

  రొయ్యల పరిశ్రమ ధర్మవరం గ్రామస్థులు ఆందోళన.

 

ఎస్.రాయవరం/విశాఖపట్నం_బ్యూరోఛీప్ (పెన్ పవర్)

 

వైద్యం అందక గోవింద్ మృతి చెందాడని మృతుని కుటుంబానికి రూ20లక్షలు‌ ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి అని ధర్మవరం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం మండలం లోని కోస్టల్ కార్పొరేషన్ రొయ్యల పరిశ్రమ వద్ద  ధర్మవరం గ్రామస్తులు ఆందోళన .చేపట్టారు. ధర్మవరం కు చెందిన గొనదర గోవింద్ గత మూడేళ్ల గా రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్నడు. గోవింద్ పనిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వైద్తం కోసం తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అందుబాటులో ఆసుపత్రి లేక పోవడం వల్లే గోవింద్ చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోవింద్ మృతి కుటుంబానికి తీరని లోటని ఆ కుటుంబానకి ఆర్దిక సహాయం అందించాలని కోరుతు కార్మికులు పోయే బస్సలు అడ్డుకున్నారు.ఈ సంఘటనను పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. పోలీసులకు ఆందోళన కార్ల మద్య వాగ్వివాదం జరిగింది. పోలీసుల సహకారంతో కార్మికుల బస్సులను బయటకు పంపించారు..



 అనంతగిరి పోలీసులకు చిక్కిన భారీ గంజాయి


 అనంతగిరి పోలీసులకు చిక్కిన భారీ గంజాయి



   విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)  


 


జిల్లాలోని అనంతగిరి మండలం దముకు  వద్ద గురువారం భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. అనంతగిరి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అక్రమ గంజాయి రవాణాని  శోధించి పట్టుకున్నారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు డి ఎల్ 4 సీ ఎన్  ఈ 1300 నంబరు గల కార్ లో 120 కిలోల శీలవతి గంజాయి రవాణా  చేస్తుండగా పట్టుబడింది. కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు లో ఇద్దరు పరార్ కాగా సెంబి ప్రసాద్ ని  అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి గంజాయి కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని   అంచనా.


కరోనాను జయించిన పోలీసులకి ఘన స్వాగతం


కరోనాను జయించిన పోలీసులకి ఘన స్వాగతం


 పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి: 


కరోనా పై పోరాడి విజయం సాధించి తిరిగి విధుల్లో చేరుతున్న కందుకూరు పోలీసులు  శంకర్, రఫీ లకి కందుకూరు పట్టణ పోలీసు స్టేషన్ లో పూలతో ఘన స్వాగతం పలికారు. కొన్ని రోజుల క్రితం  కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు కానిస్టేబుళ్లు కు పాజిటివ్ వచ్చింది.వారిరువు కోలుకొన్నారు. గురువారం  విధుల్లో కి చేరడానికి వచ్చిన సందర్భంగా కందుకూరు కందుకూరు డి ఎస్ పి కండే శ్రీనివాసులు, సి ఐ  ఎం.విజయ్ కుమార్ నేతృత్వంలో రూరల్ ఎస్సై  కె. అంకమ్మ మరియు పోలీసు సిబ్బంది పూలతో ఘన స్వాగతం పలికి,పుష్ప గుచ్ఛం ఇచ్చి పోలీసు స్టేషన్ లోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కందుకూరు డి ఎస్ పి  కండే శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనాని జయించిన పోలీసు వారిలో మనో ధైర్యాన్ని నింపటానికి ఈకార్యక్రమం చేపట్టామని అన్నారు.కరోనా పట్ల ప్రజలు అవగాహనతో,పరిశుభ్రతలు పాటిస్తూ,అనవసరంగా బయటకు రాకుండా,ఒకవేళ అవసరముండి వస్తే సామాజిక దూరం పాటిసిస్తూ,బయట ఆహారం తీసుకోకుండా,సమయానికి ఇంటిలోని ఆహారం తీసుకొంటూ, కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటే కరోనా మన దరిచేరదు.ఒకవేళ కరోనా బారిన పడ్డా త్వరగా కొలుకొనవచ్చు అని డి ఎస్ పి  శ్రీనివాసులు అన్నారు. పోలీసులు ఒక్కరు ఇలా కోవిడ్ ను జయించి విధులకు రావడం సంతోషం గా ఉందని,  ఎస్సై తిరుపతిరావు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.


ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్ లను పంపిణీ


ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్ లను పంపిణీ


పెన్ పవర్, ఉలవపాడు


 సింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామానికి చెందిన కాట్రగడ్డ వేణు ఆర్ధిక సహకారంతో ఫేస్ ప్రొటెక్షన్ మాస్కులను
ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ పిలుపుమేరకు పారాలీగల్ వాలంటీర్,ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిత్యం ప్రజల ఆరోగ్య రక్షణ భద్రత కోసం అహర్నిశలు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి  పేస్ ప్రొటెక్షన్ మాస్క్ లను డాక్టర్ బ్రహ్మయ్య చేతుల మీదగా పంపిణీ చేశారు.వైద్య అధికారులు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో ప్రత్యక్షంగా శరీరం లోనికి వ్యాధులు ప్రవేశించి టానికి అవకాశమున్న భాగాలలో ప్రధానంగా ముక్కు, కళ్ళు,నోరు అని,ఒకవేళ  ముక్కుకి,నోటికి మాస్కులు ధరించి నప్పటికీ కరోనా వైరస్ ఎదుటివారు మాట్లాడినప్పుడు వారి నోటిద్వారా వచ్చే తుంపర్ల నుండి కంటి ద్వారా శరీరంలోనికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని,కనుక తప్పనిసరి పరిస్థితులలో ఎక్కువ మంది ప్రజలతో ఉండవలసి వచ్చినప్పుడు ముఖాన్ని అంతటికీ రక్షణగా ఫేస్ ప్రొటెక్షన్ మాస్కులు ఉపయోగపడతాయని తెలిపారు.గుంపులు గుంపులుగా ఉన్న సమయంలో ఈ మాస్క్ లు ఎదుటి వారు మాట్లాడేటప్పుడు తుంపర్లు పడకుండా ఉపయోగపడతాయని అన్నారు.ప్రజలు తమకు తాము జాగ్రత్తలు పాటించడం, సామాజిక బాధ్యత అన్నారు. అదేవిధంగా కనుమల్ల గ్రామ మలినేని కాలేజీ లోని కొరంటైన్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి కూడా పంపిణీ చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కోటేశ్వరరావు,సునీల్ గవాస్కర్,కీర్తి శ్రీ,ఆరిబోయిన రాంబాబు మరియు ఆశా వర్కర్లు,సిబ్బంది పాల్గొన్నారు.


మనం మన పరిసర ప్రాంతాలను కాపాడుకుందాం 



మనం మన పరిసర ప్రాంతాలను కాపాడుకుందాం 


కాలుష్యాన్ని తరిమికొడదాం


పెన్ పవర్ , ఉలవపాడు 


 మనం మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రత ద్వారా మన పల్లెల్లోనూ పట్టణాల్లోనూ ఇళ్లలో ఉండే చెత్తను పొడి చెత్త గా తడి చెత్త గా వేరు చేసి గ్రామపంచాయతీ వారు ఇచ్చిన 2 డబ్బాలు లోను ఒక దానిలో పొడి చెత్త ఒక దానిలో తడి చెత్త మన ఇంటిలో ఉన్న చెత్తను బయట వేయకుండా 2 డబ్బాలు ద్వారా చెత్త నుండి సంపద తయారీ కేంద్రం కి తరలించి మన పల్లె ను మన గ్రామాన్ని కాపాడుకుందాం ప్రజలందరూ భాగస్వాములమవుతాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కాలుష్యాన్ని తరిమికొడదాం చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నుండి గ్రీన్ అంబాసిడర్ ట్రై సైకిల్స్ ద్వారా తరలించి మనం ఇచ్చే చెత్త నుండి సంపదను తయారు చేద్దాం వ్యర్థ పదార్థాల ద్వారా వర్మి కంపోస్టు తయారవుతుంది అది రైతులకు ఉపయోగపడుతుంది పొడి చెత్త గా ఉండే వాటిని వేరు చేసి విక్రయించి నిధులను సమకూర్చుతుంది మహిళలు వాడే కొన్ని వ్యర్థ పదార్థాలను దూరంగా ఉంచుదాం వాటిని మసిచేద్దాం పర్యావరణానికి తోడ్పాటునందిస్తుంది మొక్కలు నాటుదాం కాలుష్యాన్ని తరిమికొడదాం ఈరోజు రామాయపట్నం ఆత్మకూరు గ్రామాలలో చెత్త నుండి సంపద తయారుచేసే కేంద్రాలను ప్రారంభించి మన ఇంటిలో ఉన్న చెత్తను ట్రై సైకిల్స్ ద్వారా తరలించడం జరుగుతుంది మన పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరుచుకుని మన గ్రామాన్ని కూడా భాగస్వాములుగా చేద్దాం ఇంటికి రెండు రూపాయలు ఇద్దాం నెలకు అరవై రూపాయల ఇద్దాం మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం మన పంచాయతీ కార్యాలయానికి సంపదను సమకూర్చుకున్నాం చెత్త నుండి సంపద తయారీ కేంద్రం లో పని చేయు గ్రీన్ అంబాసిడర్ జీతాలు కల్పిద్దాం అందరం ఒక్కటవుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కాలుష్యాన్ని తరిమికొడదాం.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...